Coordinates: Coordinates: Unknown argument format

మదనపల్లె: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొద్ది విస్తరణ
పంక్తి 24: పంక్తి 24:
[[File:Madana 022.jpg|thumb|మదనపల్లె]]
[[File:Madana 022.jpg|thumb|మదనపల్లె]]
== చరిత్ర ==
== చరిత్ర ==
మదనపల్లె చరిత్ర క్రీ.శ. 907 వరకూ తెలుస్తోంది. ఈ కాలంలో చోళ సామ్రాజ్యపు భాగంగా తెలుస్తోంది. ఈ పట్టణంలో గల సిపాయి వీధి, కోట గడ్డ, అగడ్త వీధి, మరియు పలు ప్రాంతాలు ఇక్కడ ఒకానొకప్పుడు ప్రముఖ రాజులు పరిపాలించినట్లు తెలుస్తోంది.

మదనపల్లె ఒకప్పుడు విజయనగర పాలేగార్లయిన బసన్న మరియు మాదెన్న లచే పాలిమ్పబదినట్లు తెలుస్తోంది. వీరి పేర్ల మీద ఇక్క రెండు కొండలున్నాయి, ఒకటి మాదెన్న కొండ, రెండవది బసన్న కొండ. బహుశా మాదెన్న పేరుమీదే ఈ పట్టణానికి మదనపల్లె పేరు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇంకో కథనం ప్రకారం, ఈ పట్టణానికి మర్యాదరామన్న పురం అనే పేరు ఉండేదని, రాను రాను అది మదనపల్లె గా రూపాంతరం చెందినట్లుగా చెబుతారు. అలాగే ఒకానొకప్పుడు అరేబియాలోని మదీనా నగరం నుండి కొందరు ధార్మిక వేత్తలు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని, వారి పేరున మదీనావారి పల్లె అనే పేరు ఉండేదని, తరువాత రూపాంతరం చెంది అది మదనపల్లె గా స్థిరపడిందని చెబుతారు.

907 – 955, మధ్యన యాదవనాయకులు మరియు హొయసలులు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే సమయంలో ఈ పట్టణం వారి ఆధీనంలో ఉండేది. ఆతరువాత 1565 లో గోల్కొండ నవాబు ఆధీనంలో వెళ్ళింది. 1713, లో కడప నవాబైన అబ్దుల్ నబి ఖాన్ మదనపల్లెని తన ఆధీనంలో తీసుకున్నాడు. మదనపల్లె కడప ప్రాంతంలో వుండేది.
ఆ తరువాతి కాలంలో ఇది బ్రిటిష్ వారి ఆధీనంలో వెళ్ళింది. దీని ఆనవాళ్ళు నేటికీ కానవస్తాయి. సబ్-కలెక్టర్ బంగళా, కోర్టు, మొదలగు కట్టడాలు వీటికి ఆనవాళ్ళు.
[[:en:Sir Thomas Munro|సర్ థామస్ మన్రో ]] కడప యొక్క మొదటి కలెక్టరు. ఇతని కాలంలో ఇక్కడ కలెక్టరు బంగళా నిర్మించారు. 1850 లో మదనపల్లె సబ్-డివిజన్ గా ఏర్పడింది. [[:en:F.B.Manoly|ఎఫ్.బి.మనోలె]] మొదటి సబ్-కలెక్టరు. was the first Sub Collector. The town experienced several natural calamities like floods, famines and epidemics.


== మదనపల్లె గురించి ==
== మదనపల్లె గురించి ==

20:05, 6 జూలై 2014 నాటి కూర్పు


మదనపల్లె
—  మండలం  —
చిత్తూరు పటంలో మదనపల్లె మండలం స్థానం
చిత్తూరు పటంలో మదనపల్లె మండలం స్థానం
చిత్తూరు పటంలో మదనపల్లె మండలం స్థానం
మదనపల్లె is located in Andhra Pradesh
మదనపల్లె
మదనపల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో మదనపల్లె స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండల కేంద్రం మదనపల్లె
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 1,90,512
 - పురుషులు 96,968
 - స్త్రీలు 93,544
అక్షరాస్యత (2001)
 - మొత్తం 69.11%
 - పురుషులు 78.97%
 - స్త్రీలు 58.95%
పిన్‌కోడ్ {{{pincode}}}

మదనపల్లె, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము.

