పుర్బా బర్ధమాన్ జిల్లా
Purba Bardhaman | |||||||
---|---|---|---|---|---|---|---|
Clockwise from top-left: 108 Shiva Temple at Nababhat, Ajay River at Katwa, Nava Kailash temple at Kalna, Uddharanpur Ghat, Mosque of Pir Bahram Sakka in Bardhaman | |||||||
Country | India | ||||||
రాష్ట్రం | West Bengal | ||||||
Division | Burdwan | ||||||
ముఖ్యపట్టణం | Bardhaman | ||||||
Government | |||||||
• Lok Sabha constituencies | Bardhaman-Durgapur, Bardhaman Purba, Bishnupur, Bolpur | ||||||
• Vidhan Sabha constituencies | Bardhaman Dakshin, Bardhaman Uttar, Bhatar, Galsi, Raina, Jamalpur, Memari, Khandaghosh, Katwa, Mangalkot, Ketugram, Ausgram, Kalna, Purbasthali Dakshin, Purbasthali Uttar, Manteswar. | ||||||
విస్తీర్ణం | |||||||
• Total | 5,432.69 కి.మీ2 (2,097.57 చ. మై) | ||||||
జనాభా (2011) | |||||||
• Total | 48,35,532 | ||||||
• జనసాంద్రత | 890/కి.మీ2 (2,300/చ. మై.) | ||||||
Demographics | |||||||
• Literacy | 74.73 per cent | ||||||
• Sex ratio | 945 | ||||||
Time zone | UTC+05:30 (భా.ప్రా.కా) | ||||||
HDI (2004) | 0.640[1] (medium) | ||||||
Average annual precipitation | 1442 mm | ||||||
Website | http://purbabardhaman.gov.in/ |
పుర్బా బర్ధమాన్ జిల్లా, భారతదేశం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఉంది. దీనిప్రధాన కార్యాలయం బర్ధమాన్ పట్టణంలోఉంది. ఇది మునుపటి బర్ధమాన్ జిల్లా విభజన తర్వాత 2017 ఏప్రిల్ 7న ఏర్పడింది. గొప్పవిప్లవకారుడు రాష్ బిహారీ బోస్ పుర్బాబర్ధమాన్ జిల్లా, సుబల్దహా గ్రామంలో జన్మించాడు. కొంతమంది చరిత్రకారులు జిల్లాపేరును ఈ ప్రాంతానికి బోధించడానికి వచ్చిన 24వ చివరి జైన తీర్థంకర మహావీర వర్ధమానతో అనుసంధానించారు. ప్రత్యామ్నాయంగా, బర్ధమాన జిల్లా సంపన్నమైన, పెరుగుతున్న ప్రాంతం. ఎగువ గంగా లోయలో ప్రజలచే ఆర్యీకరణ పురోగతిలో ఇది ఒక ముంద రిసరిహద్దు మండలం.[2]పుర్బా అంటే తూర్పు అని అర్థం.
చరిత్ర
[మార్చు]ఈ జిల్లా 20వ శతాబ్దపు బ్రిటీష్ చరిత్రలో "బెంగాల్‌లోని అత్యంతపురాతన ధనిక, అత్యంత స్థిరమైన సాగు ప్రాంతం " గా నమోదు చేయబడింది. పాండురాజర్ ధిబి వద్ద పురావస్తు త్రవ్వకాలు మధ్యశిలాయుగంలో సుమారు సా.శ.పూ 5,000 నాటి అజయ్ లోయలో నివాసాలను సూచించాయి. ప్రారంభ చారిత్రక కాలంలో రార్ ప్రాంతంలో ఒక భాగమైన బర్ధమాన్భుక్తిని మగధలు,మౌర్యులు, కుషాణులు, గుప్తులు వరుసగా ఈప్రాంతాన్ని పాలించారు. సా.శ. 7వ శతాబ్దంలో శశాంక రాజగా ఉన్నప్పుడు, ఈ ప్రాంతం గౌడ రాజ్యంలో భాగంగా ఉండేది.ఇది తరువాత పాలస్ సేనలచే పాలించబడింది.[3]
