ఈమాట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[ఫైలు:Eemata Screenshot.gif|right|thumb|250px| "ఈమాట" మార్చి 2009 సంచిక తెరపట్టు]]
[[ఫైలు:Eemata Screenshot.gif|right|thumb|250px| "ఈమాట" మార్చి 2009 సంచిక తెరపట్టు]]
'''ఈమాట''' ఒక తెలుగు అంతర్జాల పత్రిక. ఇది [[ఇంటర్నెట్]] లో ప్రచురించబడుతున్న మాసపత్రిక. ఇది ప్రధానంగా [[అమెరికా]]లోని [[ప్రవాసాంధ్రులు|ప్రవాసాంధ్రులచే]] నడుపబడుతున్నది. తెలుగులో అంతర్జాల పత్రికలు దాదాపుగా లేని 1998లోనే ప్రారంభమైన ఈమాట పత్రిక అప్పటి నుంచీ నడుస్తూనేవుంది. మొదట్లో మాసపత్రికగా ప్రారంభమైన ఈమాటను ప్రస్తుతం ద్వైమాసికంగా వెలువరిస్తున్నారు. పత్రికకు ప్రస్తుతం మాధవ్ మాచవరం, పాణిని శంఖవరం సంపాదక బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
'''ఈమాట''' ఒక తెలుగు అంతర్జాల పత్రిక. ఇది [[ఇంటర్నెట్]] లో ప్రచురించబడుతున్న మాసపత్రిక. ఇది ప్రధానంగా [[అమెరికా]]లోని [[ప్రవాసాంధ్రులు|ప్రవాసాంధ్రులచే]] నడుపబడుతున్నది. తెలుగులో అంతర్జాల పత్రికలు దాదాపుగా లేని 1998లోనే ప్రారంభమైన ఈమాట పత్రిక అప్పటి నుంచీ నడుస్తూనేవుంది. మొదట్లో మాసపత్రికగా ప్రారంభమైన ఈమాటను ప్రస్తుతం ద్వైమాసికంగా వెలువరిస్తున్నారు. పత్రికకు ప్రస్తుతం మాధవ్ మాచవరం, పాణిని శంఖవరం సంపాదక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పూర్వసంపాదకుల్లో ప్రముఖ రచయితలు, సాహిత్యవేత్తలు కె. వి. ఎస్. రామారావు, కొలిచాల సురేశ్, కొంపెల్ల భాస్కర్, విష్ణుభొట్ల లక్ష్మన్న, ఇంద్రగంటి పద్మ, వేలూరి వేంకటేశ్వర రావులు ఉన్నారు.


==లక్ష్యాలు==
==లక్ష్యాలు==
ఈ మాట గురించి సంపాదకులు తమ పత్రికలో ఇలా చెప్పారు -
ఈ మాట గురించి సంపాదకులు తమ పత్రికలో ఇలా చెప్పారు -


