వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 185: పంక్తి 185:
== KLRWP అవార్డుల విధి విధానాల మీద బ్లాగ్ పోస్ట్ ==
== KLRWP అవార్డుల విధి విధానాల మీద బ్లాగ్ పోస్ట్ ==
[https://meta.wikimedia.org/wiki/Wikimedia_Blog/Drafts/Comprehensive_evaluation_of_Wiki_contributors_for_recognition KLRWP అవార్డుల విధి విధానాల మీద బ్లాగ్ పోస్ట్] ని పరిశీలించి, మీ అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా మనవి. --[[వాడుకరి:Arkrishna|రాధాక్రిష్ణ]] ([[వాడుకరి చర్చ:Arkrishna|చర్చ]]) 18:28, 22 ఏప్రిల్ 2014 (UTC)
[https://meta.wikimedia.org/wiki/Wikimedia_Blog/Drafts/Comprehensive_evaluation_of_Wiki_contributors_for_recognition KLRWP అవార్డుల విధి విధానాల మీద బ్లాగ్ పోస్ట్] ని పరిశీలించి, మీ అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా మనవి. --[[వాడుకరి:Arkrishna|రాధాక్రిష్ణ]] ([[వాడుకరి చర్చ:Arkrishna|చర్చ]]) 18:28, 22 ఏప్రిల్ 2014 (UTC)

KLRWP అవార్డుల విధి విధానాల బ్లాగ్ పోస్ట్ [http://blog.wikimedia.org/2014/04/29/comprehnsive-evaluation-of-wiki-contributors/ ఇచ్చట] publish చేయబడినది. అందరికీ ధన్యవాదములు. [[వాడుకరి:Arkrishna|రాధాక్రిష్ణ]] ([[వాడుకరి చర్చ:Arkrishna|చర్చ]]) 05:39, 30 ఏప్రిల్ 2014 (UTC)


== జాలపత్రికల్లో తెవికీ ప్రాచుర్యం ==
== జాలపత్రికల్లో తెవికీ ప్రాచుర్యం ==

05:39, 30 ఏప్రిల్ 2014 నాటి కూర్పు

అడ్డదారి:
WP:VP
రచ్చబండవార్తలుపాలసీలుసాంకేతికముప్రతిపాదనలుఆలోచనలుపత్రికా సంబంధాలుఇతరత్రా..



<br=clear all>


తెవికీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం మళ్ళీ వచ్చింది! క్రిందటి సంవత్సరం మనం మహిళలపై కొత్త వ్యాసాలు మరియు ఉన్న వ్యాసాల విస్తరణలో అత్యున్నతంగా కృషి చేసి అన్ని భారతీయ భాషా వికీపీడియాలకంటే తెవికీని ముందంజలో ఉంచాం. గత ఏడాది లాగే ఈసారి కూడా తెవికీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఆసక్తి గలసభ్యులు ఈ క్రింది విధంగా ఈ సంబరాలలో పాల్గొనవచ్చు.

  • మహిళలలకు సంబదించిన విషయాలపై తెలుగు వికీపీడియాలో మార్చి నెలంతా జరిగే ఎడిటథాన్ (edit-a-thon)లో పాలుపంచుకోవడం
  • మార్చి 8న హైదరాబాదు మరియు బెంగుళూరులలో జరిగే ప్రత్యక్ష సమావేశాలకు హాజరుకావడం
  • మీకు తెలిసిన ముగ్గురు మహిళలకు తెవికీని పరిచయం చేయండం మరియు తెవికీలో మార్పులు చేర్పులు ఎలా చేయాలో నేర్పడం

మరిన్ని వివరాలకు మరియు మీరు పాల్గొనటానికి ఈ పేజిని సందర్శించండి--విష్ణు (చర్చ)17:06, 1 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  • తెవికీ సభ్యులు అందరూ వికీపీడియా:సమావేశం/అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం/2014 పేజీని చూచి అందులోని వ్యాసాల్ని అభివృద్ధి చేయాలని; లేని వ్యాసాల్ని మొదలుపెట్టాలని కోరుతున్నాను. క్రిందటి సంవత్సరం మనమంతా కలిసికట్టుగా సుమారు 100 పైగా వ్యాసాల్ని అందించి అన్ని భాషల వికీపీడియాలలో ముందున్నాము. అలాగే ఈసారి కూడా మన సత్తా చూపించాలని; మరొక 150-200 వ్యాసాలు చేర్చే విధంగా సభ్యులు కలిసిపనిచేద్దామని కోరుతున్నాను. అందుకు అవసరమైన లింకుల్ని సమావేశంలో చేర్చాను. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 19:28, 1 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
తెవికీలో పద్మశ్రీ పురస్కార గ్రహీతల జాబితాలో స్త్రీల పేర్లను చూసి తెలిసివున్నంత వరకూ వ్యాసాలు అభివృద్ధి చేయవచ్చు. ప్రయత్నించండి.(నేనూ ఆ దిశగా కృషిచేస్తున్నాను.)--పవన్ సంతోష్ (చర్చ) 03:40, 5 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగులో - Hans

  • తెలుగులో అక్షరానికి కారము ఎలా చేర్చాలో దయచేసి తెలియజేయండి.
  • Example: Hans, Kins
  • rins : రింస్, Air lines: ఎయిర్ లైంస్ (ఇది తెలుగులో తప్పు కదా !)

