2012 ఢిల్లీ సామూహిక అత్యాచార ఉదంతం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 24: పంక్తి 24:
==సంఘటన==
==సంఘటన==
[[File:Delhi protests-students, Raisina Hill.jpg|thumb|రైసినా హిల్, రాజ్‌పథ్, న్యూ ఢిల్లీ వద్ద నిరసనలు]]
[[File:Delhi protests-students, Raisina Hill.jpg|thumb|రైసినా హిల్, రాజ్‌పథ్, న్యూ ఢిల్లీ వద్ద నిరసనలు]]
23 ఏళ్ళ వైద్య విద్యార్దిని మరియు ఆమె స్నేహితుడు కలిసి ఆ రోజు సాయంత్రం ఢిల్లీ లోని సాకేత్ దగ్గర సినిమా చూసి ఇంటికి బయలుదేరారు. రాత్రి 9:30కు ఒక ప్రైవేటు బస్సు ఎక్కారు. అందులో ఐదుగురు ప్రయాణీకులతోపాటు ఒక డ్రైవర్ ఉన్నారు. వారంతా తాగిఉన్నారని మరియు వారంతా ఒకటే గుంపునకు చెందినవారని వారికి తెలీదు. వారంతా నగరంలోని మురికివాడ చెందిన వారు. కొంతసేపటికి డ్రైవరు దారిమళ్ళించాడు. అలాగే బస్సు తలుపుకు కూడా గడియపెట్టారు. దీనితో అనుమానం వచ్చిన ఆమె స్నేహితుడు బస్సు సిబ్బందిని అడిగాడు. అందుకు వారు రాత్రి పూట మీకేంపని ఒంటరిగా ఎంచేస్తున్నారని అడగటం మొదలుపెట్టారు. ఆ అమ్మాయితో దురుసుగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన తన స్నేహితుడను తలపైన ఇనుప రాడ్ తో కొట్టి అపస్మారక స్థితికి తీసుకెళ్ళారు. ఆపై ఒంటరిగా ఆమెను బస్సు చివరకు ఈడ్చుకెళ్ళి అత్యాచారానికి ఒడికట్టారు. ఆమె అరచి, వారితో పెనుగులాడి నోటితో కొరికి ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించింది. అందుకు వారు ఆమెను పలుమార్లు బలంగా ఇనుప రోడ్ తో కొట్టి ఆపై ఒక్కొక్కరు అత్యాచారం చేశారు. ఈ ఉదంతమంతా బస్సు కడులుతున్డగానే జరిగింది. ఆమె గర్భసంచిలో ఆ ఇనుపరాడ్ ను పలుమార్లు చొచ్చి పైశాచిక ఆనందాన్ని పొందారు. బస్సును ఒకరితరువాత ఒకరు నడుపుతూనే తల నుంచి, ఉదరం నుంచి నెత్తురోడుతున్న ఆమెను అత్యాచారం చేశారు. సుమారు గంటకు పైగా హింసించిన వారిని వివస్త్రంగానే రోడ్డు పైకి విసిరివేశారు.
23 ఏళ్ళ వైద్య విద్యార్దిని మరియు ఆమె స్నేహితుడు కలిసి ఆ రోజు సాయంత్రం ఢిల్లీ లోని సాకేత్ దగ్గర సినిమా చూసి ఇంటికి బయలుదేరారు. రాత్రి 9:30కు ఒక ప్రైవేటు బస్సు ఎక్కారు. అందులో ఐదుగురు ప్రయాణీకులతోపాటు ఒక డ్రైవర్ ఉన్నారు. వారంతా తాగిఉన్నారని మరియు వారంతా ఒకటే గుంపునకు చెందినవారని వారికి తెలీదు. వారంతా నగరంలోని మురికివాడ చెందిన వారు. కొంతసేపటికి డ్రైవరు దారిమళ్ళించాడు. అలాగే బస్సు తలుపుకు కూడా గడియపెట్టారు. దీనితో అనుమానం వచ్చిన ఆమె స్నేహితుడు బస్సు సిబ్బందిని అడిగాడు. అందుకు వారు రాత్రి పూట మీకేంపని ఒంటరిగా ఎంచేస్తున్నారని అడగటం మొదలుపెట్టారు. ఆ అమ్మాయితో దురుసుగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన తన స్నేహితుడను తలపైన ఇనుప రాడ్ తో కొట్టి అపస్మారక స్థితికి తీసుకెళ్ళారు. ఆపై ఒంటరిగా ఆమెను బస్సు చివరకు ఈడ్చుకెళ్ళి అత్యాచారానికి ఒడికట్టారు. ఆమె అరచి, వారితో పెనుగులాడి నోటితో కొరికి ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించింది. అందుకు వారు ఆమెను పలుమార్లు బలంగా ఇనుప రోడ్ తో కొట్టి ఆపై యోని లోకి ఇనుపరాడ్ ను పలుమార్లుచొచ్చి ఒక్కొక్కరు అత్యాచారం చేశారు. ఈ ఉదంతమంతా బస్సు కడులుతున్డగానే జరిగింది. ఆమె గర్భసంచిలో ఆ ఇనుపరాడ్ ను పలుమార్లు చొచ్చి పైశాచిక ఆనందాన్ని పొందారు. బస్సును ఒకరితరువాత ఒకరు నడుపుతూనే తల నుంచి, ఉదరం నుంచి నెత్తురోడుతున్న ఆమెను అత్యాచారం చేశారు. సుమారు గంటకు పైగా హింసించిన వారిని వివస్త్రంగానే రోడ్డు పైకి విసిరివేశారు.

