వికీపీడియా:మొలక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి Category corrected
పంక్తి 1: పంక్తి 1:
{{Shortcut|[[WP:STUB]]}}
{{guideline}}
{{guideline}}


పంక్తి 38: పంక్తి 37:


===మొలకలను గుర్తించడం===
===మొలకలను గుర్తించడం===
:[[:Category:మొలకలు]] ''ఉప వర్గాలు, వ్యాసాల జాబితా''
:[[:Category:మొలక]] ''ఉప వర్గాలు, వ్యాసాల జాబితా''
:[[:Category:మొలకలు]]
:[[:Category:మొలకలు]]
:[[Wikipedia:ప్రసిధ్ధి చెందిన మొలకలు]]
:[[Wikipedia:ప్రసిధ్ధి చెందిన మొలకలు]]

14:20, 9 సెప్టెంబరు 2005 నాటి కూర్పు

మొలకలు అంటే వ్యాసాలే, కానీ ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్న దశలో ఉన్నాయన్న మాట. ఇంకా వికీపీడియా సభ్యుల దృష్టి వాటి మీద పడలేదు. వ్యాసం ప్రారంభం అయితే జరిగింది గాని పూర్తి స్థాయి వ్యాసానికి ఉండవలసినంత సమాచారం అందులో ఇంకా లేదు. అంత మాత్రం చేత మొలకలు అంటే పనికి రానివని సముదాయం అనుకోదు. వ్యాసం తయారయే క్రమం లో మొలక అనేది మొదటి అడుగు మరి! ఈ మొలకలతో ఎలా వ్యవహరించాలో నిర్దేశించడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం. ఈ వ్యాసపు మొదటి భాగమైన అత్యవసర సమాచారం విభాగాన్ని అందరూ చదవాలి. ఇక రెండవ భాగమైన అదనపు సమాచారం కొందరికే ఆసక్తి కలిగించవచ్చు, కాబట్టి అది తప్పని సరేమీ కాదు.

అత్యవసర సమాచారం

మొలకను గుర్తించుట

మొలక అంటే చాలా చిన్న వ్యాసం, కాని మరీ పనికిరానంత చిన్నదేమీ కాదు. సాధారణంగా, మొలక పరిమాణం వ్యాసపు శీర్షికను నిర్వచించేటంత పెద్దదిగా నైనా ఉండాలి. అంటే 3 నుండి 10 వాక్యాలన్న మాట. విషయం మరీ క్లిష్టమైనదైతే మొలక పెద్దదిగా ఉండవచ్చు; అలాగే, మరీ స్వల్ప విషయానికి సంబంధించిన చిన్న వ్యాసం మొలక కాకపోవచ్చు. వికీకరణ చెయ్యవలసిన పెద్ద వ్యాసాలు మొలకల కిందకి రావు. వీటికి, {{శుధ్ధి}} అనే టాగు తగిలించాలి.

చాలా కొద్ది సమాచారం ఉండే చిన్న వ్యాసాలు తొలగింపు కు గురయ్యే అవకాశం ఉంది. వికీపీడియా నిఘంటువు కాదు. చిన్న చిన్న నిర్వచనాలు పెట్టడానికి దాని సోదర ప్రాజెక్టు - విక్షనరీ— ఉంది చూడండి. ఆ వ్యాసానికి మరింత సమాచారం జోడించడం ఇంకా మంచి ఆలోచన.

మొలక వర్గీకరణ

చిన్న వ్యాసాన్ని రాసాక అది మొలక అని తెలియ జేయడానికి మొలక టెంప్లేటు ను వ్యాసానికి జత చెయ్యండి. ఆచారం ప్రకారం ఈ టెంప్లేటును వ్యాసానికి చివర పెట్టాలి. మొలక టెంప్లేటు రెండు భాగాలుగా ఉంటుంది: మొదటిది, ఇది ఫలానా రకానికి చెందిన మొలక అని, సభ్యులు మార్పు చేర్పులు చెయ్యవచ్చనీ తెలియ చెప్పే ఒక సందేశం; ఇక రెండోది, వ్యాసాన్ని మొలకల వర్గం లో పెట్టే ఒక వర్గపు లింకు. (ఈ రెండవ భాగం ఇంగ్లీషు వికీపీడియా లో ఉంది గాని తెలుగు కూర్పులో ఇంకా లేదు. ఇంగ్లీషులో మొలకలు బాగా ఎక్కువై పోవడంతో మొలకల ఉప వర్గాల అవసరం వచ్చింది. తెలుగులో ఆ అవసరం ఇంకా రాలేదు. త్వరలో వస్తుందని ఆశిద్దాం)


ప్రధాన మొలక వర్గం - {{stub}} - పూర్తిగా నిండిపోవడంతో ఉప వర్గాల అవసరం ఏర్పడింది. ఇందువలన మొలకలను వెదకటం బాగా తేలక అయింది.


