యు.ఆర్.అనంతమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 29: పంక్తి 29:


==బయటి లింకులు==
==బయటి లింకులు==
* [http://www.rujuvathu.org ಅನಂತಮೂರ್ತಿಯವರ ಬ್ಲಾಗ್]
* [http://www.rujuvathu.org ಅನಂತಮೂರ್ತಿಯವರ ಬ್ಲಾಗ್]అనంతమూర్తిగారి బ్లాగ్
* [http://kanaja.in/archives/category/ಯು-ಆರ್-ಅನಂತಮೂರ್ತಿ ಅನಂತಮೂರ್ತಿಯವರ ಸಮಗ್ರ ಸಾಹಿತ್ಯ]
* [http://kanaja.in/archives/category/ಯು-ಆರ್-ಅನಂತಮೂರ್ತಿ ಅನಂತಮೂರ್ತಿಯವರ ಸಮಗ್ರ ಸಾಹಿತ್ಯ]అనంతమూర్తిగారి సమగ్ర సాహిత్యం


==మూలాలు==
==మూలాలు==

11:27, 22 ఫిబ్రవరి 2014 నాటి కూర్పు

యు.ఆర్.అనంతమూర్తి
పుట్టిన తేదీ, స్థలం21 దిసెంబరు 1932
మెలిగె, తిర్థహళ్లి తాలూక, షిమోగా జిల్లా,కర్నాటక
వృత్తిఅధ్యాపకుడు, రచయిత,కర్నాటక సెంట్రల్ విశ్వవిద్యాలయం యొక్క చాన్సులర్
జాతీయతఇండియా
రచనా రంగంకాల్పనిక సాహిత్యం,సాహిత్య విమర్శ
సాహిత్య ఉద్యమంNavya
ప్రభావంరాం మనోహర్ లోహియా, గోపాలకృఇష్ణ అలిగ, Shantaveri Gopalagowda, ఎం.కె.గాంధి

కన్నడ సాహిత్యరంగంలో జ్ఞానపీఠ అవార్డు పొందిన ఎనిమిది మంది కన్నడ సాహితి వేత్తలలో ఉడిపి రాజగోపాలచార్య అనంతమూర్తి అరవవాడు.మంచి రచయిత మరియు సాహిత్య విమర్శకుడు.ముక్కుసూటిగా తన మనస్సులోని భావన్ని వ్యక్తపరచే వ్యక్తిత్వమున్నవాడు.మోడీ ప్రధాన మంత్రి అయ్యినచో భారతదేశంలో వుండనని ఖరాఖండిగా చెప్పినట్టి వాడు[1]

జననం-విద్యాభ్యాసం

జ్ఞానపిఠ ఆవార్డును పొందిన కన్నడ సాహితివేత్త కువెంపు పుట్టిన తిర్థహళ్ళితాలూకా(షిమోగా జిల్లా)లోని మొలిగె గ్రామంలోనే నే అనంతమూర్తిగారు జన్మించారు.ఈయన తండ్రి ఉడిపి రాజగోపాలచార్య,తల్లి సత్యమ్మ(సత్యభామ),జన్మించిన తేది 1932సంవత్సరం డిసెంబరు 21[2].అనంతమూర్తి దుర్వాసదపురం అనే గ్రామం లోని సాంప్రదాయ సంస్కృతపాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని ప్రారంబించాడు.ఒక్కడ ప్రాధమిక విధ్య అనంతరం తన తదుపరి చదువును తిర్థహళ్ళి,మరియు మైసూరులో కొనసాగించాడు.మైసూరు విశవిద్యాలయంలో ఆంగ్లభాషలో ఎం.ఎ పట్టభద్రుడయ్యాడు.ఉన్నత విద్యకై ఇంగ్లాండుదేశానికి వెళ్ళాడు.కామన్ వెల్త్ విద్యార్థి వేతనంకు అర్హత పొంది ఇంగ్లీషు మరియు తౌలిక సాహిత్యంలో 1966లో పి.ఎచ్.డి.పొందారు[3]

వృత్తిజీవనం

1970లో మైసూరు విశ్వవిద్యాలంలో మొదట ఇంగ్లిసు విభాగంలో/శాఖలో ఉపన్యాసకుడిగా చేరి,అటుపిమ్మట అక్కడే ప్రాధ్యపకుడు అయ్యాడు.తదనంతరం క్రీ.శ.1982 లో కేరళరాష్ట్రంలోని కొట్టాయం లోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా చేరారు.1992-93 సంవత్సరంలో నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియాకు అధ్యక్షుడిగా ఎన్నుకోబడినాడు.అలాగే 1993లో కేంద్ర సాహిత్య అకాడమీ కి కూడా అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యాడు.కేంద్ర సాహిత్య అకాడెమికి గోకాకర్ తరువాత అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన రెండవ కన్నడిగుడు అనంతమూర్తి.

అనంతమూర్తిగారు దేశవిదేశాలలోని పలు విశ్వవిద్యాలయాలలో సందర్శక అద్యాపకుడిగా పనిచేశారు.జర్మనిలోని తూబింగెన్ విశ్వవిద్యాలయం,అమెరికా లోని ఐయోవా మరియు టఫట్సు విశ్వవిద్యాలయాలలో,జవహారలాల్ విశ్వవిద్యాలయం మరియు కొల్లాపూర్ లోని శివాజి విశ్వవిద్యాలయం లలో సందర్శక అధ్యాపకునిగా పనిచేశారు.మంచి రచయిత,వక్త అయిన అనంతమూర్తిగారు ఇంటా బయటా అనేక సాహిత్య సమావేశాలలో పాల్గోని తన వాణిని వినిపింఛారు.1980 లో భారతీయ రచయిత సంఘసభ్యుడిగా సోవియట్ రష్యా ,పశ్చిమ జర్మనీ,మరియు ఫ్రాన్స్ దేశాలను సందర్శించాడు.మార్కుస్ వాది అయిన అనంతమూర్తికి రష్యా పర్యాటన మరింత స్పూర్తినిచ్చి,సోవియట్ పత్రిక సలహ సంఘ సభ్యుడయ్యి,1989లో మళ్ళొ రష్యా పర్యటన చేశారు.1992లో చైనా దేశాన్నికూడా సందర్శించారు.


బయటి లింకులు

మూలాలు

  1. "మోడీ ప్రధానైతే భారత్‌లో ఉండను: అనంతమూర్తి". sakshi.com. Retrieved 22-2-2014. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  2. "ಯು ಆರ್ ಅನಂತಮೂರ್ತಿ". kendasampige.com. Retrieved 22-2-2014. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  3. "ಯು.ಆರ್.ಅನಂತಮೂರ್ತಿ". kannadakavi.com. Retrieved 22-2-2014. {{cite web}}: Check date values in: |accessdate= (help)