వికీపీడియా:ఏది వికీపీడియా కాదు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎Wikipedia is not a crystal ball: విభాగం అనువాదం పూర్తి
→‎Wikipedia is not censored for the protection of minors: విభాగం అనువాదం పూర్తి
పంక్తి 62: పంక్తి 62:
# '''భవిష్యత్తు గురించిన లెక్కలు, ఊహలు, "భవిష్యత్తు చరిత్రల"''' గురించి చెప్పే రచనలు వికీపీడియాలో కూడవు. ఇవి మౌలిక పరిశోధన కిందకి వస్తాయి. అయితే అలాంటి తార్కిక, సంబద్ధ వ్యాసాల ''గురించి'' వికీపీడియాలో రాయవచ్చు. స్టార్ వార్స్ గురించి వ్యాసం రాయవచ్చు కానీ "నాలుగో ప్రపంచ యుద్ధంలో వాడబోయే ఆయుధాలు" అనే వ్యాసానికిక్కడ చోటులేదు.
# '''భవిష్యత్తు గురించిన లెక్కలు, ఊహలు, "భవిష్యత్తు చరిత్రల"''' గురించి చెప్పే రచనలు వికీపీడియాలో కూడవు. ఇవి మౌలిక పరిశోధన కిందకి వస్తాయి. అయితే అలాంటి తార్కిక, సంబద్ధ వ్యాసాల ''గురించి'' వికీపీడియాలో రాయవచ్చు. స్టార్ వార్స్ గురించి వ్యాసం రాయవచ్చు కానీ "నాలుగో ప్రపంచ యుద్ధంలో వాడబోయే ఆయుధాలు" అనే వ్యాసానికిక్కడ చోటులేదు.


===పిల్లల కోసం వికీపీడియాను సెన్సారు చెయ్యం===
===Wikipedia is not censored for the protection of minors===
వికీపీడియాలో ఉండే కొన్ని వ్యాసాలు కొందరు పాఠకులకు అభ్యంతరకరంగా ఉండవచ్చు. ఇక్కడి వ్యాసాలను ఎవరైనా సరిదిద్దవచ్చు. ఆ దిద్దుబాట్లు వెంటనే వ్యాసంలో కనిపిస్తాయి. అంచేత ఆయా వ్యాసాల్లో కనిపించే విషయాలు పిల్లలు చదివేందుకు అనుగుణంగా ఉంటాయని చెప్పలేం. అనుచితమైన విషయాలు దృష్టికి వెనువెంటనే తీసెయ్యడం జరుగుతుంది. అయితే శృంగారం, బూతు మొదలైనవి విజ్ఞాన సర్వస్వంలో భాగమే కాబట్టి, అలాంటి విషయాలపై వ్యాసాలు ఉండే అవకాశం లేకపోలేదు.
[[Wikipedia:Content disclaimer|Wikipedia may contain content that some readers consider objectionable or offensive]]. Anyone reading Wikipedia can edit an article and the changes are displayed instantaneously without any checking to ensure appropriateness, so Wikipedia cannot guarantee that articles or images are appropriate for children or adhere to specific [[social norms]]. While obviously inappropriate content (such as inappropriate links to [[shock site]]s) is usually removed immediately, except from an article directly concerning the content (such as the article about [[pornography]]), some articles may include objectionable text, images, or links, provided they do not violate any of our existing [[Wikipedia:policies and guidelines|policies]] (especially [[Wikipedia:Neutral point of view|Neutral point of view]]), nor the law of the [[U.S. state|state]] of [[Florida]] in the [[United States]], where the servers are hosted.


==What the Wikipedia community is not==
==What the Wikipedia community is not==

02:38, 8 జూన్ 2007 నాటి కూర్పు

వికీపీడియా ఓ ఆన్‌లైను విజ్ఞాన సర్వస్వము, దానికోసం ఏర్పడిన ఓ ఆన్‌లైను సముదాయం. అంచేత వికీపీడియా కానివి కూడా కొన్ని ఉన్నాయి.