మదనపల్లె

చరిత్ర

మదనపల్లె చరిత్ర క్రీ.శ. 907 వరకూ తెలుస్తోంది. ఈ కాలంలో చోళ సామ్రాజ్యపు భాగంగా తెలుస్తోంది. ఈ పట్టణంలో గల సిపాయి వీధి, కోట గడ్డ, అగడ్త వీధి, మరియు పలు ప్రాంతాలు ఇక్కడ ఒకానొకప్పుడు ప్రముఖ రాజులు పరిపాలించినట్లు తెలుస్తోంది.

మదనపల్లె ఒకప్పుడు విజయనగర పాలేగార్లయిన బసన్న మరియు మాదెన్న లచే పాలిమ్పబదినట్లు తెలుస్తోంది. వీరి పేర్ల మీద ఇక్క రెండు కొండలున్నాయి, ఒకటి మాదెన్న కొండ, రెండవది బసన్న కొండ. బహుశా మాదెన్న పేరుమీదే ఈ పట్టణానికి మదనపల్లె పేరు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకో కథనం ప్రకారం, ఈ పట్టణానికి మర్యాదరామన్న పురం అనే పేరు ఉండేదని, రాను రాను అది మదనపల్లె గా రూపాంతరం చెందినట్లుగా చెబుతారు. అలాగే ఒకానొకప్పుడు అరేబియాలోని మదీనా నగరం నుండి కొందరు ధార్మిక వేత్తలు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని, వారి పేరున మదీనావారి పల్లె అనే పేరు ఉండేదని, తరువాత రూపాంతరం చెంది అది మదనపల్లె గా స్థిరపడిందని చెబుతారు.

907 – 955, మధ్యన యాదవనాయకులు మరియు హొయసలులు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే సమయంలో ఈ పట్టణం వారి ఆధీనంలో ఉండేది. ఆతరువాత 1565 లో గోల్కొండ నవాబు ఆధీనంలో వెళ్ళింది. 1713, లో కడప నవాబైన అబ్దుల్ నబి ఖాన్ మదనపల్లెని తన ఆధీనంలో తీసుకున్నాడు. మదనపల్లె కడప ప్రాంతంలో వుండేది. ఆ తరువాతి కాలంలో ఇది బ్రిటిష్ వారి ఆధీనంలో వెళ్ళింది. దీని ఆనవాళ్ళు నేటికీ కానవస్తాయి. సబ్-కలెక్టర్ బంగళా, కోర్టు, మొదలగు కట్టడాలు వీటికి ఆనవాళ్ళు. సర్ థామస్ మన్రో కడప యొక్క మొదటి కలెక్టరు. ఇతని కాలంలో ఇక్కడ కలెక్టరు బంగళా నిర్మించారు. 1850 లో మదనపల్లె సబ్-డివిజన్ గా ఏర్పడింది. ఎఫ్.బి.మనోలె మొదటి సబ్-కలెక్టరు. was the first Sub Collector. The town experienced several natural calamities like floods, famines and epidemics.

మదనపల్లె గురించి

మదనపల్లి అను మండలం ఆంధ్రప్రదేశ్ అను రాష్ర్టంలోని చిత్తూరు జిల్లాలో ఉన్నది. ఇవన్నీ మదనపల్లె గురించి:

వాతావరణం

మదనపల్లె వాతావరణము వేసవిలో సైతం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే దీనికి ఆంధ్ర ఊటీ అనే పేరు కలదు. ప్రతి ఉద్యోగి పదవీవిరమణ తరువాత ఇక్కడ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటాడు. పెన్షనర్ల స్వర్గం గా కూడా ప్రసిధ్ధి.

