రాణి కీ వావ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9: పంక్తి 9:

==శిల్పకళా శోభితమైన గోడలు==
==శిల్పకళా శోభితమైన గోడలు==
ఈ బావి 209 అడుగుల పొడవు, 65 అడుగుల వెడల్పు, 88 అడుగుల లోతుతో చూడ్డానికి ఓ భూగర్భ కోటలా ఉంటుంది. రాతితో నిర్మించిన దీంట్లో ఎటుచూసినా స్తంభాలపై శిల్ప సంపద ఉట్టి పడుతుంది. రాణి కీ వావ్ బావి నిర్మాణంలో శిల్పకళకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు, ఈ శిల్పాలలో విష్ణువు యొక్క దశవతారాలైన కల్కి, రామ, నరసింహ, వామన, వారాహి శిల్పాలు, మహిషాసురమర్ధిని మాత శిల్పాలు, నాగకన్య, యోగిని వంటి అందమైన స్త్రీల శిల్పాలు, సోలా శృంగారం అని పిలవబడే 16 రకాల శైలులగా ఆకర్షణీయంగా కనిపించే అప్సర శిల్పాలు ఉన్నాయి.
ఈ బావి 209 అడుగుల పొడవు, 65 అడుగుల వెడల్పు, 88 అడుగుల లోతుతో చూడ్డానికి ఓ భూగర్భ కోటలా ఉంటుంది. రాతితో నిర్మించిన దీంట్లో ఎటుచూసినా స్తంభాలపై శిల్ప సంపద ఉట్టి పడుతుంది. రాణి కీ వావ్ బావి నిర్మాణంలో శిల్పకళకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు, ఈ శిల్పాలలో విష్ణువు యొక్క దశవతారాలైన కల్కి, రామ, నరసింహ, వామన, వారాహి శిల్పాలు, మహిషాసురమర్ధిని మాత శిల్పాలు, నాగకన్య, యోగిని వంటి అందమైన స్త్రీల శిల్పాలు, సోలా శృంగారం అని పిలవబడే 16 రకాల శైలులగా ఆకర్షణీయంగా కనిపించే అప్సర శిల్పాలు ఉన్నాయి. ఈ బావి అడుగున ఓ సొరంగం ఉందని, అది 28 కిలోమీటర్ల పొడవు ఉండేదని ఇప్పుడు మట్టితో నిండిందని చెబుతారు. ఇప్పుడు బావి అడుగున కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయి. దీన్ని రోజూ వేలాది సంఖ్యలో దేశవిదేశీ పర్యాటకులు సందర్శిస్తుంటారు.

==చిత్రమాలిక==
==చిత్రమాలిక==
పంక్తి 18: పంక్తి 18:

==మూలాలు==
==మూలాలు==
సాక్షి దినపత్రిక - 23-06-2014
సాక్షి దినపత్రిక - 23-06-2014<br />
ఈనాడు దినపత్రిక - 29-06-2014
{{commons category|Rani ki vav|రాణి కీ వావ్}}
{{commons category|Rani ki vav|రాణి కీ వావ్}}

06:13, 29 జూన్ 2014 నాటి కూర్పు

రాణి కీ వావ్

గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలో ఉన్న చారిత్రక ఏడు భూగర్భ అంతస్తుల బావి రాణి కి వావ్. ఈ బావికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల ( వరల్డ్ హెరిటేజ్ సైట్స్) జాజితాలో చోటు దక్కింది. 11 వ శతాబ్దంలో నిర్మించిన ఈ బావిని పఠాన్ రాజు సిద్ధార్థజైసింగ్ నిర్మించారు. ఇందులో గంగాదేవి ఆలయం కూడా నిర్మించారు. ఖతార్‌లోని దోహాలో జరిగిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో యునెస్కో ఈ బావిని ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చినట్లు ప్రకటించింది. ఒకే నిర్మాణం కింద భూగర్భ నీటి వనరులను వాడుకోవడంలో నాటి సాంకేతిక అభివృద్ధికి రాణి కీ వావ్ అత్యద్భుత నిదర్శనంగా నిలిచిందని, భారత్‌లో నాటి ప్రత్యేక భూగర్భ నిర్మాణ కౌశలానికి, కళాత్మకతకు ఇది ఒక ఉదాహరణ అని ఈ సమావేశంలో యునెస్కో కొనియాడింది.

చరిత్ర

క్రీ.శ 1022 - 1063 మధ్యన రాణి ఉదయమతి ఈ బావిని కట్టించారు. సోలంకి రాజ్యాన్ని పాలించిన తన భర్త, రాజు ఒకటో భీందేవ్ గుర్తుగా ఈ బావిని నిర్మించారు. తొమ్మిది వందల ఏళ్లకు పైగా ఘన చరిత్ర ఉన్న ఈ బావి అప్పట్లో సరస్వతి నదికి వచ్చిన వరదల వల్ల మట్టిలో కూరుకుపోయింది.

బాగోగులు

దాదాపు ఏడు శతాబ్దాలపాటు వరదలకు మట్టిలో కూరుకుపోయిన ఈ బావిని 1980ల్లో భారత పురావస్తుశాఖ వారు గుర్తించి అది పాడవకుండా తగిన చర్యలు చేపట్టారు.

శిల్పకళా శోభితమైన గోడలు

ఈ బావి 209 అడుగుల పొడవు, 65 అడుగుల వెడల్పు, 88 అడుగుల లోతుతో చూడ్డానికి ఓ భూగర్భ కోటలా ఉంటుంది. రాతితో నిర్మించిన దీంట్లో ఎటుచూసినా స్తంభాలపై శిల్ప సంపద ఉట్టి పడుతుంది. రాణి కీ వావ్ బావి నిర్మాణంలో శిల్పకళకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు, ఈ శిల్పాలలో విష్ణువు యొక్క దశవతారాలైన కల్కి, రామ, నరసింహ, వామన, వారాహి శిల్పాలు, మహిషాసురమర్ధిని మాత శిల్పాలు, నాగకన్య, యోగిని వంటి అందమైన స్త్రీల శిల్పాలు, సోలా శృంగారం అని పిలవబడే 16 రకాల శైలులగా ఆకర్షణీయంగా కనిపించే అప్సర శిల్పాలు ఉన్నాయి. ఈ బావి అడుగున ఓ సొరంగం ఉందని, అది 28 కిలోమీటర్ల పొడవు ఉండేదని ఇప్పుడు మట్టితో నిండిందని చెబుతారు. ఇప్పుడు బావి అడుగున కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయి. దీన్ని రోజూ వేలాది సంఖ్యలో దేశవిదేశీ పర్యాటకులు సందర్శిస్తుంటారు.

చిత్రమాలిక

మూలాలు

సాక్షి దినపత్రిక - 23-06-2014
ఈనాడు దినపత్రిక - 29-06-2014