ఏది వికిపీడీయా కాదు

వికిపీడీయా పుస్తక విజ్ఞాన సర్వస్వం కాదు

వికిపీడీయా పుస్తక విజ్ఞాన సర్వస్వం కాదు. ఇక్కడ వ్యాసాల సంఖ్యకు పరిమితి లేదు.

డయలప్ ఇంటర్నెట్ కనెక్షన్ను దృష్టిలో నుంచుకుని, వ్యాసపు సైజుకు కొన్ని పరిమితులున్నాయి. అలాగే అందరికీ వర్తించేలా చదవడానికి వీలయ్యే కొన్ని పరిమితులున్నాయి. వ్యాసం ఓ స్థాయికి పెరిగాక, దాన్ని వేరువేరు వ్యాసాలుగా విడగొట్టి, ప్రధాన వ్యాసంలో సారాంశాలను ఉంచడం వ్యాసం అభివృద్ధిలో ఓ భాగం. విజ్ఞాన సర్వస్వం పుస్తకాల్లో చిన్నవిగా ఉండే వ్యాసాలు ఇక్కడ విస్తారంగా, మరిన్ని విశేషాలతో కూడుకుని ఉండొచ్చు.

ఓ వ్యాస విషయానికి దగ్గరగా ఉన్న మరో విషయపు వ్యాసానికి దారిమార్పు చెయ్యాల్సిన అవసరం లేదు. దీని కోసం ప్రత్యేకంగా వ్యాసం రాసి, "ఇవి కూడా చూడండి" విభాగంలో రెండో వ్యాసపు లింకు ఇవ్వవచ్చు.

వికిపీడీయా ఒక నిఘంటువు కాదు

వికిపీడీయా ఒక నిఘంటువు కాదు లేదా ఓ పారిభాషిక పదకోశమూ కాదు. దీనికోసం వికీ సోదర ప్రాజెక్టు [1] ఉంది. మీకు ఆసక్తి ఉంటే విక్షనరీలో చేయూత నివ్వండి.సహాయం చేయండి. విక్షనరి కోసం ఇక్కడ చూడండి [[2]]

వికీపీడియా వ్యాసాలు:
  1. నిర్వచనాలు చెప్పే నిఘంటువు కాదు. వికీపీడియా నిఘంటువు కాదు కాబట్టి, కేవలం పదానికి నిర్వచనం రాసేందుకు గాను పేజీ సృష్టించకండి. కొన్ని విషయాలకు సంబంధించి వ్యాసం నిర్వచనంతోటే మొదలు కావాల్సి రావడం తప్పనిసరి కావచ్చు. నిర్వచనం తప్ప మరేమీ లేని వ్యాసం మీ దృష్టికి వచ్చినపుడు ఆ పేజీలో ఇంకేమైనా రాయగలరేమో చూడండి. సంఖ్యలకు ఇచ్చే సాంస్కృతిక అర్థాలు దీనికి మినహాయింపు.
  2. అలాంటి నిర్వచనాల జాబితా కూడా కాదు. అయితే, అయోమయ నివృత్తి కోసం ఒక పదానికి చెందిన సమానార్థకాల జాబితా పెట్టవచ్చు. కొన్ని ప్రత్యేక రంగాలకు సంబంధించిన పదాల కోశం కూడా వికీపీడియాలో పెట్టవచ్చు.
  3. వినియోగ మార్గదర్శిని గానీ, వాడుకపదాలు, జాతీయాల మార్గదర్శిని గానీ కాదు. వికీపీడియా పదాలను, జాతీయాలను ఎలా వాడాలో చెప్పే మార్గదర్శిని కాదు. ఎలా మాట్లాడాలో ప్రజలకు శిక్షణనిచ్చే స్థలం కాదు.

