తెలంగాణ సమాచార, సాంకేతిక శాఖ
రకం | తెలంగాణ ప్రభుత్వ సంస్థ |
---|---|
కేంద్రీకరణ | ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ-గవర్నెన్స్‌ను ప్రోత్సహించడం |
కార్యస్థానం | |
అధికారిక భాష | తెలుగు, ఉర్దూ |
శాఖామంత్రి | డొ. శ్రీధర్ బాబు |
ఐటి ముఖ్య కార్యదర్శి | జయేశ్ రంజన్ |
తెలంగాణ సమాచార, సాంకేతిక శాఖ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం వినియోగాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వ సేవల సమాచారాన్ని అందించడంకోసం తెలంగాణ ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన శాఖ.[1] 2014 జూన్ 2న మొదటిసారిగా నిర్వహించబడిన ఈ మంత్రిత్వ శాఖ కేబినెట్‌లోని ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోలలో ఒకటి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ ఐటీశాఖకు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2][3]
శాఖ ఏర్పాటు
[మార్చు]సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ల శాఖ సాధారణ పరిపాలన (స్పెషల్-ఎ) శాఖ, జి.ఓ.ఆర్.టి.నెం.2125, తేది. 9-5-1997 ప్రకారం ఆర్థిక, ప్రణాళిక (ప్రణాళిక విభాగం) శాఖలో ఒక భాగంగా ఏర్పాటయింది. 2000, సెప్టెంబరు 11న సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ శాఖ, జి.ఓ.ఎం.ఎస్.నెం.12 ప్రకారంగా ఈ శాఖకు స్వయం ప్రతిపత్తి కల్పించబడింది. 2013, జూలై 24న ప్రధాన పరిపాలన (ఎఆర్టి-I) శాఖ, జి.ఓ.ఎంఎస్.నెం. 575 ద్వారా శాఖకు సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ల శాఖగా నామకరణం చేయబడింది. 2014, జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ శాఖ తెలంగాణ ప్రభుత్వంలో విలీనమయింది.
కార్యకలాపాలు
[మార్చు]వివిధ రకాలైనటువంటి ఇ-గవర్నెన్సు ప్రణాళికలు ప్రవేశపెట్టడం, ఐ.టి. పెట్టుబడులను ప్రోత్సహించడం, ఐ.టి. ఆధారిత సర్వీసులను రాష్ట్రంలో ప్రవేశపెట్టడం, రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ తయారీ యూనిట్ల అమలును ప్రవేశపెట్టడం వంటి కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది.
ఐటి విధానాలు
[మార్చు]ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ నెట్ వర్క్ విభాగాలు:[4]
- డిజిటల్ తెలంగాణ
- మీ సేవ
- ఫైబర్ గ్రిడ్ పథకం
- టీఎస్ ఐపాస్
- టీ హబ్ (టెక్నాలజీ హబ్)
- టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్)
- టీ వాలెట్
- టీఎస్ కాప్
- వీ హబ్ (ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ హబ్)
- టీఎస్ బిపాస్
- తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్
- రిచ్ (రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్)
- ఇ-గవర్నెన్సు
- టీ-వర్క్స్
- టీ-సాట్
- పివిసి
- టీ-సిగ్
- ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్
- ఎన్సీఏఎం (నేషనల్ సెంటర్ ఫర్ అడిటివ్ మానుఫ్యాక్చరింగ్)
మంత్రి
[మార్చు]క్రమసంఖ్య. | ఫోటో | పేరు | పదవీకాలం | పార్టీ | ముఖ్యమంత్రి | మూలాలు | |||
---|---|---|---|---|---|---|---|---|---|
పదవి ప్రారంభం | పదవి ముగింపు | పదవీకాలం
(రోజులలో) | |||||||
1. | కెటి రామారావు | 2014 జూన్ 2 | 2018 సెప్టెంబరు 6 | 1466 | భారత రాష్ట్ర సమితి | కె. చంద్రశేఖర రావు | [5] | ||
2. | 2019 సెప్టెంబరు 8 | 2023 డిసంబర్ 3 | 1331 | [6] | |||||
3. | డొ. శ్రీధర్ బాబు | 2023 డిసంబర్ 9 | అధికారంలో ఉన్నాడు | కాంగ్రెస్ పార్టీ | రేవంత్ రెడ్డి |
ఇతర వివరాలు
[మార్చు]తెలంగాణ రాష్ట్రం సమాచార సాంకేతిక (ఐటీ) రంగంలో దేశంలోనే ఐటీ దిగ్గజ రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 17.93% ఎగుమతుల వృద్ధిని (ఏకంగా రూ.1.28 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు) సాధించి, ఐటీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. 2018-19లో రాష్ట్రం నుంచి రూ.1,09,219 కోట్ల ఐటీ ఎగుమతులు, 2019-20లో రూ.1,28,807 కోట్ల ఎగుమతులు చేసింది. ఇందులో భాగంగా 2018-19లో 5,43,033 మందికి ఉద్యోగాలు, 2019-20లో 5,82,126 మందికి ఉద్యోగాలు కల్పించబడ్డాయి. ఉద్యోగాల కల్పన వాటా కూడా 13.06% నుంచి 13.34 శాతానికి పెరిగింది.[7] 2021-22లో ఐటీ ఎగుమతుల విలువ రూ.1,83,569 కోట్లు కాగా లక్షన్నర మందికి ఉద్యోగాలు కల్పించబడ్డాయి. 2022 మే నెలనాటికి తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121గా ఉండగా, ఈ ఎనిమిదేళ్ళకాలంలో 4.1 లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయి.[8]
బడ్జెట్ వివరాలు
[మార్చు]- 2016-17 బడ్జెటులో ఈ శాఖకు 254 కోట్ల రూపాయలు కేటాయించబడింది.
మూలాలు
[మార్చు]- ↑ "About IT, Electronics & Communications Department". IT, Electronics & Communications department. Retrieved 1 January 2022.
- ↑ నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (8 September 2019). "ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం". ntnews.com. Archived from the original on 8 September 2019. Retrieved 1 January 2022.
- ↑ సాక్షి, తెలంగాణ (8 September 2019). "శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ". Sakshi. Archived from the original on 8 September 2019. Retrieved 1 January 2022.
- ↑ telugu, NT News (2022-06-25). "టీ హబ్ 2.0". Namasthe Telangana. Archived from the original on 2022-06-25. Retrieved 2022-06-25.
- ↑ "Telangana is born as 29th state, K Chandrasekhar Rao takes oath as first CM | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Jun 2, 2014. Retrieved 2023-05-05.
- ↑ "KCR expands cabinet with 6 ministers; re-inducts son KTR, nephew Harish Rao". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-09-08. Retrieved 2023-05-05.
- ↑ "ఐటీలో రాష్ట్రం మేటి". andhrajyothy. Archived from the original on 2022-01-01. Retrieved 2022-01-01.
- ↑ telugu, NT News (2022-06-01). "ఎనిమిదేళ్లలో ఐటీలో అద్భుతమైన పురోగతి : కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-06-01. Retrieved 2022-06-01.