JVRKPRASAD (చర్చ) 08:52, 6 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారు ఇలా ప్రయత్నించండి n&s(న్స్).han&s(హన్స్),kin&s(కిన్స్),lain&s(లైన్స్),rin&s(రిన్స్)...Palagiri (చర్చ) 09:34, 6 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
Palagiri గారికి, మీకు ధన్యవాదములు. మీ....JVRKPRASAD (చర్చ) 13:22, 6 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

2013 లో వాడుకరుల అధికమార్పుల ర్యాంకులు

వికీపీడియా:2013_లక్ష్యాలు#గణాంకాలు లో వ్యాసపేరుబరి మరియు వ్యాసేతరపేరుబరుల అధికమార్పుల 10ర్యాంకులు వివరాలు చేర్చబడ్డాయి.

వ్యాసపేరుబరిలో ర్యాంకులు

YVSREDDY,Kvr.lohith,శ్రీరామమూర్తి,Rajasekhar1961,Bhaskaranaidu,T.sujatha,C.Chandra Kanth Rao,సుల్తాన్ ఖాదర్,Palagiri మరియు Veera.sj

వ్యాసేతర పేరుబరులలో ర్యాంకులు

Arjunaraoc,Kvr.lohith,YVSREDDY,Rajasekhar1961,JVRKPRASAD,వైజాసత్య,T.sujatha,C.Chandra Kanth Rao,Kprsastry మరియుPalagiri వీరందరికి అభివందనాలు. --అర్జున (చర్చ) 06:23, 10 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Proposed optional changes to Terms of Use amendment

Hello all, in response to some community comments in the discussion on the amendment to the Terms of Use on undisclosed paid editing, we have prepared two optional changes. Please read about these optional changes on Meta wiki and share your comments. If you can (and this is a non english project), please translate this announcement. Thanks! Slaporte (WMF) 21:56, 13 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

సీఐఎస్-ఏ2కే త్రైమాసిక ఫలితాల వెల్లడి

సీఐఎస్-ఏ2కే జూలై-సెప్టెంబర్ 2013 కు గానూ మొదటి రిపోర్ట్, అక్టోబర్-డిసెంబర్ 2014 కు గానూ రెండో రిపోర్ట్ ను విడుదల చేసింది. ఈ రిపోర్టులలో క్లుప్తంగా ఇప్పటి వరకూ సీఐఎస్-ఏ2కే పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమాలు, వాటి ఫలతాల విశ్లేషణను చూడవచ్చు. ఆయా పేజీల చర్చా పేజీలలో మీ సూచనలను తెలుపగలరు. అలానే ఆసక్తి గలవారు ఈ పేజీలను తెలుగులోకి అనువదించగలరు. మొదటి రిపోర్ట్ ఆలస్యంగా విదుదల చేసినందుకు క్షమాపణలు. --రహ్మానుద్దీన్ (చర్చ) 13:11, 14 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

జన సేన పార్టీ

జనసేన పార్టీ పేరుతో మొదట వ్యాసం సృష్టించడం జరిగింది. తర్వాత జన సేన పార్టీ పేరుతో YVSREDDY మరియు జన సేన పేరుతో నరేష్_బళ్ళ మరియు పాలగిరి రామక్రిష్ణా రెడ్డి గారు అదే వ్యాసాన్ని సృష్టించారు. ఈ అన్ని వ్యాసాలను జనసేన పార్టీ లో విలీనం చేస్తే బాగుంటుంది. ఆయా చర్చా పేజీలలో కూడా ఇదే విషయాన్ని రాశాను. సభ్యులు తమ అభిప్రాయాన్ని తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:14, 15 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

జన సేన పార్టీ - 10:09, 14 మార్చి 2014‎ YVSREDDY

జనసేన పార్టీ - 15:29, 14 మార్చి 2014‎ సుల్తాన్ ఖాదర్
జన సేన - 10:07, 15 మార్చి 2014‎ నరేష్ బళ్ళ

వివిధ సమయాలలో సృష్టించబడిన జనసేనపార్టీ వ్యాసాలు. YVSREDDY (చర్చ) 14:19, 15 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారు, నేనుజన సేన పేరుతో వ్యాసం సృష్టించలేదు.అంతకుముందే జన సేన పార్టీవ్యాసమున్నదని,దానిలో విలీనం చెయ్యాలని నోట్ పెట్టను.అంతే.వివరాలు మరొకసారి సరిగ్గా చూడండి.Palagiri (చర్చ) 14:23, 15 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
అవునండి పాలగిరి రామక్రిష్ణా రెడ్డి గారు. మీరు విలీన ప్రతిపాదన చేశారు. YVSREDDY గారు మరియు నరేష్ బళ్ళ గారూ, మీరు జన సేన పార్టీ ని విస్తరిస్తున్నారు . ఈ మూడు వ్యాసాలను సరైన వ్యాస శీర్షిక అయిన జనసేన పార్టీ లో విలీనం చేస్తే సమంజసమంగా ఉంటుందని నా అభిప్రాయము.-- 2014-03-15T14:27:37‎ సుల్తాన్ ఖాదర్
  • నేను సరి చేశాను. ఇలాంటి చర్చలు విలీనం మూసం చేర్చి సంబంధిత చర్చాపేజీలలో చేయడం, ఇతరలకు తెలియచెప్పడానికి {{సహాయం కావాలి}}మూసను వాడడం మంచిది. నేను అలా చేశాను. రచ్చబండను వికీపీడియా విభాగాల పరిధికి మించిన విషయాల కు మాత్రమే వాడదాం. --అర్జున (చర్చ) 06:36, 16 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Catalan Culture Challenge

I apologize if this message is not in your language. Please help translate it.

