ఇడ్లీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox prepared food
{{Infobox prepared food
| name = ఇడ్లీ
| name = ఇడ్లీ
| image = [[File:Idli Sambar.JPG|250px]]
| image = [[File:Idli Sambar.JPG|250px]]
| caption = ఇడ్లీ
| caption = ఇడ్లీ
| alternate_name =
| alternate_name =
| country = దక్షిణ భారత దేశం
| country = దక్షిణ భారత దేశం
| creator =
| creator =
| course = బ్రేక్ ఫాస్ట్,
| course = బ్రేక్ ఫాస్ట్,
| served = సాంబార్ మరియు చట్నీ తో వేడిగా
| served = సాంబార్ మరియు చట్నీ తో వేడిగా
| main_ingredient = మినపగుళ్ళు,బియ్యం నూక
| main_ingredient = మినపగుళ్ళు,బియ్యం నూక
| variations = బటన్ ఇడ్లీ, తల్లె ఇడ్లీ, సన్నా, సంబార్ ఇడ్లీ, రవ్వ ఇడ్లీ
| variations = బటన్ ఇడ్లీ, తల్లె ఇడ్లీ, సన్నా, సంబార్ ఇడ్లీ, రవ్వ ఇడ్లీ
| calories =
| calories =
| other =
| other =
}}'''
}}'''

పంక్తి 22: పంక్తి 22:
[[బొమ్మ:Idli1.jpg|thumb|ఇడ్లీ|left]]
[[బొమ్మ:Idli1.jpg|thumb|ఇడ్లీ|left]]

దోశకు మరియు వడకు తమిళ దేశాన రెండు వేల సంవత్సరాల ఘనమైన చరిత్ర కలదు కానీ, ఇడ్లీ మాత్రము విదేశీ దిగుమతి. సాహిత్యములో తొలిసారి ఇడ్లీ వంటి వంటకము యొక్క ప్రస్తావన (ఇడ్డలిగే) [[920]] లో శివకోట్యాచార్య యొక్క “వడ్డారాధనే” అనే [[కన్నడ]] రచనలో ఉన్నది. ఆ తరువాత [[1130]] లో కళ్యాణీ చాళుక్య చక్రవర్తి [[మూడవ సోమేశ్వరుడు]] రచించిన సంస్కృత విజ్ఞాన సర్వస్వము ''[[మానసోల్లాస]]'' లో ఇడ్లీ తయారు చేసే విధానము ఇవ్వబడినది. అయితే ఈ రచనలలో ఆధునిక ఇడ్లీ తయారీకి ప్రధాన భాగలైన మినపప్పు తో పాటు బియ్యపుపిండి కలపడము, పిండిని పులియబెట్టడము, పిండి పొంగడానికి ఆవిరిపట్టడము మొదలైన విషయాల గురించిన ప్రస్తావన లేదు.

[[బొమ్మ:IDli.jpg|thumb|right|ఇడ్లీ-వడ, [[తిరుపతి]] దగ్గరలోని [[శ్రీనివాస మంగాపురం]] దగ్గర రోడ్డుపక్క హోటలు నుండి.]]
[[బొమ్మ:IDli.jpg|thumb|right|ఇడ్లీ-వడ, [[తిరుపతి]] దగ్గరలోని [[శ్రీనివాస మంగాపురం]] దగ్గర రోడ్డుపక్క హోటలు నుండి.]]

పంక్తి 52: పంక్తి 52:
* {{cite book | title=
* {{cite book | title=
* Devi, Yamuna (1987). ''Lord Indian Food: A Historical Companion| edition=| author=[[K. T. Achaya]]| date=May 12, 1994| publisher=Oxford University Press, USA| isbn=978-0-19-563448-8}}Krishna's Cuisine: The Art of Indian Vegetarian Cooking'', Dutton. ISBN 0-525-24564-2.

* {{cite book |last= Farnworth |first= Edward R. |title= Handbook of Fermented Functional Foods |year=2003 |publisher= CRC Press |isbn= 978-0-8493-1372-1 }}
* {{cite book |last= Farnworth |first= Edward R. |title= Handbook of Fermented Functional Foods |year=2003 |publisher= CRC Press |isbn= 978-0-8493-1372-1 }}
* Jaffrey, Madhur (1988). ''A Taste of India'', Atheneum. ISBN 0-689-70726-6.
* Jaffrey, Madhur (1988). ''A Taste of India'', Atheneum. ISBN 0-689-70726-6.
* Rau, Santha Rama (1969). ''The Cooking of India'', Time-Life Books.
* Rau, Santha Rama (1969). ''The Cooking of India'', Time-Life Books.

