వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 50: పంక్తి 50:
* {{సభ్యుడు|pavan santhosh.s|పవన్ సంతోష్}}
* {{సభ్యుడు|pavan santhosh.s|పవన్ సంతోష్}}
* {{సభ్యుడు|Rajasekhar1961|రాజశేఖర్1961}}
* {{సభ్యుడు|Rajasekhar1961|రాజశేఖర్1961}}
భూక్యాగోపినాయక్, తెలుగు అధ్యాపకులు,పి.వి.కే.న్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల,చిత్తూరు,ఆంధ్రప్రదేశ్
* {{సభ్యుడు|Pvr726|పి.వి.రామారావు}}
* {{సభ్యుడు|Pvr726|పి.వి.రామారావు}}
* {{సభ్యుడు|Naidugari Jayanna|నాయుడుగారి జయన్న}}
* {{సభ్యుడు|Naidugari Jayanna|నాయుడుగారి జయన్న}}

09:44, 17 ఆగస్టు 2014 నాటి కూర్పు

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వెబ్‌సైటులో ఉన్న తెలుగు పుస్తకాలను డీఎల్‌ఐ పేజీలకు లింకులతో సహా జాబితా రూపొందించి, ఆ జాబితాను తెలుగు వికీపీడియాలో వ్యాసాల నాణ్యత పెంచేందుకు, కొత్త వ్యాసాలు రూపొందించేందుకు ఉపయోగించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ లక్ష్యాలు సాధించేందుకు మార్గదర్శక పేజీగా దీన్ని వాడదలిచాము. ఈ ప్రాజెక్టు ద్వారా ముఖ్యంగా డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితాను అభివృద్ధి చేసి, దానిలోని సమాచారంతో తెవికీలో వ్యాసాలను అభివృద్ధి చేస్తాము.

ప్రాజెక్టు ప్రయోజనం

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పాతిక వేలకు పైగా తెలుగు పుస్తకాలు ఉచితంగా చదువుకునేందుకు వీలుగా ఉన్నాయి. ప్రాజెక్టు నిర్వాహకులు వెబ్‌సైట్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టులోని పుస్తకాలన్నీ కాపీరైట్ లేనివే అవుతాయి. కానీ, కొన్ని పుస్తకాలు కాపీరైట్ ఉన్నవి కాగా వాటి రచయితల నుండి అనుమతులు సంపాదిస్తున్నారని తెలిపారు. ఇంత ప్రయోజనకరమైన వెబ్‌సైటును వికీమీడియన్లు ఉపయోగించుకుంటే తెలుగు వికీపీడియా, తెలుగు వికీసోర్స్, తెలుగు వికీకోట్స్, తెలుగు విక్ష్నరీ బాగా అభివృద్ధి చెందుతాయి.
దురదృష్టవశాత్తూ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో అపురూపమైన గ్రంథాలు ఉన్నా వాటి పేర్లు, రచయితల పేర్లు, వివరాలు వంటివి వెబ్‌సైట్‌లో పొందిపరిచిన తీరు సరిగా లేదు. తెలుగులో సరళమైన పేరును లిప్యంతరీకరణ(ట్రాన్స్‌లిటరేషన్) చేసేవారు తెలుగు వారికి అర్థం కాని విధంగా, సెర్చ్ ద్వారా వెతుక్కోవడానికి సాధ్యం కాని విధంగా తయారు చేశారు. ఒక్కో పుస్తకాన్ని తెరిచి మొదటి పదిపేజీలు డౌన్‌లోడ్ చేసుకుని చదివితే కానీ పుస్తకం పేరు, రచయిత పేరు తెలియని స్థితి నెలకొంది. అందువల్ల ఈ పుస్తకనిధి నుంచి ప్రయోజనాలు రాబట్టుకోలేకపోతున్నాం.
ఈ ప్రాజెక్టు ద్వారా డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా పేజీలో ఎంచుకున్న పుస్తకాలకు వివరాలతో కాటలాగ్(పుస్తకాల జాబితా) తయారు చేస్తాం. ఆ వివరాల్లో పుస్తకం పేరు, డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా(డీఎల్‌ఐ) లింకు, రచయిత/సంపాదకుని పేరు, విభాగం(కాటగిరీ), పుస్తకంలోని సమాచారం గురించి క్లుప్తంగా వివరాలు, డీఎల్‌ఐ వారు పుస్తకానికి ఇచ్చిన కోడ్, పుస్తకం ముద్రింపబడిన తేదీ ఉంటాయి. అలాగే కొందరు వికీపీడియన్లు తెవికీలో ఈ పుస్తకాల్లోని సమచారం ఉపయోగించి వ్యాసాలను అభివృద్ధి చేయడం, కొత్త వ్యాసాలు తయారుచేయడం చేస్తారు.

