ఆంధ్రప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 68: పంక్తి 68:
[[దస్త్రం:Godavari satellite view.jpg|right|thumb|250px|కృష్ణా గోదావరి నదులు (ఉపగ్రహ ఛాయాచిత్రం)]]
[[దస్త్రం:Godavari satellite view.jpg|right|thumb|250px|కృష్ణా గోదావరి నదులు (ఉపగ్రహ ఛాయాచిత్రం)]]
ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ముఖ్య ప్రాంతములు కలవు: [[కోస్తా]] ఆంధ్ర, మరియు [[రాయలసీమ]]. రాష్ట్రములో 13 జిల్లాలు కలవు. తెలంగాణా రాజధాని అయిన [[హైదరాబాదు]] పదేళ్ళ వరకూ ఈ రాష్ట్రానికి కూడా రాజధాని . ముఖ్య నగరాలు [[విశాఖపట్నం]], [[విజయవాడ]],[[కాకినాడ]], [[ఏలూరు]],[[రాజమండ్రి]],[[తిరుపతి]],[[కర్నూలు]], [[నెల్లూరు]], [[గుంటూరు]],[[ఒంగోలు]], మరియు[[మచిలీపట్నం]]. [[గోదావరి]], [[కృష్ణా నది|కృష్ణ]] వంటి మహానదులు రాష్టంలో ప్రవహించటంవలన కొన్ని లక్షల హెక్టేరుల భూమి సాగు చేయబడుతున్నది.
ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ముఖ్య ప్రాంతములు కలవు: [[కోస్తా]] ఆంధ్ర, మరియు [[రాయలసీమ]]. రాష్ట్రములో 13 జిల్లాలు కలవు. తెలంగాణా రాజధాని అయిన [[హైదరాబాదు]] పదేళ్ళ వరకూ ఈ రాష్ట్రానికి కూడా రాజధాని . ముఖ్య నగరాలు [[విశాఖపట్నం]], [[విజయవాడ]],[[కాకినాడ]], [[ఏలూరు]],[[రాజమండ్రి]],[[తిరుపతి]],[[కర్నూలు]], [[నెల్లూరు]], [[గుంటూరు]],[[ఒంగోలు]], మరియు[[మచిలీపట్నం]]. [[గోదావరి]], [[కృష్ణా నది|కృష్ణ]] వంటి మహానదులు రాష్టంలో ప్రవహించటంవలన కొన్ని లక్షల హెక్టేరుల భూమి సాగు చేయబడుతున్నది.

==జిల్లాలు==
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్టా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు.


== రాష్ట్ర ప్రభుత్వము మరియు కార్య నిర్వహణ వ్యవస్థ ==
== రాష్ట్ర ప్రభుత్వము మరియు కార్య నిర్వహణ వ్యవస్థ ==

07:11, 16 జూలై 2014 నాటి కూర్పు

ఆంధ్ర ప్రదేశ్
Map of India with the location of ఆంధ్ర ప్రదేశ్ highlighted.
Map of India with the location of ఆంధ్ర ప్రదేశ్ highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
హైదరాబాదు
 - 17°21′58″N 78°28′34″E / 17.366°N 78.476°E / 17.366; 78.476
పెద్ద నగరం విశాఖపట్నం
జనాభా (2011)
 - జనసాంద్రత
49,665,533[1] (10వది)
 - 310/చ.కి.మీ
విస్తీర్ణం
 - జిల్లాలు
160205 చ.కి.మీ (8వది)
 - 13
సమయ ప్రాంతం IST (UTC యుటిసి+5:30)
అవతరణ
 - [[ఆంధ్ర ప్రదేశ్ |గవర్నరు
 - [[ఆంధ్ర ప్రదేశ్ |ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
నవంబర్ 1 ,1956
 - ఏక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్
 - నారా చంద్రబాబు నాయుడు (కాబోయే)
 - శాసనసభ + శాసనమండలి (175 + 56)
అధికార బాష (లు) తెలుగు
పొడిపదం (ISO) IN-AP
వెబ్‌సైటు: www.ap.gov.in

ఆంధ్ర ప్రదేశ్ రాజముద్ర
దస్త్రం:Andhra Pradesh new Montage1.png
ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. ఇది తెలుగువారి రాష్ట్రం. ఈ రాష్ట్రానికి వాయవ్య దిశలో తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పడమరన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో ఎనిమిదవ అతి పెద్ద రాష్ట్రము ఆంధ్ర ప్రదేశ్. ఈ రాష్ట్రంలోని ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణ, తుంగభద్ర మరియు పెన్నా. ఆంధ్రప్రదేశ్ 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.