సా.శ. 1199లో భక్తియార్ ఖిల్జీ దీనిని స్వాధీనం చేసుకున్నాడు. తొలి ముస్లిం పాలకులు గౌడ లేదా లఖ్‌నౌటీ నుండి బెంగాల్‌లోని ప్రధాన ప్రాంతాలను పాలించారు. ఐన్-ఇ-అక్బరీలో, బర్ధమాన్ సర్కార్ షరీఫాబాద్ మహల్ లేదా పరగణాగా పేర్కొనబడింది. బర్ధమాన్‌లోని కొన్నిపశ్చిమభాగాలు గోప్భుమ్‌గా ఏర్పడ్డాయి.అనేక శతాబ్దాలపాటు సద్గోప్ రాజులు పాలించారు. అమ్రార్గర్ వద్ద ఒకకోట అవశేషాలు ఉన్నాయి.[3]
1689లో బర్ధమాన్ రాజ్ కుటుంబానికి చెందిన రాజా కృష్ణరామ్ రాయ్, ఔరంగజేబ్ నుండి ఒక రాయల్ డిక్రీ పొందాడు.అది అతన్నిబర్ధమాన్‌కు జమీందారుగా చేసింది. అప్పటినుండి రాజ్ కుటుంబ చరిత్ర, జిల్లాచరిత్రతో సమానంగా మారింది.[3] ఔరంగజేబు మరణం తరువాత, మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది. ముర్షిద్ కులీ ఖాన్ బెంగాల్ నవాబు అయ్యాడు. మొఘల్ చక్రవర్తిపై నామమాత్రపు విధేయతను మాత్రమే కలిగిఉండేవాడు. ఆ సమయంలో బర్ధమాన్‌ను చక్లా అని పిలిచేవారు. ఇది మునుపటి పరగణా నుండి మార్పు తదనంతరం, అలీవర్ది ఖాన్ పాలనలో, బార్గీలు బర్ధమాన్‌పై దాడి చేసి దోచుకున్నారు.[4]
1757లో ప్లాసీయుద్ధంలో బ్రిటీష్ వారి విజయం తర్వాత, బర్ధమాన్, మేదినీపూర్, చిట్టగాంగ్‌లు ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించబడ్డాయి.1857లో బ్రిటిష్ క్రౌన్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి దేశ పరిపాలనను చేపట్టింది.[5]
1765లో ఈస్ట్ ఇండియాకంపెనీ బర్ధమాన్ దివానీని స్వాధీనంచేసుకున్నప్పుడు, అది బర్ధమాన్, బంకురా, హుగ్లీ, బీర్భూమ్‌లో మూడవవంతుతో కూడిఉంది.1820లో హుగ్లీ,[6] లో బంకురా, బీర్భూమ్‌లు వేరుచేయబడ్డాయి.
చివరికి బర్ధమాన్ ప్రాంతం శాశ్వత పరిష్కారంగా విచ్ఛిన్నానికి దారితీసింది. అద్దె బకాయిలు చెల్లించడంలో రాజాలు తరచుగా విఫలమవడంతో కొన్ని భాగాలను వేలంవేశారు. అయినా కొన్ని చెప్పుకోదగిన జ్ఞాపకాలు మిగిలాయి. మహతాబ్‌చంద్ వైస్రాయ్ కార్యనిర్వహక మండలిలో అదనపు సభ్యునిగా నియమితుడయ్యాడు.1877లో అతని పేరుకుముందు హిజ్ హైనెస్ బిరుదును ఉపయోగించుకోటానికి అనుమతించబడ్డాడు. బిజోయ్ చంద్ మహతాబ్‌కు 1908లో లార్డ్ మింటో మహారాజాధిరాజ్ బిరుదును ప్రదానంచేశారు. ఉదయ్ చంద్ మహతాబ్1941లో బాధ్యతలు స్వీకరించాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1954లో జమీందారీవ్యవస్థ రద్దు అయ్యేవరకు పనిచేశాడు.[7][8]
బర్ధమాన్ జిల్లా 2017 ఏప్రల్ 7న పుర్బాబర్ధమాన్, పశ్చిమ్ బర్ధమాన్ అనే రెండు జిల్లాలుగా విభజించబడింది [9]
భౌగోళికం
