వికీపీడియా:వాడుకరి పేజీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 96: పంక్తి 96:
తొలగించిన సభ్యుల పేజీల స్థానంలో ఖాళీ పేజీ ఒకదాన్ని సృష్టించి పెడితే, సదరు పేజీకి గతంలో ఇచ్చి ఉన్న లింకులు ఎర్ర లింకులుగా మారకుండా చూడవచ్చు.
తొలగించిన సభ్యుల పేజీల స్థానంలో ఖాళీ పేజీ ఒకదాన్ని సృష్టించి పెడితే, సదరు పేజీకి గతంలో ఇచ్చి ఉన్న లింకులు ఎర్ర లింకులుగా మారకుండా చూడవచ్చు.


== నా సభ్యుని పేజీ నుండి ఇతరులకు ఇంకా ఏం సమాచారం అందుబాటులో ఉంటుంది? ==
== What other information is accessible to others from my user page? ==
మామూలు వ్యాసాల పేజీల్లో ఉన్నట్లే, పేజీ చరితం, చర్చ వంటి లింకులు ఉంటాయి. ఎడమ పక్కన ఉండే లింకుల్లో "సభ్యుని రచనలు" అనే లింకు నొక్కి సదరు సభ్యుడు/సభ్యురాలు చేసిన దిద్దుబాట్ల జాబితా చూడొచ్చు.


అలాగే "ఈ సభ్యుని ఈమెయిలు పంపు" అనే లింకు ద్వారా, సదరు సభ్యుని ఈమెయిలు పంపవచ్చు.
In addition to the usual information accessible from an article page such as page history, "Discuss this page" and the like, other users at Wikipedia can also, at the bottom of the page (or in the sidebar), click "User contributions" to see what contributions you have made at Wikipedia over time. See [[m:Help:User contributions|MediaWiki User's Guide: User contributions page]] for more.

Visitors to your user page can also click "E-mail this user" if you have opted in [[User preferences]] to be able to send and receive email. See [[Wikipedia:Emailing users]].


[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు]]
[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు]]

[[de:Wikipedia:Benutzer-Namensraum]]
[[de:Wikipedia:Benutzer-Namensraum]]
[[fr:Wikipédia:Pages personnelles]]
[[fr:Wikipédia:Pages personnelles]]

02:52, 25 మే 2007 నాటి కూర్పు


సభ్యుల మధ్య సంప్రదింపులు జరుపుకునే వీలు కలిగించేందుకు వికీపీడియాలో సభ్యుని పేజీ లు ఉపయోగపడాతాయి. మీ సభ్యనామం ఫలానారావు అయితే:

మీ వ్యక్తిగత వివరాలు సభ్యుని పేజీ లోనే ఉండాలి గానీ, మొదటి నేమ్ స్పేసులోని పేజీల్లో రాయకూడదు.

నా సభ్యుని పేజీలో ఏమి పెట్టుకోవచ్చు?

సభ్యతకు లోబడి, మీ ఇష్టమొచ్చింది పెట్టుకోవచ్చు.

మీ గురించి కొంత పెట్టుకోండి - మీ ఫోటో, ఈమెయిలు, అసలు పేరు, మీ సొంత ఊరు, మీ ఆసక్తులు, మీ వృత్తి, ఇలాంటివి. వేటి బయట పెట్టాలి, వేటిని దాచాలి అనేది మీ ఇష్టమనుకోండి.

వికీపీడియాలో మీరు చెయ్యదలచిన పనులు, చేస్తున్న పనులు, పనికొచ్చే లింకులు మొదలైనవి కూడా పెట్టుకోవచ్చు. మీ స్వంత ప్రయోగశాలలో వికీమార్కప్ తో ప్రయోగాలు కూడా చేసుకోవచ్చు.

కొంతకాలం పాటు వికీలో పని చెయ్యని పక్షంలో మీ సభ్యుని పేజీలో చిన్న నోటు పెట్టండి.

ఏదన్నా బొమ్మనో, ఓ సూక్తినో, మీకిష్టమైన వికీపీడియా వ్యాసపు లింకునో కూడా పెట్టుకోవచ్చు. వికీపీడియాలో మీరు చేసిన కృషికి గుర్తింపొఉగా ఎవరైనా మీకు బార్న్ స్టారును బహూకరించవచ్చు. దాన్ని మీ సభ్యుని పేజీలో పెట్టుకోండి.