వైద్య పరీక్షలలో డాక్టర్లు ఆమెకు ఇనుప రాడ్ చొచ్చటం మూలంగా ఉదరంలో, పేగులలో, మర్మాంగాలలొ తీవ్రంగా దెబ్బలు తగిలాయని తెలిపారు. ఆ తరువాతి రోజు పోలీసు పరిశోధనలో ఆ ఇనుపరాడ్ తుప్పుపట్టి L ఆకారంలో ఉన్నదిగా తెలిపారు. ఉన్మాదులు వారిని రోడ్ పైకి విసిరివేశాక ఒకరు బస్సును కడిగారు.

07:56, 10 ఫిబ్రవరి 2015 నాటి కూర్పు

2012 ఢిల్లీ సామూహిక అత్యాచారం
ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద నిరసనకారులు
సమయం9:54 పిఎమ్ IST (UTC+05:30)
తేదీ16 డిసెంబరు, 2012
ప్రదేశంఢిల్లీ
ఫలితంరామ్ సింగ్ (విచారణ కాలంలో మరణించారు); ఇతర పెద్దల ప్రతివాదులు; ఉరి ద్వారా మరణశిక్ష మరియు బాల్య ప్రతివాది: సంస్కరణ సౌకర్యం మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడినది.
మరణాలు1 (స్త్రీ బాధితురాలు) 29 డిసెంబరు, 2012
గాయపడినవారు1 (పురుష బాధితుడు)
దోషులురామ్ సింగ్
ముకేష్ సింగ్
వినయ్ శర్మ
పవన్ గుప్తా
అక్షయ్ ఠాకూర్
ఒక పేరులేని బాలనేరస్థుడు
తీర్పుముద్దాయి నేరం
Convictionsరేప్, హత్య, కిడ్నాపింగ్, దోపిడీ, దాడి[1]

16 డిసెంబర్ 2012 న భారత రాజధాని ఢిల్లీ లో ఒక వైద్యవిద్యార్ధినిని కదులుతున్న బస్సులో ఆరుగురు కర్కశంగా, దారుణంగా ఇనుప కడ్డీ తో కొట్టి అత్యాచారం చేశారు. ఆ సంఘటనలో తల మరియు పేగులకు తగిలిన గాయాలతో 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు 29 డిసెంబర్ 2012 న ఆమె తుదిశ్వాస విడిచారు.

