Jump to content

నాగార్జునసాగర్ టెయిల్ పాండ్

వికీపీడియా నుండి

నాగార్జున సాగర్ టెయిల్ పాండ్' (నాగార్జునసాగర్ తోక చెరువు) నాగార్జునసాగర్ దిగువున 21 కిమీ లో ఉన్న ఒక బహుళార్ధసాధక జలాశయం. దీనినిని నల్గొండ జిల్లాలోని సత్రసాల సమీపంలో కట్టారు.. దీని స్థూల నీటి నిల్వ సామర్థ్యం 6 టిఎంసిఎఫ్. [1] రిజర్వాయర్ నీటి వ్యాప్తి ప్రాంతం నాగార్జున సాగర్ ఆనకట్ట వరకు విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్ట్ జూలై 2014 నాటికి పూర్తయింది. [2] Map

నాగార్జున సాగర్ ఆనకట్ట ఎడమవొడ్డున 810 మెగావాట్ల విద్యుత్ కేంద్రం

జల విద్యుత్ ఉత్పత్తి

[మార్చు]

నది వరద నీరు, ప్రకాశం బ్యారేజ్ అవసరాలకు విడుదల చేసిన నీటి నుండి ఆనకట్టకు అందుబాటులో ఉన్న నీటిని ఉపయోగించుకోవడానికి, 25 మెగావాట్ల రెండు యూనిట్ల జల విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను 2017 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పత్తి సంస్థ(APGENCO) ప్రారంభించింది.[3]

అధిక వాడుక సమయంలో విద్యుత్ ఉత్పత్తి

[మార్చు]

ప్రస్తుతం, నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉన్న 700 మెగావాట్ల రివర్సిబుల్ హైడ్రో టర్బైన్లు (7 x 100 మెగావాట్లు) విద్యుత్ ఉత్పత్తి విధానంలో విడుదలైన నీటిని నిల్వ చేయడానికి టెయిల్ పాండ్ అందుబాటులో లేకపోవడం వల్ల పంపింగ్ విధానంలో పనిచేయలేకపోతున్నాయి. టెయిల్ పాండ్ పూర్తవడంతో, విద్యుత్ గ్రిడ్ నుండి మిగులు విద్యుత్తును వాడి క్రిందికి వచ్చిన నీటిని నాగార్జున సాగర్ రిజర్వాయర్‌కు తిరిగి పంపింగ్ చేయడానికి, రోజువారీగా గరిష్ట భారాన్ని తీర్చడానికి ఉపయోగపడుతుంది. తోక చెరువులో లభించే ఒక టిఎంసిఎఫ్ లైవ్ స్టోరేజ్ వాటర్ కెపాసిటీ నుండి ఎనిమిది గంటల వ్యవధిలో 700 మెగావాట్ల గరిష్ట శక్తిని పొందవచ్చు.

నీటిపారుదల సంభావ్యత

[మార్చు]

గోదావరి నది నుండి ఏటా 200 టిఎంసిఎఫ్ మిగులు నీటిని దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం ద్వారా ఈ తోక చెరువుకు బదిలీ చేయాలని ప్రణాళిక వేశారు. ఈ నీటిని 410 టిఎంసిఎఫ్ స్థూల నీటి నిల్వ సామర్థ్యం గల నాగార్జున సాగర్ రిజర్వాయర్‌కు పంపుతారు. అందువల్ల నాగార్జున సాగర్ రిజర్వాయర్ ఎగువ శ్రీశైలం రిజర్వాయర్ నుండి నీటి సరఫరాను పొందవలసిన అవసరం లేదు. దీని నీటి స్థాయి (48.33 మీ MSL ), దిగువ పులిచింతల డ్యామ్ పూర్తి రిజర్వాయర్ స్థాయి (53.34 మీ MSL) తక్కువగా వుండడంతో , పులిచింతల జలాశయంలో మిగులు నీటిని పైకి పంప్ చేయవచ్చు. అందువలన శ్రీశైలం రిజర్వాయర్‌లో నిలుపుకున్న నీరు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నీటిపారుదల అవసరాలకు, జురాల, శ్రీశైలం జలాశయాల ద్వారా ఉపయోగించబడుతుంది. అలాగే కృష్ణానదిలో నీరు సరిపోనపుడు, నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుండి నీటిని శ్రీశైలం ఎడమవొడ్డున గల విద్యుత్ కేంద్రము పంపింగ్ పద్దతిలో వాడడం ద్వారా, శ్రీశైలం జలాశయానికి పంపించవచ్చు. అప్పుడు కోలిసాగర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ (16°23′49″N 77°39′30″E / 16.39694°N 77.65833°E / 16.39694; 77.65833 సమీపంలో), రాజీవ్ భీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్, నెట్టంపాడు ఎత్తిపోతల ప్రాజెక్ట్ (16°18′58″N 77°40′21″E / 16.31611°N 77.67250°E / 16.31611; 77.67250 సమీపంలో), కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, తెలుగు గంగ నీటిపారుదల ప్రాజెక్టు, హంద్రీనీవా ఎత్తిపోతల ప్రాజెక్ట్, గాలేరి నగరి ఇరిగేషన్ ప్రాజెక్ట్, వెలిగొండ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు నీరు అందుబాటులో వుంటుంది.

ఇది కూడ చూడు

[మార్చు]

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Nagarjuna Sagar tail-pond dam likely to benefit Krishna delta". The Hindu. 2004-11-14. Archived from the original on 2004-12-05. Retrieved 11 May 2013.
  2. "Nagarjuna Sagar tail pond dam progress report". APGENCO. Archived from the original on 2013-07-02. Retrieved 11 May 2013.
  3. "Nagarjunasagar Tail Pond Power House PH01598". INDIA WRIS. Archived from the original on 12 జూలై 2018. Retrieved 7 August 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]