వికిపీడీయా ఒక వ్యక్తిగత ఆలోచన లేదా అభిప్రాయం కాదు

వికీపీడియా మీ ఆలోచనలు, అభిప్రాయాలు, విశ్లేషణలు ప్రచురించే స్థలం కాదు. వికీపీడియాలో కిందివి ఉండకూడదు:

  1. ప్రాథమిక (మౌలిక) పరిశోధన: కొత్త సిద్ధాంతాలు, పరిష్కారాల ప్రతిపాదన, కొత్త ఉపాయాలు, కొత్త నిర్వచనాలు, కొత్త పదాల సృష్టి వికీపీడియాలో కూడదు. వికీపీడియా:మౌలిక పరిశోధన కూడదు చూడండి. మీవద్ద అలాంటి మౌలిక పరిశోధన ఉంటే సమీక్ష కోసం దాన్ని తగిన పత్రికలు, వేదికలకు సమర్పించండి. సమీక్ష తరువాత అది విజ్ఞానంలో భాగంగా చేరితే అపుడు వికీపీడియా దానిపై వ్యాసాన్ని ప్రచురిస్తుంది.
  2. విమర్శనాత్మక సమీక్షలు: Biographies and articles about art works are supposed to be encyclopedia articles. Of course, critical analysis of art is welcome, if grounded in direct observations of outside parties. See No 5 below. See also Writing guide: check your fiction.
  3. వ్యక్తిగత వ్యాసావళి: వికీపీడియా ఏదైనా విషయంపై మీ అభిప్రాయాలు వెల్లడించే వేదిక కాదు. మీ అభిప్రాయాన్ని చేర్చాల్సిన అసాధారణ అవసరం ఏర్పడితే ఆ పనిని (మీరు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని వికీపీడియాలో రాసే పనిని) ఇతరులను చెయ్యనివ్వండి, మీరు చెయ్యకండి.
  4. ప్రస్తుత ఘటనలపై అభిప్రాయాలు: పై విషయానికే చెందిన ఓ ప్రత్యేక సందర్భం ఇది. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలపై మీ అభిప్రాయాలు ఇక్కడ వెల్లడించరాదు..
  5. చర్చా వేదికలు: ఇక్కడ మనం చేసే పని విజ్ఞాన సర్వస్వం తయారు చెయ్యడం. దానికి సంబంధించిన చర్చ కోసం సభ్యుల లేదా వ్యాసపు చర్చాపేజీలను వాడండి. అది కూడా వ్యాసాన్ని ఎలా మెరుగు పరచాలనే విషయానికే పరిమితం చెయ్యండి. ఏ చర్చనైనా వ్యాసాల్లో చెయ్యకండి.
  6. జర్నలిజము: వికీపీడియా ఎప్పటికప్పుడు వేడివేడిగా వార్తలందించే వార్తా వెబ్సైటు కాదు.

వికిపీడీయా ప్రచార వాహనం కాదు

వికీపీడియా ప్రచార వాహనం కాదు. కాబట్టి వికీపీడియా..

  1. ప్రచార వేదిక కాదు: వికీపీడియా ఎదైనా విషయాన్ని ప్రచారం చేసే వేదిక కాదు.
  2. సొంత డబ్బా కాదు: మీ గురించి, మీరేం చేసారు, చేస్తున్నారు, ఏయే ప్రాజెక్టుల్లో పని చేస్తున్నారు మొదలైనవి రాసుకునే వీలు వికీపీడియాలో ఉన్నప్పటికీ, అన్ని పేజీలకు లాగానే ఆ పేజీలు కూడా విజ్ఞాన సర్వస్వం ప్రమాణాలు పాటించాలని గుర్తుంచుకోండి. మరీ అతిగా లింకులు ఇచ్చుకోవడం వంటివి చెయ్యరాదు.
  3. వ్యాపార ప్రకటనా స్థలం కాదు: సంస్థలు, ఉత్పత్తుల గురించి వ్యాసాలు రాయవచ్చు. అయితే అవి నిష్పాక్షికంగా, విషయ ప్రధానంగా ఉండాలి. వ్యాసంలోని విషయాలన్నీ నిర్ధారణ చేసుకునేందుకు వీలుగా ఉండాలి. అంచేతనే, చిన్న చితకా సంస్థల గురించి రాసిన వ్యాసాలు ఆమోదయోగ్యం కాకపోవచ్చు. వ్యాస విషయానికి సంబంధించినవైతే సంస్థల వెబ్ సైట్లకు బయటి లింకులు కూడా ఇవ్వవచ్చు. వికీపీడియా ఏ వ్యాపార సంస్థకు గానీ, వ్యాపారానికి గానీ ప్రచారం చెయ్యదు.