ఏం చెయ్యాలి

జాబితా పని

  • తెలుగు వికీపీడియాలోని డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన వివిధ జాబితాలు(అకార క్రమంలో) వాటిలో ఇచ్చిన ఆప్షన్లు గమనించండి.
  • డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల కోసం వెతికి జాబితాలో పొందుపరచని మంచి పుస్తకం ఏదైనా ఉంటే దాన్ని వేరే టాబ్‌లో తెరవండి.
  • ఆపైన పుస్తకం పేజీలు తెరిచి వివరాల కోసం కొన్ని పేజీలు డౌన్లోడ్ చేయండి. వాటిలోని పుస్తకం పేరు, రచయిత పేరు చూసి ఇక్కడ పొందుపరుస్తూ, పుస్తకానికి చేరేందుకు లింకు కూడా జాబితాలో ఇవ్వండి.
  • పుస్తకం ముందుమాట, విషయసూచిక చదివి అర్థమైనంత మేరకు పుస్తకం ఏ విభాగానికి చెందినది, పుస్తకంలో ఇచ్చిన సమాచారం ఏమిటి అన్నవి రాసే ప్రయత్నం చేయండి. అలాగే అక్కడే పుస్తకానికి డీఎల్‌ఐ వారు ఇచ్చిన మెటాడేటాలో కోడ్, ప్రచురించిన సంవత్సరం చూసి వికీపేజీలో రాయండి.

ముఖ్య గమనిక: ఈ ప్రాజెక్టు పని కోసం రాసేప్పుడు డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వారు పుస్తకం పేజీల్లో ఇచ్చిన సమాచారం ఏమాత్రం విశ్వసించకండి. పుస్తకం పేజీల్లో ఉన్న సమాచారం మాత్రమే నమ్మి జాబితాలో చేర్చండి.

జాబితా ఉపయోగించి తెవికీని అభివృద్ధి చేసే పని

తెలుగు వికీపీడియాలో సమాచారం చేర్చేందుకు ఉపయోగించే ఎన్నో పుస్తకాలను ఈ ప్రాజెక్టు ద్వారా అందుబాటులోకి తెచ్చుకుంటున్నాం. కనుక ఆ పుస్తకాల జాబితా నుంచి డీఎల్‌ఐ పేజీకి వెళ్ళి పుస్తకంలోని పేజీలు దిగుమతి(డౌన్లోడ్) చేసుకుని చక్కని వ్యాసాలు రాయవచ్చు. ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేయవచ్చు.

  • మీకు ఆసక్తికరంగా అనిపించిన పుస్తకాన్ని జాబితాలో చూసి అక్కడ ఇచ్చిన బయట లంకె(ఎక్స్‌టర్నల్ లింక్) ద్వారా నేరుగా డీఎల్‌ఐలో ఆ పుస్తకం పేజీకు చేరుకోండి.
  • అది పుస్తక సమాచారం నిక్షిప్తం చేసిన పేజీ. ఆ పేజీలో BookReader-1 అని వున్న దగ్గరకు వెళ్ళి Click hereని క్లిక్ చేయండి. దానివల్ల మీరు పుస్తకాలు తెరిచేందుకు పెట్టిన పేజీలోకి వెళ్తారు. క్రింద PTIFF లేదా HTML లేదా TXT లేదా RTF లేదా Meta అని ఉంటుంది. అక్కడకు వెళ్ళి PTIFFను ఎంచుకుంటే పేజీని డౌన్‌లోడ్ చేస్తుంది. పక్కనే ఉన్న ఆప్షన్ ద్వారా వరుసగా పేజీలన్నీ విడివిడి డౌన్లోడ్లుగా దిగుమతి చేసుకుని చదువుకోవచ్చు.
  • ఒక్కోపేజీని చదువుతూ, వివరాలు తెలుసుకుంటూ తెలుగు వికీపీడియా, విక్ష్నరీ, వికీకోట్స్‌ మొదలైన ప్రాజెక్టుల్లో వ్యాసాలు రాసి, ఉన్న వ్యాసాలు అభివృద్ధి చేసి ప్రాజెక్టుకు తోడ్పడవచ్చు.
  • ఈ ప్రాజెక్టు ద్వారా మీరు అభివృద్ధి చేస్తున్న వ్యాసాల చర్చ పేజీల్లో ప్రాజెక్టు మూసను పెట్టగలిగితే, మీతో పాటు ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్న వారంతా తెలుసుకుని మీ కృషిలో మరింత తోడ్పడే వీలుంటుంది.