The Catalan-speaking world... Want to find out more? From March 16 to April 15 we will organise the Catalan Culture Challenge, a Wikipedia editing contest in which victory will go to those who start and improve the greatest number of articles about 50 key figures of Catalan culture. You can take part by creating or expanding articles on these people in your native language (or any other one you speak). It would be lovely to have you on board. :-)

We look forward to seeing you!

Amical Wikimedia--Kippelboy (చర్చ) 06:08, 16 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

విక్షనరీ లో ఉండవలసిన వ్యాసాలు

తెవికీలో ఈమధ్య కాలంలో ఏక వాక్య వ్యాసాలు, విక్షనరీలో ఉండవలసిన వ్యాసాల సంఖ్య పెరుగుతూ ఉన్నది. అనుభవమున్న సభ్యులే ఈ విధంగా చేర్చడం జరుగుతున్నట్లున్నది. దయచేసి సదరు వ్యాసాలను మొలకస్థాయి దాటినంతవరకైనా విస్తరించ మనవి. రాశి కంటే వాసి ముఖ్యమని గమనించాలని మనవి. ఇది వరకు ఏక వాక్య వ్యాసాల గూర్చి విస్తృతమైన చర్చ జరిగినప్పటికీ ఈ విధగా గణనీయంగా విస్తరింపవీలు లేని వ్యాసాలు ఒకే వాక్యంతో చేర్చడం వల్ల తెవికీ నాణ్యత పెంచినట్లు భావింపరాదని నా అభిప్రాయం. చిన్న వాక్య వ్యాసాలను విక్షనరీకి తరలిస్తే బాగుంటుంది.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 14:51, 16 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  • విక్షనరీ కి తరలించాలంటే అక్కడ మన ఖాతాకు దిగుమతి చేసుకునే హక్కుండాలి. ఇదివరకు నాకు వికీసోర్సులోనూ, విక్షనరీలోనూ దిగుమతి హక్కుండేది. ఉదాహరణకు వికీసోర్సులో ప్రస్తుతమున్న అన్నమాచార్య కీర్తనలు ఒకప్పుడు వికీపీడియాలోనే ఉండేవి. నేను తిరిగి క్రియాశీలమైన తర్వాత దిగుమతి హక్కు కనిపించలేదు. అందుకే వికీసోర్సుకు, విక్షనరీకి పంపించవలసిన పేజీలు పేరుకు పోయాయి. --వైజాసత్య (చర్చ) 08:44, 18 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • దాదాపు ఐదారేళ్లుగా క్రమం తప్పకుండా తిరోగమిస్తున్న మొలకల శాతం, మళ్లీ ఇటీవలి జిల్లాల పేజీలు తదితర చిన్న పేజీల వలన మళ్లీ దాదాపు ఒక శాతం పెరిగింది. ఇది సరైన దిశ కాదు. --వైజాసత్య (చర్చ) 08:32, 18 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్/పైలట్ ప్రాజెక్టు విశ్లేషణ కు తోడ్పాటు

వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ పైలట్ ప్రాజెక్టు ముగిసింది.దీనికి తోడ్పడిన ప్రాజెక్టు సభ్యులు మరియు ఇతర సభ్యులందరికి ధన్యవాదాలు. విశేషంగా కృషి చేసిన పవన్ సంతోష్,రాజశేఖర్ ,సుల్తాన్ ఖాదర్ గారిని ప్రత్యేక పతకంతో గుర్తించడమైనది. ఇక ఈ ప్రాజెక్టు సమన్వయానికి తోడ్పడిన శశి కి ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టు విశ్లేషణ చూసి మీరు కృషి చేసే ప్రాజెక్టులలో దీని వలన వచ్చిన మంచిపద్ధతులను వాడడానికి వీలుంటే వాడండి. అలాగే విశ్లేషణ లో మీ అభిప్రాయాలు పంచుకొని తదుపరి తెవికీ అభివృద్ధి పనులు రూపుదిద్దడానికి తోడ్పడండి. --అర్జున (చర్చ) 07:20, 17 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  • వైజాసత్య గారికి, ప్రామాణికమైన ప్రాజెక్టు నిర్వచనం (ఆంగ్లవికీ) ప్రకారం తాత్కాలికమైనదే ప్రాజెక్టు. నిర్దిష్ట ముగింపులేకపోతే అదినిత్యకృత్యము (Operation) గా పరిగణించాలి. లింకు పనిచేయకపోవటానికి ఈ ప్రాజెక్టు ముగింపుకి సంబంధం లేదు. ఏదో సమస్య వలన లింకు పనిచేయుటలేదు.నేను జోహాన్ (అభివృద్ధికారునికి) తెలిపాను. ప్రస్తుతానికి సైడ్ బార్ నుంచి తొలగిస్తాను.సమస్య పరిష్కారమైన తరువాత మరల చేర్చవచ్చు.--అర్జున (చర్చ) 04:24, 20 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • విశ్లేషణకు సహాయపడిన వారికి ధన్యవాదాలు. సభ్యుల ఆసక్తి ఎక్కువగా లేనందున ఇక ఈ ప్రాజెక్టు సాంప్రదాయిక వికీప్రాజెక్టు అనగా ఆపరేషన్ లాగానే కొనసాగుతుంది. ఆసక్తి గలవారు ప్రాజెక్టు పేజీలో సూచనలను పాటించి తోడ్పడవచ్చు. --అర్జున (చర్చ) 04:36, 24 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీ దశాబ్ది ఉత్సవాల మొదటి రోజు ఫోటోలు కామన్స్ లో కావాలి.

