పునర్జన్మ
ధారావాహిక లోని భాగం |
హిందూధర్మం |
---|
హిందూమత పదకోశం |
పునర్జన్మ (ఆంగ్లం : rebirth లేదా reincarnation) అంటే మనిషి తనువు చాలించిన తరువాత, తిరిగి భూమిపై మనిషిగా (శిశువుగా) జన్మించి, తిరిగి ఇంకో జీవితం గడపడం.[1][2] ఇది విశ్వాసం కోవలోకి వస్తుంది. పునర్జన్మ అనే పదం వినగానే, మనిషికి తన ప్రస్తుత జీవితం మొదటిది అనే భావన స్ఫురిస్తుంది, ఈ జీవనం చాలించిన తరువాత రాబోయే కాలంలోనో, లేక యుగంలోనో మరో జన్మ వుండడం తథ్యం అనే విశ్వాసమే, ఈ పునర్జన్మ అనే భావనకు మూలం. అలాగే జీవితంలో అనేక మలుపులు మార్పులు రావడాన్నికూడా మరోజన్మతో పోలుస్తారు. ఉదాహరణకు ప్రమాదంలో తీవ్రగాయాలకు గురై, తిరిగి కోలుకోవడం లేదా చావునుండి బయటపడటం.
హిందూ విశ్వాసాల్లో పునర్జన్మ
[మార్చు]మనిషి పాతచొక్కా విడిచి కొత్త చొక్కా వేసుకున్నట్లు ఆత్మ శరీరము నాశనమైన తరువాత కూడా మరొక పుట్టుకతో మరొక శరీరముతో పునర్జన్మ పొందుతుందని హిందువులు నమ్ముతారు. జన్మ జన్మకూ నశించని ఈ ఆత్మ, శరీరమనే పనిముట్టుతో ప్రతి జన్మలో మంచిపనులు చేస్తూ చివరకు భగవంతుని చేరాలని (మోక్షం పొందాలని) అనుకుంటారు. పునర్జన్మ కలుగకుండా మంచి పనులు చేయడమే కాక తపస్సు చేయడం, తీర్థయాత్రలు చేయడం (ముఖ్యంగా కాశీ యాత్ర) చేస్తారు. కాశీకి వెళ్ళి అక్కడే మరణించినా పునర్జన్మ ఉండదని నమ్ముతారు. ద్విజుడు అంటే రెండు జన్మలెత్తిన వాడు. యజ్ఞోపవీతం ధరించడం (ఉపనయనము జరగడం) రెండో జన్మతో సమానమని కొందరి అభిప్రాయం. అలాగే ప్రసవించడం స్త్రీకి పునర్జన్మ వంటిదని నమ్ముతారు.
క్రైస్తవ విశ్వాసాలలో పునర్జన్మ
[మార్చు]క్రైస్తవులు పశ్చాత్తాపపడినప్పుడు మారిన మనస్సుతో తిరిగి జన్మించినట్లయ్యి కొత్తజన్మ కలుగుతుందంటారు. అలా తిరిగి జన్మించిన శిశువులా ఐనవారే దేవునిరాజ్యంలో ప్రవేశిస్తారు అని ఏసుక్రీస్తు బోధన. అర్థం ఈ జీవితంలోనే పశ్చాత్తాప్పడి, తిరిగి స్వచ్ఛమైన వారు. ఈ ప్రకారం, క్రైస్తవంలో 'ఈ జీవితంలో తనువు చాలించిన తరువాత ఇంకో జన్మ లేదు'.
ఇస్లాం విశ్వాసాలలో పునర్జన్మ
[మార్చు]ఇస్లాం పునర్జన్మను తిరస్కరిస్తుంది. యౌమల్ ఖియామ (ప్రళయ దినం) న మానవులందరికీ తిరిగి జీవితం ఒసంగబడుతుంది. ఆ తరువాత అంతంలేని జీవితం ప్రసాదింపబడుతుంది. ఈ విషయాన్ని పునర్జన్మగా భావింపరాదనే విశ్వాసం ఇస్లాం బోధిస్తుంది.
ముస్లిముల్లో కూడా తనాసికియా అనే తెగ వాళ్ళు ఆత్మ పునర్జన్మ ఎత్తుతుంది అని నమ్ముతారు.
మూలాలు
[మార్చు]- ↑ McClelland 2010, pp. 24–29, 171.
- ↑ Mark Juergensmeyer & Wade Clark Roof 2011, pp. 271–272.
ఆధార గ్రంథాలు
[మార్చు]- John Bowker (2014). God: A Very Short Introduction. Oxford University Press. ISBN 978-0-19-870895-7.
- Chapple, Christopher Key, ed. (2010). The Bhagavad Gita: Twenty-fifth–Anniversary Edition. Translated by Sargeant, Winthrop. Foreword by Huston Smith. State University of New York Press. ISBN 978-1-4384-2840-6.
- Harold Coward (2008). The Perfectibility of Human Nature in Eastern and Western Thought: The Central Story. State University of New York Press. ISBN 978-0-7914-7336-8.
- Jeaneane D. Fowler (1997). Hinduism: Beliefs and Practices. Sussex Academic Press. ISBN 978-1-898723-60-8.[permanent dead link]
- Padmanabh Jaini (1980). Wendy Doniger (ed.). Karma and Rebirth in Classical Indian Traditions. University of California Press. ISBN 978-0-520-03923-0.
- Kalupahana, David J. (1992), A history of Buddhist philosophy, Motilal Banarsidass
- Kendrick, T. D. (2003). Druids and Druidism. Courier Corporation. ISBN 978-04-864271-9-5.
- Keown, Damien (2013). Buddhism: A Very Short Introduction. Oxford University Press. ISBN 978-0-19-966383-5.
- Mark Juergensmeyer; Wade Clark Roof (2011). Encyclopedia of Global Religion. SAGE Publications. ISBN 978-1-4522-6656-5.
- Stephen J. Laumakis (2008). An Introduction to Buddhist Philosophy. Cambridge University Press. ISBN 978-1-139-46966-1.
- McClelland, Norman C. (2010), Encyclopedia of Reincarnation and Karma, McFarland, ISBN 978-0-7864-5675-8
- Giannis Stamatellos (2013), "Plotinus on Transmigration: a Reconsideration", Journal of Ancient Philosophy, 7, Journal of Ancient Philosophy 7,1, doi:10.11606/issn.1981-9471.v7i1p49-64
- Obeyesekere, Gananath (2005). Wendy Doniger (ed.). Karma and Rebirth: A Cross Cultural Study. Motilal Banarsidass. ISBN 978-8120826090.
- Trainor, Kevin (2004). Buddhism: The Illustrated Guide. Oxford University Press. ISBN 978-0-19-517398-7.
- Paul Williams; Anthony Tribe; Alexander Wynne (2012), Buddhist Thought, Routledge, ISBN 978-1-136-52088-4