అలీ నవాజ్ జంగ్ బహాదుర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
సమాచారపెట్టె చేర్చాను
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox Officeholder
| name = మీర్ అహ్మద్ అలీ
| birth_date = {{Birth date|df=yes|1877|7|11}}
| birth_place = [[హైదరాబాదు]], [[హైదరాబాదు రాష్ట్రం]] (ప్రస్తుతం [[తెలంగాణా]])
| nationality = భారతీయుడు
| religion = [[ముస్లిం]]
| alma_mater = [[నిజాం కళాశాల]]
| profession = [[ఇంజనీరు]]
| occupation =ఇంజనీరు
}}

తెలంగాణ నీటిపారుదల పితామహుడిగానూ, తెలంగాణ ఆర్థర్ కాటన్‌గా అభివర్ణించబడిన '''నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్''' హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఇంజనీరు. అప్పటి హైదరాబాదు రాజ్యంలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, నిర్మించాడు.
తెలంగాణ నీటిపారుదల పితామహుడిగానూ, తెలంగాణ ఆర్థర్ కాటన్‌గా అభివర్ణించబడిన '''నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్''' హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఇంజనీరు. అప్పటి హైదరాబాదు రాజ్యంలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, నిర్మించాడు.



07:00, 1 అక్టోబరు 2014 నాటి కూర్పు

మీర్ అహ్మద్ అలీ

వ్యక్తిగత వివరాలు

జననం (1877-07-11)1877 జూలై 11
హైదరాబాదు, హైదరాబాదు రాష్ట్రం (ప్రస్తుతం తెలంగాణా)
జాతీయత భారతీయుడు
పూర్వ విద్యార్థి నిజాం కళాశాల
వృత్తి ఇంజనీరు
వృత్తి ఇంజనీరు
మతం ముస్లిం

తెలంగాణ నీటిపారుదల పితామహుడిగానూ, తెలంగాణ ఆర్థర్ కాటన్‌గా అభివర్ణించబడిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఇంజనీరు. అప్పటి హైదరాబాదు రాజ్యంలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, నిర్మించాడు.

హైదరాబాదు ప్రజలకు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్‌గా పరిచితుడైన ఈయన అసలు పేరు మీర్ అహ్మద్ అలీ. 1877 జూలై 11న హైదరాబాదులో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి మీర్ వాయిజ్ అలీ, హైదరాబాదు రాజ్యంలో భారత ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేందుకు నియమించబడిన కార్యాలయం, ‘ధప్తర్-ఎ-ముల్కీ’లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తుండేవారు. మీర్ అహ్మద్ అలీ హైదరాబాదు, అబిడ్స్‌లోని సెయింట్ జార్జి గ్రామర్ స్కూల్‌లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశాడు. అక్కడ ఇంగ్లీషుతో పాటు లాటిన్ భాషను కూడా నేర్చుకొన్నాడు. ఆ తర్వాత నిజాం కళాశాలలో చేరి నాలుగేండ్లు ఉన్నత విద్యను అభ్యసించాడు. 1896లో నిజాం ప్రభుత్వపు ఉపకార వేతనంతో ఇంగ్లండులోని ప్రఖ్యాతి గాంచిన కూపర్‌ హిల్ ఇంజనీరింగ్ కళాశాలలో చేరి, సివిల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. కూపర్ హిల్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతిభావంతుడైన విద్యార్థిగా తన తరగతిలో ప్రథముడిగా నిలిచి అనేక స్కాలర్‌షిప్పులను అందుకున్నాడు.

1899లో ఇంగ్లండు నుండి తిరిగి వచ్చి అదే సంవత్సరం హైదరాబాదు ప్రభుత్వ ప్రజాపనుల విభాగంలో (పీడబ్ల్యూడీ)లో అసిస్టెంట్ ఇంజనీరుగా చేరి, అంచెలంచెలుగా ఎదిగి చీఫ్ ఇంజనీరయ్యాడు. ఆ తర్వాత చీఫ్ ఇంజనీరు సెక్రటరీగా పదోన్నతి పొంది పదవీ విరమణ చేశాడు. తర్వాత కూడా హైదరాబాదు ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి సాంకేతిక సేవలు అందించాడు.

2014లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో, అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ పుట్టిన రోజైన జులై 11ను ఇంజినీర్స్ డే గా ప్రకటించి ఆయన జయంత్యుత్సవాలను ఎర్రమంజిల్లోని జలసౌధలో ఘనంగా జరుపుకున్నారు.[1][2]

మూలాలు