నిగార్ సుల్తానా
నిగార్ సుల్తానా | |
---|---|
జననం | |
మరణం | 2000 ఏప్రిల్ 21 | (వయసు 67)
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1946–1986
5 సంతానం 3 మనవలు, మనవరాళళు షాయిస్ట ఖాన్ హయా అసిఫ్ జియా ఖాన్ |
జీవిత భాగస్వామి | కె. ఆసిఫ్ |
నిగార్ సుల్తానా (జూన్ 21, 1932 - ఏప్రిల్ 21, 2000) భారతీయ సినిమా నటి. ఆగ్ (1948), పతంగా (1949), శీష్ మహల్ (1950), మీర్జా గాలీబ్ (1954), యహూది (1958), దో కలియా (1968) మొదలైన సినిమాల్లో నటించింది. 1960లో వచ్చిన చారిత్రక ఇతిహాసమైన మొఘల్ ఎ ఆజం సినిమాలో "బహార్ బేగం" పాత్రలో గుర్తింపు వచ్చింది.
ప్రారంభ జీవితం, విద్య
[మార్చు]నిగార్ సుల్తానా 1932, జూన్ 21న హైదరాబాదు, గన్ ఫౌండ్రీలోని సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించింది.[1] ఈమె తండ్రి నిజాం స్టేట్ ఆర్మీలో మేజర్ హోదాలో పనిచేశాడు. ఐదుగురు సంతానంలో నిగార్ చిన్న కుమార్తె. ఈమెకు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. సిగార్ తన బాల్యాన్ని హైదరాబాదులోనే గడిపింది.[2]
కొంతకాలం పాఠశాలకు వెళ్ళిన నిగార్, ఆ తరువాత ఇంట్లోనే ఉండి ఆంగ్ల విద్యను చదువుకుంది. సంగీత, నృత్యాలలో ప్రావీణ్యం సంపాదించింది. నటనపై ఆసక్తి ఉన్న నిగార్, పాఠశాలలో ప్రదర్శించిన నాటక ప్రదర్శనలో పాల్గొన్నది.[2]
సినిమారంగం
[మార్చు]1938లో హమ్ తుమ్ ఔర్ వో అనే సినిమా నిగార్ చూసిన మొదటి సినిమా.[2] 1946లో వచ్చిన రంగభూమి సినిమాతో సినిమారంగంలోకి ప్రవేశించింది. రాజ్ కపూర్ నటించిన ఆగ్ (1948) సినిమాలో నిగార్ పోషించిన "నిర్మల" పాత్రతో బాలీవుడ్ గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలోని నిగార్ నటనను విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసించారు. ఆ తర్వాత ఆమె అనేక సినిమాల్లో వివిధ పాత్రలను పోషించింది.[3]
నిగార్ తొలి పెద్ద సినిమా షికాయత్ (1948), పూణేలో తీయబడింది; ఆ తర్వాత రంజిత్ ప్రొడక్షన్ లో తీసిన బేలా (1947) సినిమాలో, ఆ తర్వాత సినిమాల్లో నిగార్ ప్రధాన పాత్రలు పోషించింది. సలీమ్ గా దిలీప్ కుమార్, అనార్కలిగా మధుబాల నటించిన ప్రేమకథా సినిమాలో అసూయతో కూడిన ఆస్థాన నృత్యకారిణి "బహార్" పాత్రను పోషించింది. ఆ సినిమాలో తేరీ మెహఫిల్ మీన్, జబ్ రాట్ హో ఐసీ మత్వాలీ అనే పాటలు నిగార్ మీద చిత్రీకరించబడ్డాయి.[3] దారా (1953), ఖైబర్ సినిమాల్లో నటించింది.[2]
పతంగా (1949), దిల్ కీ బస్తీ (1949), శీష్ మహల్ (1950), ఖేల్ (1950), దామన్ (1951), ఆనంద్ భవన్ (1953), మీర్జా గాలీబ్ (1954), తంఖా (1956), దుర్గేశ్ నందిని (1956), యహూది (1958) వంటి సినిమాలు పేరొందాయి. 1950లలో అనేక పాత్రలలో నటించిన నిగార్, ఆతరువాత తక్కువ సినిమాలలో నటించింది. 1986లో వచ్చిన జంబిష్: ఎ మూవ్ మెంట్ - ది మూవీ నిగార్ చివరి బాలీవుడ్ చిత్రం.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]1960ల ప్రారంభంలో కొంతకాలం హైదరాబాదీ, పాకిస్తానీ నటుడు దర్పన్ కుమార్ తో ప్రేమలో ఉంది.[4] 1959, జూన్ 13 న పాకిస్తానీ నటుడిని వివాహం చేసుకున్నట్లు వచ్చిన వార్తలను ఖండించడానికి నిగార్ సుల్తానా ప్రత్యేకంగా ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటుచేసింది.[5] 1960 చివరిలో నిగార్ సుల్తానా, మొఘల్-ఎ-ఆజం (1960) నిర్మాత-దర్శకుడు కె. అసిఫ్ ను వివాహం చేసుకుంది. వారికి 5మంది పిల్లలు జన్మించారు.
మరణం
[మార్చు]ఈమె 2000, ఏప్రిల్ 21న ముంబైలో మరణించింది.
సినిమాలు
[మార్చు]- రంగభూమి (1946)
- 1857 (1946)
- బేలా (1947)
- షికాయత్ (1948)
- నావ్ (1948)
- మిట్టి కే ఖిలోన్ (1948)
- ఆగ్ అకా ఫైర్ (1948)
- పతంగా (1949)
- సునేహ్రే దిన్ (1949)
- బజార్ (1949)
- బాలం (1949)
- శీష్ మహల్ (1950)
- ఖేల్ (1950)
- ఖమోష్ సిపాహి (1950)
- ఫూలన్ కే హర్ (1951)
- దామన్ (1951)
- హైదరాబాద్ కి నజ్నీన్ (1952)
- ఆనంద్ భవన్ (1953)
- రిష్ట (1954)
- మీర్జా గాలిబ్ (1954)
- మస్తానా (1954)
- మంగు (1954)
- ఖైబర్ (1954)
- సర్దార్ (1955)
- ఉమర్ మార్వి (1956)
- దుర్గేశ్ నందిని (1956)
- యహూది (1958)
- కమాండర్ (1959)
- మొఘల్ ఎ ఆజం (1960)
- షాన్-ఎ-హిందూ (1961)
- సాయా (1961)
- రాజ్ కి బాత్ (1962)
- తాజ్ మహల్
- నూర్జహాన్ (1962)
- మేరే హమ్ దమ్ మేరే దోస్త్ (1968)
- దో కలియా (1968)
- బన్సీ బిర్జూ (1972)
- జంబిష్: ఎ మూవ్మెంట్-ది మూవీ (1986)
మూలాలు
[మార్చు]- ↑ "Sharmila Tagore to Sushmita Sen, Bollywood divas born in Hyderabad".
- ↑ 2.0 2.1 2.2 2.3 Nigar Sultana - Interview
- ↑ 3.0 3.1 3.2 Nigar Sultana Profile
- ↑ Nigar Sultana with her little girl
- ↑ Vintage Tidbits – Indian actress Nigar Sultana denying reports of her marriage with Pakistani actor Ishrat (Darpan Kumar)
బయటి లింకులు
[మార్చు]- నిగార్ సుల్తానా బాలీవుడ్ హంగామా లో నిగార్ సుల్తానా వివరాలు