బుసిరెడ్డిపల్లె: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: "బుసిరెడ్డిపల్లె" కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలానికి చెం...
(తేడా లేదు)

10:36, 1 ఆగస్టు 2014 నాటి కూర్పు

"బుసిరెడ్డిపల్లె" కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన గ్రామం.

గ్రామములోని విశేషాలు

ఈ గ్రామస్థులైన శ్రీ కొండయ్య, పురాతన కళారూపమైన "చెక్క భజన" లో దిట్ట. ఈ కళ అంటే ఆయనకు ఆరో ప్రాణం. వీరు సాంప్రదాయ కళ అయిన చెక్కభజనకు జీవంపోసి, ప్రాచుర్యం కల్పించుచున్నారు. దీనిపైన ఉన్న ఆసక్తితో చిన్నతనం నుండి, ఎంతో శ్రద్ధతో అభ్యసించి, ఇందులో మంచి నైపుణ్యం సంపాదించినారు. ఎక్కడ జాతరలు జరిగినా, దేవుని కార్యక్రమాలు జరిగినా, వీరు అక్కడ ప్రదర్శనలు ఇచ్చి ప్రజలను అలరించుచున్నారు. ఒకవైపు రాతినార బండల వ్యాపారం నిర్వహించుచూ, మరోవైపు ఈ కళలో ప్రదర్శనలు ఇచ్చుచున్నారు. ఇంతవరకు కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చి, ఎన్నో బహుమతులు, ఎందరి ప్రశంసలనో అందుకున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలలోనూ, దాదాపుగా వీరు చెక్కభజన ప్రదర్శనలు ఇచ్చినారంటే ఆశ్చర్యం లేదు. ఇంతేగాక వీరు ఈ కళలో దాదాపు ఒక వేయిమంది ఔత్సాహికులకు, చిన్నా, పెద్దా తేడాలేకుండా శిక్షణ ఇచ్చినారు. వారికి ఈ కళలో ఎన్నో మెళకువలను నేర్పి వారిని ఉత్తమ కళాకారులుగా తీర్చిదిద్దినారు. పాతకాలపు ఈ కళారూపాన్ని భవిష్యత్తు తరాలవారు మర్చిపోకుండా వారికి గూడా అందజేయాలని వీరి తాపత్రయం. [1]











[1] ఈనాదు కడప, 2014, జులై-30; 11వపేజీ.