వడ్డాది సుబ్బారాయుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 49: పంక్తి 49:
ఈయన మొత్తం 7 నాటకములను రచించారు. 1. [[వేణీ సంహారము|వేణిసంహారం]] (రచన-1883, ప్రచురణ-1886), 2. విక్రమోర్వశీయం (రచన-1884, ప్రచురణ-1889), 3. ప్రబోధ చంద్రోదయం (రచన-1891, ప్రచురణ-1893) 4. చండ కౌశికము (1900), 5. అభిజ్ఞాన శాకుంతలము (1906), 6. మల్లికామారుత ప్రకరణము (1903, 1929), ఆంధ్రకుందమాల (రచన-1931, ప్రచురణ-1932). ఈ నాటకాలన్ని సంస్కృ తానువాదాలే, అన్ని పాఠ్యగ్రంథాలుగా నిర్ణయించబడినవే.
ఈయన మొత్తం 7 నాటకములను రచించారు. 1. [[వేణీ సంహారము|వేణిసంహారం]] (రచన-1883, ప్రచురణ-1886), 2. విక్రమోర్వశీయం (రచన-1884, ప్రచురణ-1889), 3. ప్రబోధ చంద్రోదయం (రచన-1891, ప్రచురణ-1893) 4. చండ కౌశికము (1900), 5. అభిజ్ఞాన శాకుంతలము (1906), 6. మల్లికామారుత ప్రకరణము (1903, 1929), ఆంధ్రకుందమాల (రచన-1931, ప్రచురణ-1932). ఈ నాటకాలన్ని సంస్కృ తానువాదాలే, అన్ని పాఠ్యగ్రంథాలుగా నిర్ణయించబడినవే.
===మల్లికామారుత ప్రకరణము===
===మల్లికామారుత ప్రకరణము===
"కరుణ ఏవ ఏకో రసః-కరుణ ఒక్కటే రసం" అన్న సంస్కృత కవి [[భవభూతి]]. ఆయన కాళిదాసు తర్వాత సంస్కృత సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందినవారు. ఆయన రచించిన [[మాలతీ మాధవం]] అనే రచనకు అనువాదమిది.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=mallikaa%20maarutamu%20puurvabhaagamu%2031&author1=subbaaraaya%20vad%27d%27aadi&subject1=GENERALITIES&year=1903%20&language1=Telugu&pages=135&barcode=2030020025139&author2=&identifier1=&publisher1=vad%27d%27aadi%20subbaaraaya&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=119&unnumberedpages1=10&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data6/upload/0160/908 భారత డిజిటల్ లైబ్రరీలో మల్లికామారుత ప్రకరణము పుస్తకం.]</ref>
"కరుణ ఏవ ఏకో రసః-కరుణ ఒక్కటే రసం" అన్న సంస్కృత కవి [[భవభూతి]]. ఆయన కాళిదాసు తర్వాత సంస్కృత సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందినవారు. ఆయన రచించిన [[మాలతీ మాధవం]] అనే రచనకు అనువాదమిది.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=mallikaa%20maarutamu%20puurvabhaagamu%2031&author1=subbaaraaya%20vad%27d%27aadi&subject1=GENERALITIES&year=1903%20&language1=Telugu&pages=135&barcode=2030020025139&author2=&identifier1=&publisher1=vad%27d%27aadi%20subbaaraaya&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=119&unnumberedpages1=10&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data6/upload/0160/908 భారత డిజిటల్ లైబ్రరీలో మల్లికామారుత ప్రకరణము పుస్తకం.]</ref> దీని ప్రథమాంకము యొక్క తొలికూర్పు సరస్వతీ ముద్రాక్షరశాల, కాకినాడ యందు 1903 లో ముద్రించబడినది.


==మూలాలు==
==మూలాలు==

04:29, 1 అక్టోబరు 2014 నాటి కూర్పు

వడ్డాది సుబ్బారాయుడు
వడ్డాది సుబ్బారాయుడు
జననం30 జూలై, 1854
మరణం2 మార్చి, 1938
ఇతర పేర్లువసురాయకవి
తల్లిదండ్రులు
  • సూరపరాజు (తండ్రి)
  • లచ్చాంబ (తల్లి)

వసురాయకవిగా సుప్రసిద్ధులై, సహస్రమాస జీవితోత్సవమును చేసుకొన్న ధన్యజీవి వడ్డాది సుబ్బరాయుడు (1854 - 1938). తొలి తెలుగు నాటకకర్తలలో వీరికి విశిష్ట స్థానము కలదు.