1953 అక్టోబర్ 1న మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు భాషీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, రాయలసీమ దత్త జిల్లాలను కలిపి ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్రాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందాక భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి. హైదరాబాదు రాజ్యంలోని మరాఠీ జిల్లాలు మహారాష్ట్రకూ, కన్నడ భాషీయ జిల్లాలు కర్ణాటకకూ పోగా, మిగిలిన హైదరాబాదుతో కూడుకుని ఉన్న తెలుగు మాట్లాడే నిజాం రాజ్యాధీన ప్రాంతం ఆంధ్రరాష్ట్రంలో కలిసింది. అలా 1956, నవంబర్ 1న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని మరియు మద్రాస్ నుండి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. దాదాపు 58 సంవత్సరాల తరువాత జూన్ 2, 2014 న పునర్విభజింపబడింది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అధికార భాష తెలుగు. హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాల ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా పది సంవత్సరాల వరకు కొనసాగుతుంది. దేశంలోనే 2వ అతి పెద్ద కోస్తా తీరం ఈ రాష్ట్రంలో ఉంది. [2]

చరిత్ర

ఆంధ్రులు వింధ్యపర్వత దక్షిణ భాగానికి తరలి వెళ్ళి, ద్రావిడులతో కలసిన ఆర్యులుగా క్రీ.పూ. 7వ శతాబ్దపు సంస్కృత రచనలు వర్ణిస్తున్నాయి. క్రీ. పూ. 5వ శతాబ్దములో ప్రతీపాలపురం (భట్టిప్రోలు) రాజధానిగా కుబేరక అను రాజు పాలన చేస్తున్నాడని ఆధారాలు దొరికాయి. మహావీరుడు, గౌతమ బుద్ధుడు ధాన్యకటకము (అమరావతి) సందర్శించారనడానికి ఆధారాలున్నాయి. మౌర్య చక్రవర్తి అశోకుని మరణానంతరం (క్రీ.పూ 232) ఆంధ్రులు వెలుగులోకి వచ్చారు. నవీన చరిత్రకారులు ఆంధ్రుల చరిత్ర ఆనాటినుండి మొదలైనట్లుగా లెక్కిస్తున్నారు. ఆంధ్ర (శాతవాహన), శక, పల్లవ, ఇక్ష్వాకు, తెలుగు చోళ, తూర్పు చాళుక్య, కాకతీయ, విజయనగర, కుతుబ్ షాహి, హైదరాబాదు నిజాం లు మొదలైన వంశాలకు చెందిన రాజులు ఆంధ్ర దేశాన్ని పరిపాలించారు. క్రీ.శ 17వ శతాబ్దములో బ్రిటీషు వారు కోస్తా ఆంధ్రను నిజామ్ వద్ద గెలుచుకొని మద్రాసు రాష్ట్రములో (మద్రాసు ప్రెసిడెన్సీ) కలుపుకున్నారు. హైదరాబాదు నిజామ్ బ్రిటిషు ఆధిక్యతను గుర్తించి తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనాడు.

భారత దేశ స్వాతంత్ర్యానంతరము

1947లో భారత దేశానికి ఆంగ్లేయుల నుండి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నిజాము, హైదరాబాదు సంస్థానాన్ని తమ పాలనలోనే ఉంచుకోవటానికి ప్రయత్నించాడు. పోలీసు చర్య ద్వారా హైదరాబాదు 1948 భారత దేశంలో విలీనమై, హైదరాబాదు రాష్ట్రంగా అవతరించింది.