పని విభజన

ఈ ప్రాజెక్టులో పాలుపంచుకునే వికీపీడియన్లు తమకు ఆసక్తి వున్న పనిని స్వీకరించండి. ఆ క్రమంలో కింద బాధ్యతవహించే వికీపీడియన్లు అన్న వరుసలో మీకు ఆసక్తివున్న పని వద్ద సంతకం(~~~~) చేయండి. ప్రక్కగడిలో మీరు ఎంచుకున్న పని విషయంలో సూచనలు ఏమైనా ఉంటే చేయండి. ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్య ప్రతిపాదనలలో, నిర్వహణ ప్రణాళికలో పాలుపంచుకునేందుకు ప్రాజెక్టు చర్చ పేజీని ఉపయోగించండి.

చేయాల్సిన పని బాధ్యత వహించే వికీపీడియన్లు సలహాలు/సూచనలు
డీఎల్‌ఐ పుస్తకాలను జాబితాలో చేర్చడం పవన్ సంతోష్ (చర్చ) 04:31, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం] --
జాబితాలోని పుస్తకాల పేజీల సృష్టి/అభివృద్ధి Rajasekhar1961 (చర్చ) 05:07, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]
జాబితాలో ప్రస్తావించిన రచయితల పేజీల సృష్టి/అభివృద్ధి
జాబితాలోని పుస్తకాలను ఉపయోగించి వేర్వేరు పేజీలను అభివృద్ధి చేయడం
కాపీరైటు లేని పుస్తకాలను వికీసోర్సులో చేర్చడం Rajasekhar1961 (చర్చ) 05:07, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వికీసోర్సులో ప్రాజెక్టు ద్వారా చేర్చిన పుస్తకాలను టైప్ చేయడం
ఎడిట్-అ-థాన్ల నిర్వహణలో పాలుపంచుకోవడం పవన్ సంతోష్ (చర్చ) 04:47, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఫేస్‌బుక్, బ్లాగ్, ట్విట్టర్ మొదలైన సోషల్ మీడియాల్లో ప్రాజెక్టుకు ప్రాచుర్యం కల్పించడం * పవన్ సంతోష్ (చర్చ) 04:40, 28 జూలై 2014 (UTC),* Pranayraj1985 (చర్చ) 04:45, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం] ఫేస్‌బుక్‌లో వికీపీడియన్లు నాటక రంగం, సినీరంగం, సాహిత్యం, మొదలైన గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారు. వారు ప్రతీరోజూ జాబితాలో జరుగుతున్న మార్పులు చూసి ఆయా గ్రూపుల సభ్యులకు ఆసక్తికరమైన పుస్తకాల డిస్క్రిప్షన్‌తో జాబితా పేజీల లింకును పోస్ట్ చేయవచ్చు.
ప్రసార మాధ్యమాలు, సాహిత్య పత్రికల్లో ప్రాజెక్టుకు ప్రాచుర్యం కల్పించడం పవన్ సంతోష్ (చర్చ) 04:47, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

జాబితా కోసం పుస్తకాల ఎంపిక

డి.ఎల్.ఐ.లో పుస్తకాలను తెలుగు వికీపీడియాలోని జాబితాకు ఎక్కించేందుకు ఎంచుకునేప్పుడు ఈ క్రింది విషయాలు మీకు ఉపకరించవచ్చు:

  • పుస్తకాలన్నీ కాపీరైట్ లేనివేనని డీఎల్‌ఐ వారు చెప్తున్నా కాదని కొందరు అంటున్న నేపథ్యంలో వీలున్నంతలో మరీ కొత్త పుస్తకాలు ఎంచుకోకపోవడమే ఉత్తమం. ఐతే మరీ మంచి పుస్తకం, తెలుగు వికీపీడియా అభివృద్ధికి బాగా దోహదపడుతుందనుకున్న పుస్తకం ఐతే ఎప్పుడు ప్రచురణ ఐనా వదిలిపెట్టవద్దు. ఎందుకంటే వికీపీడియాలో కేవలం లంకెలు ఇచ్చి వివరాలు మాత్రమే ఇస్తున్నాం. నేరుగా పుస్తకాన్ని పెట్టలేదు. కనుక కాపీరైట్ లేని పుస్తకాలు చేర్చినా సమస్యలేని విధంగానే విడివిడి పేజీలుగా డీఎల్‌ఐ వారు పెట్టారు. కాపీరైట్ సమస్య ఉత్పన్నం కాదు. కాకపోతే కాపీరైట్ లేని పుస్తకాలు కాని పక్షంలో వికీపీడియా, విక్షనరీ, వికీకోట్స్‌కు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప వికీసోర్స్‌ను సుసంపన్నం చేసేందుకు పనికిరావు.
  • వికీమీడియా ఉద్యమానికి పూర్తిస్థాయిలో అక్కరకు వచ్చే విజ్ఞానసర్వస్వ సమాచారంతో నిండిన పుస్తకాలే ముందుగా జాబితా చెయ్యండి. చరిత్ర గ్రంథాలు, జీవితచరిత్రలు, వ్యాస సంకలనాలు, ఆత్మకథలు వంటి కాల్పనికేతర సాహిత్యమే విజ్ఞానసర్వస్వ వ్యాసాలు తయారుచేయడానికి పూర్తిస్థాయిలో పనికి వస్తుంది. నవలలు, కథలు, కవితా సంకలనాలు, పద్యకావ్యాలు వంటి కాల్పనిక సాహిత్యం పూర్తిగా విజ్ఞానసర్వస్వ నిర్మాణానికి పనికిరాదనడం కుదరదు కానీ కొన్ని రకాల వ్యాసాలే అభివృద్ధి చేయడం కుదురుతుంది. ఉదాహరణకు కాకతీయ సంచిక అనే పుస్తకం వల్ల కాకతీయుల కాలం నాటి సాంఘిక, రాజకీయ విధానాల గురించి ఎంతో సమాచారం చేర్చగలం. అదే ఏదైనా కాకతీయుల కాలం నాటిని వర్ణించిన చారిత్రిక నవలను అలా ఉపయోగించుకోలేం. కానీ ఇదే అంతటికీ వర్తిస్తుందనుకోవడమూ సరైంది కాదు. తిరుపతి వెంకట కవుల పద్యనాటకాలు, శ్రీనాథుని కావ్యాలు వంటి సుప్రసిద్ధి పొందిన పుస్తకాలను చేర్చడం వల్ల వికీసోర్సు సుసంపన్నమవుతుందని గుర్తుంచుకోవాలి.

ప్రాజెక్ట్ సభ్యులు

ఆసక్తి ఉన్న సభ్యులందరూ ఈ ప్రాజెక్టులో చేరి తమ కృషిని క్రమబద్ధీకరించి మరిన్ని సత్ఫలితాలు సాధించే ప్రయత్నం చేయండి. ఈ ప్రాజెక్టులో చేరాలంటే ఉదాహరణకు {{సభ్యుడు|శ్రీశ్రీ|పేరు}} అని చేరిస్తే మీరు ప్రాజెక్టులో చేరినట్టే. ఆపై లక్ష్యాలను గమనించి కృషి ప్రారంభించెయ్యండి.(షరా:మీరు ప్రాజెక్టుకు సంబంధించిన వ్యాసాలను అభివృద్ధి చేసేందుకు, కొత్త పేజీలు చేర్చేందుకు ఈ ప్రాజెక్టులో సభ్యత్వం స్వీకరించాల్సిన పనేమీ లేదని గుర్తుపెట్టుకోండి)

భూక్యాగోపినాయక్, తెలుగు అధ్యాపకులు,పి.వి.కే.న్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల,చిత్తూరు,ఆంధ్రప్రదేశ్