ముఖ్యమైన ప్రదేశాలు

  • హార్సిలీ హిల్స్- ఆంధ్రరాష్ట్రంలో ప్రసిధ్ధి చెందిన(ఆంధ్రా ఊటీ అని పిలువబడే) వేసవి విడిది ప్రాంతము. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి అధికారిక వేసవి విడిది కేంద్రము.
  • బోయ కొండ- ప్రసిధ్ధి చెందిన గంగమ్మ క్షేత్రము.
  • బసిని కొండ- వెంకటేశ్వర స్వామి గుడి కలిగిన ఒక కొండ. గుడి సమీపంలో వెంకటేశ్వరస్వామి పాదాలు కూడా (రాతిలో చెక్కబడి)ఉన్నాయి. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ప్రతి శనివారం ఈ కొండను ఎక్కి గుడిలో పూజలు చేయడం మదనపల్లెవాసులకు ఆనవాయితీ. హార్సిలీహిల్స్ నుంచి బసినికొండ దూరదర్శినిలో కనిపిస్తుంది.
  • సోంపాళెం
  • రిషి వ్యాలీ - జిడ్డు కృష్ణమూర్తిగారు స్థాపించిన విశ్వప్రసిధ్ధి చెందిన పాఠశాల. ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు విడిది మరియు భోజన సదుపాయాలు కలవు. ఇక్కడ విధ్యార్థులకు విద్యతోపాటు శారీరిక, మానసిక వికాసం కలిగే విధంగా విధ్యాభోధన జరుగుతుంది.
  • ఆరోగ్యవరం(శానిటోరియం)-దేశప్రసిధ్ధి చెందిన క్షయవ్యాధిగ్రస్థుల ఆరోగ్యకేంద్రము. పూర్వము అన్ని ప్రదేశాలలో క్షయవ్యాధికి వైద్యసదుపాయాలు లేనప్పుడు, దేశం నలుమూలలనుండి సామాన్యులూ, ప్రముఖులెందరో ఇక్కడకు వచ్చి వైద్యం చేయించుకున్నారు.
  • బెసెంట్ థియొసాఫికల్ కాలేజి(దివ్యజ్ఞాన కళాశాల)- దక్షిణాంధ్రంలో మొదటి కళాశాల. డా.అనీ బెసెంట్ పేరున స్థాపించబడింది.
  • "ధ్యాన మందిరము" - ప్రముఖ ఆధ్యాత్మిక వాది, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ మహేశ్ యోగిచే ప్రారంభించబడినది.
  • ఠాగూర్ కాటేజీ
  • నీరుగట్టుపల్లె- నాణ్యమైన జరీచీరలకు ప్రసిధ్ధి.

ప్రముఖ వ్యక్తులు

  • యల్లపల్లె విద్యాసాగర్ - సీనీయర్ పాత్రికేయులు
  • నూర్అబ్దుల్ ర్రహమాన్ ఖాన్ : "అఖండ్ భారతీయఅవాజ్" జాతీయ రాజకీయ పార్టీ వ్యవస్తాపక ప్రధానకార్యదర్శి, వీరు B T కాలేజీలో చదివారు, మరియు నేదురుమల్లి జనార్ధన రెడ్డి ప్రభుత్వం పరీక్షల ఫీజులు పెంచిన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతికంగా విద్యార్తుల వైపు నుంచి నాయకత్వం వహించి నిరహరదీక్షలో పాల్గొన్నారు.
  • సి.సుదర్శనరెడ్డి కర్నూలు జిల్లా కలక్టర్

రాజకీయాలు

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభ 2 దశకాలలో, మదనపల్లెలో కమ్యూనిస్టు పార్టీ ప్రాబల్యం వుండేది. ప్రస్తుతం. పట్టణ ప్రాంతములో కాంగ్రెస్ పార్టీ పట్టు మరియు గ్రామీణ ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ పట్టు కలిగివున్నాయి.