[మార్చు]పుర్బా బర్ధమాన్ జిల్లాఒక చదునైన ఒండ్రు మైదానప్రాంతం. దీనిని నాలుగు ప్రముఖ స్థలాకృతి ప్రాంతాలుగా విభజించవచ్చు.ఉత్తరాన, కాంక్షకేతుగ్రామ్ మైదానం అజయ్ ప్రాంతం ఉంది.ఇది భాగీరథిని కలుస్తుంది. బర్ధమాన్ మైదానం జిల్లా మధ్యప్రాంతాన్ని ఆక్రమించింది. దక్షిణ,ఆగ్నేయంలో దామోదర్ నది ఉంది. దక్షిణభాగంలో ఖండఘోష్ మైదానం ఉంది. భాగీరథీనది జిల్లా తూర్పు సరిహద్దులో ప్రవహిస్తుంది. భాగీరథినదీ పరివాహక ప్రాంతం జిల్లా తూర్పుభాగాన్నిఆక్రమించింది. పశ్చిమ్ వర్ధమాన్ జిల్లా, ఉప్పెన లేటరైట్ స్థలాకృతి ఈ జిల్లాలోని ఆస్గ్రామ్ ప్రాంతంవరకు విస్తరించి ఉంది.[10][11]
వాతావరణం
[మార్చు]పుర్బాబర్ధమాన్ జిల్లావేడి, తేమతోకూడిన ఉష్ణమండల వాతావరణాన్నికలిగి ఉంటుంది. అత్యంత వేడిగా ఉండే నెల ''మే'' అయితే, ''జనవరి'' నెల బాగా చలిగా ఉంటుంది. వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబరు వరకు ఉంటుంది. వార్షిక సగటువర్షపాతం 1,400 మి.మీ.ఉంటుంది.వర్షాకాలంలో 75%శాతానికిపడిపోతుంది. బెంగాలీలో కాల్బైసాఖి అని పిలువబడే స్థానికీకరించిన ఉరుములతో కూడిన తుఫానులు మార్చి నెల నుండి రుతుపవనాలు ప్రారంభమయ్యే వరకు ఉంటాయి.[12]
పరిపాలనా విభాగాలు
[మార్చు]పుర్బాబర్ధమాన్ జిల్లా క్రింది పరిపాలనా ఉపవిభాగాలుగా విభజించబడింది:[9][13]
ఉపవిభాగం | ప్రధాన కార్యాలయం | ప్రాంతం
కిమీ2 |
జనాభా
(2011) |
గ్రామీణ
జనాభా % (2011) |
పట్టణ
జనాభా % (2011) |
---|---|---|---|---|---|
బర్ధమాన్ సదర్ నార్త్ | బర్ధమాన్ | 1,958.43 | 1,586,623 | 73.58 | 26.42 |
బర్ధమాన్ సదర్ సౌత్ | బర్ధమాన్ | 1,410.03 | 1,198,155 | 95.54 | 4.46 |
కత్వా | కత్వా | 1,070.48 | 963,022 | 88.44 | 11.56 |
కల్నా | కల్నా | 993.75 | 1,097,732 | 87.00 | 13.00 |
పుర్బా బర్ధమాన్ | బర్ధమాన్ | 5,432.69 | 4,835,532 | 84.98 | 15.02 |
జిల్లా నాలుగు ఉపవిభాగాలను కలిగి ఉంది:[9][14][15]
- కల్నా ఉప విభాగంలో కల్నాలో ఒకపురపాలక సంఘం, కల్నా I, కల్నా II, మాంటెస్వర్, పుర్బాస్థలి I, పుర్బాస్థలి II అనే ఐదు కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాకులు ఉన్నాయి.
- కత్వా ఉప విభాగంలో కత్వా, డైన్హాట్ అనే రెండు పురపాలక సంఘాలు, కత్వా I, కత్వా II, కేతుగ్రామ్ I, కేతుగ్రామ్ II, మొంగాకోట్ అనే ఐదు కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాకులు ఉన్నాయి.
- బర్ధమాన్ సదర్ ఉత్తర ఉపవిభాగంలో బర్ధమాన్, గుస్కర అనే రెండు పురపాలక సంఘాలు, ఆస్గ్రామ్ I, ఆస్గ్రామ్ II, భటర్, బుర్ద్వాన్ I, బుర్ద్వాన్ II, గల్సి I, గల్సి II అనే ఏడు కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాకులు ఉన్నాయి.
