పొదిలి నగరపంచాయతీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పొదిలి నగరపంచాయతీ
పొదిలి
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంనగర పంచాయతీ

పొదిలి నగరపంచాయతీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా లోని నగర పంచాయతీ. ఇది ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం లోని, మార్కాపురం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందింది. పురపాలక సంఘ ప్రధాన కార్యాలయం పొదిలి పట్టణంలో ఉంది. [1]

చరిత్ర[మార్చు]

పొదిలిని పూర్వం పృదులాపురి అని పిలిచేవారు.ఈ నగరపంచాయతీ 2021 లో ఏర్పాటు చేశారు.నగర పంచాయితీ పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. దీనికి పురపాలక సంఘం కౌన్సిల్ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు జరుగుతాయి.[2]

భౌగోళికం[మార్చు]

పొదిలి నగరపంచాయతీ అక్షాంశ రేఖాంశాలు 15.604°N 79.608°E.18.28N మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతి దీనికి 174 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైశాల్యం 43.88 చదరపు కిలోమీటర్లు.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పొదిలి పట్టణ జనాభా 31,145. వీరిలో 15,681 మంది పురుషులు కాగా, మహిళలు 15464 మంది ఉన్నారు. 0–6 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు 3349 మంది ఉన్నారు. వీరిలో 1753 మంది బాలురు, 1596 మంది బాలికలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 16230 కుటుంబాల ఉన్నాయి.[3][4][5].ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939తో పోలిస్తే పొదిలిలో పిల్లల లింగ నిష్పత్తి 910 ఉంది. పొదిలి అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 71.98% ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 80.36% కాగా స్త్రీల అక్షరాస్యత రేటు 63.56%. అక్షరాస్యులు ఉన్నారు.

పౌర పరిపాలన[మార్చు]

ఈ నగర పంచాయతీకి కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. నగర పంచాయతీ పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. ఇతను ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతాడు.[6]

మూలాలు[మార్చు]

  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. Telugu, TV9 (2021-03-14). "AP Municipal Election Results 2021 Highlights: అదే తీరు అదే జోరు ఏపీలో కొనసాగుతున్న ఫ్యాన్ హవా". TV9 Telugu. Retrieved 2021-10-28.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "District Census Handbook - Prakasam" (PDF). Census of India. p. 34,35,,36,37,38. Retrieved 18 January 2015.
  4. "Census 2011-Office of the Registrar General & Census Commissioner,India". Retrieved 11 February 2017.
  5. "District Census Handbook - Prakasam" (PDF). Census of India. p. 36. Retrieved 18 January 2015.
  6. "Commissioner and Director of Municipal Administration |". cdma.ap.gov.in. Retrieved 2021-10-19.

వెలుపలి లంకెలు[మార్చు]