మద్రాసు రాజధానిగా ఉండే ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి' పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్ష చేసి మరణించారు, కానీ కర్నూలును రాజధానిగా చేసి 1953 అక్టోబరు 1న మద్రాసు రాష్ట్రంలో ఉత్తరాన ఉన్న 11 జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం చేశారు. గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేసారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.

తెలుగు ప్రజల కోరికపై 1956, నవంబరు 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. కొత్త రాష్ట్రానికి హైదరాబాదు రాజధానిగా అవతరించింది. ఈ విధంగా భాష ఆధారముగా ఏర్పడిన రాష్ట్రములలో ఆంధ్ర ప్రదేశ్ మొదటి రాష్ట్రము అయినది. నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.

1960 వ సంవత్సరంలో పటాస్కర్ కమీషన్ తీర్పుమూలంగా చిత్తూరు జిల్లా తిరుత్తణి తాలూకాలోని ఎక్కువ భాగాన్ని తమిళనాడు కు ఇచ్చి, తమిళనాడుకు చెందిన తిరువళ్లూర్ తాలూకాలోని కొన్ని గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్ లో చేర్చారు. ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భవించినప్పుడు 20 జిల్లాలే ఉన్నాయి. తరువాత, 1970, ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా, 1978 ఆగష్టు 12న రంగారెడ్డి జిల్లా, 1979 జూన్ 1న విజయనగరం జిల్లాలు ఏర్పడడంతో మొత్తం 23 జిల్లాలయ్యాయి.

రాజకీయాలు

నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి. 1982 వరకు అన్నీ కాంగ్రెసు ప్రభుత్వాలే ఆంధ్ర ప్రదేశ్ ను పరిపాలించాయి. 1982 వరకు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలము పనిచేశాడు. ఆయన తరువాత పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేసారు. తరువాతి కాలంలో ఆయన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసారు.

అయితే 1982 వరకు రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెసుకు ఉన్న బలాన్ని సవాలు చేయటానికి నందమూరి తారక రామారావు అదే సంవత్సరములో తెలుగుదేశం అనే పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. స్థాపించిన తొమ్మిది నెలలలోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టడంతో ఒక బుడతడి దెబ్బకు వస్తాదు కుప్పకూలినట్లయింది.

2004 అసెంబ్లీ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెసు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉధృతంగా పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి పోటీ చేసింది. కాంగ్రెసు, తెరాస కూటమి పదవిలోకి రావడంతో, కాంగ్రెసుకు చెందిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఐదేళ్ళ అనతరం 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీచేయగా, తెలుగుదేశం పార్టీ, తెరాస, ఉభయ కమ్యూనిష్టు పార్టీలు కలిసి మహాకూటమి తరఫున పోటీచేశాయి. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ, భాజపాలు కూడా పోటీచేయడంతో బహుముఖ పోటీలు జరిగాయి.సెప్టెంబరు 2, 2009న రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 నెలలు పాలించిన తరువాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా మార్చడం జరిగింది . నల్లారి కిరణకుమార్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం రాజీనామా చేయటంతో ఎన్నికలు దగ్గరబడుతున్నందున, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచటానికి ఆసక్తి చూపనందున రాష్ట్రపతిపాలన విధించబడింది [3].

