సాక్షి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 28: పంక్తి 28:


=== చిత్రీకరణ ===
=== చిత్రీకరణ ===
పులిదిండి గ్రామంలో ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు తీసిన తొలి చిత్రం [[సాక్షి (సినిమా)|సాక్షి]] చిత్రీకరణ సాగింది. బాపురమణల మిత్రులు రామచంద్రరాజు స్వగ్రామం పులిదిండి కావడం సినిమా షూటింగ్ కోసం గ్రామాన్ని ఎంపికచేసుకోవడానికి గల కారణాల్లో ఒకటి. సినిమాకు అవసరమైన కొన్ని సెట్లు ప్రముఖ రచయిత, బాపురమణల మిత్రులు [[బి.వి.ఎస్.రామారావు]] వేశారు. ఈ సెట్ ఎంత సహజంగా కుదిరేలా ప్రయత్నించారంటే సినిమాలో కథానాయకుడి గుడిసె సెట్ వేసినప్పుడు, దాన్ని పాతబడిన ఇల్లుగా చూపేందుకు గ్రామంలోని పాతబడిపోయిన పాడైన గుమ్మం ఆ ఇంటివారిని అడిగి తీసుకుని వినియోగించారు. అలానే ఆ గుమ్మాన్నిచ్చిన వారికి కొత్త గుమ్మాన్ని ఏర్పాటుచేశారు.<ref name="మా సినిమాలు-బాపు">{{cite web|first1=బాపు|title=మా సినిమాలు|url=http://navatarangam.com/2014/02/our-films-bapu-1/|website=నవతరంగం|accessdate=18 April 2015}}</ref>
పులిదిండి గ్రామంలో ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు తీసిన తొలి చిత్రం [[సాక్షి (సినిమా)|సాక్షి]] చిత్రీకరణ సాగింది. బాపురమణల మిత్రులు రామచంద్రరాజు స్వగ్రామం పులిదిండి కావడం సినిమా షూటింగ్ కోసం గ్రామాన్ని ఎంపికచేసుకోవడానికి గల కారణాల్లో ఒకటి. సినిమాకు అవసరమైన కొన్ని సెట్లు ప్రముఖ రచయిత, బాపురమణల మిత్రులు [[బి.వి.ఎస్.రామారావు]] వేశారు. ఈ సెట్ ఎంత సహజంగా కుదిరేలా ప్రయత్నించారంటే సినిమాలో కథానాయకుడి గుడిసె సెట్ వేసినప్పుడు, దాన్ని పాతబడిన ఇల్లుగా చూపేందుకు గ్రామంలోని పాతబడిపోయిన పాడైన గుమ్మం ఆ ఇంటివారిని అడిగి తీసుకుని వినియోగించారు. అలానే ఆ గుమ్మాన్నిచ్చిన వారికి కొత్త గుమ్మాన్ని ఏర్పాటుచేశారు. ఈ సినిమా చిత్రీకరించేందుకు ముందు బాపుకు సినిమా దర్శకత్వ విభాగంలో పనిచేసిన అనుభవమేదీ లేదు. కేవలం సినిమా విద్యార్థిగా, ఔత్సాహికునిగా ప్రారంభమై ఎవరి వద్దా అసిస్టెంటుగా పనిచేయకుండానే సినిమాల్లో అడుగుపెట్టారు.<ref name="మా సినిమాలు-బాపు">{{cite web|first1=బాపు|title=మా సినిమాలు|url=http://navatarangam.com/2014/02/our-films-bapu-1/|website=నవతరంగం|accessdate=18 April 2015}}</ref>