16న సాయంత్రం ఆమె తన స్నేహితుడితో కలిసి సినిమా చూసి తిరిగి వస్తూ ఐదుగురు ప్రయాణికులు ఉన్న బస్సు ఎక్కారు. మధ్యం తాగి ఉన్న ఆ ఐదుగురు ఆమెను, ఆమె స్నేహితుడిని ఇనుప కడ్డీతో కొట్టి కదులుతున్న బస్సులోనే గంటకు పైగా అత్యాచారం చేసి చివరకు వారిద్దరిని బస్సులోనుంచి బయటకు తోసేశారు. అటువైపు వెళ్తున్న కొందరు వివస్త్రంగా, అచేతనంగా పడి ఉన్నవారిని చూసి టోల్ ప్లాజా గస్తీ వాహన సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్చారు. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో ఉదర సంబంధిత పలు శస్త్రచికిత్సలు చేసిన తరువాత ఆమెను వెంటిలేటర్ లో ఉంచారు. 26 డిసెంబర్ న మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి ఆమెను తరలించారు. 29 డిసెంబర్ న ఆమె మరణించారు.

21 డిసెంబర్ నాటికి బస్సు డ్రైవర్ తో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన తెలిపారు. ఢిల్లీ లో వేలమంది నిరసనకారులు తమ నిరసన తెలుపగా ఆ నిరసనలో రక్షకభటులతో ఘర్షణ జరిగింది.

సంఘటన

రైసినా హిల్, రాజ్‌పథ్, న్యూ ఢిల్లీ వద్ద నిరసనలు

23 ఏళ్ళ వైద్య విద్యార్దిని మరియు ఆమె స్నేహితుడు కలిసి ఆ రోజు సాయంత్రం ఢిల్లీ లోని సాకేత్ దగ్గర సినిమా చూసి ఇంటికి బయలుదేరారు. రాత్రి 9:30కు ఒక ప్రైవేటు బస్సు ఎక్కారు. అందులో ఐదుగురు ప్రయాణీకులతోపాటు ఒక డ్రైవర్ ఉన్నారు. వారంతా తాగిఉన్నారని మరియు వారంతా ఒకటే గుంపునకు చెందినవారని వారికి తెలీదు. వారంతా నగరంలోని మురికివాడ చెందిన వారు. కొంతసేపటికి డ్రైవరు దారిమళ్ళించాడు. అలాగే బస్సు తలుపుకు కూడా గడియపెట్టారు. దీనితో అనుమానం వచ్చిన ఆమె స్నేహితుడు బస్సు సిబ్బందిని అడిగాడు. అందుకు వారు రాత్రి పూట మీకేంపని ఒంటరిగా ఎంచేస్తున్నారని అడగటం మొదలుపెట్టారు. ఆ అమ్మాయితో దురుసుగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన తన స్నేహితుడను తలపైన ఇనుప రాడ్ తో కొట్టి అపస్మారక స్థితికి తీసుకెళ్ళారు. ఆపై ఒంటరిగా ఆమెను బస్సు చివరకు ఈడ్చుకెళ్ళి అత్యాచారానికి ఒడికట్టారు. ఆమె అరచి, వారితో పెనుగులాడి నోటితో కొరికి ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించింది. అందుకు వారు ఆమెను పలుమార్లు బలంగా ఇనుప రోడ్ తో కొట్టి ఆపై యోని లోకి ఇనుపరాడ్ ను పలుమార్లుచొచ్చి ఒక్కొక్కరు అత్యాచారం చేశారు. ఈ ఉదంతమంతా బస్సు కడులుతున్డగానే జరిగింది. ఆమె గర్భసంచిలో ఆ ఇనుపరాడ్ ను పలుమార్లు చొచ్చి పైశాచిక ఆనందాన్ని పొందారు. బస్సును ఒకరితరువాత ఒకరు నడుపుతూనే తల నుంచి, ఉదరం నుంచి నెత్తురోడుతున్న ఆమెను అత్యాచారం చేశారు. సుమారు గంటకు పైగా హింసించిన వారిని వివస్త్రంగానే రోడ్డు పైకి విసిరివేశారు.

వైద్య పరీక్షలలో డాక్టర్లు ఆమెకు ఇనుప రాడ్ చొచ్చటం మూలంగా ఉదరంలో, పేగులలో, మర్మాంగాలలొ తీవ్రంగా దెబ్బలు తగిలాయని తెలిపారు. ఆ తరువాతి రోజు పోలీసు పరిశోధనలో ఆ ఇనుపరాడ్ తుప్పుపట్టి L ఆకారంలో ఉన్నదిగా తెలిపారు. ఉన్మాదులు వారిని రోడ్ పైకి విసిరివేశాక ఒకరు బస్సును కడిగారు.