వికీపీడియా ఇతర సైట్లకు మిర్రరు గానీ, లింకులు, బొమ్మలు, మీడియా ఫైళ్ళ ఖజానా గానీ కాదు

వికీపీడియా ఇతర సైట్లకు మిర్రరు గానీ, లింకులు, బొమ్మలు, మీడియా ఫైళ్ళ ఖజానా గానీ కాదు. ఇక్కడ తయారయ్యే ప్రతీ వ్యాసంలోను నిర్దాక్షిణ్యంగా మార్పు చేర్పులు చేసి తుది రూపుకు తీసుకురావాలి. ఇక్కడ మీరు ఏది రాసినా, దాన్ని GNU FDL కు అనుగుణంగా విడుదల చేస్తున్నట్లే. వికీపీడియా వ్యాసాలు..

  1. బయటి లింకుల సంగ్రహమో లేక ఇంటర్నెట్ డైరెక్టరీల సంగ్రహమో కాదు: వ్యాస విషయానికి సంబంధించిన లింకులను చేర్చడంలో తప్పేమీ లేదు. అయితే వ్యాసాన్ని మింగేసేలా అయితే మరీ ఎక్కువ లింకులు చేర్చకూడదు.
  2. అంతర్గత లింకుల సమాహారం కాదు: అయోమయ నివృత్తి పేజీలు తప్పించి ఏ పేజీ కూడా అంతర్గత లింకుల జాబితా లాగా ఉండకూడదు.
  3. సార్వజనికమైన వనరుల సంగ్రహం కాదు: ఉదాహరణకు చారిత్రక దస్తావేజులు, పుస్తకాలు, ఉత్తరాలు, చట్టాలు మొదలైన వాటి పూర్తి పాఠాల సంగ్రహం కాదు. అలంటి పూర్తి పాఠాలు పెట్టేందుకు అనువైన స్థలం వికీసోర్సు. అయితే ఈ సార్వజనిక వనరుల లోని విషయాలను వ్యాసాల్లో వాడుకోవచ్చు.
  4. ఏ వ్యాసానికీ సంబంధం లేని ఫోటోలు, బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళ సంగ్రహం కాదు: అలంటి వాటిని వికీమీడియా కామన్స్ లో పెట్టండి.

వికీపీడియా ఉచితంగా స్పేసు ఇచ్చే వెబ్ హోస్టు కాదు

వికీపీడియాలో మీ సొంత వెబ్ సైటు, బ్లాగు, వికీ మొదలైనవి పెట్టరాదు. వికీ టెక్నాలజీ వాడి ఏదైనా చెయ్యాలని మీకు ఆసక్తి ఉంటే దానికి చాలా సైట్లున్నాయి (ఉచితంగా గానీ, డబ్బులకు గానీ). అలాగే మీరే స్వంత సర్వరులో వికీ సాఫ్టువేరును స్థాపించుకోవచ్చు. వికీపీడియా..