తెలుగు వికీ దశాబ్ది ఉత్సవాల మొదటి రోజు ఫొటోలు కామన్స్ లో చేర్చమని సమా‌వేశంలో పాల్గొని ఫొటోలు తీసిన సభ్యులకు మనవి. ఇప్పటివరకు పాలగిరి గారు ఎక్కించిన రెండవరోజు ఫొటోలు మాత్రమే వున్నాయి. ప్రత్యేకించి మండలి బుద్ధ ప్రసాద్ గారి వ్యాసానికి మంచి ఫొటో మరియు కొలరావిపు విజేతల ఫొటో ఎక్కించండి. --అర్జున (చర్చ) 16:17, 20 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త నిర్వాహకులు, అధికారులు

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ముగిసిన సందర్భంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన వారందరికీ అభినందనలు తెలిపాము. అయితే నిర్వాహకులలో విష్ణువర్ధన్, రహ్మానుద్దీన్ మరియు విశ్వనాథ్ గార్లను అధికారులగాను, శశి గార్ని నిర్వాహకులుగా చేయడానికి సభ్యుల అభిప్రాయాలను కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 10:52, 21 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖరుల వారు, మంచి విషయాన్ని సూచించారు. నేను వీరితో ఏకీభవిస్తున్నాను. సభ్యులకు ఈ విషయమై తమ అభిప్రాయాలు తెలిపేది. అహ్మద్ నిసార్ (చర్చ) 20:01, 21 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
విష్ణువర్ధన్, రహ్మానుద్దీన్ మరియు విశ్వనాథ్ గార్లను అధికారులగాను, శశి గార్ని నిర్వాహకులుగా చేయడం తెవికీ అభివృధ్ధికి దోహదపడుతుంది. ఈ విషయంలో Rajasekhar గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.---కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 00:41, 22 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
విష్ణువర్ధన్, రహ్మానుద్దీన్ మరియు విశ్వనాథ్ గార్లను అధికారులను చేయడానికి శశిగారిని నిర్వాహకుని చేయాలనే అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. --t.sujatha (చర్చ) 05:07, 25 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
విష్ణువర్ధన్, రహ్మానుద్దీన్ మరియు విశ్వనాథ్ గారు వికీ అభివృద్ధికి చేస్తున్న సేవలు అభినందనీయం. కేవలం అది ఒక్కటే నిర్వాహకత్వం లేదా అధికారిని చేయటానికి ప్రాతిపదిక కాకూడదు ఎందుకంటే ఇవి సేవలకు గుర్తింపుగా ఇచ్చే పతకాలు కాదు. నిర్వాహకత్వం ఇవ్వాలంటే ఆయా అభ్యర్ధికి నిర్వహణా కార్యక్రమాలలో ఆసక్తి ఉండాలి, ఆపై నిర్వహణపై సరైన అవగాహన ఉండాలి. అధికారి హోదాకు వీటితో పాటు వివాద పరిస్కారం, ఏకాభిప్రాయ సాధన తదితర అంశాలపై పట్టు ఉండాలి. ఇదివరకటి కంటే అధికారి హోదా యొక్క బాధ్యతలు గణనీయంగా పెరిగాయి. అందుకనే రహ్మానుద్దీన్ గారిని ఆయా విషయాల్లో అనుభవం పొంది తిరిగి ప్రతిపాదించుకోవాలని అర్జునరావు గారు తిరస్కరించి ఉంటారని నా నమ్మకం. అన్యధా భావించవద్దు నాకు వీరందరూ చేస్తున్న కృషిపై చక్కని గౌరవం ఉన్నది కానీ ఆయా హోదాలు గౌరవప్రదానాలు కాదు. ఈ వ్యాఖ్యతో నేను ఎవరిని నిర్వాహకత్వానికి, అధికారి హోదాకు ప్రతిపాదించుకోకుండా ఆపడం లేదు. కాకపోతే ప్రతిపాదనలను గతంలో కంటే కాస్త క్షుణ్ణంగానే పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మాత్రమే సూచిస్తున్నాను. -08:14, 26 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం జులై 2014-జూన్2015 తెలుగు వికీ ప్రణాళిక - మీ సూచనలకై అభ్యర్థన