రాష్ట్ర భౌగోళిక సమగ్రతపై ఉద్యమాలు

రాష్ట్రం ఏర్పడినతరువాత అడపా దడపా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు దానికి పోటీగా సమైక్య ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి.2009 లో కే.సి.ఆర్ నిరాహరదీక్ష విరమింపచేయడానికి కేంద్రప్రభుత్వం తెలంగాణాఏర్పాటు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ ఉద్యమాలు మరింత బలం పుంజుకున్నాయి. కేంద్రప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అందరికీ అమోదమైన లక్ష్యంకొరకు ప్రయత్నించినప్పటికి సత్ఫలితాలివ్వలేదు. 30 జూలై, 2013న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 10 జిల్లాలతో కూడిన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.తదుపరి సమైక్యాంధ్ర ఉద్యమము వూపందుకుంది. ప్రభుత్వ ఉద్యోగసంఘాల నాయకత్వంలో రెండు నెలలపై బడి సమైక్యాంధ్ర ఉద్యమము నడిచింది. 3 అక్టోబర్ 2013న జరిగిన కేంద్రప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణా ఏర్పాటుని ఆమోదించారు. తదుపరి చర్యగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించి వాటి పరిష్కార వివరాలతో కేబినెట్ నోట్ మరియు బిల్లు తయారీ జరిగింది. [4] ఆ తరువాత రాష్ట్రపతి పంపిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును [5]. శాసనసభ,శాసనమండలిలో సుదీర్ఘ చర్చల పూర్తికాకముందే ఒకవారం పొడిగించిన గడువు ముగిసే సందర్భంలో ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తిరస్కరించే తీర్మానం పై మూజువాణీ వోటుతో సభలు అమోదముద్ర వేశాయి.[6].2014, ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు భాజపా మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది[7].20 పిభ్రవరి న రాజ్యసభ ఆమోదం తెలిపింది. సీమాంధ్రకు న్యాయం చేయడానికి వెంకయ్యనాయుడు ప్రతిపాదించిన సవరణలను కొంత వరకు తృప్తిపరచే విధంగా ప్రధాని ఆరుసూత్రాల ప్యాకేజీని ప్రకటించిన పిదప, బిల్లుకు యథాతథంగా మూజువాణీ వోటుతో అమోదముద్ర పడింది [8]. జూన్ 2, 2014 న తెలంగాణా ప్రాంతం సీమాంధ్ర ప్రాంతాలనుండి వీడి క్రొత్త రాష్ట్రంగా ఏర్పడింది[9].

భౌగోళిక పరిస్థితి

కృష్ణా గోదావరి నదులు (ఉపగ్రహ ఛాయాచిత్రం)

ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ముఖ్య ప్రాంతములు కలవు: కోస్తా ఆంధ్ర, మరియు రాయలసీమ. రాష్ట్రములో 13 జిల్లాలు కలవు. తెలంగాణా రాజధాని అయిన హైదరాబాదు పదేళ్ళ వరకూ ఈ రాష్ట్రానికి కూడా రాజధాని . ముఖ్య నగరాలు విశాఖపట్నం, విజయవాడ,కాకినాడ, ఏలూరు,రాజమండ్రి,తిరుపతి,కర్నూలు, నెల్లూరు, గుంటూరు,ఒంగోలు, మరియుమచిలీపట్నం. గోదావరి, కృష్ణ వంటి మహానదులు రాష్టంలో ప్రవహించటంవలన కొన్ని లక్షల హెక్టేరుల భూమి సాగు చేయబడుతున్నది.

జిల్లాలు

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్టా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు.

రాష్ట్ర ప్రభుత్వము మరియు కార్య నిర్వహణ వ్యవస్థ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధినేత ముఖ్యమంత్రి కాగా, రాష్ట్ర పరిపాలన గవర్నరు పేరున జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ (దిగువ సభ) లో 175 స్థానాలు, విధాన మండలి (ఎగువ సభ)లో 56[10] స్థానాలు ఉన్నాయి.దీనికి తోడు, ఆంగ్లో-ఇండియన్ వర్గం నుంచి ఒకరిని శాసన సభకు నామినేటు చేస్తారు.ఆ రకంగా శాసన సభ లో సభ్యుల సంఖ్య 175. ఆంధ్ర ప్రదేశ్ కు పార్లమెంటులో 36 స్థానాలు కలవు (లోక్ సభ లో 25 మరియు రాజ్య సభలో 11). ఎలెక్ట్రానిక్ సాంకేతివ్యవస్థ ఉపయోగించి ఈ-ప్రభుత్వపాలన ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించటానికి అంతర్జాలంలో ఎపి ఆన్లైన్ అనే జాలస్థలి [11] కలిగివుంది.

