కల్మషహారాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with ' == కల్మషహారాలు == thumb|Detergents డిటర్జెంట...'
(తేడా లేదు)

15:48, 17 ఏప్రిల్ 2015 నాటి కూర్పు

== కల్మషహారాలు ==
Detergents
డిటర్జెంట్   అనునది  ఒక  సర్ఫెక్టెంట్ (తలతన్యతను తగ్గించు గుణం గల వస్తువు)  లేక  " విలీన ద్రావణాలలో శుభ్రపరచు లక్షణాలు" గల  సర్ఫెక్టెంట్  యొక్క మిశ్రమం అని  నిర్వచించవచ్చు.  ఇవి  సాధరణంగా   సబ్బును పోలిన  సమ్మేళనాల కుటుంబానికి  చెందినవి కానీ   ఘన నీటిలో  ఎక్కువ  కరిగే  గుణం కలిగి వుంటాయి .  ఇవి   ఆల్కైల్  బెంజీన్ సల్ఫోనేట్స .  ఘన నీటిలో   వుండు కాల్షియం మరియు ఇతర  పరమాణువుల సమూహముతో   జత కూడుటకు   సబ్బు  యొక్కధ్రువ కార్భోక్సైల్  కు   డిటర్జెంట్ల యొక్క  ధ్రువ  సల్ఫోనేట్   తో  పోల్చి  చూస్తే   సబ్బుతో  ఆ రసాయనిక  చర్య జరుగుటకు  అవకాశం  చాలా  తక్కువ   ఇదే నీటిలో    సబ్బు యొక్క    కనిష్ట  ద్రవానియతకు  కారణము.  మన  సాదారణ   పరిబాషలో   డిటర్జెంట్    అనునది   లాండ్రీ డిటర్జెంట్ ను  ( బట్టలు ఉతికే సోడా) లేక   డిష్  డిటర్జెంట్   ను  ( అంట్లు  కడిగే   పొడి )   సూచిస్తుంది.

సాధారణంగా డిటర్జెంట్స పొడులు లేదా కేంద్రీకరించిన ద్రవనాల రూపంలో అందుబాటులో వుంటాయి .డిటర్జెంట్లు అనునవి పాక్షికంగా హైడ్రోఫిలిక్ (ధ్రువ ) మరియు పాక్షికంగా హైడ్రోఫోబిక్ స్వభావము కల్గి వుండడం వల్ల అవి సబ్బు లాగా కూడా పని చేస్తాయి.అవి అంపిబిలిక్ స్వభావము తో వుంటాయి. చమురు మరియు జిడ్డు వంటి హైడ్రోఫోబిక్ సమ్మేళనాలు నీటితో సౌకర్యవంతంగా మిశ్రమించడానికి వాటికి వున్న ఆ ద్వంద్వ స్వభావమే మూల కారణము.


== కల్మషహారాలు-రసాయనిక వర్గీకరణ ==

కల్మషహారాలు తమ విద్యుత్ ఆవేశము బట్టి మూడు విస్తృత బృందాలుగా విభజించారు .

రుణావేశ కల్మషహారాలు

సాధారణ రుణవేశ కల్మషహారాలు ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్స అయి ఉంటాయి. ఈ రుణవేశ అణువులలో వున్న అల్కైల్ బెంజీన్ భాగం లైపోఫిలిక మరియు సల్ఫోనేట్ భాగం హైడ్రోఫిలిక్ అయి వుంటుంది.ఇందులో రెండు విభిన్న రకాలు ప్రాచుర్యం పొందాయి. అవి సరళ ఆల్కైల్ సమూహాల తో వున్నవి, సారించిన ఆల్కైల్ సమూహాల తో వున్నవి. ఆర్థికంగా పురోగమిస్తున్న సమాజాలలో రెండవ వర్గానివి తొలగించబడ్డాయి , అందుకు కారణము అవి చాలా పేలవంగా జీవఅధోకరణం చెందడమే. ఒక అంచనా ప్రకారం ఏటా 6 బిలియన్ కిలోల రుణవేశ కల్మషహారాలను దేశీయ విపణి లో ఉత్పత్తి చేస్తారు . పిత్త ఆమ్లాలైన డీఆక్సీకొలీక్ ఆమ్లములు జీర్ణం కొరకు ,అలాగే కొవ్వుల మరియు నూనెల శోషణ నిమిత్తం కాలేయం ద్వారా ఉత్పత్తి చేయబడు ఇవి రుణవేశ కల్మషహారాలు అయి వున్నాయి.

.

ధనావేశ కల్మషరాలు

ధనావేశ  కల్మషహారాలు  దాదాపుగా  రుణవేశ కల్మషహారాల లాగే వుంటాయి . కానీ ఇవి రుణవేశ సల్ఫోనేట్ గుంపుకు బదులు  హైడ్రోఫోబిక్  భాగం కల్గి వుంటాయి . ధనావేశ surfactant (తలతన్యతను తగ్గించు గుణం గల వస్తువు)  లు  చతుర్ధ అమ్మోనియం లవణములను   కల్గి వుంటాయి . ఇక్కడ  అమ్మోనియం గుంపు పైన  ధనావేశము వుంటుంది. 