మీ రచనలను సార్వజనికం చేస్తూ లైసెన్సు విడుదల చెయ్యదలచినా, మీ సభ్యుని పేజీలో చెయవచ్చు.

ఇతరుల సభ్యుని పేజీలో దిద్దుబాట్లు చెయ్యకండి. అయితే టైపింగు తప్పులు, భాషా దోషాలు లాంటివి కనిపిస్తే, చొరవగా సరిదిద్దండి. తమ సభ్యుని పేజీలో దిద్దుబాట్లు జరిపితే కొందరు సభ్యులు ఏమీ అనుకోరు గానీ కొందరు ఇష్టపడక పోవచ్చు. ఉత్తమమైన మార్గం ఏమిటంటే.. మీకు కనిపించిన సవరణలను సదరు సభ్యుని చర్చాపేజీలో సూచించండి

వికిపీడియాకు సంబంధం లేని విషయాలను మరీ ఎక్కువగా సభ్యుని పేజీలో పెట్టకండి. మీ సభ్యుని పేజీ మీ స్వంత హోమ్ పేజీ కాదు, అది ఓ వికీపీడియనుగా మీ పేజీ మాత్రమే.

ఉచితంగా, స్వేచ్ఛగా దొరకని బొమ్మలను మీ సభ్యుని పేజీలో పెట్టకండి. అలాంటి బొమ్మలు కనిపిస్తే వెంటనే తీసివెయ్యబడతాయి.

మీ పేజీని వికీపీడియను వర్గాల లోకి చేర్చుకోవచ్చు.

సభ్యుని ఉప పేజీల సంగతేమిటి?

మీకు ఇంకా కొన్ని పేజీలు కావాలనుకుంటే ఉపపేజీలను సృష్టించుకోవచ్చు. మీ సభ్యుని పేజీలో ఏది ఉండాలని కోరుకుంటారో వాటన్నిటినీ ఇక్కడా పెట్టుకోవచ్చు.

ఉదాహరణలు:

  • మీరు ఏదైనా వ్యాసం రాస్తూంటే అది ఒక స్థాయికి వచ్చేదాకా ఇక్కడ పెట్టుకోవచ్చు
  • మీ పాత చర్చాపేజీలను ఇక్కడ నిక్షిప్తం చేసుకోవచ్చు
  • ప్రయోగాలు; ఏదైనా మూసపై ప్రయోగాలు చెయ్యదలిస్తే దాన్నో ఉపపేజీగా చేసి, ప్రయోగాలు చెయ్యండి

ఏవి వర్జితం?

వికీపీడియాకు సంబంధం లేని విషయం మరీ ఎక్కువ పెట్టరాదు. ఉదాహరణకు:

  • మీ వికీపీడియాయేతర పనుల గురించిన బ్లాగు
  • వికీపీడియాకు సంబంధం లేని విషయంపై చర్చ
  • మితి మీరిన వ్యక్తిగత సమాచారం
  • వికీపీడియాకు సంబంధం లేని ఉపాఖ్యానాలు, వ్యాఖ్యలు
  • వినోదం, కాలక్షేపం కబుర్లు, మరీ ముఖ్యంగా వికీపీడియాలో చురుగ్గా పాల్గొనని సభ్యుల విషయంలో మరీను
  • వికీపీడియాలో పాల్గొనని వారితో చర్చ
ఇంకా చూడండి: వికీపీడియా:ఏది వికీపీడియా కాదు

ఉచితంగా హోస్టింగు, ఈమెయిలు సదుపాయాలు బోలెడన్ని ఉన్నాయి. అలాంటి వాటి కోసం వికీపీడియా కంటే ఆ సైట్లు మేలు.

వికీపీడియాలో చురుగ్గా పాల్గొనే వారి విషయంలో ఈ మార్గదర్శకాలను అమలు చెయ్యడంలో వికీపీడియా సముదాయం కొంత సహనంతో ఉంటుంది. మంచి దిద్దుబాటు చరిత్ర కలిగిన వికీపీడియనుల విషయంలో వికీపీడియా విషయానికి అంతగా సంబంధించని సామాజిక కార్యక్రమాలను అనుమతిస్తుంది.

