డి. కామేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 43: పంక్తి 43:
===నవలలు===
===నవలలు===
# కొత్తనీరు
# కొత్తనీరు
# కొత్తమలుపు
# కోరికలే గుర్రాలైతే
# ఎండమావులు
# మనసున మనసై
# జీవితం చేజారనీయకు
# కొడుకు ఖరీదు
# వైరస్
# కార్యేషు మంత్రీ


===కథాసంపుటాలు===
===కథాసంపుటాలు===

15:52, 9 నవంబరు 2014 నాటి కూర్పు

దూర్వాసుల కామేశ్వరి
జననందూర్వాసుల కామేశ్వరి
(1935-08-22)1935 ఆగస్టు 22
India కాకినాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ప్రసిద్ధికథా రచయిత్రి, నవలా రచయిత్రి
మతంహిందూ
భార్య / భర్తడి.వి.నరసింహం
పిల్లలుఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు

డి.కామేశ్వరి కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి పరిచయం. ఈమె 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు వ్రాసింది. న్యాయం కావాలి, కోరికలే గుర్రాలైతే సినిమాలుగా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి.

జీవిత విశేషాలు

ఈమె 1935, ఆగష్టు 22వ తేదీన కాకినాడలో జన్మించింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో పెరిగి అక్కడే విద్యను అభ్యసించింది. 1952లో డి.వి.నరసింహంతో పెళ్లి అయ్యాక భర్త ఉద్యోగరీత్యా ఒరిస్సాలో నివసించింది. భర్త పదవీవిరమణ తర్వాత 1984లో హైదరాబాదులో స్థిరపడింది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

రచనలు

1962లో ఆంధ్రపత్రికలో 'వనితలు వస్త్రాలు' అనే వ్యాసంతో రచనావ్యాసంగం ప్రారంభించింది. అదే పత్రికలో ప్రచురితమైన ఆనందరావు - ఆకాకరకాయలు అనే కథ ఈమె వ్రాసిన తొలి కథ. 1968లో వ్రాసిన కొత్తనీరు మొదటి నవల.

నవలలు

  1. కొత్తనీరు
  2. కొత్తమలుపు
  3. కోరికలే గుర్రాలైతే
  4. ఎండమావులు
  5. మనసున మనసై
  6. జీవితం చేజారనీయకు
  7. కొడుకు ఖరీదు
  8. వైరస్
  9. కార్యేషు మంత్రీ

కథాసంపుటాలు

  1. వానజల్లు
  2. కాదేదీ కథ కనర్హం
  3. డి కామేశ్వరి కథలు
  4. కాలాన్ని వెనక్కు తిప్పకు
  5. మధుపం

కథలు

  1. ఆకలి
  2. ఆనందరావు - ఆకాకరకాయలు
  3. ఆపాత మధురం
  4. ఈడపిల్ల
  5. ఎదురీత
  6. కథ కానిది
  7. కాలాన్ని వెనక్కి తిప్పకు
  8. కుక్కపిల్ల
  9. చదరంగం
  10. చోతంత్రం
  11. తలుపుగొళ్ళెం
  12. తారుమారు
  13. తెలియని నిజాలు
  14. నియోరిచ్
  15. నేరం దాగదు
  16. పురుషులందు...
  17. భావన
  18. మనసుతో ఆడొద్దు
  19. మనసే శిక్ష
  20. లక్ష్మణరేఖ
  21. వంకర గీతలు
  22. వడ్లగింజలో బియ్యపుగింజ
  23. వానచినుకులు
  24. వానజల్లు
  25. వేట
  26. వేదభూమి
  27. సబ్బుబిళ్ళ
  28. సశేషం

పురస్కారాలు

  • గృహలక్ష్మి స్వర్ణకంకణము -1971
  • మద్రాస్ తెలుగు అకాడమీ అవార్డు
  • అభినందన మాదిరెడ్డి అవార్ఢు
  • తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు
  • నంది పురస్కారం - టీవీ చిత్రాల విభాగంలో ఉత్తమ కథారచయిత - 2009

మూలాలు

  1. కథావిహారం శీర్షికలో విహారి వ్యాసం
  2. భూమికలో పి.సత్యవతి వ్యాసం