  1. మీ వ్యక్తిగత పేజీలు కాదు: వికీపీడియనులకు తమ స్వంత పేజీలున్నాయి. కానీ వాటిని తమ వికీపీడియా పనికి సంబంధించిన వటికి మాత్రమే వాడాలి. వికీయేతర పనుల కోసం పేజీలు అవసరమైతే ఇంటర్నెట్లో దొరికే అనేక ఉచిత సేవలను వాడుకోండి.
  2. ఫైళ్ళు దాచిపెట్టుకునే స్థలం కాదు: వ్యాసాలకు అవసరమైన ఫైళ్ళను మాత్రమే అప్ లోడు చెయ్యండి; అలా కానివి ఏవైనా సరే తొలగిస్తాం. మీదగ్గర అదనంగా బొమ్మలుంటే వాటిని కామన్స్ లోకి అప్ లోడు చెయ్యండి, అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.

వికీపీడియా విచక్షణా రహితమైన సమాచార సంగ్రహం కాదు

వికీపీడియా విచక్షణా రహితమైన సమాచార సంగ్రహం కాదు. నూటికి నూరుపాళ్ళూ నిజమైన ప్రతి విషయమూ వికీపీడియాలో చేర్చదగినదేం కాదు. వికీపీడియా వ్యాసాలు..

  1. తరచూ అడిగే ప్రశ్నల జాబితాలు కాదు. వ్యాసాల్లో తరచూ అడిగే ప్రశ్నల జాబితాలు చేర్చరాదు. దాని బదులు, అదే సమాచారాన్ని ఓ పద్ధతిలో వ్యాసంగా అమర్చండి.
  2. అనేక చిన్న చిన్న విషయాలను గుదిగుచ్చి చూపించే సంగ్రహం కాదు: సూక్తులు, గొప్పవారి ఉటంకింపులు, ఉల్లేఖనలు మొదలైన వాటి ఏరి కూర్చి పెట్టే సంగ్రహం కాదు.
  3. ప్రయాణ మార్గదర్శిని కాదు: విశాఖపట్టణం వ్యాసంలో దాల్ఫిన్స్ నోస్ గురించి, రామకృష్ణా బీచ్ గురించి ఉండొచ్చు. అంతేగానీ, అక్కడ ఏ హోటల్లో గది అద్దెలు తక్కువగా ఉంటాయి, భోజనం ఎక్కడ బాగుంటుంది, ఫలానా చోటికి వెళ్ళాలంటే ఏ నంబరు బస్సెక్కాలి ఇలాంటివి ఉండకూడదు.
  4. జ్ఞాపికలు రాసుకునే స్థలం కాదు: సన్నిహితుల మరణం దుస్సహమే. కానీ అంతమాత్రాన వికీపీడియా వాళ్ళ జ్ఞాపకాలను, సంతాప తీర్మానాలను రాసుకునే స్థలం కాదు. వారి గురించి వ్యాసం రాయాలంటే, దానికి తగ్గ ప్రఖ్యాతి కలిగి ఉండాలి.
  5. వార్తా నివేదికలు కాదు: వికీపీడియా వేడివేడిగా వార్తలందించే పత్రిక కాదు.
  6. టెలిఫోను డైరెక్టరీ కాదు: వ్యక్తుల గురించి వికీపీడియాలో రాయాలంటే వారికి అందుకు తగ్గ పేరుప్రఖ్యాతులు, గుర్తింపు ఉండాలి.
  7. వ్యాపార విశేషాలు తెలియజేసే డైరెక్టరీ కాదు: ఏదైనా టెలివిజను చానలు గురించిన వ్యాసం ఉందనుకోండి. ఆ చానల్లో ఏ సమయానికి ఏ కార్యక్రమం వస్తుందో జాబితా తయారు చేసి పెట్టరాదన్న మాట. ముఖ్యమైన కార్యక్రమాల గురించి రాయవచ్చు కానీ మొత్తం కార్యక్రమాల జాబితా ఇవ్వరాదు.