  • పార్లమెంటు నియోజకవర్గం : రాజంపేట, ప్రస్తుత ఎం.పి. : ఎ.సాయిప్రతాప్ (కాంగ్రెస్ పార్టీ)
  • అసెంబ్లీ నియోజకవర్గం : (283) 'మదనపల్లె', ప్రస్తుత ఎం.ఎల్.ఎ. : షాజహాఁ బాషా (కాంగ్రెస్ పార్టీ)
  • మునిసిపాలిటి : మదనపల్లె. ప్రస్తుత ఛైర్ పర్సన్: ఎన్. రవికుమార్ (కాంగ్రెస్ పార్టీ)

మదనపల్లె నాటక కళాపరిషత్‌

35 ఏళ్ళ కిందట మదనపల్లె నాటక కళాపరిషత్‌ ఏర్పాటైంది. ఇందులో రిటైర్డ్‌ జిల్లా న్యాయమూర్తి జయరామిరెడ్డి న్యాయవాదులు బోయపాటి సుబ్బయ్యనాయుడు, లక్ష్మీకాంతం, బి.నర్సింహులు, పార్థసారధి, కాంట్రాక్టర్లు రామన్న, కిట్టన్న, పెరవళి కృష్ణమూర్తి, అశ్వర్థనారాయణ, జర్నలిస్టు పురాణం త్యాగమూర్తి శర్మ, గాయకుడు పత్తి రెడ్డన్న, ఫోటోగ్రాఫర్‌ బి.నారాయణశర్మ, ఉపాధ్యాయులు ఎ.సుబ్రమణ్యం, ఉద్యోగి జివి రమణలు కీలకపాత్ర పోషించారు. వీరు సభ్యులుగా, నటులుగా ఎన్నో నాటకాలు వేశారు. నెల్లూరు కు చెందిన నెప్జా నాటక కళాపరిషత్‌, ప్రొద్దుటూరు కు చెందిన రాయల నాటక కళాపరిషత్‌ అనంతపురము కు చెందిన పరిత కళాపరిషత్‌, చిత్తూరు కు చెందిన ఆర్ట్స్ లవర్‌ అసోసియేషన్‌ నిర్వహించే నాటక పోటీల్లో మదనపల్లె నాటక కళా పరిషత్‌ పాల్గొంటూ ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు. మదనపల్లె నాటక రంగంలో ప్రధానంగా పల్లెపడుచు, భక్త రామదాసు, వెంకన్న కాపురం, ఎవరు దొంగ, కప్పలు తదితర సాంఘిక, చారిత్రాత్మక నాటకాలను వేశారు. మదనపల్లె జిఆర్‌టి హై స్కూల్‌లో రోజుకు నాలుగు దాకా నాటకాలు వేశేవారు. పోటీలు నిర్వహించి వారం రోజుల పాటు నిరవధికంగా నాటకాలు వేసేవారు. నాటకాల్లో మహిళా పాత్రదారులు గూడూరు సావిత్రి, సీతారామమ్మ, రాజేశ్వరీ తదితరులు వచ్చేవారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించేది.

అంజుమన్ తరఖి ఉర్దూ (మదనపల్లె శాఖ)

22 సంవత్సరాల క్రిందట అంజుమన్ తరఖి ఉర్దూ శాఖ ఏర్పాటైంది. ఇందులో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గులాందస్తగీర్, సయ్యద్ అబ్దుల్ అజీం, నిసార్ అహ్మద్ సయ్యద్, ఖాదర్ హుసేన్ లు కీలక పాత్ర పోషించారు. ఖమర్ అమీనీ, జవాహర్ హుసేన్, అడ్వకేట్ నజీర్ అహ్మద్, షరాఫత్ అలీ ఖాన్, అడ్వకేట్ సికందర్ అలీ ఖాన్, హాజీ ముహమ్మద్ ఖాన్, ఖాజీ ముహమ్మద్ షాకిరుల్లా మరియు మహమ్మద్ అక్రం లు తమవంతూ కృషి చేశారు. ఉర్దూ భాషాభి వృధ్ధికి, సాహిత్యపోషణకు ఎన్నో పోటీలను వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ముషాయిరా లు (కవిసమ్మేళనాలు), సెమినార్లు నిర్వహించారు. మదనపల్లెలో ముషాయిరాల సాంప్రదాయం సయ్యద్ అబ్దుల్ అజీం మరియు గులాం దస్తగీర్ ఆధ్వర్యంలో ప్రారంభమయినాయి. నిసార్ అహ్మద్ సయ్యద్ మరియు ఖమీర్ అమీనీ ల ఆధ్వర్యంలో జీవంపోసుకున్నాయి.

