కురుమద్దాలి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 106: పంక్తి 106:
==గ్రామ పంచాయతీ==
==గ్రామ పంచాయతీ==
#మొదటి సర్పంచ్ కొసరాజు శ్రీరంగనాయకులు (1938-52) ప్రత్తిపాటి రమాదేవి (2006-13).
#మొదటి సర్పంచ్ కొసరాజు శ్రీరంగనాయకులు (1938-52) ప్రత్తిపాటి రమాదేవి (2006-13).
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కొసరాజు స్వప్న, సర్పంచిగా ఎన్నికైనారు. తరువాత వీరు పామర్రు మండల సర్పంచుల సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైనారు. [2] & [3]
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కొసరాజు స్వప్న, సర్పంచిగా ఎన్నికైనారు. తరువాత వీరు పామర్రు మండల సర్పంచుల సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైనారు. [2] & [4]


==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==

16:45, 1 ఆగస్టు 2014 నాటి కూర్పు

కురుమద్దాలి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పామర్రు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,197
 - పురుషులు 1,581
 - స్త్రీలు 1,616
 - గృహాల సంఖ్య 920
పిన్ కోడ్ 521 157
ఎస్.టి.డి కోడ్ 08674

కురుమద్దాలి, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 157. యస్.టీ.డీ.కోడ్ నం. 08674.

ఇది ఉయ్యూరు-పామర్రుల మధ్యలో పామర్రుకు 3 కిలోమీటర్ల దూరాన ఉన్నది. 'కురు' అంటే చిన్న అని అర్థం. పుల్లేరు దాటితే పెదమద్దాలి ఉంటుంది అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.

స్వాతంత్ర్యోద్యమ ప్రముఖులు

స్వాతంత్ర ఉద్యమంలో, కమ్యునిస్టు ఉద్యమంలో ఈ గ్రామం పేరు గాంచింది. స్వాతంత్ర ఉద్యమంలో గుళ్ళపల్లి రామబ్రహ్మం, గుళ్ళపల్లి శ్రీరాములు, గుళ్ళపల్లి తాతయ్య (బాపయ్య), వీరమాచనేని మల్లిఖార్జునరావు, ముత్తేవి కేశవాచార్యులు, పుట్టగుంట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామములో మౌలిక వసతులు

గ్రామములో రాజకీయాలు

గ్రామ పంచాయతీ

  1. మొదటి సర్పంచ్ కొసరాజు శ్రీరంగనాయకులు (1938-52) ప్రత్తిపాటి రమాదేవి (2006-13).
  2. 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కొసరాజు స్వప్న, సర్పంచిగా ఎన్నికైనారు. తరువాత వీరు పామర్రు మండల సర్పంచుల సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైనారు. [2] & [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

  1. శ్రీ చెన్నమల్లీశ్వరస్వామి ఆలయం (శివాలయం),
  2. శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం (విష్ణు ఆలయం) రెండున్నర్ర శతాబ్దాల క్రితం నిర్మించారు.
  3. సాయి బాబా ఆలయం 1937లో కట్టినారు. షిర్డీలో సాయిబాబా దేవాలయం తరువాత దేశంలో కట్టిన రెండవ దేవాలయం ఇది.[ఆధారం చూపాలి]
  4. శ్రీ ఆంజనేయస్వామి ఆలయం 2003 ఏప్రిల్ లో కట్టినారు.
  5. ఊరిలోని శ్రీరామ అవధూత పిచ్చెమ్మ ఆశ్రమం ఎంతో ప్రసిద్థి చెందింది. రచయిత గుడిపాటి వెంకటాచలం పిచ్చెమ్మ ఆశ్రమంలో ఉండి ఇక్కడ నుండే నేరుగా రమణ మహర్షి ఆశ్రామానికి వెళ్ళారు.

గ్రామంలో ప్రధాన పంటలు

  1. కురుమద్దాలి గ్రామo వ్యవసాయానికి ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం పరిశ్రమలు కూడా బాగా స్థాపిస్తున్నారు. ఈ ఊరిలో చదువుకున్నవారు చాలా ఎక్కువ. అనేక మంది పెద్ద పెద్ద పదవులలో ఉన్నారు.
  2. కురుమద్దాలి గ్రామానికి చెందిన శ్రీమతి నూతక్కి జయప్రద, మాజీ ఎం.పిటి.సి., మరియూ ఒక మహిళా రైతు. వీరు 2013=14 సంవత్సరంలో, తన 3.3 ఎకరాల పొలంలో, ఎకరానికి 72 టన్నుల చెరకు పండించినారు. ఉయ్యూరులోని కె.సి.పి.పంచదార కర్మాగారం పరిధిలో ఇది అత్యధిక పంట. ఈ సందర్భంగా వీరికి 2014,జూన్-12, గురువారం నాడు, ఉయ్యూరు కె.సి.పి. కర్మాగారంవారు ఒక బంగారు పతకం అందజేసినారు. [1]

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (Central Board of Direct Taxes) ఛైర్మనుగా, కేంద్ర ప్రభుత్వం నియమించబోవుచున్న, ఐ.ఆర్,ఎస్. సీనియర్ అధికారి శ్రీ కొసరాజు వీరయ్య చౌదరి, కురుమద్దాలి గ్రామస్థులే. వీరు ఈ గ్రామానికి చెందిన శ్రీ కొసరాజు వెంకటపూర్ణచంద్రరావు, శేషమ్మ దంతతుల రెండవ కుమారుడు. గతంలో వీరు పన్ను ఎగవేత, నల్లధనం, 2జి. స్పెక్ట్రం కేటాయింపులు తదితర కేసులను పర్యవేక్షించినారు. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలకు ఎంపిక కాబోతున్న వీరిద్వారా, గ్రామానికి జాతీయస్థాయి గుర్తింపు లభించినది. [3]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3694. [1] ఇందులో పురుషుల సంఖ్య 1772, మహిళల సంఖ్య 1922, గ్రామంలో నివాసగ్రుహాలు 956 ఉన్నాయి.

మూలాలు

  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16

[2] ఈనాడు కృష్ణా; 2014,జూన్-13; 11వ పేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014, జులై-29; 16వపేజీ. [4] ఈనాడు కృష్ణా, 2014, జులై-31; 7వపేజీ.