కుక్కర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 30 interwiki links, now provided by Wikidata on d:q271997 (translate me)
చి Wikipedia python library
పంక్తి 2: పంక్తి 2:
[[File:WMF Schnelldrucktopf 4,5 Liter Perfect Ultra.jpg|thumb|right|కుక్కర్ ]]
[[File:WMF Schnelldrucktopf 4,5 Liter Perfect Ultra.jpg|thumb|right|కుక్కర్ ]]

'''కుక్కర్''' ([[ఆంగ్లం]] Cooker) అన్నం, కూరగాయలు, పప్పులు ఉడికించి వండే వంటింటి పరికరం. మామూలుగా [[పొయ్యి]] మీద నేరుగా చేసేదాని కంటే దీనితో [[వంట]] త్వరగా పూర్తవుతుంది. [[నీటి ఆవిరి]] యొక్క వత్తిడి (ప్రెషర్ - Pressure) తో పనిచేసే కుక్కర్ ను ప్రెషర్ కుక్కర్ (Pressure Cooker) అంటారు. ఒక్క [[అన్నం]] (బియ్యం - Rice) ఉడికించడానికి మాత్రమే ఉపయోగించే ప్రత్యేకమైన కుక్కర్ ను రైస్ కుక్కర్ (Rice Cooker) అంటారు.

==ఆటోమాటిక్ రైస్ కుక్కర్==
==ఆటోమాటిక్ రైస్ కుక్కర్==

13:24, 4 జూన్ 2014 నాటి కూర్పు

కుక్కర్

కుక్కర్ (ఆంగ్లం Cooker) అన్నం, కూరగాయలు, పప్పులు ఉడికించి వండే వంటింటి పరికరం. మామూలుగా పొయ్యి మీద నేరుగా చేసేదాని కంటే దీనితో వంట త్వరగా పూర్తవుతుంది. నీటి ఆవిరి యొక్క వత్తిడి (ప్రెషర్ - Pressure) తో పనిచేసే కుక్కర్ ను ప్రెషర్ కుక్కర్ (Pressure Cooker) అంటారు. ఒక్క అన్నం (బియ్యం - Rice) ఉడికించడానికి మాత్రమే ఉపయోగించే ప్రత్యేకమైన కుక్కర్ ను రైస్ కుక్కర్ (Rice Cooker) అంటారు.

ఆటోమాటిక్ రైస్ కుక్కర్

ఇందులో బియ్యంతో పాటు దానిక తగిన పరిమాణంలో నీళ్ళు పోసి విద్యుచ్ఛక్తితో అనుసంధానం చేస్తే అన్నం ఉడికినపుడు దానంతట అదే ఆగిపోతుంది. అన్నంలోని గంజి వార్చనక్కరలేదు. ఆహారం ఉడకడం అంటే ఆ పదార్థాల్లో పెద్ద పెద్ద అణువులు తమ బంధాలు తెంచుకుని నీటితో చర్య జరపడం ద్వారా చిన్న చిన్న అణువులుగా మారడమే. ఇలా జరగడానికి ఎక్కువ శక్తి కావాలి. అది వంటకి వాడే వేడి ద్వారా సమకూరుతుంది. వేడి ఎంత ఎక్కువ ఉంటే అంత తొందరగా వంట అవుతుంది. అయితే మామూలు పరిస్థితుల్లో సాధారణ వాతావరణ పీడనం దగ్గర మనం 100 డిగ్రీల సెంటిగ్రేడుకి మించి ఉష్ణోగ్రతను అందించలేం. ఎందుకంటే ఆ ఉష్ణోగ్రత దగ్గరకు వచ్చేసరికి నీరు ఆవిరైపోతుంది. అయితే అధిక పీడనంలో ఉంచితే నీరు 100 డిగ్రీల సెంటిగ్రేడు వద్ద ఆవిరి కాదు. దాని భాష్పీభవన ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే నీరు ఆవిరై పోకుండానే 110 లేదా 120 డిగ్రీల సెంటిగ్రేడు వరకూ కూడా ఉష్ణోగ్రతను అందించగలుగుతాం. ప్రెషర్‌ కుక్కర్‌లో జరిగేదిదే. ఎక్కువ వేడి అందుతుంది కాబట్టి త్వరగా అన్నం ఉడుకుతుంది.

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=కుక్కర్&oldid=1173094" నుండి వెలికితీశారు