- బర్ధమాన్ సదర్ దక్షిణ ఉప విభాగంలో మెమారి అనే ఒక ఒకపురపాలక సంఘం, ఖండఘోష్, జమాల్పూర్, మెమారి I, మెమారి II, రైనా I, రైనా II అనే ఆరు సమాజ అభివృద్ధి సమితులుఉన్నాయి:
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కలు డేటా ప్రకారం, 2017లో బర్ధమాన్ జిల్లా విభజన తర్వాత పునశ్చరణ ప్రకారం పుర్బా బర్ధమాన్ జిల్లా మొత్తం జనాభా 48,35,532. వారిలో 24,69,310 (51%) మంది పురుషులు కాగా, 23,66,222 (49%) మంది స్త్రీలు ఉన్నారు. 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల జనాభా 5,09,855 మందిఉన్నారు. మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాలు జనాభా 14,87,151 (30.75%) మంది ఉన్మనారు.అలాగే షెడ్యూల్డ్ తెగలు జనాభా 327,501 (6.77%) మంది ఉన్నారు.[16] మొత్తం అక్షరాస్యుల సంఖ్య 32,32,452 (6 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల జనాభాలో 74.73%) అందులో పురుషులు 17,81,090 (పురుషుల జనాభాలో 80.60%) మంది ఉన్నారు. అలాగే 6 సంవత్సరాలకు పైగా వయస్సు ఉన్న స్త్రీలు 14,53,362 మంది (6 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీ జనాభాలో 68.66%).[17]
మతాల ప్రకారం
[మార్చు]హిందూమతానికి చెందినవారు అత్యధికం. ఇస్లాం రెండవ అతిపెద్ద మతం. బర్ధమాన్‌లోని అనేక మంది జమీందార్లు, ఎక్కువగా హిందువులు, ప్రకృతి దృశ్యాన్ని చుట్టుముట్టే అనేక కుటుంబ దేవాలయాలను నిర్మించారు. చాలా మంది గిరిజనులు హిందూ మతాన్ని అనుసరిస్తారు కానీ వారి గిరిజన మతానికి కూడా ఎక్కవ ప్రాధాన్యత ఇస్తారు. ఇస్లాం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ కేంద్రీకృతమై ఉంది. కేతుగ్రామ్ I (46.77%), మాంటెస్వర్ (41.77%) కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్‌లలో గణనీయమైన మైనారిటీని కలిగి ఉంది.
మతం | జనాభా (1941) [18] | శాతం (1941) | జనాభా (2011)[19] | శాతం (2011) |
---|---|---|---|---|
హిందూ | 922,290 | 71.77% | 3,566,068 | 73.75% |
ఇస్లాం | 277,573 | 21.60% | 1,251,737 | 25.89% |
షెడ్యూలు తెగలు | 84,493 | 6.58% | -- | -- |
ఇతరులు [a] | 687 | 0.05% | 17,727 | 0.37 |
జనాభా మొత్తం | 12,85,043 | 100% | 48,35,532 | 100% |
ప్రయాణ సౌకర్యాలు
[మార్చు]- కోల్‌కతా సబర్బన్ రైల్వే వ్యవస్థలో భాగమైన హౌరా-బర్ధమాన్ మెయిన్ లైన్, హౌరా-బర్ధమాన్ కోర్డ్ ఈ జిల్లాలోకి ప్రవేశించి శక్తిగఢ్ రైల్వే స్టేషన్లో కలుస్తాయి. హౌరా- ఢిల్లీ మెయిన్ లైన్లో భాగమైన బర్ధమాన్-అసన్సోల్ సెక్షన్, హౌరా-గయా-ఢిల్లీ లైన్, హౌరా-అలహాబాద్-ముంబై లైన్, బర్ధమాన్-కియుల్ సాహిబ్‌గంజ్ లూప్ జిల్లాకు మరొక చివరన బయలుదేరుతాయి.[20][21]
- బంకురా-మసాగ్రామ్ లైన్లో డీజిల్ బహుళ యూనిట్ సేవలు అందుబాటులో ఉన్నాయి.[22]
- బర్ధమాన్-కత్వా లైన్, నారో గేజ్ నుండి విద్యుదీకరించబడిన బ్రాడ్ గేజ్‌గా మార్చబడిన తర్వాత, 12 జనవరి 2018న ప్రజలకు తెరవబడింది.[23]
- కోల్‌కతా-ఆగ్రా జాతీయ రహదారి 19 (పాత నంబర్ NH 2), పాత గ్రాండ్ ట్రంక్ రోడ్లో ఎక్కువ భాగం ఈ జిల్లా గుండా వెళుతుంది.[24] జిల్లా గుండా వెళుతున్న ఇతర రహదారులు: జాతీయ రహదారి 114, రాష్ట్ర రహదారి 6, రాష్ట్ర రహదారి 7, రాష్ట్ర రహదారి 13 (పాత గ్రాండ్ ట్రంక్ రోడ్లో ఎక్కువ భాగాన్ని కవర్ చేస్తుంది), రాష్ట్ర రహదారి 14, రాష్ట్ర రహదారి 15.[25]
మూలాలు
[మార్చు]- ↑ "West Bengal Human Development Report 2004" (PDF) (in ఇంగ్లీష్).
