Coordinates: 26°32′N 76°11′E / 26.54°N 76.19°E / 26.54; 76.19

దౌస జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దౌస జిల్లా
చాంద్ బౌరి, అభనేరి
చాంద్ బౌరి, అభనేరి
రాజస్థాన్ పటంలో దౌస జిల్లా స్థానం
రాజస్థాన్ పటంలో దౌస జిల్లా స్థానం
Coordinates (దౌస): 26°32′N 76°11′E / 26.54°N 76.19°E / 26.54; 76.19
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
ప్రధానకేంద్రందౌస
ప్రధానకేంద్రందౌస
Area
 • Total3,432 km2 (1,325 sq mi)
Population
 (2011)
 • Total16,34,409[1]
జనాభా
 • అక్షరాస్యత68.16
 • లింగ నిష్పత్తి(పురుషులు) 1000:905 (స్త్రీలు)
Time zoneUTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం)
జాతీయ రహదారులుజాతీయ రహదారి 11 (NH-11)
సగటు వార్షిక అవపాతం459.8 mm

రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో దౌస జిల్లా ఒకటి. దౌస పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 2950.జిల్లా జనసంఖ్య 1,316,790. జనసాంధ్రత చ.కి.మీ 384. అక్షరాస్యత 62.75%. దౌస జిల్లా ఉత్తరసరిహద్దులో ఆల్వార్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో భరత్‌పూర్ జిల్లా ఆగ్నేయ సరిహద్దులో కరౌలి జిల్లా, దక్షిణ సరిహద్దులో సవై మధోపూర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో జైపూర్ జిల్లా ఉన్నాయి.

విభాగాలు[మార్చు]

రాజస్థాన్ పటంలో దౌసా జిల్లా (సంఖ్య: 28)

దౌస జిల్లా 5 తాలూకాలుగా విభజించబడ్డాయి: బస్వ, దౌస, లాల్సాట్, మహ్వా, శిఖరి.

భౌగోళికం[మార్చు]

జిల్లాలో సవై నది, బాణగంగా నదులు ప్రవహిస్తున్నాయి. జిల్లా జాతీయరహదారి-11 మార్గంలో జైపూర్, ఆగ్రా మధ్య ఉంది. ఇది జైపూర్ నుండి తూర్పుగా 55కి.మీ దూరంలో ఉంది. మహ్వా తాలూకాలో ఖెర్ల బుజుంగ్ గ్రామపంచాయితీ ఉంది. ఎం.ఎల్.ఎ ఎన్నికలలో ఇక్కడి నుండి గుజార్ జాతికి చెందిన ముగ్గురు సభ్యులు రాజస్థాన్ అసెంబ్లీకి పోటీ చేసారు. ముగ్గురు సభ్యులు మూడు జాతీయ పార్టీల కొరకు పోటీ చేయడం, ముగ్గురూ న్యాయవాదులు కావడం ప్రత్యేకతలతో ఇది సరికొత్త రికార్డుగా మారింది. చివరికి హరి సింగ్ విజయం సాధించాడు. ఈ వార్తను బి.బి.సి చానల్‌లో ప్రసారం చేయడం ఒక ప్రత్యేకత.

పేరు వెనుక చరిత్ర[మార్చు]

దౌస జిల్లాలో ఉన్న దేవగిరి కొండల కారణంగా ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది.

చరిత్ర[మార్చు]

దౌసలో ఉన్న కొండమీద బద్‌గుజార్ రాజులు ఒక కోటను నిర్మించారు. బద్‌గుజార్ రాజులు ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి పాలకులుగా భావించుతారు. తరువాత చౌహాన్ రాజులు ఈ ప్రాంతాన్ని కచ్వహ రాజులకు ఇచ్చారు. అయినప్పటికీ పాలనాధికారం అంబర్ వద్ద కేంద్రీకరించబడింది.

1562లో అక్బర్ ఖవజా మొయిద్ధిన్ చిస్టి యాత్ర నిమిత్తం అజ్మీర్కు వెళ్ళినప్పుడు, వారు దౌస వద్ద బసచేసారు. అప్పుడు అక్బర్ దౌస హకిం రుప్సి బర్గి, భర్మల్ సోదరుని కలుసుకున్నాడు. ఇక్కడి ప్రజలకు వ్యవసాయం ప్రధానవృత్తిగా ఉంది.జిల్లాలో గోధుమలు, బజ్రా, ఆవాలు, వేరుశనగ, రాప్ గింజలు పండించుతారు.1991 ఏప్రిల్ 10 న సవై మధోపూర్ జిల్లా లోని దౌస, బస్వ, సిక్రై, కరొడి, లాల్సాట్, మహ్వ తాలూకాలను వేరు చేసి దౌస జిల్లా రూపొందించబడింది.

గణాంకాలు[మార్చు]

వైశాల్యపరంగా దౌస జిల్లా రాజస్థాన్ రాష్ట్రంలో అతి చిన్న జిల్లాగా గుర్తించబడుతుంది.

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19013,21,510—    
19113,05,507−0.51%
19212,54,843−1.80%
19312,83,384+1.07%
19413,22,117+1.29%
19514,03,207+2.27%
19614,73,905+1.63%
19715,88,702+2.19%
19817,63,706+2.64%
19919,99,227+2.72%
200113,23,002+2.85%
201116,34,409+2.14%
source:[2]

2011 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,637,226, [3]
ఇది దాదాపు. గునియా దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. ఇడాహో నగర జనసంఖ్యకు సమం..[5]
640 భారతదేశ జిల్లాలలో. 305 వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 476 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 24.31%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 904:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 69.17%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

మూలాలు[మార్చు]

  1. "Name Census 2011, Dausa Handbook data" (PDF). censusindia.gov.in. 2016. Retrieved 28 February 2016.
  2. Decadal Variation In Population Since 1901
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Guinea-Bissau 1,596,677 July 2011 est.
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Idaho 1,567,582

సరిహద్దులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]