ఆయానేతర - కల్మషహారాలు

వీటిని ఎటువంటి ఆవేశము లేని హైడ్రోఫిలిక్ గుంపులతో వర్ణించవచ్చు . సాధారణంగా ఈ ఆయానేతర కల్మషహారాలు పాలిఒక్సీఇతీలీన్ లేదా గ్లైకోసైడ్ పైన ఆధారపడి ఉంటాయి. ఈ పదార్థాలను ఈతాక్సీలేట్లు అయి వుంటాయి . ట్వీన్ , ట్రిటోన్ , మరియు బ్రిజ్ సరీ పైన పేర్కొన్న వాటికి సాధారణ ఉదాహరణలు. గ్లైకోసైడ్స్ వాటి ఆవేశేము లేని హైడ్రోఫిలిక్ గుంపుగా ఒక చక్కెరను కల్గి వుంటాయి. ఉదాహరణలుగా తియొగ్లుకొసైడ్ మరియుమల్టోసైడ్స్ ను పేర్కొనవచ్చు. HEGA మరియు MEGA వరుసకు చెందినవి వీటిని పోలి వుంటాయి.

జ్విట్టర్ అణువులు సమానమైన  రుణవేశము మరియు ధవేశములను  కల్గి వున్న రాసాయన  సమూహముల వలన  నికరంగా  సున్నా ఆవేశము కల్గి వుంటాయి. 


చరిత్ర

మొదటి  ప్రపంచ యుద్దములో  కొవ్వులు మరియు  నూనెల  కొరతను  అదిగమించడానికి  మొదటి సారిగా  జర్మనీలో  కృత్రిమ కల్మషహారాలను వుత్పత్తి చేశారు.


కల్మషహారాలు -ప్రాధాన్యాలు

లాండ్రీ కల్మషహారాలు

కల్మషహారాలను ముక్యంగా ఉపయోగించేది బట్టలు వుతుకటకు. వీటికి వున్న విభిన్న లేక బహుళఉపయోగార్థముగా వుండుటకు అలాగే పోటీతో కూడకున్న వినియోగదారుడి విపణి కోసం వీటి సూత్రీకరణలు చాలా క్లిష్టంగా వుంటాయి .సాధారణంగా లాండ్రీ కల్మషరాలు నీటి సున్నితత్వపూ రసాయనాలు , బ్లీచ్ , ఎంజైములు, , పరిమళాలు, మరియు అనేక ఇతర సాధనములను కల్గి వుంటాయి. వీటి సూత్రీకరణ వస్త్రములను శుబ్రము చేయు మంచి నీటి ఉష్ణోగ్రత మీద ఆధారపడి వుంటుంది . అలాగే ఈ సూత్రీకరణ ప్రదేశము మీద ఆధారపడి వుంటుంది.

జీవ పదార్థములు

వీటిని ముక్యంగా  జీవ కణములలో  అంతర్గత ప్రోటీన్లను  విబాగించుటకు మరియు శుద్దీకరణ కొరకు ఉపయోగిస్తారు. దీని కోసం  అంతర్గతంగ  వున్న  పల్చటి  ఏక పొరలోకి చొచ్చుకెళ్లగల కల్మశహారాము కావాలి .శుద్దీకరణ లో  అదునాతన సాకేంతిక పురోగతులు ముక్యమైన జీవ ప్రోటీన్ల యొక్క నిర్మాణ మరియు జీవభౌతిక  వర్గీకరణకు వెసులుబాటు కల్పిస్తుంది.ఇటువంటి అణువులు అంతర్గత పొరలను  బంగపరుస్తాయి. వీటికి వుదాహరణలుగా వాహాకాలను గ్రాహకాలను పేర్కొనవచ్చు.

ఇంధన సంకలితాలు

ఒట్టో ఇంజిన్ల యొక్క కార్బ్యురేటర్లు మరియు ఇంధన గొట్టములు ద్వారా దుర్గందము రాకుండా ఈ కల్మషహారాలను విరివిగా ఉపయోగిస్తాయి . వీటి కేంద్రీకరణ గురించి దాదాపుగా 300 పి‌పిఎమ్ గా వుంటుంది . సాధారణ డిటర్జెంట్లు దీర్ఘ శృంఖల అమైన్లు మరియు పాలిఐసొబ్యుటేనమైన్లు మరియు పాలిఐసొబ్యుటేనమైడ్లు అయి వుంటాయి.

సబ్బు లేని సబ్బు

ఇది సబ్బు లేని ద్రవ ప్రక్షాళనకు వుపయోగపడుతుంది. PH(10)తో కొద్దిగా ఆమ్లా స్వభావము కలిగి వుంటుంది. వీటిని ఏదిని ఉత్పత్తుల మధ్య వుంచుతారు.