మామూలుగా, మొలకల నామకరణ విధానం ఇలా ఉంటుంది విషయం-మొలక ; మొలకల పూర్తి జాబితా కొరకు Wikipedia:Wikiproject Stub sorting/మొలకల రకాలు చూడండి. వ్యాసాలను మొలకలుగా గుర్తించేటపుడు, వీలయినంత ఖచ్చితంగా, నిర్దుష్టంగా చెయ్యండి —మిగిలిన సభ్యులకు మొలకను గుర్తించడంలో ఇది చాలా సహాయ పడుతుంది. ఒక వేళ వ్యాసం రెండు వర్గాల లోకి వసుంటే, రెండు టెంప్లేటులు వాడండి. రెండు కంటే ఎక్కువ వాడటం మాత్రం అంత మంచిది కాదు.


ఒక ప్రధాన వర్గమంటూ లేని మొలక మీకు కనిపిస్తే, దానికి ఒక వర్గాన్ని సృష్టించండి. మొలకకు టాగు తగిలించడం ఎంత ముఖ్యమో, వర్గాన్ని సృష్టించడం కూడా అంతే ముఖ్యమైనది. మొలక బాగా విస్తరించాక, పూర్తి స్థాయి వ్యాసం అయ్యాక, దాని మొలక టాగును తొలగించాలి.

మొలక సంబంధిత కార్య కలాపాలకు Wikipedia:WikiProject Stub sorting (shortcut WP:WSS) కేంద్ర స్థానం.

ఒక చక్కని మొలక వ్యాసం ఎలా ఉండాలి

ఒక మొలకను ప్రారంభించేటపుడు, దాని ప్రధాన ఉద్దేశ్యం విస్తరణ అని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. దానికి తగినట్లుగా, ఆ వ్యాసంలో విస్తరణకు వీలైనంత కనీస మాత్రపు సమాచరం ఉండే విధం గా చూడాలి. పుస్తకాల నుండి గానీ, YAHOO!, Google వంటి సెర్చి ఇంజనుల నుండి గాని మీ తొలి సమాచారాన్ని సేకరించ వచ్చు. ఇతర మార్గాల నుండి సేకరించిన సమాచారాన్ని కూడా పొందు పరచ వచ్చు; ఆ సమాచారం సరి యైనదీ,నిష్పాక్షికమైనది అయి ఉండాలి.


విషయాన్ని నిర్వచించడం తో మొలకను మొదలు పెట్టండి. కొన్ని సార్లు విషయాన్ని నిర్వచించడం అసాధ్యం; అటువంటప్పుడు విషయం గురించి స్పష్టమైన వివరణ ఇవ్వండి. ఉదాహరణకు ఆ స్థలం ఎందుకు ప్రసిధ్ధి చెందింది, ఫలానా వ్యక్తి గొప్పదనం ఏమిటి మొదలైనవి.


తరువాత, ఈ ప్రాధమిక నిర్వచనాన్ని విస్తరించాలి. ఇంతకు ముందు సూచించిన పధ్ధతుల ద్వారా తగినంత సమాచారాన్ని సేకరించవచ్చు. కొన్ని వాక్యాలు రాసిన తరువాత వాటిలోని పదాలకు సంబంధిత అంతర్గత లింకులు పెట్టాలి. అనవసరంగా, అతిగా లింకులు పెట్టవద్దు; ఏమైనా సందేహాలుంటే, సరిచూడు మీట నొక్కి, ఒక పాఠకుడి దృష్టి తో వ్యాసాన్ని చదవండి. లింకులు అవసరం లేదనిపించిన చోట పెట్టకండి.


వ్యాసాన్ని సమర్పించిన తరువాత అది ఎన్నో దశల గుండా ప్రస్థానం చెందుతుంది. ఎవరైనా సభ్యుడు దానిని విస్తరించవచ్చు, సరైన సమాచారం దొరికినపుడో, తీరుబడి గా ఉన్నపుడో మీరే దానిని విస్తరించవచ్చు.

మొలకలను గుర్తించడం

Category:మొలక ఉప వర్గాలు, వ్యాసాల జాబితా
Category:మొలకలు
Wikipedia:ప్రసిధ్ధి చెందిన మొలకలు
Wikipedia:పొట్టి పేజీలు