: సాహిత్యమంటే అభిమానం ఉన్నవారు ప్రవాసంలో ఉన్న తెలుగువారి కోసం, ఒక మంచి సాహిత్య పత్రికను స్వచ్ఛందంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా స్థాపించిన పత్రిక, ఈమాట. లాభాపేక్ష లేకుండా, రాజకీయ వాదాలకూ వర్గాలకూ అతీతంగా, రచయితలకూ పాఠకులకూ స్నేహపూరితమైన వాతావరణంలో ఒక ఉమ్మడి వేదికగా మనగలగడమే ఈమాట లక్ష్యం. 1998 దీపావళి నాడు విడుదలైన మొదటి సంచిక నుంచి ఇప్పటిదాకా ఆశయభంగం కాకుండా, కాలానుగుణంగా మారుతూ ఈ పత్రిక ఇలా పెరగడానికి కారణం, ప్రపంచపు నలుమూలలా ఉన్న సాహిత్యాభిమానులు అందించే సహాయ సహకారాలు మాత్రమే. పాఠకుల వెసులుబాటు కోసం ఈమాటని మూడు పద్ధతుల్లో ప్రచురిస్తున్నాం. యూనికోడ్‌లో చదవడం ఉత్తమమైన పద్ధతి. మీ కంప్యూటర్లపై యూనికోడ్ చదివే సదుపాయం లేకపోతే ఈమాటను తెలుగు లేదా రోమన్ లిపిలొ చదువుకునే వెసులుబాటు ఉంది. ఉన్నత స్థాయి తెలుగు సాహిత్యాన్ని ఆదరించి ప్రోత్సహించాలన్న ఈమాట ఆశయానికి పాఠకుల, రచయితల హృదయ పూర్వకమైన సహకారాన్ని కోరుతున్నాం.<ref>{{cite web|first1=సంపాదకులు|title=మా గురించి|url=http://eemaata.com/em/about#|website=ఈమాట|publisher=ఈమాట బృందం|accessdate=15 January 2015}}</ref>
: సాహిత్యమంటే అభిమానం ఉన్నవారు ప్రవాసంలో ఉన్న తెలుగువారి కోసం, ఒక మంచి సాహిత్య పత్రికను స్వచ్ఛందంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా స్థాపించిన పత్రిక, ఈమాట. లాభాపేక్ష లేకుండా, రాజకీయ వాదాలకూ వర్గాలకూ అతీతంగా, రచయితలకూ పాఠకులకూ స్నేహపూరితమైన వాతావరణంలో ఒక ఉమ్మడి వేదికగా మనగలగడమే ఈమాట లక్ష్యం. 1998 దీపావళి నాడు విడుదలైన మొదటి సంచిక నుంచి ఇప్పటిదాకా ఆశయభంగం కాకుండా, కాలానుగుణంగా మారుతూ ఈ పత్రిక ఇలా పెరగడానికి కారణం, ప్రపంచపు నలుమూలలా ఉన్న సాహిత్యాభిమానులు అందించే సహాయ సహకారాలు మాత్రమే. పాఠకుల వెసులుబాటు కోసం ఈమాటని మూడు పద్ధతుల్లో ప్రచురిస్తున్నాం. యూనికోడ్‌లో చదవడం ఉత్తమమైన పద్ధతి. మీ కంప్యూటర్లపై యూనికోడ్ చదివే సదుపాయం లేకపోతే ఈమాటను తెలుగు లేదా రోమన్ లిపిలొ చదువుకునే వెసులుబాటు ఉంది. ఉన్నత స్థాయి తెలుగు సాహిత్యాన్ని ఆదరించి ప్రోత్సహించాలన్న ఈమాట ఆశయానికి పాఠకుల, రచయితల హృదయ పూర్వకమైన సహకారాన్ని కోరుతున్నాం.<ref name="about us">{{cite web|first1=సంపాదకులు|title=మా గురించి|url=http://eemaata.com/em/about#|website=ఈమాట|publisher=ఈమాట బృందం|accessdate=15 January 2015}}</ref>


==ప్రచురణా విధానం==
==ప్రచురణా విధానం==

12:17, 15 జనవరి 2015 నాటి కూర్పు

"ఈమాట" మార్చి 2009 సంచిక తెరపట్టు

ఈమాట ఒక తెలుగు అంతర్జాల పత్రిక. ఇది ఇంటర్నెట్ లో ప్రచురించబడుతున్న మాసపత్రిక. ఇది ప్రధానంగా అమెరికాలోని ప్రవాసాంధ్రులచే నడుపబడుతున్నది. తెలుగులో అంతర్జాల పత్రికలు దాదాపుగా లేని 1998లోనే ప్రారంభమైన ఈమాట పత్రిక అప్పటి నుంచీ నడుస్తూనేవుంది. మొదట్లో మాసపత్రికగా ప్రారంభమైన ఈమాటను ప్రస్తుతం ద్వైమాసికంగా వెలువరిస్తున్నారు. పత్రికకు ప్రస్తుతం మాధవ్ మాచవరం, పాణిని శంఖవరం సంపాదక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పూర్వసంపాదకుల్లో ప్రముఖ రచయితలు, సాహిత్యవేత్తలు కె. వి. ఎస్. రామారావు, కొలిచాల సురేశ్, కొంపెల్ల భాస్కర్, విష్ణుభొట్ల లక్ష్మన్న, ఇంద్రగంటి పద్మ, వేలూరి వేంకటేశ్వర రావులు ఉన్నారు.

