పేట్ బషీరాబాద్
పేట్ బషీరాబాద్ | |
---|---|
సమీప ప్రాంతం | |
Coordinates: 17°31′18″N 78°29′00″E / 17.521741°N 78.483421°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
టెలిఫోన్ కోడ్ | 040 |
Vehicle registration | టిఎస్-26 X XXXX |
పేట్ బషీరాబాద్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కుత్బల్లాపూర్ శివారు ప్రాంతం.[1] ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండలం పరిధిలోకి వస్తుంది.[2]
చరిత్ర
[మార్చు]సికందర్ జా మీర్ అక్బర్ ఆలీఖాన్ అసఫ్ జా III రెండవ కుమారుడైన 3వ నిజాం మీర్ బషీరుద్దీన్ ఆలీఖాన్ (సంసం ఉద్ దౌలా) పేరును ఈ ప్రాంతాలనికి పెట్టారు. ఇక్కడికి సమీపంలో జీడీమెట్ల, కుత్బుల్లాపూర్, నందనగర్, గాజులరామారం, సూరారం, రామరాజు నగర్, భెల్ కాలనీ, గ్రీన్ కౌంటీ కాలనీ, మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో పేట్ బషీరాబాద్ మీదుగా కోఠి, మేడ్చల్, ఎన్జీవోస్ కాలనీ, అఫ్జల్గంజ్, మెహదీపట్నం, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వంటి ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[3] ఇక్కడికి సమీపంలో బొల్లారం బజార్ రైల్వే స్టేషను, ఆల్వాల్ రైల్వే స్టేషను ఉన్నాయి.
పాఠశాలలు
[మార్చు]ఇక్కడ సెయింట్ ఆన్స్ హైస్కూల్, షేర్వుడ్ హైస్కూల్ ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Pet Basheerabad Locality". www.onefivenine.com. Retrieved 2021-02-02.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2021-02-02.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-02.