వికీపీడియా భవిష్యత్తు చూసే మాయాదర్పణం కాదు

భావి ఘటనలు విజ్ఞాన సర్వస్వంలో భాగం కావు. జరిగేదాకా అసలవి జరుగుతాయో లేదో చెప్పలేని ఘటనలైతే మరీను.

  1. ఘటనా క్రమాన్ని ముందే నిర్ణయించినంత మాత్రాన ఆ ఘటనలు వ్యాసాలుగా పనికిరావు: ఉదాహరణకు 2028 ఒలింపిక్స్ ఇప్పటి నుండే గురించిన వ్యాసం సమంజసంగా ఉండదు. వచ్చే సంవత్సరం కూడా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అన్నంత ఖచ్చితంగా జరిగే ఘటనల గురించి రాయవచ్చేమోగానీ, ఇలాంటి విషయాల మీద వ్యాసాలు కూడదు.
  2. అలాగే భవిష్యత్తులో ఫలానా ఘటన జరిగితే ఈ పేరు పెడదాం అని ముందే పేర్లు నిర్ణయించుకుని పెట్టే విషయాలు కొన్ని ఉన్నాయి. అలాంటి విషయాలకు వ్యాసాలు రాయరాదు. ఉదాహరణకు తుపానులకు పేర్లు పెట్టే పద్ధతి. 2010లో వచ్చే తుపానులకు ఈయీ పేర్లు పెడదాం అని ముందే పేర్ల జాబితా తయారు చేసి పెట్టుకుంటారు. ఎలాగూ పేర్లు పెట్టేసారు కదా అని వ్యాసాలు రాసెయ్యకూడదు.
  3. భవిష్యత్తు గురించిన లెక్కలు, ఊహలు, "భవిష్యత్తు చరిత్రల" గురించి చెప్పే రచనలు వికీపీడియాలో కూడవు. ఇవి మౌలిక పరిశోధన కిందకి వస్తాయి. అయితే అలాంటి తార్కిక, సంబద్ధ వ్యాసాల గురించి వికీపీడియాలో రాయవచ్చు. స్టార్ వార్స్ గురించి వ్యాసం రాయవచ్చు కానీ "నాలుగో ప్రపంచ యుద్ధంలో వాడబోయే ఆయుధాలు" అనే వ్యాసానికిక్కడ చోటులేదు.

పిల్లల కోసం వికీపీడియాను సెన్సారు చెయ్యం

వికీపీడియాలో ఉండే కొన్ని వ్యాసాలు కొందరు పాఠకులకు అభ్యంతరకరంగా ఉండవచ్చు. ఇక్కడి వ్యాసాలను ఎవరైనా సరిదిద్దవచ్చు. ఆ దిద్దుబాట్లు వెంటనే వ్యాసంలో కనిపిస్తాయి. అంచేత ఆయా వ్యాసాల్లో కనిపించే విషయాలు పిల్లలు చదివేందుకు అనుగుణంగా ఉంటాయని చెప్పలేం. అనుచితమైన విషయాలు దృష్టికి వెనువెంటనే తీసెయ్యడం జరుగుతుంది. అయితే శృంగారం, బూతు మొదలైనవి విజ్ఞాన సర్వస్వంలో భాగమే కాబట్టి, అలాంటి విషయాలపై వ్యాసాలు ఉండే అవకాశం లేకపోలేదు.

What the Wikipedia community is not

వికిపీడీయా యుద్ద సంగ్రామ స్థలం కాదు

ప్రతీ సభ్యుడు తన సహ సభ్యులతో సంయమనం తొ వ్యవహరించాలి.నాగరికతతో, సంయమనంతో, సభ్యతతో వ్యవహరించాలి మరియు సహకరించు కొవాలి. వికిపీడీయాలొ మిగతా సభ్యులతో ఏకీభవించని పక్షంలొ తన సహ సభ్యులపై దుశ్చర్యలు చేయరాదు,దూషించరాదు, పరుషవాక్యలు,వ్యక్తిగత నింద చేయరాదు లేదా వ్రాయరాదు. ఏకీభవించని విషయాన్ని చాకచక్యంతో, ఋజువులతో నిరుపించుకోవాలి చర్చించు కొవాలి.చర్చించిన విషయం మీద ఒక నిర్ణయానికి రావాలి. Do not create or modify articles just to prove a point. Do not make legal or other threats against Wikipedia, Wikipedians, or the Wikimedia Foundation 3. Threats are not tolerated and may result in a ban. See also Wikipedia:Dispute resolution.