రాష్ట్ర గుర్తులు

విభాగం పేరు మాధ్యమం(అనుకూలమైతే)
రాష్ట్ర భాష తెలుగు
రాష్ట్ర గుర్తు పూర్ణకుంభం

రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లె పూదండ
రాష్ట్ర జంతువు కృష్ణ జింక
రాష్ట్ర పక్షి పాలపిట్ట
రాష్ట్ర వృక్షం వేప చెట్టు
రాష్ట్ర ఆట చెడుగుడు
రాష్ట్ర నృత్యం కూచిపూడి
రాష్ట్ర పుష్పము కలువ పువ్వు
రాష్ట్ర జల చరము డాల్ఫిన్

ఆర్ధిక రంగము

రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు వ్యవసాయం ఆయువుపట్టు. భారత దేశములోని రెండు ప్రధాన నదులు, గోదావరి మరియు కృష్ణ రాష్ట్రం గుండా ప్రవహిస్తాయి. వరి, పొగాకు, ప్రత్తి, మిర్చి, మరియు చెరుకు రాష్ట్రంలో పండించే ముఖ్యమైన పంటలు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్, సమాచార సాంకేతికం(ఐటి) మరియు జీవసాంకేతికం (బిటి) రంగాల్లో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

భాష-సంస్కృతి

తెలుగు రాష్ట్ర అధికార భాష. కవిత్రయమని పేరుగన్న నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ మహా భారత కావ్యాన్ని తెలుగులోకి అనువదించారు. మహా భాగవతమును బమ్మెర పోతన అనువదించాడు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు విశ్వనాథ సత్యనారాయణ, డా.సి.నారాయణరెడ్డి మొదలైనవారు తెలుగులో ఆధునిక రచయితలు. ఆంధ్రప్రదేశ్ కు గొప్ప సాంస్కృతిక వారసత్వము కలదు. అన్నమాచార్య, త్యాగరాజు, రామదాసు తదితర గొప్ప కర్ణాటక సంగీతకారులు తెలుగు భాషలో కృతులు రచించి, భాషను సుసంపన్నం చేశారు. కూచిపూడి రాష్ట్ర శాస్త్రీయ నృత్యం. అలాగే నటరాజ రామకృష్ణ గారి కృషి వల్ల ఆంధ్రనాట్యం కూడా ప్రజాదరణ పొందింది.

సినిమా

ఆంధ్రులు సినిమా ప్రియులు, గత 70 సంవత్సరాలుగా సినిమాను విపరీతముగా పెంచి పోషించారు. రాష్ట్రంలో సంవత్సరానికి సుమారు 130 సినిమాలు రూపొందుతాయి. ఆదాయపరంగా తెలుగు సినిమా ఒక పెద్ద పరిశ్రమ, కానీ తక్కిన భారత దేశములో పెద్దగా గుర్తింపు పొందలేదు. రాష్ట్రం నుండి ఉద్భవించిన కొందరు ప్రముఖ సినీ కళాకారులు నాగయ్య , ఎన్.టి.రామారావు (మాజీ ముఖ్యమంత్రి), అక్కినేని నాగేశ్వరరావు , ఎస్.వి.రంగారావు ("ఎస్.వి.అర్) జగ్గయ్య, ఘంటసాల,ఎస్.పి.బాలసుబ్రమణ్యం, సుశీల, జానకి, సావిత్రి, భానుమతి అంజలి జమున, శారద, షావుకారు జానకి, వాణిశ్రీ ,ఎల్.వి.ప్రసాద్ , కె.వి.రెడ్డి, బి.యన్.రెడ్డి, బి.నాగిరెడ్డి, బాపు, రాజేంద్ర ప్రసాద్, చిరంజీవి,జయప్రద మొదలైనవారు.