21:31, 3 జూన్ 2014 నాటి కూర్పు

ఇడ్లీ
ఇడ్లీ
మూలము
మూలస్థానందక్షిణ భారత దేశం
వంటకం వివరాలు
వడ్డించే విధానంబ్రేక్ ఫాస్ట్,
వడ్డించే ఉష్ణోగ్రతసాంబార్ మరియు చట్నీ తో వేడిగా
ప్రధానపదార్థాలు మినపగుళ్ళు,బియ్యం నూక
వైవిధ్యాలుబటన్ ఇడ్లీ, తల్లె ఇడ్లీ, సన్నా, సంబార్ ఇడ్లీ, రవ్వ ఇడ్లీ

ఇడ్లీలు

ఇడ్లీ (ఆంగ్లం: Idli or Idly) దక్షిణ భారత దేశంలో విరివిగా వాడే అల్పాహార వంటకం. ఇడ్లీలు గుండ్రంగా రెండు లేదా మూడు అంగుళాల వ్యాసం కలిగి ఉంటాయి. మినప పప్పు మరియు బియ్యపు పిండి కలిపి పులియబెట్టిన పిండిని గుంత అచ్చులు ఉన్న పళ్లాలపైపోసి ఆవిరితో ఉడికించి తయారుచేస్తారు. మినప్పప్పు లోని ప్రోటీన్లు, బియ్యంలోని పిండి పదార్థాలు కలిసి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి. పిండి పులియడం వల్ల శరీరం సులభంగా జీర్ణించుకోగల చిన్న పదార్ధాలుగా విచ్ఛిన్నం చెందుతుంది. అందుకే దీన్ని పసి పిల్లలకూ, అనారోగ్యంతో బాధ పడేవారికీ తరచుగా తినిపిస్తూ ఉంటారు.

సాధారణంగా ఉదయం పూట అల్పాహారంగా తినే ఇడ్లీలను, వాటితో పాటు నంజుకుని తినటానికి చట్నీ లేదా సాంబారు లేదా కారంపొడిగానీ, పచ్చడితో గానీ వడ్డిస్తారు. ఎండు మసాలాలను కలిపి దంచి తయారుచేసిన ముళగాయి పొడి వంటి పొడులు ఇడ్లీలను ప్రయాణాలలో వెళుతూ వెళుతూ తినటానికి అనువుగా ఉంటాయి. అంతే కాకుండా, ఇడ్లీలు ప్రపంచంలోని పది అత్యంత ఆరోగ్యవంతమైన వంటకాలలో ఒకటిగా పరిగణించబడుతున్నది.[1]

పుట్టు పూర్వోత్తరాలు

ఇడ్లీ

దోశకు మరియు వడకు తమిళ దేశాన రెండు వేల సంవత్సరాల ఘనమైన చరిత్ర కలదు కానీ, ఇడ్లీ మాత్రము విదేశీ దిగుమతి. సాహిత్యములో తొలిసారి ఇడ్లీ వంటి వంటకము యొక్క ప్రస్తావన (ఇడ్డలిగే) 920 లో శివకోట్యాచార్య యొక్క “వడ్డారాధనే” అనే కన్నడ రచనలో ఉన్నది. ఆ తరువాత 1130 లో కళ్యాణీ చాళుక్య చక్రవర్తి మూడవ సోమేశ్వరుడు రచించిన సంస్కృత విజ్ఞాన సర్వస్వము మానసోల్లాస లో ఇడ్లీ తయారు చేసే విధానము ఇవ్వబడినది. అయితే ఈ రచనలలో ఆధునిక ఇడ్లీ తయారీకి ప్రధాన భాగలైన మినపప్పు తో పాటు బియ్యపుపిండి కలపడము, పిండిని పులియబెట్టడము, పిండి పొంగడానికి ఆవిరిపట్టడము మొదలైన విషయాల గురించిన ప్రస్తావన లేదు.

ఇడ్లీ-వడ, తిరుపతి దగ్గరలోని శ్రీనివాస మంగాపురం దగ్గర రోడ్డుపక్క హోటలు నుండి.

తెలుగులో ఇడ్లీలను ఇడ్డెనలు అంటారు. ప్రస్తుతము ఈ పేరు వాడకం తగ్గినది.

చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ (7వ శతాబ్దము) రచనల వలన భారత దేశములో ఆ కాలములో ఆవిరిపట్టే పాత్రలు లేవని తెలుస్తున్నది కానీ భారతీయులు మరుగుతున్న గిన్నెపై బట్టకప్పి ఆవిరిపట్టి ఉండవచ్చని భావిస్తారు. ఇండొనేషియన్లు అనేకరకాల పులియబెట్టే వంటకాలు వండేవారు అందులో ఇడ్లీకి పోలికలున్న కేడ్లీ అనే వంటకము కూడా ఉన్నది. 800 - 1200 మధ్య కాలములో ఇండోనేషియాకు హిందూ రాజులతో పాటు వెళ్లిన వంటవాళ్లు, పులియపెట్టే పద్ధతులు, అవిరిపెట్టే పద్ధతులు మరియు వాళ్ల వంటకము కేడ్లీని దక్షిణ భారతదేశానికి తెచ్చారని ఒక భావన కానీ ఖచ్చితముగా నిర్ధారించుటకు ఆధారములు లేవు.