=== నిర్మాణానంతర కార్యక్రమాలు ===
=== నిర్మాణానంతర కార్యక్రమాలు ===

18:48, 18 ఏప్రిల్ 2015 నాటి కూర్పు

సాక్షి
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
నిర్మాణం శేషగిరిరావు
కథ ముళ్ళపూడి వెంకటరమణ
తారాగణం కృష్ణ,
విజయనిర్మల,
రాజబాబు,
విన్నకోట రామన్న పంతులు,
సాక్షి రంగారావు,
జగ్గారావు (మస్తాన్),
విజయలలిత,
శివరామకృష్ణయ్య,
చలపతిరావు
సంగీతం కె.వి.మహదేవన్,
సహాయకుడు పుహళేంది
నేపథ్య గానం చిత్తరంజన్,
పి.బి. శ్రీనివాస్,
ఘంటసాల,
పి. సుశీల
నృత్యాలు పసుమర్తి కృష్ణమూర్తి
సంభాషణలు ముళ్ళపూడి వెంకటరమణ
ఛాయాగ్రహణం పి.ఎన్. సెల్వరాజ్
నిర్మాణ సంస్థ నందనా ఫిలిమ్స్
(శ్రీరమణ చిత్ర?)
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
దస్త్రం:SAAKSHI cinima b&w.jpg
సాక్షి సినిమాలో టైటిల్ పడినప్పడి దృశ్యం

బాపు దర్శకత్వంలో కృష్ణ, విజయనిర్మల ప్రధానపాత్రలుగా 1967లో విడుదలైన సినిమా సాక్షి. సాక్షి బాపు దర్శకుడిగా తీసిన మొట్టమొదటి చిత్రం. ఈ చిత్రం తీసే సమయానికి కృష్ణగాని, విజయనిర్మల గాని ప్రేక్షకులకి అంతగా తెలియదు. పైగా ఈ సినిమాలో వీరిద్దరూ ఏవిధమైన మేకప్ లేకుండా నటించారు.

గ్రామీణ వాతావరణం, అక్కడి రాజకీయాలు, మానవ సహజమైన భయాలు, మనకెందుకొచ్చిన గొడవ అని ఎంతటి ఘోరాన్నైనా చూడనట్టుగా ఊరుకోవటం, చక్కగా చిత్రీకరించారు. హీరో కృష్ణ, బాపు దర్శకత్వంలో చక్కగా నటించాడు. ఃఅలాగే విన్నకోట రామన్న పంతులు, రాజబాబు కూడ చక్కటి నటనను కనబరిచారు. రంగారావు అనే నటుడు ఈ చిత్రంలో కరణం పాత్రను పోషించి,ఈ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకుని సాక్షి రంగారావు గా ప్రసిద్ధికెక్కాడు.

నిర్మాణం

కథాంశం అభివృద్ధి

ముళ్ళపూడి వెంకటరమణ ఆంగ్ల చలనచిత్రం high noon అనుసరించి సాక్షి అనే కథను రాశారు.[1] సాక్షి చిత్రకథను చాలావరకూ ఆ సాక్షి కథనే ఆధారంగా చేసుకుని తయారుచేసుకున్నారు. కనుక ఈ సినిమా మూలకథాంశంపై హై నూన్ ప్రభావం ఉందని చెప్పవచ్చు. కథలో చివరకు కథానాయకుడి పాత్ర కూడా మంచి పాత్ర కాదన్న విషయం తెలుస్తుంది. ఐతే సినిమాకు అనుగునంగా ఆ విషయాన్ని తీసివేసి సినిమా కథానాయకుడిని అమాయకుడిగా నిలిపారు.[2]