ఇతర కళలు

ఆంధ్ర ప్రదేశ్ లో పలు సంగ్రహాలయాలు (మ్యూజియం) కలవు, అందులో సాలార్ జంగ్ మ్యూజియం, పురావస్తుశాఖ మ్యూజియం ముఖ్యమైనవి. వీనిలో పలు శిల్పాలు, చిత్రాలు, హిందూ మరియు బౌద్ధ మత శిల్పాలు, కళాఖండాల సేకరణలు ప్రదర్శంచబడినవి. ఈ రెండు సంగ్రహాలయాలు హైదరాబాదులో ఉన్నాయి.

విద్యారంగము

ప్రధాన వ్యాసం: ఆంధ్ర ప్రదేశ్ లో విద్య
ఆంధ్రప్రదేశ్ లో విద్యా నిర్వహణ ప్రభుత్వ శాఖలద్వారా జరుగుతుంది.

  1. పాఠశాల విద్యాశాఖ[12] (సర్వ శిక్షా అభియాన్) [13]
  2. ఇంటర్ మీడియట్ విద్యా మండలి. [14]
  3. సాంకేతిక విద్యా మండలి[15]
  4. ఉన్నత విద్యా పరిషత్ [16]

పర్యాటక రంగము

ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి, ద్వారక తిరుమల (చిన్న తిరుపతి) , శ్రీశైలం, శ్రీ కాళహస్తి, సింహాచలము, అన్నవరం, అహొబిలము, మహానంది, కానిపాకం, విజయవాడ ‍‍‍మొదలైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. తిరుపతి లోని తిరుమల తిరుపతి దేవస్థానము ప్రపంచములోకెల్లా ఐశ్వర్యవంతమైన హిందూ దేవాలయము. ఇవే కాకుండా పేరిపాలెం, మచిలీపట్నం వంటి ఎన్నో బీచ్ లు ఉన్నాయి. పాపి కొండలు, బొర్రా గుహలు, అరకు లోయ, లంబసింగి వంటి ముఖ్యమైన పర్యాటకా ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక అభివృద్ధి సంస్థ [17]రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ముఖ్య పాత్ర వహిస్తున్నది.

ఇవికూడా చూడండి

మూలాలు

  1. "Census of Andhra Pradesh 2011" (PDF). Andhra Pradesh state portal. Government of India. Retrieved 8 May 2013.
  2. డిపార్ట్మెంట్ ఆఫ్ లాండ్ రిసోర్సెస్ వారి పరిశోధన
  3. "రాష్ట్రపతి పాలనపై ప్రజలకు గవర్నర్: కిరణ్ నిర్ణయాలపై..." వన్ ఇండియా. 2014-03-02. Retrieved 2014-03-06.
  4. "ముగిసిన కేబినెట్, తెలంగాణ నోట్‌కు ఆమోదం". వన్ ఇండియా. 2013-10-3. Retrieved 2014-01-31. {{cite web}}: Check date values in: |date= (help)
  5. "ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు". సూర్య. 2013-12-16. Retrieved 2014-01-31.
  6. "టీ-బిల్లుకు అసెంబ్లీ తిరస్కారం". సూర్య. 2014-01-31. Retrieved 2014-01-31.
  7. "జయహో తెలంగాణ". సూర్య. 2014-02-19. Retrieved 2014-02-19.
  8. "తెలంగాణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.29వ రాష్ట్రంగా..." వెబ్ దునియా. 2014-02-20. Retrieved 2014-02-24.
  9. "జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావం". వార్త. 2014-03-05. Retrieved 2014-03-06.
  10. ELECTIONS – Notification
  11. ఎకనామిక్ టైంస్ లో 2014 ఎన్నికలకు సంబందించిన సమాచారం
  12. పాఠశాల విద్యాశాఖ
  13. పాఠశాల విద్యాశాఖ వెబ్ సైటు
  14. ఇంటర్ మీడియట్ విద్యా మండలి వెబ్ సైటు
  15. సాంకేతిక విద్యా మండలి వెబ్ సైటు
  16. ఉన్నత విద్యా పరిషత్ వెబ్ సైటు
  17. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక అభివృద్ధి సంస్థ జాలస్థలం

బయటి లింకులు