మీ సభ్యుని పేజీని మరో పేజీకి దారిమార్పు చెయ్యడం (చర్చాపేజీకి, ఉపపేజీలకు కాకుండా) కొందరికి కోపం తెప్పిస్తుంది. దీని వలన మీకు సందేశాలు రాయాలన్నా, మీ రచనల గురించి చూడాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. మీ పాత ఖాతాకు సంబంధించిన సభ్యుని పేజీ నుండి కొత్త ఖాతా సభ్యుని పేజీకి చేసిన దారి మార్పు దీనికి మినహాయింపు.

సభ్యుని పేజీల స్వంతదార్లు, దిద్దుబాట్లు

సభ్యులు తమ సభ్యుని పేజీలను తమ ఇచ్చ వచ్చినట్లుగా పెట్టుకోవడం అనూచానంగా వస్తోంది. అయినప్పటికీ, ఈ పేజీలు సముదాయానికి చెందినవే:

  • ఇక్కడి రచనలు, వికీపీడియా వ్యాసాల్లాగే GFDL లైసెన్సుకు అనుగుణంగా ఉండాలి.
  • మీ పేజీలలో ఇతర సభ్యులు దిద్దుబాట్లు చెయ్యవచ్చు. కానీ మీ సభ్యుని పేజీలో ఇతరులు దిద్దుబాటు చెయ్యకపోవడం ఓ సాంప్రదాయంగా వస్తోంది.
  • సముదాయపు విధానాలు, వ్యక్తిగత దాడులతో సహా, మిగతా చోట్ల లాగే ఇక్కడా అమలవుతాయి.
  • కొన్ని సందర్భాల్లో, వికీపీడియాకు ఏ విధంగానూ ఉపయోగపడని విషయాలను తీసివెయ్యవలసి ఉంటుంది.

వికీపీడియాలో పెట్టేందుకు ఉచితంగా ఉండనివి, ఇతరులు దిద్దుబాటు చెయ్యరాదు అని మీకనిపించినవీ అయిన విషయాలను మీ స్వంత వెబ్ సైటులో పెట్టుకోండి. ఉచితంగానూ, తక్కువ ఖర్చుతోను వెబ్ హోస్టింగు చేసే చాలా సంస్థలున్నాయి.

సభ్యుల పేజీల సంరక్షణ

వ్యాసాల పేజీల్లాగానే, సభ్యుల పేజీలు కూడా దుశ్చర్యలకు గురవుతూ ఉంటాయి. దుశ్చర్యలు కొనసాగుతూ ఉంటే, పేజీని సంరక్షించవలసి రావచ్చు. సంరక్షించిన పేజీ పేరును, సంరక్షణ కారణంతో సహా వికీపీడియా:సంరక్షిత పేజీ పేజీలో చేర్చాలి.

ఈ సభ్యుల పేజీల్లో దుశ్చర్యలు సాధారణంగా దుశ్చర్యలపై నిర్వాహకులు తీసుకున్న చర్యలకు ప్రతీకారంగా జరుగుతాయి. నిర్వాహకులు అవసరమైనిపించినపుడు తమ సభ్యుల పేజీలను సంరక్షించుకోవచ్చు. కొన్ని అరుదైన సందర్భాల్లో నిర్వాహకుడు కాని సభ్యుల పేజీలు కూడా దుశ్చర్యకు గురి కావచ్చు. అలాంటి వారు వికీపీడియా:సంరక్షణ కొరకు అభ్యర్ధన పేజీలో సంరక్షణ కోరుతూ అభ్యర్ధన పెట్టవచ్చు. అప్పుడు నిర్వాహకుడు దాన్ని సంరక్షించుతాడు.

చర్చాపేజీల్లో దుశ్చర్య కాస్త తక్కువగానే ఉంటుంది. అలాంటి దాన్ని వెనక్కి తీసుకుపోవడంతో సరిపెట్టాలి. పదే పదే జరిగిన దుశ్చర్యల విషయంలో విధానాలు అనుమతించిన మేరకు నిరోధాన్ని విధించి దుశ్చర్యను అరికట్టాలి. చాలా అరుదుగా సంరక్షణ విధించ వలసి రావచ్చు. చర్చాపేజీకి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా, కానీ అది చిట్టచివరి వికల్పం కావాలి.

ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సభ్యుల పేజీల సంరక్షణను ఎత్తివేయాలి.