నమస్కారం. గత ఫిబ్రవరి నుండి CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం తెవికీ అభివృధ్ధికై కృషి చేస్తున్న సంగతి మీకందరికీ తెలిసిందే. గత సంవత్సరం 5 భారతీయభాషా వికీపీడీయాల అభివృధ్ధికి కృషి చేసిన CIS-A2K ఈ సంవత్సరం 7 భాషలలో కృషి చేయడానికి ప్రణాళిక తయారుచేస్తున్నది. ఈ 7 భాషలలో తెలుగును మళ్ళీ చేర్చడం జరిగిండి. జులై 2014-జూన్2015 వరకు తెలుగు వికీ అభివృధ్ధికి ప్రణాళిక ఇక్కడ చేర్చడం జరిగింది. సమాయాభావం వలన మొత్తం ప్రణాళికను తెలుగులోకి అనువాదం చేయడానికి వీలుపడలేదు. సభ్యులు సద్మనస్సుతో క్షమించగలరు మరియు అనువాదనికి తోడ్పడగలరు. ఈ ప్రణాళిక తెవికీ దశాబ్ది వేడుకలలో మరియు మార్చి 8వ తేది గోల్డెన్ త్రెషోల్డ్లో జరిగిన చర్చల అధారంగా, తెవికీ సభ్యుల సూచనలు సలహాలు పరిగణలోనికి తీసుకొని రూపొందించబడింది. ఈ ప్రణాళికను మెరుగు పరచడానికి సూచనలు సలహాలు చర్చా పేజిలో ఇవ్వగలరు.
ప్రణాళికలో భాగంగా గత సంవత్సరం తెవికీలో మరియు క్రిందటి ఏడాది ప్రణాళికపరంగా జరిగిన ప్రగతి విశ్లేషణ కూడా జరుపబడింది.
CIS-A2K చేపట్టబోయే మిగతా 6 భాషల ప్రణాళికలు, మరియు ఇతర స్వతంత్ర ప్రాజెక్టులు,community strengthening initiatives ఇతరత్రా వివరాలన్ని CIS-A2K Annual Work Plan పేజిలో చూడవచ్చు. ఈ ప్రణాళికలపై కూడా మీ సూచనలు సలహాలు నిర్ధారిత ప్రణాళికా చర్చా పేజిలో ఇవ్వ మనవి. నెనర్లు.--విష్ణు (చర్చ)12:13, 22 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ బస్సుకార్యక్రమ ప్రణాళిక ఇక్కడ చేర్చబడింది. మీ సూచనలు సలహాలతో ఈ ప్రణాళికలను ఇంకా బలోపేతం చేయగలరు. --విష్ణు (చర్చ)09:12, 26 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Changes to the default site typography coming soon

This week, the typography on Wikimedia sites will be updated for all readers and editors who use the default "Vector" skin. This change will involve new serif fonts for some headings, small tweaks to body content fonts, text size, text color, and spacing between elements. The schedule is:

  • April 1st: non-Wikipedia projects will see this change live
  • April 3rd: Wikipedias will see this change live

This change is very similar to the "Typography Update" Beta Feature that has been available on Wikimedia projects since November 2013. After several rounds of testing and with feedback from the community, this Beta Feature will be disabled and successful aspects enabled in the default site appearance. Users who are logged in may still choose to use another skin, or alter their personal CSS, if they prefer a different appearance. Local common CSS styles will also apply as normal, for issues with local styles and scripts that impact all users.

For more information:

-- Steven Walling (Product Manager) on behalf of the Wikimedia Foundation's User Experience Design team

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి

తెలుగు సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడమనే ప్రాజెక్టుకు ఇండివిడ్యువల్ ఎంగేజ్‌మెంట్ గ్రాంట్ కోసం ప్రయత్నించడం జరుగుతోంది. సహ వికీపీడియన్లు ప్రాజెక్టు పేజీని సందర్శించమని మనవి.
ఇప్పటికే వేలాది తెలుగు పుస్తకాలు డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. ఐతే వాటిని వెతకడం, అందుబాటులోకి తెచ్చుకుని చదవడం మాత్రం చాలా కష్టసాధ్యమైన విషయంగా ఉంది. పుస్తకాల పేర్లు, రచయితల పేర్లు ఆంగ్లంలో అత్యంత అస్పష్టమైన స్పెల్లింగులతో రాసి ఉండడంతో వీటిని గూగుల్ వంటి ప్రసిద్ధిపొందిన సెర్చ్‌ఇంజిన్లలో వెతకడం సాధ్యపడడం లేదు. ఆ పుస్తకాలకు తెలుగు యూనీకోడ్‌లో పేరు, రచయిత పేరు, పుస్తకంలోని విషయానికి సంక్షిప్త వివరణలతోపాటు డి.ఎల్.ఐ.లో పుస్తకం వద్దకు లింకుతో కూడిన అంతర్జాల గ్రంథసూచి(ఆన్లైన్ కాటలాగ్) తయారు చేయడం ముఖ్యోద్దేశం. వికీపీడియా మరియు సోదర ప్రాజెక్టుల్లోనే కాక సి.ఐ.ఎస్. ఎ 2 కె బ్లాగు, వెబ్సైట్, సోషల్ మీడియా, తెలుగు సాహిత్యానికి సంబంధించిన ఇతర అంతర్జాల పత్రికల్లోనూ స్వేచ్చా నకలుహక్కులతో ప్రచురించడం ద్వారా వాడుకరులకు విస్తృతంగా అందుబాటులోకి తీసుకువస్తాము.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాథమికంగా తెలుగు వికీపీడియా, వికీసోర్స్, వికీకోట్స్‌లు ప్రయోజనం పొందవచ్చు. ఆయా గ్రంథాల్లోని విజ్ఞానసర్వస్వ సమాచారాన్ని సహ వికీమీడియన్లు ఉపయోగించుకోవచ్చు. నకలుహక్కుల పరిధిలో లేని ఎన్నో పుస్తకాలు వికీసోర్సుకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. వికీమీడియా ప్రాజెక్టులకే కాక తెలుగు అంతర్జాలం అభివృద్ధికి కూడా ఈ గ్రంథసూచి ఉపయోగపడవచ్చు.
ఈ ప్రాజెక్టుకు మద్దతునివ్వాలంటే - ప్రాజెక్టు పేజీలోని ఎండార్స్‌మెంట్స్ అనే విభాగంలో సంతకం చేసి ఎండార్స్‌ చేయవచ్చు. అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు అక్కడి చర్చపేజీలో వ్యాఖ్యానించవచ్చు. ఆయా అంశాల్లో మీ విలువైన భాగస్వామ్యాన్ని కోరుతున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 04:39, 5 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

