వెల్లాల ఉమామహేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46: పంక్తి 46:
==సాహిత్యసేవ==
==సాహిత్యసేవ==
అనంతపురంలో చదివేటప్పుడు 1932 ప్రాంతంలో మిత్రులు [[మఠం వాసుదేవమూర్తి]], [[పాళ్ళూరు సుబ్బణాచార్యులు]]తో కలిసి 'కవికుమారసమితి'గా ఏర్పడి క్రొక్కారు మెఱుగులు, తొలకరి చినుకులు అనే ఖండకావ్య సంకలనాలను వెలువరించాడు.
అనంతపురంలో చదివేటప్పుడు 1932 ప్రాంతంలో మిత్రులు [[మఠం వాసుదేవమూర్తి]], [[పాళ్ళూరు సుబ్బణాచార్యులు]]తో కలిసి 'కవికుమారసమితి'గా ఏర్పడి క్రొక్కారు మెఱుగులు, తొలకరి చినుకులు అనే ఖండకావ్య సంకలనాలను వెలువరించాడు.<ref>[[రాయలసీమ రచయితల చరిత్ర]] మూడవ సంపుటి - [[కల్లూరు అహోబలరావు]]- శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం</ref>
ఉమామహేశ్వరరావు 1960వ దశకంలో షేక్స్‌పియర్ నాటకాలన్నీ తెలుగులోకి అనువదించాడు. ఆయనకు [[పుట్టపర్తి నారాయణాచార్యులు]] బాల్యస్నేహితుడు.<ref>[http://puttaparthisaahitisudha.blogspot.com/2012/07/blog-post_16.html పుట్టపర్తి ఆత్మ "లీవ్స్ ఇన్ ద విండ్ "పుట్టపర్తి వారి The Hero ఆంగ్ల నాటకమూ ..వల్లంపాటి సమీక్షణమూ-పుట్టపర్తి అనూరాధ]</ref> అంతే కాక మహాత్మా గాంధీ వ్యక్తిత్వాన్ని చిత్రిస్తూ ''మహాత్ముని అంతరంగము'' అనే రచన చేశాడు.<ref>[http://www.prabhanews.com/coverstory/article-245727 మన సాహిత్యంలో మహత్మ - ఆంధ్రప్రభ అక్టోబర్ 2, 2011]</ref>
ఉమామహేశ్వరరావు 1960వ దశకంలో షేక్స్‌పియర్ నాటకాలన్నీ తెలుగులోకి అనువదించాడు. ఆయనకు [[పుట్టపర్తి నారాయణాచార్యులు]] బాల్యస్నేహితుడు.<ref>[http://puttaparthisaahitisudha.blogspot.com/2012/07/blog-post_16.html పుట్టపర్తి ఆత్మ "లీవ్స్ ఇన్ ద విండ్ "పుట్టపర్తి వారి The Hero ఆంగ్ల నాటకమూ ..వల్లంపాటి సమీక్షణమూ-పుట్టపర్తి అనూరాధ]</ref> అంతే కాక మహాత్మా గాంధీ వ్యక్తిత్వాన్ని చిత్రిస్తూ ''మహాత్ముని అంతరంగము'' అనే రచన చేశాడు.<ref>[http://www.prabhanews.com/coverstory/article-245727 మన సాహిత్యంలో మహత్మ - ఆంధ్రప్రభ అక్టోబర్ 2, 2011]</ref>



10:28, 10 ఆగస్టు 2014 నాటి కూర్పు

వెల్లాల ఉమామహేశ్వరరావు
జననంవెల్లాల ఉమామహేశ్వరరావు
1912, ఆగష్టు 30
చిత్తూరుజిల్లా, పుంగనూరుగ్రామం
ప్రసిద్ధిసినిమా నటుడు, కవి
మతంహిందూ
తండ్రిశ్రీకంఠయ్య
తల్లికృపాలక్ష్మమ్మ
ఇల్లాలు చిత్రంలో కాంచనమాలతో ఉమామహేశ్వరరావు

వెల్లాల ఉమామహేశ్వరరావు (V. Umamaheswara Rao) తెలుగు సినిమా తొలితరం హీరోల్లో ఒకరు. కడప జిల్లాకు చెందిన ఉమామహేశ్వరరావు ప్రముఖ న్యాయవాది మరియు రంగస్థల నటుడు.[1] రచయిత మరియు నాటకకర్త, ఈయన ఇల్లాలు సినిమాలో హీరోగా సినీ రంగప్రవేశం చేశాడు. ఎత్తుగా, అందంగా ఉన్న ఉమామహేశ్వరరావు సినిమాలపై మోజుతో చాలా డబ్బును భాగస్వామిగా పెట్టుబడిగా పెట్టి ఇల్లాలు సినిమా నిర్మించి, అందులో హీరోగా నటించాడు. ఆ తరువాత ఈయన 1943లో విడుదలైన మరో రెండు సినిమాల్లో మాత్రమే నటించాడు. అవి నాగయ్య సొంత చిత్రమైన భాగ్యలక్ష్మి (పి.పుల్లయ్య దర్శకుడు) మరియు గూడవల్లి రాంబ్రహ్మం యొక్క పంతులమ్మ.[2] "లేపాక్షి" అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ ఫిలిమును నిర్మించాడు.

ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ చిత్తూరు నాగయ్య కాలం వచ్చేప్పటికి తెర మరుగయ్యాడు. అయితే అప్పట్లో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

విద్యాభ్యాసము

వెల్లాల ఉమామహేశ్వరరావు 4వ ఫారము వరకు చిత్తూరులో చదివి తరువాతి ఉన్నత విద్య కడపలో ముగించాడు. ఇంటర్మీడియెట్ మద్రాసులో చదివాడు. బి.ఎ. అనంతపురం దత్తమండల కళాశాలలో చదివాడు. మద్రాసులో లా చదివి అక్కడే న్యాయవాదిగా కొంతకాలం పనిచేశాడు.

సాహిత్యసేవ

అనంతపురంలో చదివేటప్పుడు 1932 ప్రాంతంలో మిత్రులు మఠం వాసుదేవమూర్తి, పాళ్ళూరు సుబ్బణాచార్యులుతో కలిసి 'కవికుమారసమితి'గా ఏర్పడి క్రొక్కారు మెఱుగులు, తొలకరి చినుకులు అనే ఖండకావ్య సంకలనాలను వెలువరించాడు.[3] ఉమామహేశ్వరరావు 1960వ దశకంలో షేక్స్‌పియర్ నాటకాలన్నీ తెలుగులోకి అనువదించాడు. ఆయనకు పుట్టపర్తి నారాయణాచార్యులు బాల్యస్నేహితుడు.[4] అంతే కాక మహాత్మా గాంధీ వ్యక్తిత్వాన్ని చిత్రిస్తూ మహాత్ముని అంతరంగము అనే రచన చేశాడు.[5]

నటించిన సినిమాలు

  1. ఇల్లాలు (1940)
  2. భాగ్యలక్ష్మి (1943)
  3. పంతులమ్మ (1943)

మూలాలు