మతపరమైన విషయాలు

మదనపల్లె పట్టణం సార్వజనీయ పట్టణం. విద్యాధికులు గల పట్టణం. హిందువులూ, ముస్లింలూ మరియు క్రైస్తవులు కలసి సుఖశాంతులతో జీవించే పట్టణం. ఈ పట్టణం ఆంధ్రప్రదేశ్ కే ఆదర్శం. ఇచట శ్రీ వేంకటేశ్వర దేవాలయం, జామా మస్జిద్ మరియు ఛాంబర్లియన్ చర్చి ప్రసిద్ధమైనవి.

పత్రికలు

  • "ఈ సంఘం" తెలుగు పక్షపత్రిక 2007 సం. నండి ప్రచురించబడుతోంది. దీని వ్యవస్థాపకులు శ్రీ ఓ.వి.ఎన్. గుప్త గారు. సంపాదకులు పి. త్యాగమూర్తి శర్మ గారు.
  • "పెద్దమనుషులు" తెలుగు పక్షపత్రిక ప్రచురింపబడేది. దీని స్థాపకులు కీ.శే. ఈర్.యెస్. సుదర్శనం.
  • నూర్అబ్దుల్ ర్రహమాన్ ఖాన్ : "అఖండ్ భారతీయఅవాజ్" జాతీయ రాజకీయ పార్టీ వ్యవస్తాపక ప్రధానకార్యదర్శి, వీరు B T కాలేజీలో చదివారు, మరియు నేదురుమల్లి జనార్ధన రెడ్డి ప్రభుత్వం పరీక్షల ఫీజులు పెంచిన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతికంగా విద్యార్తుల వైపు నుంచి నాయకత్వం వహించి నిరహరదీక్షలో పాల్గొన్నారు.

పట్టణంలో విద్యాలయాలు

మదనపల్లె లో విద్య రాను రాను వికసిస్తోంది, చదువరులు విద్యార్థులు పెరుగుతున్నారు.

  • 1936వ సంవత్సరంలో స్థాపింపబడిన బోర్డు హైస్కూల్, ప్రస్తుతం జిల్లా పరిషత్ హైస్కూల్, జిల్లాలోనే అతి పెద్ద ఉన్నత పాఠశాల. గిరిరావు థియోసాఫికల్ హైస్కూల్, హోప్ హైస్కూల్, హోప్ మునిసిపల్ హైస్కూల్, మునిసిపల్ ఉర్దూ హైస్కూల్, సి.ఎస్.ఐ.బాలికల పాఠశాల, ప్రభుత్వ బాలికల పాఠశాల, రామారావు పాఠశాల ముఖ్యమైనవి. ఇవియేగాక ఓ పాతిక ప్రైవేటు హైస్కూల్స్ గలవు.
  • బి.టి.కాలేజ్, ప్రభుత్వ బాలికల కాలేజ్ లు ముఖ్యమైనవి. ఇవి గాక నాలుగు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు మరియు పది హెను జూనియర్ కాలేజీలు గలవు.
  • సాంకేతిక విద్యా సంస్థలూ, బి.ఎడ్., ఇంజనీరింగ్, నర్శింగ్, పాలిటెక్నిక్ సంస్థలూ గలవు.
  • నవోదయ పాఠశాల గలదు.