కొంతమంది తెలుగు స్వాతంత్ర్యసమరయోధులు

ఆసక్తి ఉన్న ఈ సమాచారం ఉపయోగించి ఈ ప్రముఖుల పేజీలు సృష్టించగలరు

నేను ఈ అనువాదాల్లో కృషి చేసేందుకు ఆసక్తి కలిగివున్నాను. ఐతే ఆంగ్ల పాఠ్యాన్ని పేస్ట్ చేసి వ్యాసానువాదం చేస్తూంటే వీక్షకులు అవి యధాతథంగా ఆంగ్ల సమాచారం చూసేలా ఉంది. ఎడిటర్లకి కనిపించేలా(సవరణల్లో) వీక్షకులకు కనిపించకుండా ఉండేలా వీలుందని గతంలో ఎక్కడో చదివాను. అది ఎలా చేయాలన్నది చెప్పగలరా? అక్కడ అర్జున రావు గారు పెట్టారేమోనని నాకు గుర్తు.--పవన్ సంతోష్ (చర్చ) 06:04, 8 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ, అనువాదం చేయునపుడు అనువాదం కాని ఆంగ్ల భాగానికి ఇరువైపులా <!-- ఆంగ్ల భాగం --> అనే ట్యాగును ఉంచండి. అపుడు అనువాదం జరిగినపుడు మాత్రమే ఎడిటర్లకు కనిపిస్తాయి. వీక్షకులకు కనిపించవు.---- కె.వెంకటరమణ చర్చ 07:02, 8 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకటరమణ గారూ కృతజ్ఞతలు. ఐతే ఎ.కామేశ్వరరావు అనే వ్యాసం సృష్టించడంలో ప్రయత్నం చేశాను. ప్రయోజనం కనిపించలేదు. నేనెక్కడ పొరపాటు చేశానన్నది తెలియలేదు.--పవన్ సంతోష్ (చర్చ) 10:18, 8 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]
పై వ్యాసాలలో అల్లూరి సత్యనారాయణరాజు అనే వ్యాసం తెవికీలో ఉన్నది. ఆయన జీవిత చరిత్ర ఇక్కడ] వివరంగా ఉంది.---- కె.వెంకటరమణ చర్చ 06:06, 8 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]
సరిచేశాను. చూడండి.--Rajasekhar1961 (చర్చ) 10:53, 8 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ, సరిచేశాను. -- కె.వెంకటరమణ చర్చ

రద్దైన శాసనసభ నియోజకవర్గాల గురించిన పేజీలు

2009లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలు రద్దయ్యాయి. రద్దైన నియోజకవర్గాలు దశాబ్దాల తరబడి కొనసాగాయి. ఎందరో ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల నుంచి ఎన్నికై రాష్ట్రస్థాయిలో మంత్రులుగా పనిచేశారు. ఐతే తెవికీలో ఆయా నియోజకవర్గాల గురించి వ్యాసాలు లేనట్టు గమనించాను. ఉదాహరణకు పశ్చిమగోదావరి జిల్లాలోని అత్తిలి శాసనసభ నియోజకవర్గం గురించిన పేజీ లేకపోవడం నేను గమనించాను. ఆ నియోజకవర్గంలోని మండలాలు మూడుగా విడిపోయి తణుకు మొదలైన శాసనసభ నియోజకవర్గాల్లో చేరిపోయాయి. వీటి గురించి వ్యాసాలు ప్రారంభించవచ్చా? లేదంటే ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలే ఉండాలా?--పవన్ సంతోష్ (చర్చ) 05:31, 10 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మరణించిన ప్రముఖుల వ్యాసాలున్నాయి, కాలగర్భంలో కలిసిపోయిన చారిత్రక ప్రదేశాల వ్యాసాలున్నాయి, ఒకప్పుడు వైభవంగా వెలుగొందిన రాజ్యాలు- సామ్రాజ్యాలు- సంస్థానాల వ్యాసాలున్నాయి, నేలమట్టమైన కోటలకు సంబంధించిన వ్యాసాలున్నాయి, అంతరించిపోయిన జీవజాతుల వ్యాసాలున్నాయి, ఇదే మాదిరిగా తగినంత సమాచారం ఉంటే రద్దయిన నియోజకవర్గాల వ్యాసాలను కూడా మీరు తప్పకుండా చేర్చవచ్చు. నిబంధనలు పాటిస్తూ తెవికీలో ఏ వ్యాసమైనా సృష్టించవచ్చు. ఆ వ్యాసాలకున్న విలువే ముఖ్యం, కాని అవి ఉన్నవా లేవా అనేది ముఖ్యం కాదు. ఇలాంటి వాటికి వర్గం వేరు చేస్తే సరిపోతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:38, 10 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రతిస్పందించినందుకు కృతజ్ఞతలు చంద్రకాంతరావు గారూ! మీ సలహా బావుంది. తప్పకుండా ఆయా నియోజకవర్గాలు చేర్చుతాను.--పవన్ సంతోష్ (చర్చ) 14:08, 11 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పురస్కారాలు బిరుదులు కాదు

భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు(అవార్డులు) బిరుదులుగా వాడుకోకూడదు. భారతప్రభుత్వం ద్వారా అందే ఈ అత్యున్నత పౌరపురస్కారాలు చూడడానికి, వాడడానికి బిరుదుల్లా ఉండడంతో ఈ సమస్య వస్తోంది. ఈ మధ్యనే పద్మశ్రీ పురస్కారం బిరుదుగా వాడుకున్నారనీ, వెనక్కి తీసుకోవాలనీ ప్రముఖ సినీనటులపై హైకోర్టులో కేసు నడిచిన విషయం విదితమే. హైకోర్టు ఈ బిరుదులు రాష్ట్రపతికి వెనక్కి తిరిగి ఇవ్వాలని ఆదేశించగా సుప్రీంకోర్టులో స్టే విధించారు. ఐతే సుప్రీంకోర్టు కూడా సదరు నటుణ్ణి ఇంటి నేమ్‌ప్లేటుపై కూడా బిరుదులా వాడనని ఓ అఫిడవిట్ దాఖలుచేయమని ఆదేశించింది. ఆంగ్ల వికీలో చాలామంది వ్యక్తిగత పేజీల్లో ఆనరరీ ప్రీఫిక్స్, టైటిల్ అంటూ పద్మవిభూషణ్, పద్మశ్రీలు ఉండడం చూసి అక్కడ చర్చ ప్రారంభించాను. ఇప్పుడు తెలుగు వికీపీడియా మెయిన్ పేజీలో 1858 : ప్రముఖ మహిళోద్ధారకుడు, భారతరత్న ధొండొ కేశవ కర్వే జననం. అని ఉంది. ఐతే నిజానికి భారతరత్న పురస్కార గ్రహీత అని ఉంటే మరింత బావుంటుంది. ఇవేమీ గతంలో అంతగా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు మాత్రం హైకోర్టు, సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మనం కూడా ఇక ఈ జాగ్రత్త వహిస్తే బావుంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 06:53, 18 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాద్ నెలవారీ సమావేశాలు

  • హైదరాబాద్ సమావేశాలకు స్పందన తక్కువ కావడం, మరియు పాత వాడూకరులు క్రియాశీలకంగా లేకపోవడం గురించి నాదొక ఆలోచన. హైదరాబాద్‌లో కొద్దిమంది ఆశక్తి కలిగిన వారు ఉన్నా వారు హైదరాబాద్‌లోనే వేరు వేరు ప్రాంతాల నుండి రావాలి కనుక వారికి రవాణా చార్జీలు కల్పించగలిగితే బావుంటుందని.

ఇవి చిన్న మొత్తాలు కనుక ఆచరణీయమే అని నా అభిప్రాయం. రావాలనుకున్న వారికీ చార్జీలు పెట్టుకొని మరీ అబిడ్స్ వరకూ ఎందుకు వెళ్ళడం అని ఉండదు కనుక అలాంటి చిన్న నిధిని ఏర్పాటు చేసుకొని వచ్చిన వారికి చార్జీలు ఇవ్వగలిగితే ఎక్కువమంది వస్తారనుకుంటున్నాను...విశ్వనాధ్ (చర్చ) 13:58, 18 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  • నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం స్వచ్చంద సంస్థలలో వచ్చే సేవకులు, వాడుకదారులు ఎటువంటి లాభా పేక్ష లేకుండా వస్తేనే బాగుంటుంది మనము నగదు ప్రోత్సాహకాలు ఇస్తూ వుంటే ఛార్జీలు ఇస్తారుకదా కానీ వచ్చిన వాళ్ళు ఆ తరువాత కూడా ఉచితంగా తమ సేవలు అందచేయలేకపోవచ్చు.మనము చార్జీలు ఇచ్చి కూడా రమ్మని చెపితే జనాలు ఇదేదో వికీవారు వాణిజ్య ప్రయోజనం ఆశించి మనలకు ఆహ్వానిస్తున్నారు అనుకొనే ప్రమాదం వున్నది నగరంలో జరిగే వివిధ కార్యకమాలకు ప్రజలు స్వచ్చందం గానే వస్తారు, ఈమధ్య కాలంలో ఆమ్వే,హెర్బల్ లైఫ్,యోగా , ట్రైనింగ్ కంపెనీలు , కొన్ని చైన్ మార్కెటింగ్ సంస్థలు ఉచిత సెమినారు,వర్క్ షాపులు అని చెప్పి వచ్చిన జనాల చేత డబ్బులు కట్టించుకొంటున్నారు వీరి వలన ప్రముఖ సంస్థల సాంస్కృతిక కార్యక్రమాలు కాకుండా వేరేవాటికి హాజరు అయ్యే ప్రజల సంఖ్య తగ్గినది . కొత్త మందికి చేరువకావాలి అంటే వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో ( స్కూళ్ళు ,లైబ్రరీలు, కమ్యునిటీ హాళ్లలో మనమే వర్క్ షాపు లాంటి ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుంది దీనికి మనకు కావలసినది కొన్ని కరపత్రాలు ,స్టీక్కర్లు ! --కశ్యప్ 06:01, 21 ఏప్రిల్ 2014 (UTC)
  • మీరు చెప్పిన లాంటివి తరచుగా జరిగేవి కాదు. మన ప్రోగ్రాం ప్రతి నెలా జరుగుతుంది. అలా ప్రతిసారీ రావాలంటే కొంత ఇబ్బందితో కూడుకొన్నదే. మనం మనవైపుగా చేసేది తెవికీకి అంతర్జాలం ద్వారా చేస్తున్నాం. అది స్వచ్చందానే కదా. పైన చెప్పిన దానిబట్టి , నెలవారీ సమావేశాలకు హైదరాబాదీయులు ఎక్కువగా హాజరవుతారని నా అభిప్రాయం...విశ్వనాధ్ (చర్చ) 08:06, 21 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా అన్వేషణ ఫలితాల్లో వికీడేటా ఫలితాలు