జీవితసంగ్రహం

సుబ్బరాయుడు 1854 లో తూర్పు గోదావరి జిల్లాలోని పాసర్లపూడి గ్రామంలో (ఆనంద నామ సంవత్సర శ్రావణ శుద్ధ పంచమి ఆదివారం నాడు) జన్మించాడు. చిన్నతనంలోనే సుబ్బరాయుడు తల్లిదండ్రులు మరణించారు. ఈయన బడిలో చదివి పాసయిన పరిక్ష ఒక్కటీ లేదని చెబుతారు. అయినప్పటికీ, తన 14వ ఏట నుండే భజగోవింద శ్లోకాలను తెలిగించడంతో కవిత్వం చెప్పడం మొదలెట్టారు.1874లో రాజమండ్రి చేరి అక్కడ ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేశాడు. సమకాలీకులైన వావిలాల వసుదేవశాస్త్రి, కందుకూరి వీరేశలింగంతోపాటు ఈయన్ను కలిపి రాజమండ్రి త్రయం అని పిలిచేవారు. సుబ్బరాయుడు చాటు పద్యాలు చెప్పడంలో గొప్ప ఆసక్తి కనబరచేవాడు. 1875లో ప్రారంభమైన ఈయన కవితా వ్యాసంగం మరణించేవరకూ సాగింది. ఈయన చెప్పిన చాటు పద్యాలు వసురాయ చాటు ముక్తావళి మరియు వసురాయ చాటు ప్రబంధం అనే సంపుటాలుగా వెలువడ్డాయి. ఈయన ప్రతిభకు ముగ్ధులైన పురప్రముఖులు గండపెండేరం తొడిగి, సూక్తి సుధానిధి అనే బిరుదునిచ్చి సత్కరించారు.[1]

రచనా వ్యాసంగం

సుబ్బరాయుడు ముఖ్యంగా శతక రచనకు ప్రసిద్ధి. ఆయన నామనందన శతకం (1877), భక్త చింతామణి శతకం (1883), ఆర్త రక్తమణి శతకం (1933) మొదలైన శతకాలు వ్రాసాడు. ఇందులో భక్త చింతామణి శతకం అన్నింటికంటే ఉతృష్టమైనది. ఈ శతకంలో చిన్నపిల్లలు ఇసుకలో గూళ్లు కట్టి, వాటితో కొద్దిసేపు ఆడుకొని, వెళ్ళేటప్పుడు తొక్కేసి వెళ్ళినట్టే, సృష్టి కర్త కూడా జీవితాన్ని ఇచ్చి, కొన్నాళ్లు ఆడించి, తుదకు చెరిపేస్తాడని సృష్టికర్త లీలను మూడు వందల యాభైకి పైగా పద్యాల్లో వర్ణిస్తాడు. ఆర్త రక్తమణి శతకం రామున్ని కీర్తిస్తూ వ్రాసినది.

భక్తచింతామణి శతకం తరువాత వసురాయకవి గారికి అంతగా పేరుతెచ్చినది ‘వేణీ సంహారం’ నాటకం. ఇది సంస్కృత నాటకానికి రసవంతమైన తెలుగు అనువాదం. వసురాయకవిగారు దీనిని రచించి ఊరుకోకుండా, రంగస్థలం మీదికి కూడా ఎక్కించి, అందులో భీముని పాత్రను గూడా పోషించేవారని చెబుతారు.

1875 లో సావిత్రీ చరిత్రను ద్విపదలో వ్రాశాడు. ఈయన ఇతర రచనలలో సుగుణ ప్రదర్శనం (1880), సూక్తి వసు ప్రకాశం (1882), కాళిదాసు మేఘదూత అనువాదం (1884),

ఈయన మొత్తం 7 నాటకములను రచించారు. 1. వేణిసంహారం (రచన-1883, ప్రచురణ-1886), 2. విక్రమోర్వశీయం (రచన-1884, ప్రచురణ-1889), 3. ప్రబోధ చంద్రోదయం (రచన-1891, ప్రచురణ-1893) 4. చండ కౌశికము (1900), 5. అభిజ్ఞాన శాకుంతలము (1906), 6. మల్లికామారుత ప్రకరణము (1903, 1929), ఆంధ్రకుందమాల (రచన-1931, ప్రచురణ-1932). ఈ నాటకాలన్ని సంస్కృ తానువాదాలే, అన్ని పాఠ్యగ్రంథాలుగా నిర్ణయించబడినవే.

మల్లికామారుత ప్రకరణము

"కరుణ ఏవ ఏకో రసః-కరుణ ఒక్కటే రసం" అన్న సంస్కృత కవి భవభూతి. ఆయన కాళిదాసు తర్వాత సంస్కృత సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందినవారు. ఆయన రచించిన మాలతీ మాధవం అనే రచనకు అనువాదమిది.[2] దీని ప్రథమాంకము యొక్క తొలికూర్పు సరస్వతీ ముద్రాక్షరశాల, కాకినాడ యందు 1903 లో ముద్రించబడినది.

మూలాలు

  • వడ్డాది సుబ్బారాయకవి, ఆంధ్ర రచయితలు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1950. పేజీలు: 147-51.