ప్రాజెక్టుకు సంబంధించిన పేజీలు

జాబితాలు

ప్రాజెక్టు ద్వారా ముఖ్యంగా అభివృద్ధి చేయాల్సిన పేజీలు ఇవి:

  1. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - అంకెలు
  2. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - అ
  3. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ఆ
  4. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ఇ
  5. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ఈ
  6. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ఉ
  7. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ఊ
  8. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ఋ
  9. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ఎ
  10. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ఏ
  11. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ఐ
  12. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ఒ
  13. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ఓ
  14. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ఔ
  15. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - అం
  16. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - క
  17. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ఖ
  18. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - గ
  19. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ఘ
  20. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - చ
  21. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ఛ
  22. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - జ
  23. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ఝ
  24. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ట
  25. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ఠ
  26. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - డ
  27. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ఢ
  28. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - త
  29. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - థ
  30. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ద
  31. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ధ
  32. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - న
  33. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ప
  34. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ఫ
  35. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - బ
  36. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - భ
  37. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - మ
  38. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - య
  39. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ర
  40. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ల
  41. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - వ
  42. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - శ
  43. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ష
  44. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - స
  45. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - హ
  46. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - ళ
  47. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా - క్ష

వికీలలో మిగిలిన పేజీలు

ఈ జాబితాను ఉపయోగించి తెలుగు వికీపీడియాలోని పలు వ్యాసాలు, వికీసోర్సులో పుస్తకాలు, వికీకోట్సులో వ్యాసాలు, విక్ష్నరీలో పదాలు అభివృద్ధి చేయవచ్చు. తెలుగు వికీపీడియాలో ఈ జాబితాలోని పుస్తకాలను, జాబితాలోని సమాచారాన్ని ఉపయోగించి సృష్టించే/అభివృద్ధిచేసే పేజీల చర్చా పేజీల్లో {{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి}} అన్న మూస పెడితే సహ వికీపీడియన్లకు ఉపయుక్తంగా ఉంటుంది.

ప్రాజెక్టు మూసలు

ఈ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేసే అన్ని వ్యాసాల చర్చా పేజీలలో {{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి}} అనే మూసను ఒక దానిని చేర్చటం వలన ఆ వ్యాసాలు ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహింపబడుతున్నాయని అందరికీ తెలియజేయవచ్చు. అంతేకాక దీనికి సంబంధించిన వ్యాసాలలో మార్పులు చేయాలనుకుంటున్న వారిని ఇక్కడకు చేర్చి తగిన సూచనలు/మార్గనిర్దేశాలు చేయవచ్చు.

వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
హెచ్చరిక: ప్రస్తుతం ఈ మూసను ఒక చర్చాపేజీ కాని పేజీలో ఉంచారు. ఈ మూసను చర్చా పేజీలలో మాత్రమే ఉంచాలి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్న సభ్యులు తమ వాడుకరి పేజీల్లో {{మూస:తెలుగు సమాచారం అందుబాటులోకి}} అన్న మూసను పెట్టుకోవడం ద్వారా మీ పేజీ ఈ ప్రాజెక్టు సభ్యుల వర్గీకరణలోకి చేరుతుంది. ఈ ప్రాజెక్టు సభ్యత్వ మూసలో అయ్యంకి వెంకటరమణయ్య ఫోటో ఉపయోగిస్తున్నాము. ఆయన తెలుగునాట గ్రంథాలయోద్యమ పితామహుడన్న పేరుపొందిన వ్యక్తి. పుస్తక విజ్ఞానం అందరికీ అందుబాటులోకి రావాలన్న సంకల్పంతో ఊరూరా తిరిగి అక్కడి యువతను, పెద్దలను ఉత్సాహపరిచి గ్రంథాలయాలను ఏర్పాటుచేయించారు. గ్రంథాలయ వారోత్సవాలు వంటి కార్యక్రమాలు ఇప్పటికీ ఆయన జయంతి నాడు ప్రారంభమవుతాయి. అటువంటి మహనీయుని స్ఫూర్తితో ఈ ప్రాజెక్టు అంతర్జాల గ్రంథాలయాలను అభివృద్ధిచేయాలని ఆయన ఫోటోను వారికి గౌరవంగా ఉపయోగిస్తున్నాము.


మూలాలు