- ↑ "Census of India 2011: District Census Handbook, Bardhaman, Part XII B" (PDF). Brief History of the district, pages 9 - 11. Directorate of Census Operations, West Bengal. Retrieved 12 April 2017.
- ↑ 3.0 3.1 3.2 "Census of India 2011: District Census Handbook, Bardhaman, Part XII B" (PDF). Brief History of the district, pages 9 - 11. Directorate of Census Operations, West Bengal. Retrieved 12 April 2017.
- ↑ "Census of India 2011: District Census Handbook, Bardhaman, Part XII B" (PDF). Brief History of the district, pages 9 - 11. Directorate of Census Operations, West Bengal. Retrieved 12 April 2017.
- ↑ "Census of India 2011: District Census Handbook, Bardhaman, Part XII B" (PDF). Brief History of the district, pages 9 - 11. Directorate of Census Operations, West Bengal. Retrieved 12 April 2017.
- ↑ Chattopadhyay, Akkori, Bardhaman Jelar Itihas O Lok Sanskriti (History and Folk lore of Bardhaman District.), (in Bengali), Vol I, pp 367-370, Radical Impression. ISBN 81-85459-36-3
- ↑ Chattopadhyay, Akkori, Vol I, pp 345-365
- ↑ "Bardhaman District". History and Background. Bardhaman district administration. Retrieved 13 April 2017.
- ↑ 9.0 9.1 9.2 "পূর্ব ও পশ্চিম, আজ বর্ধমান জেলা ভাগের আনুষ্ঠানিক ঘোষনা মুখ্যমন্ত্রীর" (in Bengali). ABP Ananda, 7 April 2017. 7 April 2017. Retrieved 9 April 2017.
- ↑ Chattopadhyay, Akkori, Bardhaman Jelar Itihas O Lok Sanskriti (History and Folk lore of Bardhaman District.), (in Bengali), Vol I, p18,28, Radical Impression. ISBN 81-85459-36-3
- ↑ "Census of India 2011, West Bengal: District Census Handbook, Barddhaman" (PDF). Physiography, pages 13-14. Directorate of Census Operations, West Bengal. Retrieved 3 March 2017.
- ↑ "2011 District Census Handbook Bardhaman Part XII A" (PDF). Climate on page 17. Directorate of Census Operations, West Bengal. Retrieved 6 March 2017.
- ↑ "District Statistical Handbook 2014 Burdwan". Table 2.2, 2.4(a). Department of Statistics and Programme Implementation, Government of West Bengal. Archived from the original on 21 January 2019. Retrieved 17 February 2017.
- ↑ "District Statistical Handbook 2014 Burdwan". Table 2.2, 2.4(a). Department of Statistics and Programme Implementation, Government of West Bengal. Archived from the original on 21 January 2019. Retrieved 17 February 2017.
- ↑ "Directory of District, Sub division, Panchayat Samiti/ Block and Gram Panchayats in West Bengal, March 2008". West Bengal. National Informatics Centre, India. 19 March 2008. Archived from the original on 25 February 2009. Retrieved 6 December 2008.
- ↑ "2011 Census - Primary Census Abstract Data Tables". West Bengal – District-wise. Registrar General and Census Commissioner, India. Retrieved 16 April 2017.
- ↑ "2011 Census - Primary Census Abstract Data Tables". West Bengal – District-wise. Registrar General and Census Commissioner, India. Retrieved 16 April 2017.
- ↑ "CENSUS OF INDIA, 1941 VOLUME VI BENGAL PROVINCE" (PDF). Retrieved 13 August 2022.
- ↑ "Table C-01 Population by Religion: West Bengal". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.
- ↑ "36811/ Howrah Barddhaman Jn Chord Local". Time Table. indiarailinfo. Retrieved 9 February 2017.
- ↑ "63501/ Mowrah-Barddhaman Fast Memu Local". Time Table. indiarailinfo. Retrieved 9 February 2017.
- ↑ "Bankura-Mathnasibpur DEMU". Time Table. indiarailinfo. Retrieved 28 February 2017.
- ↑ "Baro rail Katwae, jamlo bhidr (Big railway in Katwa, crowd gathers)". Bengali. Ananda Bazar Patrika, 13 January 2018. Retrieved 13 January 2018.
- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 10 February 2017.
- ↑ "List of State Highways in West Bengal". West Bengal Traffic Police. Retrieved 15 October 2016.
వెలుపలి లంకెలు
[మార్చు]- ↑ Including Jainism, Christianity, Buddhism, Zoroastrianism, Judaism, Ad-Dharmis, or not stated