ప్రకృతి వ్యవసాయం
ప్రకృతి వ్యవసాయం అనేది జపనీస్ రైతు, తత్వవేత్త అయిన మసనోబు ఫుకుఒక (1913–2008) ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన పర్యావరణ వ్యవసాయ విధానం. ఈ విధానాన్ని ఆయన 1975 లో గడ్డి పరకతో విప్లవం అనే తన పుస్తకం లో పరిచయం చేసారు. ఫుకుఒక తన వ్యవసాయ విధానాన్ని జపనీస్ లో 自然農法 (షిజెన్ నోహో )[1] గా అభివర్ణించారు. ఈ పద్ధతి "ఫుకుఒక పద్ధతి" లేక "సహజ వ్యవసాయ విధానం" గా కూడా పిలవబడుతుంది.
సూత్రాలు
[మార్చు]ప్రకృతి వ్యవసాయం లోని పంచ సూత్రాలు :[2]
- దుక్కి దున్నకుండా
- ఎరువులు వాడకుండా
- పురుగుమందులు లేక కలుపు మందులు వాడకుండా
- కలుపు తీయకుండా
- కత్తిరింపు లేకుండా
అంత్యః పర్యావరణ వ్యవస్థలు
[మార్చు]ఆవరణ శాస్త్రంలో, అంత్యః పర్యావరణ వ్యవస్థలు అత్యంత స్థిరమైనవే కాక ఉత్పాదకత, వైవిధ్యం లో ఉన్నతమైనవి.ప్రకృతి రైతులు వీటిలొఅని సద్గుణాలను అనుకరించి అంత్యః పర్యావరణ వ్యవస్థల తో పొల్చదగినటువంటి పరిస్థుతులను సాదించగలిగారు అంతేకాక అధునాతన పద్ధతులైన అంతరపంటలు, సమగ్ర సస్య రక్షణ మొదలైనవి ఆచరించారు.
సారవంతమైన వ్యవసాయం
[మార్చు]1951 లో న్యూమాన్ టర్నర్ అనే అతను సారవంతమైన వ్యవసాయ పద్ధతిని సమర్దించారు. టర్నర్ వాణిజ్య రైతు అయినప్పటికీ సారవంతమైన వ్యవసాయ పద్ధతి లో ఆయన పాటించినా సూత్రాలు ఫుకుఒక పద్ధతి లోని సూత్రాలకు చాలా సారూప్యత ఉన్నది. ఇంతేకాక టర్నర్ పశుపాలన లో కూడా ప్రకృతి పద్ధతిని పాటించారు.
ప్రాకృతిక సేద్యం
[మార్చు]జపనీస్ రైతు, తత్వవేత్త మొకిచి ఒకాడ ఫుకుఒక కంటే ముందు 1930 లో "ఎరువుల ఉపయోగం లేని" సేద్య పద్ధతి ని పాటించారు. ఈ పద్ధతిని గురించి వివరించటానికి ఒకాడ ఉపయోగించిన జపనీస్ అక్షరాల అనువాదం ఈ విధంగా ఉన్నది "ప్రకృతి వ్యవసాయం" (Natural Farming).[3] వ్యవసాయ పరిశోధకుడు హు-లియన్ జు "ప్రకృతి వ్యవసాయం" జపనీస్ పదం యొక్క సరైన సాహిత్య అనువాదం అని పేర్కొన్నారు.[3]
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1975 (in Japanese) 自然農法-わら一本の革命 (in English) 1978 re-presentation The One-Straw Revolution: An Introduction to Natural Farming.
- ↑ Helena Norberg-Hodge; Peter Goering; John Page (1 January 2001). From the Ground Up: Rethinking Industrial Agriculture. Zed Books. ISBN 978-1-85649-994-1.
- ↑ 3.0 3.1 Xu, Hui-Lian (2001). NATURE FARMING In Japan (Monograph). T. C. 37/661(2), Fort Post Office, Trivandrum - 695023, Kerala, India.: Research Signpost. ISBN 81-308-0111-6. Archived from the original on 2019-07-17. Retrieved 2015-06-21.
{{cite book}}
: CS1 maint: location (link)