కాశీయాత్ర చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
పంక్తి 31: పంక్తి 31:




{{వికీసోర్స్|కాశీయాత్ర చరిత్ర}}
==బయటి లింకులు==
==బయటి లింకులు==
*[http://ia331330.us.archive.org/3/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf కాశీయాత్రచరిత్ర పూర్తి పుస్తకం పీడిఎఫ్]
*[http://ia331330.us.archive.org/3/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf కాశీయాత్రచరిత్ర పూర్తి పుస్తకం పీడిఎఫ్]

11:08, 4 జూలై 2014 నాటి కూర్పు

1869 ముద్రణ ముఖచిత్ర పరిచయం
దిగవల్లి వేంకటశివరావు సంపాదకత్వంతో 1941లో ముద్రింపబడిన ప్రతి, మరల 1991లో ముద్రింపబడింది
ముక్తేవి లక్ష్మణరావు సంపాదకత్వంతో సంక్షిప్తీకరింపబడిన ప్రతి (తెలుగు విశ్వవిద్యాలయం)

కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్యానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి 3 సెప్టెంబరు, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.

ఏనుగుల వీరాస్వామయ్య

కాశీయాత్ర చరిత్ర రచన ప్రాముఖ్యత

యాత్రా క్రమం, విశేషాలు

  • అప్పటికి (1831-1832) బ్రిటిషు వారు ఇంకా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకోలేదు. కాబట్టి కొంత భాగం సంస్థానాలలో రాజు ల క్రింద ఉండేది.
  • ఆనాటి వాడుకభాషలో సమకాలీన జీవిత దౌర్భాగ్యాలను, తన పోషకుల వంచనాశిల్పాన్ని, తన బలహీనతలనూ నిర్వికారంగా వ్రాయగలిగాడు.
  • అప్పటి సంస్థానాలలో, ఇంగ్లీషు రాజ్యభాగాలలో, పౌరోహిత్యంలో ఎన్ని విధాల మోసం, లంచగొండితనం, అవినీతి ఉన్నాయో దాపరికం లేకుండా వ్రాశాడు.
  • విలియం బెంటింగ్ రాజప్రతినిధులు ఎన్ని విధాల, ఎన్ని కుమార్గాలలో స్వదేశీ సంస్థానాలను క్రమంగా ఆక్రమించుకొంటున్నారో, దేశంలో జమిందారుల, దోపిడీ దొంగల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో, సామాన్య ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురౌతున్నారో మొహమాటం లేకుండా వ్రాశాడు.
  • కొన్ని ప్రదేశాలలో కుల, మత, ప్రాంత భేదాలు ఎన్ని అనర్ధాలు తెచ్చిపెడుతున్నాయో, భిన్న ప్రాంతాలలో ఆర్ధిక పరిస్థితులెలా ఉన్నాయో చిత్రీకరించాడు.
  • పుప్పాడ లోని బెస్తలు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎలా అప్పులపాలైనారో వివరించాడు.

రచన నుండి కొన్ని ఉదాహరణలు

రచయిత వాడిన పదాలు

ముద్రణలు

  • చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సలహాలు ఉత్తరాల ద్వారా పొందిన వీరాస్వామి యాత్రా చరిత్రను ఆయన మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై మొదటిసారిగా 1838 లో ముద్రించాడు.
  • ఈ గ్రంథం 1869 లో ద్వితీయ ముద్రణ పొందింది.
  • ఈ గ్రంథం 1941 లో దిగవల్లి వేంకట శివరావు అనేక వివరణలతో ప్రచురించాడు. ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు బెజవాడలో తిరిగి ముద్రించారు.

మూలాలు, వనరులు


Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:

బయటి లింకులు