రేఖాచిత్రం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎చరిత్ర: కళల వెలుపల రేఖాచిత్రాలు
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q93184
పంక్తి 37: పంక్తి 37:


[[వర్గం:చిత్రలేఖనం]]
[[వర్గం:చిత్రలేఖనం]]

[[en:Drawing]]

19:08, 1 నవంబరు 2014 నాటి కూర్పు

లియొనార్డో డావిన్సి యొక్క రేఖాచిత్రం

రేఖాచిత్రం (ఆంగ్లం:Drawing) అనునది వివిధ రకాల చిత్రకళకి సంబంధించిన పరికరాలని ఉపయోగించి ద్విపరిమాణపు మాధ్యమం (two dimensional medium) పై చిత్రాన్ని ఏర్పరచే ఒక దృశ్య కళ. గ్రాఫైట్ పెన్సిళ్ళు, కలం మరియు సిరా, కుంచెలు, మైనపు పెన్సిళ్ళు, రంగు పెన్సిళ్ళు, కాల్చిన బొగ్గు, ఇరేజర్లు, మార్కర్లు, స్టైలస్ లు, సిల్వర్ పాయింట్ వంటి ప్రత్యేక లోహాలు వంటి పరికరాలని రేఖాచిత్రాలకి ఉపయోగించటం జరుగుతుంది. రేఖాచిత్రాలని చిత్రీకరించే కళాకారులని ఆంగ్లంలో డ్రాఫ్ట్స్ మెన్ (Draftsman) గా వ్యవహరిస్తారు.

ఒక ఉపరితలం పై కావలసినంత పదార్థాన్ని విడుదల చేయటం వలన ఆ ఉపరితలంపై కంటికి కనబడేలా గుర్తు ఏర్పడుతుంది. ఉపరితలాలుగా అట్ట, ప్లాస్టిక్, తోలు, వస్త్రం, రాత బల్ల లు చిత్రలేఖనానికి విరివిగా ఉపయోగించిననూ, కాగితమే చిత్రలేఖనానికి ప్రధానాధారంగా వ్యవహరించినది. మొత్తం మానవ చరిత్రలో రేఖాచిత్ర మాధ్యమం ప్రముఖ మరియు ప్రాథమిక ప్రజాభిప్రాయాన్ని వెలిబుచ్చటానికి ఉపయోగపడినది. ఆలోచనలను, ఉద్దేశ్యాలను, భావాలను వ్యక్తీకరించటానికి రేఖాచిత్రం అత్యంత సరళమైన మరియు సమర్థవంతమైన సాధనంగా ఉపయోగపడినది. కావలసిన పరికరాలు విరివిగా లభ్యమవటంతో రేఖాచిత్రకళ అతి సాధారణ కళల్లో ఒకటిగా అవతరించినది.

అవలోకనం

రేఖాచిత్రకళ, దృశ్యకళలలో అతి ప్రాముఖ్యత పొందిన వ్యక్తీకరణ రూపం. అనేక గీతలతో బాటు గా వివిధ తీవ్రతలు గల ఛాయలతో కంటికి కనబడే ప్రపంచాన్ని ఒక ఉపరితలంపై ప్రతిబింబజేస్తుంది. సాంప్రదాయిక రేఖాచిత్రకళ ఏకవర్ణంలో గానీ, లేదా చాలా తక్కువగా బహువర్ణాలలో గానీ ఉండగా, ఆధునిక రేఖాచిత్రకళ చిత్రకళకి ధీటుగానో లేక రెంటికీ ఉన్న సరిహద్దులని చెరిపేసే విధంగానో ఉన్నది. పాశ్చాత్య పరిభాషలో రేఖాచిత్రకళకీ, చిత్రకళకీ దాదాపు ఒకే రకమైన పరికరాలు వినియోగించిననూ ఈ పదాల వాడుకలో తేడాలు కలవు. పాశ్చాత్య పరిభాష ప్రకారం, రంగులని అద్దకుండా కేవలం గీతలతో వేయబడే చిత్రాలని రేఖాచిత్రంగానూ, రేఖాచిత్రాలకి రంగులని అద్దటం చిత్రకళ గానూ వ్యవహరిస్తారు.

రేఖాచిత్రకళ అన్వేషణాత్మక, పరిశీలనాత్మక, సమస్యాపూరణం చేసే, కూర్పు గల ఒక కళ. రేఖాచిత్రాలు తరచుగా అస్పష్టంగా, చాలా అయోమయంగా ఉంటాయి. వీటిని కళాభ్యాసానికి వినియోగిస్తారు.