వికిపీడీయా-అరాచకం

వికిపీడీయా లొ మార్పులు చేర్పులు చేయడానికి అందరికి అవకాశం ఉంటుంది, కాని కొన్ని సందర్భాలలొ మార్పులు చేయడాన్ని నియంత్రించవచ్చు లేదా నిరొధించవచ్చు. ఇది వివాదాస్పద అంశాలకు ప్రత్యేకంగా వర్తిస్తుంది.వికిపీడీయా ఒక స్వయం నియంత్రణ వ్యవస్థ.అయితే ఇది సభ్యులు ఒక అంశం లేదా ఒక విషయం మీద తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే చర్చా వేదిక కాదు.వికిపీడీయా ను అందరి సహాయం తొ విజ్ఞాన సర్వస్వ భాండాగారం క్రింద తయారు చేసే ఉద్దేశం తో ప్రారంభించారు. చర్చా వేదిక కోసమైతే ఇక్కడ చూడంది.వికీ పోర్క్ ను వాడండి. Anarchopedia. ఇది కూడా చూడండి పవర్

వికిపీడీయా - ప్రజాస్వామ్యం

Wikipedia is not an experiment in democracy. Its primary method of finding consensus is discussion, not voting. That is, majority opinion does not necessarily rule in Wikipedia. Various votes are regularly conducted, but their numerical results are usually only one of several means of making a decision. The discussions that accompany the voting processes are crucial means of reaching consensus. For example, a very important Wikipedia process is reaching consensus on what articles are not encyclopedic and should be deleted from Wikipedia entirely. The discussion by which that consensus is reached occurs in the context of a "vote" on the Wikipedia:Votes for deletion page.

Wikipedia is not a bureaucracy

Disagreements should be resolved through consensual discussion, rather than through tightly sticking to rules and procedures. Instruction creep should be avoided. A perceived procedural error made in posting anything, such as an idea or nomination, is not grounds for invalidating that post. Follow the spirit, not the letter, of any rules, policies and guidelines.

When you wonder what to do

  • When you wonder what should or should not be in an article named "whatever", ask yourself what a reader would expect under "whatever" in an encyclopedia. For examples of what kinds of articles people consider to be encyclopedic, see Wikipedia:Votes for deletion/Precedents and Wikipedia:What's in, what's out.
  • When you wonder whether the rules given above are being violated, consider:
    • Changing the content of an article (normal editing)
    • Changing the page into a redirect, preserving the page history
    • Nominating the page for deletion on Wikipedia:Votes for deletion if it meets grounds for such action under the Wikipedia:Deletion policy page. To develop an understanding of what kinds of contributions are in danger of being deleted you have to regularly follow discussions there.
    • Changing the rules on this page after a consensus has been reached following appropriate discussion with other Wikipedians via the Talk page. When adding new options, please be as clear as possible and provide counter-examples of similar, but permitted, subjects.

Notes

Note 1: While this page is intended to record policies that are firmly established, it continues to evolve. If you wish to quote it in a discussion, please be sure to check the latest version.

Note 2: Note that Wikipedia incorporates many images and some text which are considered "fair use" into its GFDLed articles. See also Wikipedia:Copyrights.

Note 3: If you believe that your legal rights are being violated, you may discuss this with other users involved, take the matter to the appropriate mailing list, contact the Wikimedia Foundation, or in cases of copyright violations notify us here.

See also