కలుగోడు అశ్వత్థరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 69: పంక్తి 69:
[[వర్గం:1901 జననాలు]]
[[వర్గం:1901 జననాలు]]
[[వర్గం:1972 మరణాలు]]
[[వర్గం:1972 మరణాలు]]
[[వర్గం: అనువాదకులు]]
[[వర్గం: తెలుగు అనువాదకులు]]
[[వర్గం: అనంతపురం జిల్లా కవులు]]
[[వర్గం: కన్నడ అనువాదకులు]]
[[వర్గం: అనంతపురం జిల్లా ప్రముఖులు]]
[[వర్గం: కన్నడ కవులు]]
[[వర్గం: తెలుగు కవులు]]

13:07, 8 సెప్టెంబరు 2014 నాటి కూర్పు

కలుగోడు అశ్వత్థరావు
జననంకలుగోడు అశ్వత్థరావు
(1901-07-25)1901 జూలై 25
India కలుగోడు గ్రామం, గుమ్మగట్ట మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం1972 జూలై 19
వృత్తికరణము
ప్రసిద్ధిప్రముఖ తెలుగు,కన్నడ కవి
మతంహిందూ
తండ్రికలుగోడు వెంకోబరావు
తల్లిలక్ష్మమ్మ

బడగనాడు శాఖకు చెందిన మధ్వ బ్రాహ్మణ కుటుంబములో వెంకోబరావు, లక్ష్మమ్మ దంపతులకు కలుగోడు అశ్వత్థరావు[1] 1901 వ సంవత్సరం జూలై 25 వ తేదీన జన్మించాడు. కేవలం నాలుగవ తరగతి వరకే చదివిన ఇతడు సహజంగా అబ్బిన విద్యతోపాటు స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. రాయదుర్గం తాలూకా కలుగోడు లోను, కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా తళుకు గ్రామంలోను కరణముగా పనిచేశాడు. ఈ రెండు గ్రామాలలోను ఇతనికి చాలినన్ని భూములున్నాయి. ఇతని జీవితం హాయిగా గడచింది. ఇంటికి వచ్చిన అతిథులను గొప్పగా సత్కరించేవాడు. తన గ్రంథాలను ప్రచురించుకొనడానికి స్వంతంగా రాయదుర్గంలో కవిరాజ ముద్రాక్షరశాలను నెలకొల్పాడు. తన చివరి దశలో దీనిని రాయల పరిషత్తుకు ఉచితంగా ఇచ్చివేశాడు.

రచనలు

  1. సర్వజ్ఞునివచనములు - కన్నడభాష నుండి తెలుగులోనికి అనువాదం
  2. ವೇಮನ ರತ್ನಗಳು - వేమన పద్యాలను కన్నడ భాషలోనికి అనువాదం
  3. అనుభవామృత సారము - మహాలింగ రంగ కన్నడలో వ్రాసిన అనుభవామృత అనే అద్వైత వేదాంత గ్రంథానికి తెలుగు అనువాదం
  4. సోమేశ్వర శతకము - పాల్కురికి సోమనాథుని కన్నడ శతకానికి తెలుగు అనువాదం
  5. హరిభక్తసారము - కనకదాసు కన్నడరచనకు తెలుగు సేత
  6. ಭಾಗವತ ಗೀತಿಗಳು - పోతనభారతంలోని గజేంద్రమోక్షము, రుక్మిణీకళ్యాణము, ప్రహ్లాదచరిత్ర,వామనచరిత్ర ఘట్టాల కన్నడానువాదము
  7. ಶೃಂಗಾರ ವರೂಧಿನಿ - మనుచరిత్ర కన్నడానువాదము
  8. ಕಂದಪದ್ಯ ರಾಮಾಯಣ - స్వతంత్ర కన్నడ రచన
  9. ಶ್ರೀಕೃಷ್ಣಲೀಲೆ(ಬೈಲು ನಾಟಕ) - స్వతంత్ర కన్నడ వీధి నాటకము
  10. ಸುಭದ್ರಾಪರಿಣಯ ನಾಟಕ - స్వతంత్ర కన్నడ రచన
  11. గధాయుద్ధము - రన్న కవిచే రచింపబడిన ಸಾಹಸ ಭೀಮ ವಿಜಯ అనే కన్నడ కావ్యానువాదము
  12. దండకరామాయణము
  13. అశ్వత్థ భారతము (ఆది చతుష్కము మాత్రము)
  14. అశ్వత్థేశ త్రిశతి (కందములు)
  15. మూడు శతకములు
  16. మయూరధ్వజము (నాటకము)
  17. యువతీ వివాహ భాగ్యోదయము (నాటకము)
  18. అక్కమహాదేవి వచనములు
  19. బ్రాహ్మణుడు
  20. గురుదక్షిణ

బిరుదములు,పురస్కారములు

  • కవిరాజ
  • 1967 మే 6వ తేదీ హిందూపురంలో రాయలకళాపరిషత్ సత్కరించి కవిసవ్యసాచి బిరుదును ప్రదానం చేసింది.[2]
  • ఉభయభాషాభాస్కర

మూలాలు

  1. రాయలసీమ రచయితల చరిత్ర - రెండవసంపుటి - కల్లూరు అహోబలరావు
  2. సీమసాహితీ స్వరం శ్రీసాధన పత్రిక - డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి పుట 240