పేరాల సుబ్రహ్మణ్యం
Jump to navigation
Jump to search
పేరాల సుబ్రహ్మణ్యం | |
---|---|
జననం | |
ఇతర పేర్లు | వసంత సేన్, పేరాల |
వృత్తి | సినిమా దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1978-2005 |
గుర్తించదగిన సేవలు | పిల్లలు దిద్దిన కాపురం, రాఘవయ్య గారి అబ్బాయి |
పేరాల సుబ్రహ్మణ్యం తెలుగు చలనచిత్ర దర్శకుడు. ఇతని స్వగ్రామం ప్రకాశం జిల్లాలోని ఉప్పుగుండూరు. ఇతడు 1969లో చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించి దర్శకుడు బి.వి.ప్రసాద్ వద్ద తొమ్మిది సంవత్సరాలు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. సినిమాలలో ప్రవేశించక ముందు అతడు సాంఘిక నాటకాలలో నటించాడు. [1]
సినిమారంగం
[మార్చు]ఇతడు అనేక తెలుగు, కన్నడ సినిమాలకు కథ, చిత్రానువాదం, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించాడు. దర్శకుడిగా ఇతని తొలి సినిమా ఓ అమ్మకథలో ఇతడి పేరుని వసంతసేన్‌గా పేర్కొన్నారు. తరువాతి సినిమాలలో ఇతడు ఇంటిపేరు పేరాలతో ప్రసిద్ధి చెందాడు. ఇతడు కృష్ణంరాజు, జగపతి బాబు, నూతన్ ప్రసాద్, శ్రీనాథ్, చరణ్‌రాజ్, వజ్రముని, అంబరీష్, అనంత్ నాగ్, కన్నడ ప్రభాకర్,శారద, జయసుధ, అంబిక,గీత, ఆరతి, రాధిక, దివ్యవాణి, లక్ష్మి వంటి నటీనటులతో పనిచేశాడు.
ఇతడు పని చేసిన సినిమాలలో కొన్ని,:[2] [3]
సంవత్సరం | సినిమా పేరు | భాష | పాత్ర | వివరాలు | |||
---|---|---|---|---|---|---|---|
దర్శకుడు | సహదర్శకుడు | కథ | స్క్రీన్ ప్లే/సంభాషణలు | ||||
1978 | డూ డూ బసవన్న | తెలుగు | |||||
1980 | త్రిలోక సుందరి | తెలుగు | |||||
1981 | ఓ అమ్మకథ | తెలుగు | ఈ చిత్రంలో ఇతని పేరు వసంతసేన్ అని పేర్కొన్నారు. | ||||
1981 | మావూరి పెద్దమనుషులు | తెలుగు | |||||
1981 | మనవూరి రాముడు | తెలుగు | |||||
1982 | గరుడరేఖె | కన్నడ | |||||
1984 | బడ్డి బంగారమ్మ | కన్నడ | |||||
1984 | డాకూ రాణి | తెలుగు | హిందీలో డాకూరాణి హిమ్మత్‌వాలి అనే పేరుతో డబ్ చేయబడింది. | ||||
1985 | మారుతి మహిమె | కన్నడ | |||||
1986 | బెట్టద తాయి | కన్నడ | |||||
1986 | బ్రహ్మాస్త్ర | కన్నడ | |||||
1987 | [[:kn:ಅತಿರಥ ಮಹಾರಥ (ಚಲನಚಿತ್ರ)|అతిరథ మహారథ]] | కన్నడ | |||||
1987 | తాయి | కన్నడ | |||||
1987 | బజార్ భీమ | కన్నడ | |||||
1987 | లారీ డ్రైవర్ | కన్నడ | |||||
1988 | కంకణ భాగ్య | కన్నడ | |||||
1988 | ధర్మతేజ | తెలుగు | |||||
1988 | పృథ్వీరాజ్ | తెలుగు | |||||
1990 | ఆవేశ | కన్నడ | |||||
1990 | నమ్మూర హమ్మీర | కన్నడ | |||||
1990 | నిగూఢ రహస్య | కన్నడ | |||||
1992 | నన్న తంగి | కన్నడ | |||||
1993 | పిల్లలు దిద్దిన కాపురం | తెలుగు | |||||
1995 | ముత్తినంత హెండతి | కన్నడ | |||||
1996 | హైదరాబాద్ గూండాయిజం | తెలుగు | |||||
1997 | రాజదర్బార్ | తెలుగు | |||||
1997 | జేనిన హొళె | కన్నడ | |||||
2000 | రాఘవయ్య గారి అబ్బాయి | తెలుగు | |||||
2005 | దేవీమాతా | హిందీ | |||||
2005 | ఆశల పల్లెకి | తెలుగు | ఉత్తమ బాలల చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వంచే నంది పురస్కారం[4] |
మూలాలు
[మార్చు]- ↑ వి.ఎస్.అవధాని (5 January 1982). "పరిచయం: పేరాల సుబ్రహ్మణ్యం" (PDF). ఆంధ్రపత్రిక. No. సంపుటి:68 సంచిక:276. Archived from the original (PDF) on 29 సెప్టెంబరు 2022. Retrieved 29 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "All Movies Perala". ఇండియన్ సినిమా. Retrieved 29 September 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Perala". చిత్రలోక కన్నడ. Retrieved 29 September 2022.
- ↑ L.VENUGOPAL. "Andhra Pradesh State Nandi Film Awards(2001-2006)". TELUGUCINEMA CHARITRA. Retrieved 30 September 2022.