లక్ష్యాలు

ఈ మాట గురించి సంపాదకులు తమ పత్రికలో ఇలా చెప్పారు -

సాహిత్యమంటే అభిమానం ఉన్నవారు ప్రవాసంలో ఉన్న తెలుగువారి కోసం, ఒక మంచి సాహిత్య పత్రికను స్వచ్ఛందంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా స్థాపించిన పత్రిక, ఈమాట. లాభాపేక్ష లేకుండా, రాజకీయ వాదాలకూ వర్గాలకూ అతీతంగా, రచయితలకూ పాఠకులకూ స్నేహపూరితమైన వాతావరణంలో ఒక ఉమ్మడి వేదికగా మనగలగడమే ఈమాట లక్ష్యం. 1998 దీపావళి నాడు విడుదలైన మొదటి సంచిక నుంచి ఇప్పటిదాకా ఆశయభంగం కాకుండా, కాలానుగుణంగా మారుతూ ఈ పత్రిక ఇలా పెరగడానికి కారణం, ప్రపంచపు నలుమూలలా ఉన్న సాహిత్యాభిమానులు అందించే సహాయ సహకారాలు మాత్రమే. పాఠకుల వెసులుబాటు కోసం ఈమాటని మూడు పద్ధతుల్లో ప్రచురిస్తున్నాం. యూనికోడ్‌లో చదవడం ఉత్తమమైన పద్ధతి. మీ కంప్యూటర్లపై యూనికోడ్ చదివే సదుపాయం లేకపోతే ఈమాటను తెలుగు లేదా రోమన్ లిపిలొ చదువుకునే వెసులుబాటు ఉంది. ఉన్నత స్థాయి తెలుగు సాహిత్యాన్ని ఆదరించి ప్రోత్సహించాలన్న ఈమాట ఆశయానికి పాఠకుల, రచయితల హృదయ పూర్వకమైన సహకారాన్ని కోరుతున్నాం.[1]

ప్రచురణా విధానం

అంతర్జాలంలో తమ పత్రిక ప్రచురణా విధానం గురించి సంపాదకులు (పద్మ ఇంద్రగంటి) ఇలా చెప్పారు :

దిన, వార, మాస పత్రికల వెబ్‌సైట్లు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫాంట్ ని వాడుతూ, ఒకదానికి మరొకదానికి సంబంధం లేకుండా, చిన్న చిన్న సమాచార ద్వీపాల్లా ఉన్నాయి. పది పేజీలకన్నా ఎక్కువ పేజీలు ఉన్న ఏ వెబ్‌సైట్ కైనా ముఖ్యంగా కావలసిన రెండు సౌకర్యాలు:

  1. వెబ్‌సైట్ లో వెతకగలిగే సౌకర్యం (ఇది అన్ని రకాల వెబ్‌సైట్లకి ప్రాణం లాంటిది.)
  2. పాత సంచికలు చదవగలిగే అవకాశం. ఇది పత్రికల (periodicals) లాంటి తరచుగా మారే సమాచారం ఉన్న వెబ్‌సైట్లకి అత్యంత అవసరం.

ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ద్విభాషా వెబ్‌సైట్లు అనే బండి గతికి యూనికోడూ, ప్రామాణికమైన పద్ధతుల ఉపయోగం రెండూ రెండు చక్రాల్లాంటివని మా ప్రగాఢ విశ్వాసం. ఈ రెండిటిలో ఏది ఉపయోగించకపోయినా బండి నడక కుంటుబడుతుంది. .. అందుకే ఇకనుంచి ఈమాట వినూత్నమైన సౌకర్యాలతో మీ ముందుకి వస్తోంది. అందులో కొన్ని:

  • ప్రతి పేజీ నుంచీ ఈమాటలో రచనలని ని పూర్తిగా తెలుగులో కూడా వెతకగలిగే సౌకర్యం.
  • ప్రతి రచన గురించీ మీ అభిప్రాయం అదే పేజీలో తెలుగులో కూడా తెలియచేయగలిగే సౌకర్యం.
  • ఏ రచయిత రచనల నైనా ఒకే పేజీలో చదవగలిగే సౌకర్యం.
  • మరికొన్ని ఉపయోగ్యతా పెంపుదలలు (usability enhancements)
  • కంటికింపైన రంగులు, పాత సంచికల సూచిక, శీర్షికల సూచిక వగైరా, వగైరా..

.. .. ఏ బ్రౌజర్ లోనైనా (గ్రాఫిక్స్ సౌకర్యం లేని బ్రౌజర్‌లో కూడా)ఈమాట చదవగలిగేలా చేయలన్నది మా ఆశయం. ఈ ఆశయ సాధనలో భాగంగా కొన్ని server side పనిముట్లను కూడా పరిశీలిస్తున్నాము. ఇంకా 1998 నుండి ప్రచురించిన పాత సంచికలన్నింటినీ యూనికోడ్ లోకి మార్చి ఆ సంచికల్లోని రచనలని కూడా వెతకగలిగే సౌకర్యం కల్పించడానికి ముమ్మరంగా కృషిచేస్తున్నాము.

