|style="font-size: medium; padding: 1; border-top: 1px solid gray; vertical-align: center; " | శివరామప్రసాద్ గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో కార్టూనిస్టుల వ్యాసాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , [[వికీపీడియా:కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం/2013/ఎంపిక మండలి ప్రశంసాపత్ర విజేతల వివరాలు|పురస్కారాల ఎంపిక మండలి]] తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.
శివరామప్రసాద్ గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో కార్టూనిస్టుల వ్యాసాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.
తెలుగు పతకం
తెలుగు మెడల్
విభిన్న అంశాలపై తెవికీ విస్తృతిని, వాసిని పెంచి విజ్ఞానసర్వస్వానికి విశేష కృషిచేస్తున్న శివరామప్రసాదు గారికి తెవికీ సభ్యులందరి తరఫున తెలుగు పతకాన్ని సమర్పించుకుంటున్నాను --వైజాసత్య
తెలుగు మెడల్
శివా గారు కార్టూనిస్టుల గురించి వ్రాసిన వ్యాసాల పరంపరలో అద్భుతమైన కృషిని గమనించవచ్చును. (1)ఒక విలక్షణమైన సబ్జెక్టును ఎంచుకోవడం (2) కార్టూనిస్టులతో కేవలం ఈ విషయం గురించి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం (3) వారి అనుమతితో సమాచారాన్ని కూర్చడం - ఇవన్నీ తెలుగు వికీలో వ్యాసాల కూర్పులో క్రొత్త ఒరవడిని సృష్టించాయని భావిస్తున్నాను. ఇతర సభ్యులు ఈ కృషిని స్ఫూర్తిగా తీసికొని ఇలా నిజంగా విలునైన సమాచారాన్ని చేర్చగలరని ఆశిస్తున్నాను. శివా శ్రమను అభినందిస్తూ తెలుగు వికీ సభ్యులందరి తరఫున ఈ తెలుగు పతకాన్ని సమర్పిస్తున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:05, 26 ఫిబ్రవరి 2009 (UTC)
నాగురించి
నా పూర్తిపేరు కప్పగంతు శివరామప్రసాద్. నా జన్మదినం 2 జూన్ 1958. నా చిన్నతనం, చదువు నా జన్మ స్తలమైన విజయవాడలొ జరిగినది. 1966 వరకు ప్రాధమిక పాఠశాలలొ 5వతరగతి వరకు చదివాను. 6వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ఆధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మునిసిపల్ హైస్కూల్ నందు అభ్యసించాను.తరువాత శాతవాహన కాలేజీ నుండి వ్యాపార శాస్త్రం ముఖ్య విషయంగా పట్టభద్రుణ్ణి అయినాను. హైదరాబాదులొ పని చేసే రోజులలో, పెండేకంటి వెంకటసుబ్బయ్యలా కాలేజీ నుండి ఈవెనింగ్ కాలేజీ నుండి 1999-2002 సంవత్సరముల మధ్య న్యాయశాస్త్రం అభ్యసించి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందాను. ఇండియన్ బాంకర్స్ అసోషియేషన్ నుండి సి.ఎ.ఐ.ఐ.బి పూర్తి చేసాను. ప్రస్తుతం, బెంగుళూరు నగరంలోని ఒక ప్రభుత్వ బాంకు ప్రధాన కార్యాలయం(Head Office) లోని అంతర్జాతీయ విభాగము(International Operations Wing)నందు మానేజరుగా బెంగుళూరు నగరంలో పని చేస్తున్నాను. నా పెళ్ళి 1981వ సంవత్సరంలొ అయ్యింది. నా భార్య,గృహిణి(House Manager). మాకు ఇద్దరు ఆబ్బాయిలు, ఇద్దరూ ఉద్యోగాలలొ ఉన్నారు-ఒకరు న్యూయార్క్, యు ఎస్ ఎ లో ,మరొకరు పూనే, భారత్ లో
నా అభిరుచులు
చిన్నతనం నుండీ పుస్తకాలు చదవటం అంటే చాల ఇష్టం.నాకు చదవటం వచ్చినదగ్గరనుండి చందమామ చదవటం మా నాన్నగారు శ్రీ కప్పగంతు లక్ష్మీ నరసింహం గారుఅలవాటు చేసారు. ఇంగ్లీషు సినిమాలు చూడటం మా చిన్న మేనమామ శ్రీ శుద్ధపల్లి చంద్రమౌళి గారు అలవాటు చేసారు. కాలేజీకొచ్చేటప్పటికి రెండు గ్రంధాలయాలలో సభ్యత్వం సహాయంతో విశ్వనాధ సత్యనారాయణ, గుడిపాటి వెంకటచలం, కొడవటిగంటి కుటుంబరావు గార్ల పుస్త కాలు దాదాపు అన్ని చదివాను. ఇంకా భమిడిపాటి కామేశ్వరరావు, ముళ్ళపూడి వెంకటరమణ గార్ల పుస్తలన్నీ చదివాను.పై రచయితల పుస్తకాలన్నీ కొని పోగుచేసాను.తపాలా బిళ్ళలు సేకరణ, హామ్ రేడియో నా ముఖ్యమైన అభిరుచులు. హామ్ రేడియే హాబీకొరకు ప్రభుత్వము వారు నిర్వహించు పరీక్షనందు ఉత్తీర్ణుడనయినాను. ప్రభుత్వమువారు నాకు కేటాయించిన సంకేత నామము(CALL SIGN) vu3ktb.అదే వికీపీడియాలొ నా లాగిన్ పేరు.