Mediawiki:commons.js వద్ద ఒక మార్పును చేయడం ద్వారా వికీడేటా ఫలితాలు వికీపీడియా ఫలితాలలో సైతం కనిపించే ఏర్పాటు జరిగింది (ఉదాహరణకి "మణిలాల్ గాంధీ" అని వెతికి చూడగలరు). కేవలం వికీడేటా లో, వెతికే అంశం యొక్క లేబుల్ ఇంకా డిస్క్రిప్షన్ ఉంటే సరిపోతుంది. వికీడేటాలో ఏ విధంగా పని చేసి మన సొంత వికీపీడియాను అభివృద్ధి పరచవచ్చో అన్న విషయమై వెబినార్ చేయదలిచాను. ఇందులో వికీడేటా లో పనిచేసే పనిముట్లలో ఒకటయిన రెజనేటర్ గురించి తెలుసుకోవచ్చు. ఆసక్తి గలవారు వచ్చే నెల బెంగుళూరు సమావేశంలో పాల్గొనదలిస్తే ప్రత్యక్షంగా, బెంగుళూరు వెలుపల వారికి వెబినార్ ద్వారా రెజొనేటర్ గురించి చిన్న ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 14:33, 22 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వీషయమై జెరార్డ్ వ్రాసుకున్న బ్లాగు టపా ను ఇక్కడ చదవండి. --రహ్మానుద్దీన్ (చర్చ) 04:13, 23 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు ఆశక్తి ఉన్నది. వెబినార్ లో ఎలా నమోదు చేసుకోవాలి తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 06:51, 26 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

KLRWP అవార్డుల విధి విధానాల మీద బ్లాగ్ పోస్ట్

KLRWP అవార్డుల విధి విధానాల మీద బ్లాగ్ పోస్ట్ ని పరిశీలించి, మీ అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా మనవి. --రాధాక్రిష్ణ (చర్చ) 18:28, 22 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

KLRWP అవార్డుల విధి విధానాల బ్లాగ్ పోస్ట్ ఇచ్చట publish చేయబడినది. అందరికీ ధన్యవాదములు. రాధాక్రిష్ణ (చర్చ) 05:39, 30 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

జాలపత్రికల్లో తెవికీ ప్రాచుర్యం

అంతర్జాలంలో తెలుగు సాహిత్యం, రాజకీయం, సినిమా వగైరా ఎన్నెన్నో అంశాలతో కూడిన పత్రికలు ఉన్నాయి. ప్రింటుమీడియాతో సంబంధం లేని ఎన్నో జాలపత్రికలు నేడు అంతర్జాలంలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ పత్రికల్లో వచ్చే వ్యాసాలలో వివిధ ఆంగ్ల వికీ లింకులు ఇస్తున్నారు. తెలుగు సినిమాలు, సాహిత్యానికి సంబంధించిన వివరాలకు కూడా ఆంగ్ల వికీ లింకులు ఇస్తున్నారు. నేను పుస్తకం.నెట్, కినిగె అనే రెండు సాహిత్య పత్రికలను సంప్రదించి తెలుగు వికీపీడియా లింకులు సరైనవి లేకుంటేనే ఆంగ్ల వికీని సంప్రదించాలని, తద్వారా అంతర్జాలంలో తెలుగు సమాచారాన్ని అభివృద్ధి చేసే ఉద్యమంలో భాగస్వామ్యం వహించాలని ఇ-మెయిల్స్ పెట్టాను. వారు వెంటనే సానుకూలంగా స్పందించి నేను కోరిన విధంగానే తెవికీ వ్యాసాలకు లింకులు ఇస్తున్నారు. ఈ ప్రయత్నం విజయవంతమయ్యే అవకాశం ఉంది కనుక సహసభ్యులు మీకు తెలిసిన జాలపత్రికల కాంటాక్టు మెయిల్స్‌కీ అలా కోరుతూ పంపగలరేమో పరిశీలించండి.
పుస్తకం.నెట్ వారు భగవంతుని మీది పగ, ధూమరేఖ, నాస్తికధూమము, నందోరాజా భవిష్యతి వ్యాసాల్లో చివర వికీపేజీకి లింకు అని ఇచ్చారు. అలానే మధ్యలో ఎక్కడైనా వీలైతే ఇస్తున్నారు. కినిగె పత్రికలో కూడా కర్నాటకలో నా తిరుగాట వ్యాసంలో శివరామ కారంత్ ప్రస్తావన వచ్చినప్పుడు వికీలో ఆయన పేరిట ఉన్న పేజీకి లింకు ఇచ్చారు. ఐతే నిన్నటి వరకూ అది ఆంగ్ల వికీలోని పేజీకి లింకు ఉండేది. ఇకపై ఎప్పుడు వీలున్నా ముందుగా తెవికీనే ప్రయత్నిస్తామన్నారు.
ఈ క్రమంలోనే అంతర్జాలంలోని పెద్ద సంఖ్యలో ఉన్న సినీ, రాజకీయ పత్రికల విషయంలోనూ, బ్లాగర్ల విషయంలోనూ ప్రయత్నించవచ్చు.--పవన్ సంతోష్ (చర్చ) 04:35, 26 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]