సంపాదక వర్గం

మార్చి 2009 నాటికి సంపాదక వర్గం:

  • వేలూరి వేంకటేశ్వర రావు (ముఖ్య సంపాదకుడు)
  • ఇంద్రగంటి పద్మ
  • మాచవరం మాధవ్
  • శంఖవరం పాణిని

పాలసీలు

ఈమాట పత్రిక రచనల స్వీకరణ, ప్రచురణల్లో సమీక్షా పద్ధతిని అనుసరిస్తుంటారు. ఈ పద్ధతిలో మొదట రచనలను సంపాదకులు పరిశీలిస్తుంటారు, ఆపైన అవసరమైతే తత్సంబంధిత రంగాల్లో నిపుణులైన ఇతర విమర్శకులు ఇద్దరితో సమీక్షింపజేస్తారు. ఆ సమీక్షావివరాలు రచయితలకు అందజేసి కొద్దిస్థాయిలో మార్పులు చేర్పులు సూచిస్తారు. ఆ మార్పులు లేకుండానే తమ రచనలు ప్రచురణ కావాలని రచయితలు భావిస్తే ఆ రచన ఈమాట వారు తిరస్కరించడమో, రచయిత ఉపసంహరించుకోవడమో జరుగుతుంది. రచయితలతో సంప్రదింపుల ఫలితంగా ప్రచురణార్హమైన రచనలను తుదిగా నిర్ణయిస్తారు. ఈ పద్ధతిని కొందరు రచయితలు, సాహిత్యవేత్తలు విమర్శిస్తున్నారు. ఆ విమర్శలకు సమాధానంగా రచనల్లో ఉన్నత విలువలు నెలకొల్పేందుకు ఉద్దేశించే తాము ఈ పీర్ రివ్యూ విధానం ప్రవేశపెట్టామని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన పద్ధతి అని తెలుగువారు అలవాటుపడితే సరిపోతుందని సమాధానమిస్తున్నారు. ఇతర పత్రికల్లో సంపాదకులదే నిర్ణయమంటూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఈమాటలో మాత్రం ఈ విధమైన ప్రివ్యూ పద్ధతితో రచయితలు, సమీక్షకులు, సంపాదకులు సమిష్టి నిర్ణయంతో వ్యవహరిస్తున్నామని వ్రాశారు.[2]

రచనలు

ఈమాట పత్రికలో కథలు, కవితలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, ఇతర ఆసక్తికరమైన రచనలు ప్రచురిస్తారు. రచనల్లో ప్రవాసాంధ్రుల జీవితం, అనుభవాలు, అనుభూతులు వంటివాటికి ప్రాధాన్యత ఇచ్చినా తెలుగు సంస్కృతీ సమాజాలకు సంబంధించిన ఏ రచన అయినా ప్రచురణార్హమేనని స్పష్టంచేశారు. ఈమాట ఆశయాలుగా సంపాదకులు, ప్రచురణకర్తలు పేర్కొన్నవి: (1) తెలుగు వారి అనుభవాల్ని అనుభూతుల్నీ జీవనాన్నీ జీవితాన్నీ ప్రతిబింబించే రచనలకి, రచయితలకి ఒక వేదిక కల్పించటం (2) ఈ వేదిక రాజకీయ, కుల, మత, వర్గ ధోరణులకి, వ్యాపార కలాపాలకి దూరంగా ఉండడం. (3) ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించుకొని, ఈమాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తేలిక మార్గంలో అందేటట్టు చూడటం.

