పైడి జైరాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పైడి జైరాజ్ (Paidi Jairaj)
జననంసెప్టెంబరు 28, 1909
మరణంఆగష్టు 11, 2000
వృత్తినటులు, నిర్మాత, దర్శకులు

పైడి జైరాజ్ (ఆంగ్లము: Paidi Jairaj)(సెప్టెంబరు 28, 1909 - ఆగష్టు 11, 2000) భారత సినీరంగంలో తెలంగాణ కరీంనగర్ కు చెందిన తెలుగు నటుడు, నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. తెలంగాణ రాష్ట్రం నుండి హిందీ చిత్ర పరిశ్రమలో నటుడిగా మంచి పేరు సంపాదించి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న పైడి జైరాజ్ పేరును రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ పెట్టారు.[1]

జననం[మార్చు]

ఈయన 1909 సంవత్సరం సెప్టెంబరు 28న కరీంనగర్ లో జన్మించారు.[2] జైరాజ్ 156 చిత్రాలలో కథానాయకుడి పాత్రలతోపాటు మొత్తం 300 పైగా మూకీ, టాకీ సినిమాలలో నటించారు.[3]

నటనా జీవితం[మార్చు]

భారత కోకిల సరోజినీ నాయుడు జైరాజ్ కు మేనత్త అవుతారు. కరీంనగర్ జిల్లాకు చెందిన జైరాజ్ హైదరాబాద్ నిజాం కాలేజీలో చదివి సినిమాలపై మోజుతో 1929లో ముంబాయి చేరుకున్నారు. తన ఇరవైయ్యోయేట 1930 లో తొలిసారిగా " స్పార్క్లింగ్ యూత్ " అనే మూకీ చిత్రంలో నటించారు. అదే సంవత్సరంలో " ట్రయంఫ్ ఆఫ్ లవ్ " అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. జైరాజ్ మొత్తం 11 మూకీ చిత్రాల్లో నటించారు. 1931 లో ప్రారంభమైన టాకీ యుగంలో ఆయన " షికారి " ఉర్దూ చిత్రంతో టాకీల్లో ప్రవేశించారు. తర్వాత కాలంలో శాంతారాం, పృధ్వీరాజ్ కపూర్ లాంటి పెద్ద హీరోల సరసన మరో పెద్ద హీరోగా పేరు తెచ్చుకున్నారు. నిరూపా రాయ్, శశికళ, దేవికారాణి, మీనాకుమారి లాంటి హీరోయిన్ ల సరసన నటించారు. అనేక విజయాలనూ చవిచూశారు.

'మూకీ' సినిమా రోజులలో 11 సినిమాలలో, తరువాత సుమారు 156 'టాకీ' సినిమాలలో కథానాయకుడిగా, విలక్షణమైన నటుడిగా పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. హిందీ, ఉర్దూ భాషలతో పాటు, కొన్ని మరాఠీ, గుజరాతీ భాషా చిత్రాలలో కూడా నటించారు. అనేక చిత్రాలలో ఎన్నో రకాల పాత్రలు ధరించినా ఇతను పోషించిన జాతీయ నాయకుల పాత్రలు దేశానికి గుర్తుండేవి, ప్రేరణ కలిగించేవి. ఒక నటుడిగా ఈ పాత్రలే ఎక్కువ సంతృప్తినిచ్చినట్లు ఆయన చెప్పేవారు. జైరాజ్ పోషించిన టిప్పు సుల్తాన్, పృథ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్ మొదలైన చారిత్రక సంబంధ పాత్రలు విశిష్టమైనవి. బొంబాయి చిత్రసీమలో ప్రవేశించి హీరోగా ఎదిగి హిందీ, ఉర్దూ మొదలైన భాషల్లో సుమారు 170 చిత్రాల్లో నటించిన తెలుగువాడు పైడి జైరాజ్.

సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా 1962, ఫిబ్రవరి 24న విడుదలైంది. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ అనే హిందీ సినిమా తెలుగులోకి అనువాదం చేయబడింది.

నటుడిగానే కాక మొహర్, మాలా, ప్రతిమ, సాగర్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇందులో ' సాగర్ ' చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. ఎక్కువగా షాజహాన్, పృధ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్, టిప్పు సుల్తాన్, అల్లావుద్దీన్, చంద్రశేఖర ఆజాద్ లాంటి చారిత్రక పాత్రల్ని ధరించిన జైరాజ్ తెలుగు వాడై వుండి కూడా ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించలేకపోయారు.

దర్శకత్వం[మార్చు]

పైడి జైరాజ్ మెహర్, సాగర్ , మాల, ప్రతిమ అనే నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. పి.జె. ఫిల్మ్స్ యూనిట్ పతాకంపై ప్రసిద్ధనటి నర్గీస్ కథానాయికగా 'సాగర్' చిత్రాన్ని 1951లో నిర్మించాడు.

