పోతుల సునీత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోతుల సునీత

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి శాసనమండలి సభ్యురాలు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 మార్చి 2017 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 6 జూన్ 1967
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు ఈశ్వరయ్య, అనసూయమ్మ
జీవిత భాగస్వామి పోతుల సురేష్
సంతానం 2
వృత్తి రాజకీయ నాయకురాలు

పోతుల సునీత (వావిలాల సునీత) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ శాసనమండలి సభ్యురాలిగా ఉంది.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

పోతుల సునీత 6 జూన్ 1967లో తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా,వడ్డేపల్లి మండలం, శాంతినగర్‌‌ లో ఈశ్వరయ్య, అనసూయమ్మ దంపతులకు జన్మించింది. ఆమె 1984లో పత్తికొండ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసి అనంతరం బీఏ పూర్తి చేసింది. పోతుల సునీత పరిటాల రవి సన్నిహితుడు పోతుల సురేష్ ను వివాహం చేసుకుంది.

రాజకీయ జీవితం[మార్చు]

పోతుల సునీత తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి అలంపూర్ జడ్పీటీసీగా ఎన్నికయింది. ఆమె 2004 ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుండి టికెట్ ఆశించిన పలు కారణాల వల్ల ఆలంపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలైంది. పోతుల సునీత 2009లో పెనుకొండ నియోజకవర్గం నుండి, 2014 ఎన్నికల్లో అనంతపురం, మహాబూబ్‌నగర్ జిల్లాల నుండి టీడీపీ టిక్కెట్టు కోసం ప్రయత్నించిన ఆ సమయంలో ఈ రెండు జిల్లాల్లో టీడీపీ టిక్కెట్టు దక్కలేదు. దీంతో 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం టిక్కెట్టును పార్టీ కేటాయించడంతో అక్కడ నుండి పోటీ చేసి ఓడిపోయింది.[2]

పోతుల సునీత ఎన్నికల తర్వాత చీరాల టీడీపీ ఇన్‌ఛార్జి గా పని చేసి, ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలికి 2017లో ఎమ్మెల్యేల కోటాలో టీడీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయింది. ఆమె ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై జరిగిన ఓటింగ్‌లో టీడీపీ విప్‌కు వ్యతిరేంకగా ఓటు వేసి వైసీపీకి మద్దతు తెలిపింది. ఆమె 22 జనవరి 2020న తేదీన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, 20 అక్టోబర్ 2020న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది.[3]

పోతుల సునీత ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలికి 2021లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికై 24 మార్చి 2021న శాసన మండలి సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసింది.[4] ఆమె ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి మార్చి 2023లో జరిగిన ఎన్నికలకు ఎమ్మెల్యే కోటా నుండి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2023 ఫిబ్రవరి 20న పార్టీ ప్రకటించగా[5] ఆమె ఎమ్మెల్సీగా గెలిచింది.[6]

మూలాలు[మార్చు]

  1. Sakshi (21 January 2021). "ఎమ్మెల్సీగా పోతుల సునీత ఎన్నిక". Archived from the original on 5 December 2021. Retrieved 5 December 2021.
  2. Sakshi (12 April 2014). "రాష్ట్రంలో అసెంబ్లీ అభ్యర్ధులు". Archived from the original on 5 December 2021. Retrieved 5 December 2021.
  3. Hmtv (28 October 2020). "ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా". Archived from the original on 5 December 2021. Retrieved 5 December 2021.
  4. Eenadu (25 March 2021). "ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం". Archived from the original on 5 December 2021. Retrieved 5 December 2021.
  5. Andhra Jyothy (20 February 2023). "వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన! లిస్ట్ ఇదే." Archived from the original on 21 February 2023. Retrieved 21 February 2023.
  6. Sakshi (24 March 2023). "ముగ్గురూ గెలిచారు". Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.