శీర్షికలు

ఈ మాటలో వచ్చే శీర్షికలు - సంపాదకీయం, సమీక్షలు, సంప్రదాయ సాహిత్యం, కథలు, కవితలు , వ్యాసాలు, అనువాదాలు, శబ్ద తరంగాలు, ఈ-పుస్తకాలు, ప్రకటనలు, ధారావాహికలు/నవలలు, జిగిరీ, తోలుబొమ్మలాట వంటివి. ఇవే కాకుండా "గ్రంధాలయం" విభాగంలో అనేక పుస్తకాలు పాఠకులకు అందించే ప్రయత్నం జరుగుతున్నది. మార్చి 2009నాటికి ఈ గ్రంధాలయంలో లభిస్తున్న పుస్తకాలు : ATA 2006, కరుణ ముఖ్యం, కళాపూర్ణోదయం, కుండీలో మర్రిచెట్టు, క్రీడాభిరామం, నిశ్శబ్దంలో నీ నవ్వులు, ప్రభావతీ ప్రద్యుమ్నం, భాషాశాస్త్రానికి మరోపేరు భద్రిరాజు, మనుచరిత్ర, మేఘదూతః, వ్యవహారికోద్యమ చరిత్ర, శిలాలోలిత, సూర్యశతకం, స్వప్నవాసవదత్తం

పాఠకుల అభిప్రాయాలు

  • విష్ణుభొట్ల లక్ష్మన్న (మే 2, 2006) : ఈమాట మే 2006 సంచిక చదివాను. చాలా అనందపడ్డాను! ఈమాట మెదటి సంచిక నుండి చూపిన వైవిద్యం, ప్రవాసాంధ్రుల రచనాశక్తిని ప్రోత్సాహపరిచే ఆదర్శం, ఎటువంటి వ్యాపార, రాజకీయ, కుల, మత వర్గాల ఇజాలకు లొంగకుండా, ప్రవాసాంధ్రుల అనుభవాలు, ఆలోచనలు పంచుకునే వేదికగా నిబడి ఉండటం సామాన్యమైన విషయం కాదు! ఇందుకు కారకులైన వారిని అభినందిస్తున్నాను. ముఖ్యంగా మూడు మాటలు: (1) ప్రవాసాంధ్రులు, ప్రత్యేకంగా అమెరికాలోని తెలుగు వారు, వాసిలోనూ రాసిలోనూ వృత్తి పరంగా మాత్రమే కాకుండా, తెలుగు సాహిత్యపరంగా కూడా గమనించదగ్గ ప్రతిభ కనపరుస్తున్నారనటానికి ఈమాట ఒక నిదర్శనం. (2) ఇంటర్నెట్లో వచ్చిన, వస్తున్న మార్పుల్ని తెలుగు సాహిత్యవికాసానికి (సాహిత్యం అంటే మంచి హితం అన్న అర్ధంలో అయితే తెలుగు ప్రజల వికాసానికి)ఉపయోగించవచ్చు అన్న ఆలోచనలను అమలుచేసి చూపెట్టటం ఈమాట ద్వారా నిరూపించబడింది. (3) ఫిజిక్స్ లో చెప్పినట్లు న్యూక్లియర్ రియాక్షన్ ద్వారా శక్తిని తయారు చెయ్యటానికి ఒక క్రిటికల్ మాస్ అవసరం. ఇప్పుడు ఈమాట ద్వారా, ప్రవాసాంధ్రుల సంఖ్య క్రిటికల్ మాస్ కి చేరుకోటం వల్ల, ప్రవాసాంధ్రుల శక్తి ఈమాట వల్ల తెలుస్తోంది. - ఇందుకు కారకులైన వారందరికీ ధన్యవాదాలు.


  • సాయిరామ్ రాజు (జనవరి 9, 2009) : ఏమాటకామాటే చెప్పుకొవాలి. ఈమాట నిజంగా చాలా బాగుంది. మన తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఈమాటలో మన మాటలు కలుపుకోవచ్చు.. మంచిచెడులు చెప్పుకోవచ్చు.

విశేషాలు

  • ఈ మాట సంపాదక వర్గానికి తెలుగు వికీపీడియాతో మంచి సంబంధాలున్నాయి.
  • ఈ మాటలో నిర్వహణలో ప్రముఖులు ఇంటర్నెట్‌లో తెలుగు వ్యాప్తికి విశేషంగా కృషి చేస్తున్నారు.


ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మూలాలు

  1. "మా గురించి". ఈమాట. ఈమాట బృందం. Retrieved 15 January 2015. {{cite web}}: |first1= missing |last1= (help)
  2. వెంకటేశ్వరరావు, వేలూరి (నవంబర్ 2008). "ఈమాట – నామాట". ఈమాట. 10 (నవంబర్ 2008). Retrieved 15 January 2015. {{cite journal}}: Check date values in: |date= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=ఈమాట&oldid=1377857" నుండి వెలికితీశారు