అవార్డులు[మార్చు]

జైరాజ్ భారతీయ సినిమా వికాసానికి తన జీవితకాలంలో చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 1980లో కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేసి గౌరవించింది.

కుటుంబం[మార్చు]

ఈయన పుట్టిన తేది సెప్టెంబరు 28 1909 . ఈయనకి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు.

మరణం[మార్చు]

ఈయన 2000 సంవత్సరం ఆగష్టు 11న పరమపదించారు.

గుర్తింపులు[మార్చు]

హిందీలో మాత్రమే కాకుండా మరాఠీ, ఒరియా, బెంగాలీ, పంజాబీ, కొంకణి, గుజరాతీ, మలయాళం సహా పలు జాతీయభాషల్లో దాదాపు 300 చిత్రాలకు పైగా నటించి భారతీయ సినిమా పరిశ్రమలో శిఖర సమానుడిగా నిలిచి, తెలంగాణ నేలనుంచి దేశం గర్వించదగ్గ స్థాయిలోకి ఎదిగిన పైడి జైరాజ్ అందించిన సేవలకు గుర్తుగా రవీంద్రభారతి రెండవ అంతస్తులోని హాలును ఆధునీకరించి ‘పైడి జైరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌’గా నామకరణం చేశారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీచేసింది.[4][5]

సినిమాలు[మార్చు]

