దువ్వాడ శ్రీనివాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దువ్వాడ శ్రీనివాస్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 మార్చ్ 2021 - 29 మార్చ్ 2027
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 1964
టెక్కలి, శ్రీకాకుళం జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ , ప్రజారాజ్యం పార్టీ
తల్లిదండ్రులు దువ్వాడ కృష్ణమూర్తి, లీలావతి
జీవిత భాగస్వామి దువ్వాడ వాణి
సంతానం దువ్వాడ హైంధవి , దువ్వాడ నవీణ
నివాసం టెక్కలి

దువ్వాడ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021 మార్చిలో ఎమ్మెల్యే కోటాలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

దువ్వాడ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, టెక్కలిలో 1964లో దువ్వాడ కృష్ణమూర్తి, లీలావతి దంపతులకు జన్మించాడు. ఆయన కాకినాడ పీఆర్‌ కళాశాలలో ఎంఏ ఇంగ్లీషు లిటరేచర్ పూర్తి చేసి, బీఎల్‌ చేసి లాయర్ పట్టా అందుకున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

దువ్వాడ శ్రీనివాస్‌ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2001లో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా, 2006లో శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌గా పనిచేశాడు. దువ్వాడ శ్రీనివాస్‌ 2009లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమిపాలై, 36552 ఓట్లతో మూడవస్థానంలో నిలిచాడు. దువ్వాడ శ్రీనివాస్‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో టెక్కలి నియోజకవర్గం అసెంబ్లీకి పోటీ చేసి 8387 ఓట్ల తేడాతో, 2019లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి 6,653 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.[1]

దువ్వాడ శ్రీనివాస్ ను వైఎస్సార్‌సీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 2021 ఫిబ్రవరి 25న ఖరారు చేశాడు.[2][3] ఆయన శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయినట్లు 2021 మార్చి 8న ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తెలిపాడు.[4] ఆయన శాసనసభ్యుడిగా 2021 ఏప్రిల్ 1న ప్రమాణ స్వీకారం చేశాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. News18 Telugu. "వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఈ ఆరుగురే ఎందుకు? ఎవరి నేపథ్యం ఏంటి?". Archived from the original on 18 July 2021. Retrieved 18 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. TV9 Telugu (25 February 2021). "ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చాణక్యం.. వైసీపీ అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే! - Political history of YCP MLC candidates". Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (26 February 2021). "ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో వైఎస్సార్‌సీపీ ప్రత్యేకత". Sakshi. Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
  4. Outlook India (8 March 2021). "Six ruling YSR Congress candidates elected unopposed to AP Legislative Council". outlookindia.com/. Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
  5. The Times of India (1 April 2021). "Six newly elected Andhra Pradesh MLCs take oath | Amaravati News - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 18 July 2021. Retrieved 18 July 2021.
  6. Prajashakti (1 April 2021). "ఆరుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం". Archived from the original on 2 April 2021. Retrieved 18 July 2021.