ఆరోగ్య సదుపాయాలు

మదనపల్లెలో హాస్పిటల్స్ ఎక్కువ. ఆరోగ్యవరం, ఎమ్.ఎల్.ఎల్. లేదా మేరీ లాట్ లైలెస్ హాస్పిటల్ (ఇది పాతతరంలో గోషా ఆసుపత్రి లేదా గోషా హస్పతాల్ గా ప్రసిద్ధి) మరియు ప్రభుత్వ ఆసుపత్రి పేరు గలవి. గడచిన కాలంలో వైద్య సేవలకు ఘనమైన పేరుగల మదనపల్లె, నేడు అడుగడుగునా నర్సింగ్ హోంలు వెలసిననూ, ఆ పేరును కాలక్రమేణా కోల్పోతున్నది. వ్యాపారరంగంగా మారుతున్న వైద్యరంగాన్ని, సేవారంగంగా తిరిగీ తన స్థానాన్ని కలుగ జేయవలెను. అనేక విభాగాలలో స్పెషలిస్టులు లేని కారణంగా రోగులను తిరుపతి గాని బెంగళూరు గాని వైద్యసేవలకొరకు తరలడం సాధారణంగా కానవస్తుంది.

పరిశ్రమలు

  • మదనపల్లి స్పిన్నింగ్ మిల్ (సి.టి.యం.)
  • పట్టు పరిశ్రమలు (నీరుగట్టువారిపల్లి)
  • గార్మెంట్ పరిశ్రమ
  • ఫుడ్ ఇండస్ట్రీస్

పంటలు

ముఖ్యంగా, టమోటా, వేరుశెనగ, వరి, మామిడి, మరియు కూరగాయలు పండిస్తారు. నీరుగట్టువారిపల్లె

వ్యాపారం

మదనపల్లె మార్కెట్ యార్డ్ ఈ ప్రాంతానికి వ్యాపార రంగ పట్టుగొమ్మ. ఈ మార్కెట్ యార్డ్‌లో టమోటా, మామిడి, సీతాఫలం, కూరగాయలు ప్రముఖ వ్యాపార వస్తువులు. దేశంలోని అనేక ప్రాంతాల వారు, టమోటా, మామిడి, సీతాఫలం, చింతకాయ కోనుగోలుకొరకు ఇచ్చటకు వస్తారు. గొర్రెల మార్కెట్ మదనపల్లె సమీపంలోని అంగళ్లు లో ప్రతి శనివారం జరుగుతుంది. మదనపల్లెలో సంత ప్రతి మంగళవారం జరుగుతుంది. పట్టణవాసులకు వారానికి కావలసిన కూరగాయలు ఈసంతే సమకూరుస్తుంది. అలాగే పట్టు పరిశ్రమలో తయారయ్యే ముడి పట్టు, పట్టు బట్టలు, నాణ్యతగల చీరల కోనుగోలు కొరకు ఇతరరాష్ట్రాల వ్యాపారస్తులు తరచుగా రావడం పరిపాటి.

రవాణా సౌకర్యాలు

  • మదనపల్లెలో ఆం.ప్ర.రా.రో.ర.సం. వారి రెండు బస్సు డిపోలు గలవు.
  • ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషన్ లేదు.10 కి.మీ. దూరంలో సి.టి.యం.రోడ్డులో 'మదనపల్లె రైల్వే స్టేషన్ ' ఉంది.
  • ట్రాన్స్ పోర్టు కొరకు లారీలెక్కువ. ఈ లారీలు ప్రధానంగా టమోటా, వరి, బియ్యం మరియు వేరుశెనగ రవాణా కొరకు ఉపయోగకరంగా ఉన్నవి.

భౌగోళికం

ప్రజల సాధక బాధకాలు

ఎక్కువ ప్రజ మధ్య తరగతి కుటుంబానికి చెందినది. రోజువారి చిన్న చిన్న వ్యాపారస్తులు, కూలీలు ఎక్కువ. వడ్డీ వ్యాపారులు, వడ్డీ దళారులు ఎక్కువ. వీటి వలన సాధారణ ప్రజ ఆర్థికంగా కోలుకోలేక పోతోంది. చిరుద్యోగులు, ఉద్యోగస్తులు వడ్డీ వ్యాపారాలు చేసే వ్యవస్థ మదనపల్లెలో కాన వస్తుంది. "ఫైనాన్స్" అనే ఘనమైన పేరుతో ఈ అమానవీయ వ్యాపారం అన్ని వర్గాల్లో సాగుతున్నది. ఈ వడ్డీ వ్యాపారస్తులపై ప్రభుత్వ నిఘా అసలేలేదు. నిఘా పెట్టవలసిన అధికారులే ఈ ఫైనాన్స్ రంగంలో మునిగివున్నారనే అపవాదు ఉన్నది.

