ఐస్ బకెట్ ఛాలెంజ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:సంఘటనలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1: పంక్తి 1:
'''ఐస్ బకెట్ ఛాలెంజ్ ''' అనగా ఒక బకెట్ నిండా మంచు ముక్కలతో కూడిన చల్లని నీటిని తీసుకుని నెత్తిమీదినుండి కుమ్మరించుకోవడం.
'''ఐస్ బకెట్ ఛాలెంజ్ ''' అనగా ఒక బకెట్ నిండా మంచు ముక్కలతో కూడిన చల్లని నీటిని తీసుకుని నెత్తిమీదినుండి కుమ్మరించుకోవడం.
==నేపధ్యము==
==నేపధ్యము==

పంచవ్యాప్తంగా సెలబ్రిటీలందరూ విపరీతంగా పాల్గొంటున్న పోటీ ఇది. ఎవరూ ఛాలెంజ్ చేయకపోయినా కొంతమంది నెత్తిమీద నుంచి చల్లటి ఐసు నీళ్లు పోసుకుని ఇందులో పాల్గొంటే, [[అక్షయ్ కుమార్]] లాంటి వాళ్ల మీద అభిమానులు బక్కెట్ల కొద్దీ నీళ్లు కుమ్మరిస్తున్నారు. ఏఎల్ఎస్ అనే వ్యాధిని అరికట్టేందుకు జరుగుతున్న పరిశోధనల కోసం విరాళాల సేకరణకు ప్రారంభించిన ఈ ఛాలెంజ్.. ఇప్పుడు ఓ పబ్లిసిటీ వ్యవహారంలా కూడా మారిపోతోంది.
'ఐస్ బకెట్ చాలెంజ్' ద్వారా దాతృత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పరోపకారి కోరె గ్రిఫిన్. పుర్రె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన స్నేహితుడి సహాయార్థం 'ఐస్ బకెట్ చాలెంజ్' దాతృత్వ కార్యక్రమం మొదలుపెట్టారు. గత కొద్ది రోజులుగా ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా సందడి చేస్తోంది. హాలీవుడ్, బాలీవుడ్ తారలు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు 'ఐస్ బకెట్ చాలెంజ్'లో పాల్గొంటున్నారు. తమ వంతుగా విరాళాలు అందజేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలందరూ విపరీతంగా పాల్గొంటున్న పోటీ ఇది. ఎవరూ ఛాలెంజ్ చేయకపోయినా కొంతమంది నెత్తిమీద నుంచి చల్లటి ఐసు నీళ్లు పోసుకుని ఇందులో పాల్గొంటే, [[అక్షయ్ కుమార్]] లాంటి వాళ్ల మీద అభిమానులు బక్కెట్ల కొద్దీ నీళ్లు కుమ్మరిస్తున్నారు. ఏఎల్ఎస్ అనే వ్యాధిని అరికట్టేందుకు జరుగుతున్న పరిశోధనల కోసం విరాళాల సేకరణకు ప్రారంభించిన ఈ ఛాలెంజ్.. ఇప్పుడు ఓ పబ్లిసిటీ వ్యవహారంలా కూడా మారిపోతోంది.
==కోరె గ్రిఫిన్ మరణం==
[[మసాచుసెట్స్]] లోని నాంటుకెట్ సముద్ర తీరంలో ఆగస్టు 16న జరిగిన డైవింగ్ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. డైవింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయి మునిపోయారు.27 ఏళ్ల వయసులోనే గిఫ్రిన్ మృతి చెందడం విచారకరం. చనిపోవడానికి ముందు వరకు అతడు లక్ష డాలర్ల విరాళాలు సేకరించడం విశేషం. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా గిఫ్రిన్ ను ఆయన తండ్రి రాబర్ట్ వర్ణించారు. 'గత రాత్రి ఫోన్ చేసి తాను స్వర్గంలో ఉన్నట్టు గిఫ్రిన్ చెప్పాడు' అని సంతాప సందేశంలో ఆయన పేర్కొన్నారు.


==మనదేశంలో ఐస్ బకెట్ ఛాలెంజ్ స్వీకరించిన ప్రముఖులు==
==మనదేశంలో ఐస్ బకెట్ ఛాలెంజ్ స్వీకరించిన ప్రముఖులు==

10:00, 22 ఆగస్టు 2014 నాటి కూర్పు

ఐస్ బకెట్ ఛాలెంజ్ అనగా ఒక బకెట్ నిండా మంచు ముక్కలతో కూడిన చల్లని నీటిని తీసుకుని నెత్తిమీదినుండి కుమ్మరించుకోవడం.