చిత్రీకరణ

పులిదిండి గ్రామంలో ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు తీసిన తొలి చిత్రం సాక్షి చిత్రీకరణ సాగింది. బాపురమణల మిత్రులు రామచంద్రరాజు స్వగ్రామం పులిదిండి కావడం సినిమా షూటింగ్ కోసం గ్రామాన్ని ఎంపికచేసుకోవడానికి గల కారణాల్లో ఒకటి. సినిమాకు అవసరమైన కొన్ని సెట్లు ప్రముఖ రచయిత, బాపురమణల మిత్రులు బి.వి.ఎస్.రామారావు వేశారు. ఈ సెట్ ఎంత సహజంగా కుదిరేలా ప్రయత్నించారంటే సినిమాలో కథానాయకుడి గుడిసె సెట్ వేసినప్పుడు, దాన్ని పాతబడిన ఇల్లుగా చూపేందుకు గ్రామంలోని పాతబడిపోయిన పాడైన గుమ్మం ఆ ఇంటివారిని అడిగి తీసుకుని వినియోగించారు. అలానే ఆ గుమ్మాన్నిచ్చిన వారికి కొత్త గుమ్మాన్ని ఏర్పాటుచేశారు. ఈ సినిమా చిత్రీకరించేందుకు ముందు బాపుకు సినిమా దర్శకత్వ విభాగంలో పనిచేసిన అనుభవమేదీ లేదు. కేవలం సినిమా విద్యార్థిగా, ఔత్సాహికునిగా ప్రారంభమై ఎవరి వద్దా అసిస్టెంటుగా పనిచేయకుండానే సినిమాల్లో అడుగుపెట్టారు.[3]

నిర్మాణానంతర కార్యక్రమాలు

కథ

గ్రామంలో పడవ నడిపేవాడు కృష్ణ. అతన్ని ప్రేమించే అమ్మాయి విజయ నిర్మల. ఊరి రౌడీ, లారీ డ్రైవరు జగ్గారావు. విజయ నిర్మల ఇతని చెల్లెలు. రౌడీ చేసిన హత్య చేస్తుండగా చూసిన కథానాయకుడు, న్యాయస్థానానికి వెళ్ళి సాక్ష్యం చెప్తాడు. రౌడీకి జైలు శిక్ష పడుతుంది. కాని, రౌడీ జైలు నుంచి తప్పించుకుని వస్తున్నాడని తెలిసిన జనం, అప్పటిదాకా మెచ్చుకున్నవారే, ప్రాణ భయంతొ ఉన్న పడవాడికి ఆశ్రయం ఇవ్వటానికి నిరాకరిస్తారు. ఇక రౌడీ చేతులో ఎట్టాగో చావు తప్పదని నిబ్బరం గా ఉన్న పడవ వాడు, రౌడీ వచ్చి తన్నటం మొదలు పెట్టేసరికి, భయంలోంచి వచ్చిన తప్పనిసరి ధైర్యంతో తాగి ఉన్న రౌడీని తనకున్న శక్తి యావత్తూ వినియోగించి దెబ్బలు వేస్తాడు. ఆ రౌడీ చచ్చిపోతాడు.

పాటలు

సాక్షి సినిమా కోసం ఆరుద్ర 4 పాటలు రచించారు.[4]

  • అటు వెన్నెల ఇటు వెన్నెల ఎటు చూస్తే అటు వెన్నెల - రచన: ఆరుద్ర; గానం: పి.సుశీల
  • అమ్మకడుపు చల్లగా అత్తకడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా - రచన: ఆరుద్ర; గానం: పి.సుశీల
  • దయలేదా నీకు దయలేదా ప్రాణసఖునిపై దయలేదా - రచన: ఆరుద్ర: గానం: పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ బృందం
  • పదిమంది కోసం నిలబడ్డ నీకు ఫలితం ఏమిటి ? - రచన: ఆరుద్ర; గానం: మోహన్ రాజు

మూలాలు

  1. "బొమ్మలోంచి సినిమాలోకి నడిచొచ్చిన 'బాపూ తనపు' హీరోయిన్!". సారంగ. Retrieved 18 April 2015. {{cite web}}: |first1= missing |last1= (help)
  2. ఎమ్.వి.ఎల్., ప్రసాద్. "ముందుమాట". కథారమణీయం-2 (1 ed.). హైదరాబాద్: విశాలాంధ్ర పబ్లికేషన్స్.
  3. "మా సినిమాలు". నవతరంగం. Retrieved 18 April 2015. {{cite web}}: |first1= missing |last1= (help)
  4. సాక్షి, ఆరుద్ర సినీ గీతాలు (1965-1970), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2002, పేజీలు: 60-63.