మత్తు పానీయ షాపులు అధిక సంఖ్యలోనే వున్నాయి. చిన్నా చితకా వ్యసనపరులూ సర్వ సాధారణంగానే కానవస్తారు.

సినిమాలు

మదనపల్లె లో సినిమా హాళ్ళు అధికంగా వుండేవి.ఆంధ్ర రాష్ట్రంలోనే శుభ్రత కలినిగినవిగా పేరొందినవి. నేడు వాటి పరిస్థితి అంతంత మాత్రమే. ఎన్నో సినిమా హాళ్ళు మూతపడ్డాయి. ఉన్న కొన్ని సినిమాహాళ్ళు అధునాతన పరికరాలతో అన్ని హంగులూ కలవిగా కానవస్తాయి.

మండలంలోని పట్టణాలు

మండలంలోని గ్రామాలు

కొన్ని విశేషాలు

  • మదనపల్లెలోని టీబీ ఆసుపత్రిలో 'చందమామ' రూపకర్తలలో ఒకరైన చక్రపాణి కొంతకాలం చికిత్స చేయించుకున్నారు.
  • "ఆ నలుగురు" సినిమా రచయిత "పెళ్ళైన కొత్తలో" సినిమా దర్శక నిర్మాత అయిన మదన్ మదనపల్లెలో బిసెంట్ థియోసాఫికల్ కాలేజ్ లో చదువుకున్నాడు.
  • ఎన్నికల ప్రచారం కోసం ఇందిరా గాంధీ మదనపల్లె వచ్చిప్పుడే కాంగ్రెస్(ఐ) కు ఎన్నికల కమీషన్ హస్తం గుర్తు కేటాయించింది.
  • 1919వ సంవత్సరంలో రవీంద్రనాథ్ టాగోర్ మదనపల్లెకు వచ్చారు.
  • విశ్వకవి రవీంద్రుడు మన జాతీయగీతాన్ని ఆంగ్లంలోనికి బి.టి. కళాశాల, మదనపల్లెలో అనువదించినారు.
    • భారత జాతీయగీతం ... ఠాగూర్ జనగణమనను 1919 లో మదనపల్లె లో ఆంగ్లములోకి తర్జుమా చేశాడని భావిస్తారు. ఈ తర్జుమా ప్రతి నేటికినీ బీసెంట్ థియోసాఫికల్ కాలేజి మదనపల్లె లో యున్నది. మొదటిసారి బహిరంగంగా జనగణమన గీతాన్ని ఆలపించింది మదనపల్లెలోనే. 1919 ఫిబ్రవరి 28న తన స్నేహితుడు, బిసెంట్ థియోసాఫికల్ కాలేజి ప్రిన్సిపాలు అయిన జేమ్స్ హెచ్. కజిన్స్ కోరిక మేరకు కొంత మంది విద్యార్ధులను ప్రోగు చేసుకొని జనగణమనను బెంగాలీలో ఆలపించాడు.
  • ఆంధ్రరాష్ట్ర మాజీముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి మదనపల్లెలోని బి.టి. కశాశాలలో విధ్యాభ్యాసం చేశారు.
  • మదనపల్లె మరియు ఆ పరిసర ప్రాంతాలు టమోటా పంటలకు ప్రసిధ్ధి.
  • బాహుదా నది పట్టణము మధ్యలో ప్రవహించును. సాధారణంగా మామూలు కాలువలా ఉండే బాహుదా 1996 సంలో వరదల కారణంగా ప్రవాహము హెచ్చి ప్రాణ నష్టం జరిగిం
sillk industries are in నీరుగట్టువారిపల్లె

మూలాలు

  1. తెలుగుసినిమా.కాం వెబ్‌సైటులో శ్రీ అట్లూరి ఇంటర్వ్యూ, సేకరించిన తేదీ: జులై 20, 2007

బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=మదనపల్లె&oldid=1252014" నుండి వెలికితీశారు