Coordinates: 10°52′N 78°41′E / 10.87°N 78.68°E / 10.87; 78.68

శ్రీరంగం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 63: పంక్తి 63:
{{భారత దేశంలోని హిందువుల పవిత్రనగరాలు}}
{{భారత దేశంలోని హిందువుల పవిత్రనగరాలు}}
{{విష్ణు దేవాలయాలు}}
{{విష్ణు దేవాలయాలు}}
{{హిందూ మతం పవిత్ర నగరాలు}}

[[వర్గం:తమిళనాడు పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:తమిళనాడు పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:వైష్ణవ దివ్యక్షేత్రాలు]]
[[వర్గం:వైష్ణవ దివ్యక్షేత్రాలు]]

15:43, 12 జనవరి 2015 నాటి కూర్పు

  ?శ్రీరంగం
తమిళనాడు • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 10°52′N 78°41′E / 10.87°N 78.68°E / 10.87; 78.68
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 70 మీ (230 అడుగులు)
జిల్లా (లు) తిరుచ్చిరాపల్లి జిల్లా
జనాభా 70,109 (1991 నాటికి)
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 620006
• +91-431
• TN-48

శ్రీరంగం (తమిళం: ஸ்ரீரங்கம்), శ్రీరంగనాధుడు రంగనాయకి అమ్మవారితో కొలువైవున్న వైష్ణవ దివ్యక్షేత్రం. ఇది తమిళనాడులొని తిరుచినాపల్లి (తిరుచ్చి)కి ఆనుకొని ఉభయ కావేరీ నదుల మధ్యనున్న పట్టణం. కీర్తిశేషులు పద్మశ్రీ షేక్ చినమౌలానా ఈ ఆలయంలో ఆస్థాన నాదస్వర విద్వాంసుడుగా పనిచేశారు. ఈయన ప్రకాశం జిల్లా కరవది గ్రామానికి చెందిన వారు.

శ్రీంరంగం
దస్త్రం:Srirangam 1909.JPG
The main gopura of Sri Ranganathaswamy Temple, Srirangam

శ్రీంరంగంలోని శ్రీరంగనాధస్వామి ఆలయం ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఇది వైష్ణవ దివ్యదేశాలలో అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు. ఆళ్వారులు అందరూ ఈ క్షేత్రం మహిమను గానం చేశారు. భారతదేశంలో అతి పెద్ద ఆలయసంకీర్ణాలలో ఒకటి (one of the largest temple complexes in India). దేవాలయం వారి వెబ్‌సైటు ప్రకారం ఈ ఆలయం ప్రదేశ వైశాల్యం 6,31,000 చదరపు మీటర్లు (156 ఎకరాలు). ప్రాకారం పొడవు. 4 కిలోమీటర్లు (10,710 అడుగులు).[1] ప్రపంచంలో అతిపెద్దదైన కంబోడియాలోని అంకార్ వాట్ మందిరం శిధిలావస్థలో ఉన్నది గనుక ప్రపంచంలో పూజాదికాలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం ఇదేనని దేవాలయం వెబ్‌సైటులో ఉన్నది. శ్రీరంగం ఆలయ 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో విరాజిల్లుతున్నది. [2]. ఈ గోపురాన్ని "రాజగోపురం" అంటాఱు. దీని ఎత్తు 236 అడుగులు (72 మీటర్లు) - ఆసియాలో అతిపెద్ద గోపురం.


కావేరీనది తీరాన మూడు ప్రసిద్ధ రంగనాధ ఆలయాలున్నాయి. అవి

  1. ఆది రంగడు : మైసూరు సమీపంలో శ్రీరంగపట్టణం లోని రంగనాధస్వామి మందిరం.
  2. మధ్య రంగడు : శివ సముద్రంలోని రంగనాధస్వామి మందిరం.
  3. అంత్య రంగడు : శ్రీరంగంలోని రంగనాధస్వామి మందిరం.

నెల్లూరు పట్టణంలో శ్రీ తల్పగిరి రంగనాధ స్వామివారి ఆలయం కూడా ఒక ప్రసిద్ధ రంగనాధ మందిరం.


ఆళ్వారుల దివ్య ప్రబంధాలకూ, రామానుజుని శ్రీవైష్ణవ సిద్ధాంతానికీ శ్రీరంగం పట్టుగొమ్మగా నిలిచింది. నాలాయిర దివ్యప్రబంధంలోని 4,000 పాశురాలలో 247 పాశురాలు "తిరువారంగన్" గురించి ఉన్నాయి. శ్రీవైష్ణవుల పవిత్ర గురు ప్రార్ధన (తనియన్)గా భావించే "శ్రీశైలేశ దయాపాత్రం.." అనే శ్లోకాన్ని రంగనాధస్వామి స్వయంగా మణవాళ మహామునికి సమర్పించాడని భావిస్తారు.

ఇవి కూడా చూడండి

శ్రీరంగనాధస్వామి ఆలయం

మూలాలు

  1. Sri Ranganathaswamy Temple website
  2. India By Sarina Singh, Joe Bindloss, Paul Clammer, Janine Eberle

బయటి లింకులు


మూస:భారత దేశంలోని హిందువుల పవిత్రనగరాలు

"https://te.wikipedia.org/w/index.php?title=శ్రీరంగం&oldid=1376037" నుండి వెలికితీశారు