ఇడ్లీ ఎక్కడి నుండి దిగుమతి అయినా భారతీయుల ప్రియమైన అల్పాహార వంటకాలలో ఒకటిగా విలసిల్లుతున్నది. భారతదేశపు పల్లె పల్లెలో ఇడ్లీ గురించి తెలియని వారు తక్కువ. ప్రతి హోటలు నందు మెనూలో తప్పక చేర్చు వంటకం ఇడ్లీ.

రవ్వ ఇడ్లీ

తయారీ

ఇడ్లీలు ఉడకబెట్టేందుకు ప్రస్తుతం ప్లేట్లు లభ్యమవుతున్నాయి. గతంలో వీటిని ఆవిరిపోకుండా గుడ్డతో మూత కట్టిన పాత్రల్లో (వాసెన) ఉడికించే వారు. పాత్రలో సగం వరకూ నీరు పోసి దాని అంచుకు గట్టిగా ఓ బట్ట కట్టి అందులో ఒకటే ఇడ్లీ పోసి ఉడికించే వారు. తరువాత దానిని ముక్కలుగా కోసి తినేవారు. తమిళనాడులో ఇప్పటికీ చాలామంది పిండిని నేరుగా ప్లేటులో కాకుండా దాని మీద బట్ట వేసి పిండి మిశ్రమాన్ని వేసి ఉడికిన తర్వాత కొంచెం నీళ్ళు చల్లి తీసేస్తారు. ఇలా చేయడం వల్ల ప్లేట్లకు నెయ్యి గానీ, నూనె గానీ రాయాల్సిన అవసరం ఉండదు.

పోషక విలువలు

ఇడ్లీ ఆరోగ్యకరమైన అల్పాహారం. మద్యరకం సైజు ఇడ్లీ నుండి సుమారు 50 క్యాలరీలు లభిస్తాయి. ఇందులో 0.2 గ్రా కొవ్వులు, 1.43 గ్రా మాంసకృతులు, 11.48 గ్రా పిండి పదార్థాలు, 1.1 గ్రా పీచు పదార్థాలు, 279 మి.గ్రా సోడియం, 9 మి.గ్రా పొటాషియం, 1 మి.గ్రా ఇనుము లభిస్తాయి. ఇందులో రోజువారీ పనులకు అవసరమయ్యే పోషకాలన్నీ దాదాపుగా లభిస్తాయి.

విశేషాలు

కంచి దేవరాజ స్వామి ఆలయంలో ఒకటిన్నర కిలో బరువున్న ఇడ్లీ తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇందుకోసం బియ్యం, మిరియాలు, కొత్తిమీర, అల్లం, ఇంగువ, జీలకర్ర, తగినంత పెరుగు కలిపి మెత్తగా రుబ్బి ఓ పెద్ద ఇడ్లీగా వేసి ఆవిరి మీద ఉడికిస్తారు.

కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని రామస్సెరి అనే గ్రామం ఇడ్లీలకు పెట్టింది పేరు. స్పాంజిలా మృదువుగా ఉండే ఈ ఇడ్లీ ఒకటో శతాబ్దం నుంచీ ఒక కుటుంబం ఈ విధానాన్ని రహస్యంగా ఉంచుతున్నారు. ఇప్పటికీ కట్టెలపొయ్య మీద బట్ట కట్టిన మట్టి పాత్రలోనే ఇడ్లీని వండుతారు. [2]

ఇవి కూడా చూడండి

మూలములు

  1. http://completewellbeing.com/article/the-light-list/
  2. ఈనాడు ఆదివారం, 14 జులై, 2013, పుట 16
  • ఎ హిస్టోరికల్ డిక్షనరీ ఆఫ్ ఇండియన్ ఫుడ్ - కే. టీ. అచయ (ఆక్స్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ ప్రచురణ)

నోట్సు

  • K. T. Achaya (May 12, 1994). * Devi, Yamuna (1987). Lord Indian Food: A Historical Companion. Oxford University Press, USA. ISBN 978-0-19-563448-8.Krishna's Cuisine: The Art of Indian Vegetarian Cooking, Dutton. ISBN 0-525-24564-2.
  • Farnworth, Edward R. (2003). Handbook of Fermented Functional Foods. CRC Press. ISBN 978-0-8493-1372-1.
  • Jaffrey, Madhur (1988). A Taste of India, Atheneum. ISBN 0-689-70726-6.
  • Rau, Santha Rama (1969). The Cooking of India, Time-Life Books.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇడ్లీ&oldid=1167948" నుండి వెలికితీశారు