నేపధ్యము

'ఐస్ బకెట్ చాలెంజ్' ద్వారా దాతృత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పరోపకారి కోరె గ్రిఫిన్. పుర్రె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన స్నేహితుడి సహాయార్థం 'ఐస్ బకెట్ చాలెంజ్' దాతృత్వ కార్యక్రమం మొదలుపెట్టారు. గత కొద్ది రోజులుగా ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా సందడి చేస్తోంది. హాలీవుడ్, బాలీవుడ్ తారలు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు 'ఐస్ బకెట్ చాలెంజ్'లో పాల్గొంటున్నారు. తమ వంతుగా విరాళాలు అందజేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలందరూ విపరీతంగా పాల్గొంటున్న పోటీ ఇది. ఎవరూ ఛాలెంజ్ చేయకపోయినా కొంతమంది నెత్తిమీద నుంచి చల్లటి ఐసు నీళ్లు పోసుకుని ఇందులో పాల్గొంటే, అక్షయ్ కుమార్ లాంటి వాళ్ల మీద అభిమానులు బక్కెట్ల కొద్దీ నీళ్లు కుమ్మరిస్తున్నారు. ఏఎల్ఎస్ అనే వ్యాధిని అరికట్టేందుకు జరుగుతున్న పరిశోధనల కోసం విరాళాల సేకరణకు ప్రారంభించిన ఈ ఛాలెంజ్.. ఇప్పుడు ఓ పబ్లిసిటీ వ్యవహారంలా కూడా మారిపోతోంది.

కోరె గ్రిఫిన్ మరణం

మసాచుసెట్స్ లోని నాంటుకెట్ సముద్ర తీరంలో ఆగస్టు 16న జరిగిన డైవింగ్ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. డైవింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయి మునిపోయారు.27 ఏళ్ల వయసులోనే గిఫ్రిన్ మృతి చెందడం విచారకరం. చనిపోవడానికి ముందు వరకు అతడు లక్ష డాలర్ల విరాళాలు సేకరించడం విశేషం. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా గిఫ్రిన్ ను ఆయన తండ్రి రాబర్ట్ వర్ణించారు. 'గత రాత్రి ఫోన్ చేసి తాను స్వర్గంలో ఉన్నట్టు గిఫ్రిన్ చెప్పాడు' అని సంతాప సందేశంలో ఆయన పేర్కొన్నారు.

మనదేశంలో ఐస్ బకెట్ ఛాలెంజ్ స్వీకరించిన ప్రముఖులు

సోనాక్షి సిన్హా

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఓ సరికొత్త పద్ధతిలో ఐస్ బకెట్ ఛాలెంజ్ స్వీకరించింది.ఎవరూ తనను ఛాలెంజ్ చేయకపోయినా తనంతట తానే ఇందులో పాల్గొంది. ఈ తరహా ఛాలెంజ్ పేరుతో నీళ్లు వృథా చేయడం తనకు ఇష్టం లేదని అంటూ.. బకెట్ లో కేవలం ఒకే ఒక్క ఐస్ క్యూబ్ వేసుకుని, దాన్ని తన తలమీద నుంచి కిందకు వేసుకుంది. అనవసరంగా నీళ్లు వృథా చేయడం మాని ముందు ఆ సైట్ లోకి వెళ్లి విరాళాలు ఇవ్వాలని అభిమానులను కోరింది. ఈ మేరకు ఫేస్‌బుక్ లో తన వీడియోను కూడా పోస్ట్ చేసింది.

'ఎవరూ నన్ను నామినేట్ చేయలేదు. అయినా నేను ఛాలెంజ్ స్వీకరించాను. ఇప్పుడు మీ అందరినీ నేను నామినేట్ చేస్తున్నాను. మీరు ఇప్పటికే స్నానం చేసి ఉంటే మాత్రం ఐసునీళ్లు పోసుకోవద్దు. స్నానం చేయకపోతే మాత్రం మీ ఇష్టం. కానీ తప్పనిసరిగా www.als.org సైట్ లోకి వెళ్లి విరాళాలు మాత్రం ఇవ్వండి' అని అందులో రాసింది. దీనివల్ల ఏఎస్ఎల్ వ్యాధి నివారణకు పరిశోధనలకు మరింత ఊతం అందే అవకాశం ఏర్పడింది.

బయటి లంకెలు