రేఖాచిత్రకళలో అనేక వర్గాలు కలవు. ఫిగర్ డ్రాయింగ్, కార్టూనింగ్, డూడ్లింగ్ మరియు షేడింగ్. రేఖాచిత్రకళలో లైన్ డ్రాయింగ్, స్టిప్లింగ్, షేడింగ్ మరియు ట్రేసింగ్ వంటి అనేక పద్ధతులు కూడా కలవు.

త్వరగా వేయబడిన, పూర్తి చేయబడని రేఖాచిత్రాన్ని స్కెచ్ (చిత్తు నమూనా) అని వ్యవహరిస్తారు.

కట్టడాలని నిర్మించే ముందు వాటి ప్రణాళికల సాంకేతిక రేఖాచిత్రాల ద్వారా చిత్రీకరిస్తారు.

చరిత్ర

భావవ్యక్తీకరణ రూపాలుగా రేఖాచిత్రాలు లిఖితపూర్వక భావ వ్యక్తీకరణకంటే మునుపే రేఖాచిత్రాల ద్వారా భావ వ్యక్తీకరణ కలదు. కావున భావ వ్యక్తీకరణలో రేఖాచిత్రాలే ప్రాచీనమైనవి. మానవజాతికి వ్రాత తెలియక ముందు రేఖాచిత్రాల ద్వారా భావ వ్యక్తీకరణ ప్రత్యేకమైనదిగా గుర్తించబడినది. 30,000 సంవత్సరాల క్రితమే మానవుడు గుహలలోను మరియు రాతి పై రేఖాచిత్రాలని సృష్టించాడు. పిక్టోగ్రామ్స్ అనబడు ఈ రేఖాచిత్రాలు పలు వస్తువులను మరియు నైరూప్య భావాలను ప్రతిబింబింపజేశాయి. చరిత్రపూర్వ సమయానికి చెందిన ఈ చిత్తునమూనాలు మరియు చిత్రకళని శైలీకృతం మరియు సరళతరం చేయబడటంతోనే ఈ నాటి లిఖితపూర్వక భాషలు అవతరించాయి.

కళలలో రేఖాచిత్రాలు రేఖాచిత్రాలు సృజనాత్మకతకి అద్దం పడటం వలన కళాప్రపంచంలో ఇవి ప్రాముఖ్యతని సంతరించుకొన్నవి. చరిత్రలో అధికభాగం రేఖాచిత్రాలు కళాత్మక ఆచరణకి పునాదులుగా నిలిచాయి. కలపతో చేయబడ్డ పలకలను రేఖాచిత్రకారులు మొదట్లో వాడేవారు. 14వ శతాబ్దంలో కాగితం విరివిగా లభించటంతో దాని వాడకం పెరిగినది. ఈ కాలంలో రేఖాచిత్రాలు ఆలోచనలకి, దర్యాప్తులకి, నటనలో ఉపయోగించేవారు. రేఖాచిత్రాలు కళాత్మకంగా వర్థిల్లుతున్న కాలంలో జ్యామితి మరియు తత్త్వం యొక్క ప్రభావం అధికంగా కలిగిన, వాస్తవిక ప్రాతినిధ్యపు లక్షణాలని ప్రదర్శించే రినైసెన్స్ కళా ఉద్యమం ఉద్భవించినది.

ఫోటోగ్రఫి వినియోగం విస్తారం అవటంతో రేఖాచిత్రాల వాడుకలో మార్పు వచ్చినది.

కళల వెలుపల రేఖాచిత్రాలు రేఖాచిత్రాలు కళామాధ్యమంగా విస్తారంగా వాడబడిననూ, ఇవి కళలకి మాత్రమే పరిమితం కాలేదు. కాగితం విరివిగా లభ్యం కాని కాలమైన 12వ శతాబ్దంలో సాధువులు ఐరోపా ఖండంలో అతి క్లిష్టమైన రేఖాచిత్రాలు జంతువుల చర్మం నుండి తయారు చేయబడే తోలు పై చిత్రీకరించేవారు. విఙాన శాస్త్రంలో, వైఙానిక ఆవిష్కరణలకి, పలు విషయాలని అర్థమయ్యేలా వివరించటానికి ఉపయోగిస్తారు. 1616 లో ఖగోళ శాస్త్రవేత్త అయిన గెలీలియో గెలీలీ చంద్రుని యొక్క పరిమాణ క్రమాన్ని అర్థమయ్యేలా వివరించేందుకు రేఖాచిత్రాలనే వాడాడు. ఖండాల రూపాలని వివరించేందుకు భూగోళ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ వెజెనర్ 1924 లో రేఖాచిత్రాలని వాడాడు.

ప్రముఖ రేఖాచిత్రకారులు

పరికరాలు

సాంకేతిక అంశాలు

లక్షణము

రూపం మరియు సమతౌల్యం

కోణం

కళాత్మకత

ప్రక్రియ

ఇవి కూడా చూడండి

మూలాలు