కొటికలపూడి సీతమ్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:1874 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:1936 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 11: పంక్తి 11:


[[వర్గం:1874 జననాలు]]
[[వర్గం:1874 జననాలు]]
[[వర్గం:1936 మరణాలు]]

14:27, 15 మార్చి 2014 నాటి కూర్పు

కొటికలపూడి సీతమ్మ (1874 - 1936) ప్రముఖ రచయిత్రి.

ఈమె అబ్బూరి సుబ్బారావు గారి కుమార్తె; కొటికలపూడి రామారావు గారి భార్య. భర్త ఉద్యోగరీత్యా రాజమండ్రిలో చాలాకాలం నివసించారు. ఆకాలంలో కందుకూరి వీరేశలింగం గార్కి శుశ్రూషచేసి, వారినుండి తెలుగు భాషలోని మెళకువలు తెలుసుకొని మంచి కవయిత్రిగా పరిణమించారు. వీరేశలింగం గార్కి స్త్రీవిద్య విషయంలో తోడ్పడ్డారు. ఈమె సావిత్రి అనే పత్రికను కొంతకాలం నిర్వహించారు.

1913లో బాపట్లలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభ యందలి మహిళా శాఖకు అధ్యక్షత వహించారు. అందులొ పాల్గొన్నవారి ఉపన్యాసములన్నింటిని వచన గ్రంథముగా సంపుటీకరించారు. చివరిదశలో పిఠాపురం మహారాణి గారికి విద్యనేర్చే గురువుగా పనిచేశారు. ఈమె వీరేశలింగం గారి జీవితచరిత్రను రచించారు. "ఒక మహమ్మదీయ వనిత" అనే కరుణరసమైన పద్యములు, లేడీ జేన్ గ్రే మొదలైన చిన్న కావ్యములు రచించారు.

రచనలు

  • అహల్యాబాయి చరిత్ర
  • సాధురక్షక శతకము
  • పద్యభగవద్గీత