తొలగింపు

మీ పేజీలోని విషయాలను తొలగించాలని సముదాయం అభిప్రాయపడితే, మీరు సదరు సమాచారాన్ని తొలగించాలి. సముదాయపు సమ్మతి తోనే మీరు ఆ విషయాలను పెట్టుకోవచ్చు. ఓ సంవత్సరం పైగా వికీపీడియాలో చురుగ్గా ఉంటూ అనేక మంచి వ్యాసాలకు తోడ్పాటు అందించిన సభ్యుల విషయంలో సముదాయం కాస్త మెత్తగా ఉండే అవకాశం ఉంది.

మీరు సహకరించకపోతే, మేమే సదరు పేజీలో దిద్దుబాటు చేసి అనుచితమైన విషయాలను తొలగిస్తాం. ఒకవేళ పేజీ యావత్తూ అనుచితమైతే, ఆ పేజీని మీ ప్రధాన సభ్యుని పెజీకి దారిమార్పు చేస్తాం.

మరీ మితిమీరిన సందర్భాల్లో సదరు సభ్యుని ఉపపేజీని తొలగింపు విధానాలకు అనుగుణంగా తొలగిస్తాం. అలా తొలగించిన పేజీని మళ్ళీ సృష్టించకండి. మళ్ళీ వెంటనే తొలగించేందుకు అది చాలు. ఉచితానుచితాల విషయంలో మా నిర్ణయాన్ని గౌరవించండి.

నా ఉపపేజీలను తొలగించడం ఎలా?

{{delete}} అనే మూసను సదరు ఉపపేజీలో చేర్చడం ద్వారా మీ సభ్యుని ఉపపేజీని తొలగించుకోవచ్చు.

లేదా, ఆ పేజీని మీ సభ్యుని పేజీకి దారిమార్పు పేజీగా మార్చి వేస్తే సరి! చాలా వరకు ఇది సరిపోతుంది.

పై మూసను మీ పేజీలను తొలగించేందుకు మాత్రమే వాడండి, అదీ బలమైన కారణం ఉంటేనే.

గతంలో వేరే నేమ్స్పేసులో ఉండి, సభ్యుని ఉపపేజీగా తరలించబడి ఉంటే, ఈ తొలగింపు జరగదు. వీటిని తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో చర్చించాక మాత్రమే తొలగిస్తారు.

నా సభ్యుని పేజీ, చర్చాపేజీలను తొలగించడం ఎలా?

దుశ్రయలేమీ లేనపుడు, వ్యక్తిగత సమాచారం వికీపీడియాకు అవసరంలేని సందర్భాల్లో, మీ సభ్యుని పేజీ, చర్చాపేజీలను తొలగించమని కోరవచ్చు. చాలా కాలంగా సభ్యుడై ఉన్న వారు వికీపీడియాను వీడిపోదలచినపుడు ఇలాఅ అడగవచ్చు.

తొలగింపు కొరకు మీ పేజీలో అభ్యర్ధన పెట్టండి. నిర్వాహకులెవరైనా ఆ పేజీని చూసి, తొలగింపు వికీపీడియా విధానాలకు అనుగుణంగా ఉన్నదనుకుంటే తొలగిస్తారు. తొలగించిన సభ్యుల పేజీల స్థానంలో ఖాళీ పేజీ ఒకదాన్ని సృష్టించి పెడితే, సదరు పేజీకి గతంలో ఇచ్చి ఉన్న లింకులు ఎర్ర లింకులుగా మారకుండా చూడవచ్చు.

నా సభ్యుని పేజీ నుండి ఇతరులకు ఇంకా ఏం సమాచారం అందుబాటులో ఉంటుంది?

మామూలు వ్యాసాల పేజీల్లో ఉన్నట్లే, పేజీ చరితం, చర్చ వంటి లింకులు ఉంటాయి. ఎడమ పక్కన ఉండే లింకుల్లో "సభ్యుని రచనలు" అనే లింకు నొక్కి సదరు సభ్యుడు/సభ్యురాలు చేసిన దిద్దుబాట్ల జాబితా చూడొచ్చు.

అలాగే "ఈ సభ్యుని ఈమెయిలు పంపు" అనే లింకు ద్వారా, సదరు సభ్యుని ఈమెయిలు పంపవచ్చు.