నటుడిగా (103 చిత్రాలు)
  • 1995: గాడ్ అండ్ గన్
  • 1994: బేతాజ్ బాద్షా
  • 1992: లంబు దాదా
  • 1988: ఖూన్ భారి మాంగ్
  • ఓల్డ్ మాన్ - రెస్క్యూస్ ఆర్తి
  • షాజహాన్ (హిందీ చిత్రం )
  • 1986: The Living Corpse (as Jairaj),
  • 1984 Bindiya Chamkegi,
  • 1984 Unchi Uraan,
  • 1983 Ardh Satya (as Jairaj),
  • 1983 Pukar
  • Narvekarji (as Jairaj),
  • 1983 Masoom,
  • 1983 Karate,
  • 1981 Fiffty Fiffty
  • Tiwari (as Jairaj),
  • 1981 Khoon Aur Paani
  • Singh (as Jairaj),
  • 1981 Kranti
  • Maharaj Laxman Singh (as Jairaj),
  • 1980 Jyoti Bane Jwala (as Jairaj),
  • 1980 Chunaoti
  • Inspector General (as Jairaj),
  • 1980 Jazbaat (as Jairaj),
  • 1979 Ahimsa,
  • 1979 Nagin Aur Suhagan
  • Thakur Jagatpal Singh (as Jairaj),
  • 1978 Muqaddar Ka Sikandar
  • Doctor Kapoor,
  • 1978 Don
  • Dayal (Judo Karate Instructor),
  • 1978 Aakhri Daku (as Jairaj),
  • 1978 Khoon Ka Badla Khoon,
  • 1978 Anjaam
  • Dharamdas (as Jairaj),
  • 1977 Chhailla Babu
  • Pratap Verma (as Jairaj),
  • 1977 Kachcha Chor (as Jairaj),
  • 1976 Hera Pheri
  • Dinanath (as Jairaj),
  • 1976 Charas
  • Police Officer Hameed,
  • 1976 Bairaag (as Jairaj),
  • 1976 Naag Champa (as Jairaj),
  • 1975 షోలే
  • Police Comissioner (as Jairaj),
  • 1975 Kala Sona
  • Rakesh's Father (as Jairaj),
  • 1975 Dharmatma (as Jairaj),
  • 1975 Himalay Se Ooncha
  • Chief of Kathmandu Tower (as Jairaj),
  • 1975 Jogidas Khuman,
  • 1975 Toofan (as Jairaj),
  • 1974 Chor Chor (as Jairaj),
  • 1974 Faslah
  • Publisher - Asha's boss,
  • 1973 Gehri Chaal,
  • 1973 Suraj Aur Chanda,
  • 1973 Chhalia (as Jairaj),
  • 1973 Naag Mere Saathi,
  • 1972 Shehzada (as Jai Raj),
  • 1971 Nadaan
  • Jailor (as Jairaj),
  • 1971 Chhoti Bahu
  • Rajaram Ramprasad Bahadur (as Jairaj),
  • 1970 Gunah Aur Kanoon,
  • 1970 Jeevan Mrityu
  • S.N. Roy (as Jairaj),
  • 1967-1968 Maya (TV series)
  • Kana / Maharajah
  • – The Treasure Temple (1968) … Kana (as Jairaj)
  • – Natira (1967) … Maharajah (as Jairaj),
  • 1968 Neel Kamal,
  • 1967 Baharon Ke Sapne (as Jairaj),
  • 1966 Maya
  • Gammu Ghat (as Jairaj),
  • 1964 Khufia Mahal (as Jairaj),
  • 1963 Nine Hours to Rama
  • G.D. Birla (as Jairaj),
  • 1962: సామ్రాట్ పృథ్వీరాజ్
  • 1961 Razia Sultana,
  • 1961 Aas Ka Panchhi (as J. Raj),
  • 1961 Jai Chitod,
  • 1960 Lal Quila,
  • 1960 రిటర్న్ ఆఫ్ ఎ సూపర్ మేన్
  • 1959 Char Dil Char Raahein
  • 1959 Samrat Prithviraj Chauvan సామ్రాట్ పృథ్వీరాజ్
  • Nirmal Kumar,
  • 1957 Mumtaz Mahal,
  • 1957 Pardesi,
  • 1956 Parivar,
  • 1956 Sultana Daku,
  • హతిమ్ తాయ్
  • 1955 Teerandaz,
  • 1955 Insaniyat,
  • 1954 Baadbaan,
  • 1952 Lal Kunwar,
  • 1951 Rajput,
  • 1951 Saagar,
  • 1950 Proud,
  • 1949 సింగార్,
  • 1949 Darogaji,
  • 1949 Roomal,
  • 1949 అమర్ కహానీ,
  • 1948 Azadi Ki Raah Par,
  • 1948 Sajan Ka Ghar,
  • 1948 Anjuman,
  • 1947 మన్మణి
  • 1946 Shahjehan
  • Shiraz,
  • 1946 Salgirah,
  • 1946 Rajputani,
  • 1945 Rahat,
  • 1944 Panna
  • Shyam,
  • 1943 Hamari Baat,
  • 1943 నయీ కహానీ
  • 1943 Prem Sangeet,
  • 1942 తమన్నా
  • 1942 Nai Duniya,
  • 1942 ఖిలోనా
  • 1941 Prabhat,
  • 1941 Mala,
  • 1941 The Saint
  • Binod,
  • 1940 Chambe Di Kali
  • Kartara,
  • 1939 Jugari,
  • 1939 Leatherface
  • Samar,
  • 1938 Madhur Milan,
  • 1938 బాబీ
  • 1937 Toofani Khazana,
  • 1935 Sher Dil Aurat,
  • 1935 Jeevan Natak,
  • 1934 Mazdoor
  • Kailash,
  • 1933 Maya Jaal,
  • 1933 Patit Pawan,
  • 1933 Aurat Ka Dil,
  • 1932 Shikari (1932 film)|షికారీ
  • 1930 జగ్‌మగ్‌తీ జవానీ,
కెమెరా, ఎలెక్ట్రికల్ విభాగం (4 చిత్రాలు)
  • 2000 Baaghi (assistant camera - as Jairaj)
  • 1999 Zulmi (assistant camera - as Jairaj)
  • 1999 Anari No. 1 (assistant camera - as Jairaj)
  • 1995 Takkar (assistant camera - as Jairaj)
దర్శకత్వం (3 చిత్రాలు)
ఎడిటోరియల్ విభాగం (1 చిత్రం)
  • 1976 Bairaag (assistant editor - as Jairaj)
స్వంత నిర్మాణం (1 చిత్రం)
  • Hindustan Hamara (documentary)

మూలాలు[మార్చు]

  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005
  • హిందీ తెరపై తొలి తెలుగు హీరో 'పైడి జైరాజ్', ఫాల్కే అవార్డు విజేతలు, హెచ్. రమేష్ బాబు, చిన్నీ పబ్లికేషన్స్, 2003.
  • యూట్యూబ్(వి6 టివి)లో పైడి జైరాజ్ వీడియో
  1. Namasthe Telangana (28 September 2021). "పైడి జైరాజ్ దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌". Archived from the original on 17 April 2022. Retrieved 17 April 2022.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-10-19. Retrieved 2008-03-21.
  3. శతవసంతాల కరీంనగర్ (1905-2005), మానేరు టైమ్స్ ప్రచురణ, పేజీ 68
  4. "భారతీయ సినీపరిశ్రమకు తెలంగాణ ముద్ర జైరాజ్‌". EENADU. Archived from the original on 2022-10-14. Retrieved 2022-10-14.
  5. telugu, NT News (2022-09-28). "తెలంగాణ సినీశిఖరం జైరాజ్‌". Namasthe Telangana. Archived from the original on 2022-09-28. Retrieved 2022-10-14.

బయటి లింకులు[మార్చు]