నల్గొండ రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నల్గొండ రెవెన్యూ డివిజను
నల్గొండలోని క్లాక్ టవర్
నల్గొండలోని క్లాక్ టవర్
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లానల్గొండ

నల్గొండ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. నల్గొండ జిల్లాలోవున్న మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 11 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం నల్గొండ పట్టణంలో ఉంది.[2] 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3] ఈ రెవెన్యూ డివిజను నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలోని నల్గొండ శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉంది.[4]

వివరాలు[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.

పరిపాలన[మార్చు]

నల్గొండ డివిజనులోని మండలాలు:[5]

క్ర.సం నల్గొండ రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
2 చిట్యాల మండలం 16 రెవెన్యూ గ్రామాలు
3 కంగల్ మండలం 24 రెవెన్యూ గ్రామాలు
4 కట్టంగూర్ మండలం 18 రెవెన్యూ గ్రామాలు
6 నకిరేకల్ మండలం 16 రెవెన్యూ గ్రామాలు
7 నల్గొండ మండలం 35 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
8 నార్కెట్‌పల్లి మండలం 19 రెవెన్యూ గ్రామాలు
9 తిప్పర్తి మండలం 13 రెవెన్యూ గ్రామాలు
10 కేతేపల్లి మండలం 13 రెవెన్యూ గ్రామాలు
11 శాలిగౌరారం మండలం 20 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)

గమనిక:గతంలో ఈ రెవెన్యూ డివిజనులో 13 మండలాలు ఉండేవి. వాటిలోని చండూరు మండలం, మునుగోడు మండలం ఇదే జిల్లాలో కొత్తగా ఏర్పడిన చండూరు రెవెన్యూ డివిజనులో విలీనమయ్యాయి..[6]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Yadadri district" (PDF). New Districts Formation Portal. Archived from the original (PDF) on 2017-02-15. Retrieved 2022-08-16.
  3. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-08-16.
  4. "Nalgonda district info". Official website of Nalgonda district. Archived from the original on 15 February 2016. Retrieved 2022-08-16.
  5. "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-16. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  6. "TS News: తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్లు .. నేటి నుంచి అమల్లోకి". EENADU. Retrieved 2023-12-31.