రాత్రి 11 గంటలకు కొందరు గస్తీ సిబ్బందికి వివస్త్రంగా, అచేతనంగా పడి ఉన్న వారిగురించి తెలుపగా గస్తీ సిబ్బంది సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రి వారు అత్యవసర చికిత్స చేసి ఆమెను వెంటిలేటర్ లో పెట్టారు. డాక్టర్లు పరీక్షించగా ఆమెలో ఉండవలసిన పేగులు కేవలం 5% మాత్రమె మిగిలి ఉన్నట్లుగా తెలుసుకున్నారు. ఉన్మాదులు ఆ రాడ్ ఆమె లోనికి చొచ్చి బలంగా బయటకు లాగటం మూలంగా ఆమె పేగులు బయటకు వచ్చినట్లు తెలిపారు.

బాధితులు

వైద్య విద్యార్ధిని తల్లిదండ్రులు ఉత్తర ప్రదేశ్ లోను బాల్లియా జిల్లా కు చెందినవారు. ఆమె ఢిల్లీ లోనే పుట్టి పెరిగారు. భద్రత కారణాల దృష్ట్యా ఆమెను అమానత్, నిర్భయ మరియు దామిని అని పిలుస్తున్నారు.

చికిత్స మరియు బధితురాలి మరణం

2012 డిసెంబర్, 30 న బెంగుళూరుటౌన్ హాల్ బయట నిరసన తెలుపుతున్న బెంగుళూరు ప్రజలు
స్త్రీ భాదితురాలు 29 డిసెంబర్, 2012న మరణం తర్వాత, ప్రజలు నిశ్శబ్దంగా కోలకతాలో బిధాన్ నగర్, (సాల్ట్ లేక్ సిటీ) వద్ద క్యాండిల్లైట్ తో నిరసన కవాతు

19 డిసెంబర్ 2012 న దెబ్బతిన్న ఆమె పేగులను గాంగ్రెనె అనే వ్యాధి సోకే కారనమున్నందున తొలగించారు. ఆ తరువాత ఆమెకు నరాల నుంచి పోషణ మరియు ఒషదాలను ఇచ్చారు. 21 డిసెంబర్ 2012 న ప్రభుత్వం ఆమెకు చక్కటి వైద్య సేవల కొరకు ఒక వైద్య కమిటీ ని నియమించింది. 25 డిసెంబర్ నాటికి ఆమె పరిస్థితి విషమంగా ఉంది. డాక్టర్లు ఆమె లోపలి రక్త స్రావం కొంతమేరకు త్రగిన్దని తెలిపారు.

26 డిసెంబర్ న ప్రధాని మన్మోహన్ సింగ్ చేపట్టిన కాబినెట్ మీటింగ్ లో ఆమెను సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. మౌంట్ ఎలిజబెత్ అవయవ మార్పిడి ప్రత్యేకత కలిగిన ఆసుపత్రి.

28 డిసెంబర్ 2012 న ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. డాక్టర్లు ఆమె ప్రాణాలతో పోరాడుతుందని తెలిపారు. ఆమె ఆరోగ్యం మరింత విషమించడంతో ఆమె 29 డిసెంబర్ 2012 న ఉదయం 4:45 కు మరణించారు.

ఆరోపిత నేరస్తులు

నిరసనకారులను విచ్ఛిన్నం చేసే ప్రయత్నించడములో పోలీసులు నీటి ఫిరంగి, మరియు టియర్ గ్యాస్ వంటివి ఉపయోగించారు.

ఈ సంఘటనతో సంభందం ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు: రామ్ సింగ్ - బస్సు డ్రైవరు, అతని తమ్ముడు ముకేష్ సింగ్ లను రాజస్తాన్ లో అదుపులోకి తీసుకున్నారు. వినయ్ శర్మ - జిమ్ ఇన్స్ట్రక్టర్ ను ఢిల్లీ లో అదుపులోకి తీసుకున్నారు. అలాగే పవన్ గుప్త - ఒక పండ్ల వ్యాపారి ని ఢిల్లీ లో అదుపులోకి తీసుకున్నారు, మైనర్ బాలుడైన రాజు ను ఉత్తార ప్రదేశ్ లో ఆనంద్ విహార్ టెర్మినల్ లో అదుపులోకి తీసుకున్నారు. అక్షయ్ ఠాకూర్ - బీహార్ నుంచి ఢిల్లీ కి పనికి వచ్చిన ఇతనిని బీహార్ లో ఆరంగాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ ఆ రోజు తప్ప త్రాగి బస్సును విలాసంగా ఢిల్లీ చుట్టూ తిప్పుతున్నారు. రాజు ఆ రోజే వారందరినీ కలిశాడు. రామ్ సింగ్ ను 18 డిసెంబర్ 2012 మహానగర న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టారు.ముకేష్ సింగ్ ను అదుపులోకి తీసుకున్న తరువాత జైలు సహచరులు అతనిని కొడుతున్నందున తిహార్ జైలు లో ప్రత్యేక గదిలో ఉంచారు. గుప్తాను అదుపులోకి తీసుకున్న తరువాత ఆటను తన నెరాన్నీ అంగీకరించి తనను ఉరితీయవలసినదిగ తెలిపాడు. ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచార సంఘటనకు వ్యతిరేకంగా ఇద్దరు ముంబై మహిళలు తమ వీపులపై "రేపిస్టులను ఉరితీయండి" అని వ్రాసుకొని నగ్నంగా ఫోజులిచ్చారు.

అభియోగం

19 డిసెంబర్ న ఆమె స్నేహితుడు నిందితులను గుర్తించారు. 21 డిసెంబర్ 2012 న బాధితురాలు ఆమె వాంగ్మూలాన్ని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో సబ్ దివిసినల్ న్యాయాధికారికి పోలీస్ డిప్యూటీ కమిషనర్ గారి ముందు తెలిపారు.

శిక్ష

ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో 31 డిసెంబరు, 2014న నిర్భయ తల్లి

ఈ కేసులో 2013 సెప్టెంబరు 13, శుక్రవారం తీర్పు వెలువడింది. నిర్భయపై అత్యంత హేయంగా అత్యాచారం చేసి, కిరాతకంగా హింసించి చంపిన నరరూప రాక్షసులను చనిపోయేవరకూ ఉరితీయటమే సరైన శిక్ష అని న్యాయస్థానం తీర్పుచెప్పింది. దేశం యావత్తునూ నిర్ఘాంతపరచిన ఢిల్లీ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులైన ముఖేష్ (26), అక్షయ్‌ఠాకూర్ (28), పవన్‌గుప్తా (19), వినయ్‌శర్మ (20)లకు ఢిల్లీ కోర్టు శుక్రవారం మరణశిక్ష విధించింది. గత డిసెంబర్‌లో ఢిల్లీలో 23 ఏళ్ల యువతిపై అత్యంత పాశవికంగా, ఒళ్లు గగుర్పొడిచే రీతిలో వీరు నేరానికి పాల్పడటం.. ఈ కేసును అరుదైన కేసుల్లోకెల్లా అరుదైన కేసుగా నిలుపుతోందని కోర్టు అభివర్ణించింది.

ఒక నిస్సహాయ మహిళపై దోషుల అమానవీయ, భయానక చర్యలు జాతి అంతరాత్మను నిర్ఘాంతపరచాయని.. మహిళలపై నేరాలను సహించబోమనే సందేశం పంపటానికి వీరికి తీవ్రమైన శిక్ష అవసరమని అదనపు సెషన్స్ జడ్జి యోగేష్‌ఖన్నా తన 20 పేజీల తీర్పులో స్పష్టంచేశారు. ‘దోషులు చనిపోయే వరకూ ఉరితీయాలి’ అంటూ కిక్కిరిసిన కోర్టు గదిలో జడ్జి శిక్షను ప్రకటించారు. నిస్సహాయురాలైన బాధితురాలిని చనిపోవటానికి గురిచేసిన చిత్రహింసలు, గాయాల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కోర్టు దోషులకు మరణశిక్ష విధించింది[2].

బయటి లింకులు

మూలాలు

  1. Gardiner Harris (3 January 2013). "Murder Charges Are Filed Against 5 Men in New Delhi Gang Rape". The New York Times. Retrieved 3 January 2013.
  2. http://articles.timesofindia.indiatimes.com/2013-09-13/india/42039813_1_murder-case-vinay-sharma-track-court