ఆర్తీ అగర్వాల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 23: పంక్తి 23:


== సినీరంగ ప్రవేశం ==
== సినీరంగ ప్రవేశం ==
14 సంవత్సరాల వయసులో మొదట మోడలింగ్‌రంగంలోకి ప్రవేశించింది.
14 సంవత్సరాల వయసులో మొదట మోడలింగ్‌రంగంలోకి ప్రవేశించింది. [[ఫిలడెల్ఫియా]] లోని ఓ స్టేజ్‌ షోలో డాన్స్ చేయడానికి హీరో సునీల్‌శెట్టి ఆమెను ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి బిగ్‌ బీ [[అమితాబ్ బచ్చన్]] ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ప్రముఖ నిర్మాత [[డి.సురేష్ బాబు]] నిర్మించిన [[నువ్వు నాకు నచ్చావ్]] చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి కథానాయికగా పరిచయమయింది. ఈ చిత్రంలో కథానాయకుడు [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]. ఆ సినిమా ఘన విజయం సాధించి ఆమెకి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది. తెలుగు సినీరంగంలో 2000 దశకంలో అగ్ర కథానాయకులుగా భావించబడిన [[చిరంజీవి]], [[వెంకటేష్]], [[బాలకృష్ణ]] మరియు [[నాగార్జున]] ల సరసన నటిండమ కాక యువతరం కథానాయకులైన [[మహేష్ బాబు]], [[జూనియర్ ఎన్టీయార్]], [[ప్రభాస్]], [[రవితేజ (నటుడు)|రవితేజ]],[[ఉదయ్ కిరణ్]], [[తరుణ్]] లతో నటించిన ఘనత ఆర్తీకి దక్కింది. [[బి.గోపాల్]] దర్శకత్వంలో వరుసగా నాలుగు సినిమాలలో నటించింది (చివరిది అతిధి పాత్ర). [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] సరసన నటించిన మూడు చిత్రాలు [[నువ్వు నాకు నచ్చావ్]], [[వసంతం]], [[సంక్రాంతి]] ఘనవిజయం సాధించాయి.
ప్రముఖ నిర్మాత [[డి.సురేష్ బాబు]] నిర్మించిన [[నువ్వు నాకు నచ్చావ్]] చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి కథానాయికగా పరిచయమయింది. ఈ చిత్రంలో కథానాయకుడు [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]. ఆ సినిమా ఘన విజయం సాధించి ఆమెకి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది. తెలుగు సినీరంగంలో 2000 దశకంలో అగ్ర కథానాయకులుగా భావించబడిన [[చిరంజీవి]], [[వెంకటేష్]], [[బాలకృష్ణ]] మరియు [[నాగార్జున]] ల సరసన నటిండమ కాక యువతరం కథానాయకులైన [[మహేష్ బాబు]], [[జూనియర్ ఎన్టీయార్]], [[ప్రభాస్]], [[రవితేజ (నటుడు)|రవితేజ]],[[ఉదయ్ కిరణ్]], [[తరుణ్]] లతో నటించిన ఘనత ఆర్తీకి దక్కింది. [[బి.గోపాల్]] దర్శకత్వంలో వరుసగా నాలుగు సినిమాలలో నటించింది (చివరిది అతిధి పాత్ర). [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] సరసన నటించిన మూడు చిత్రాలు [[నువ్వు నాకు నచ్చావ్]], [[వసంతం]], [[సంక్రాంతి]] ఘనవిజయం సాధించాయి.



18:33, 6 జూన్ 2015 నాటి కూర్పు

ఆర్తీ అగర్వాల్
జననం (1984-03-05) 1984 మార్చి 5 (వయసు 40)
అమెరికాలోని అట్లాంటిక్ సిటీ న్యూజెర్సీ
మరణంజూన్ 6, 2015
అమెరికాలోని అట్లాంటిక్ సిటీ న్యూజెర్సీ[1]
జీవిత భాగస్వామిఉజ్వల్ కుమార్

ఆర్తీ అగర్వాల్ (మార్చి 5, 1984 - జూన్ 6, 2015) [2] తెలుగు సినిమా నటీమణి.

జననం

అమెరికాలో స్థిర పడిన ఒక గుజరాతీ కుటుంబములో న్యూజెర్సీ లో జన్మించింది. పెరిగిన ఈమె 16 యేళ్ల వయసులో 2001 లో విడుదలైన హిందీ చిత్రము పాగల్‌పన్ తో భారతీయ సినిమాలలో అడుగుపెట్టింది.

సినీరంగ ప్రవేశం

14 సంవత్సరాల వయసులో మొదట మోడలింగ్‌రంగంలోకి ప్రవేశించింది. ఫిలడెల్ఫియా లోని ఓ స్టేజ్‌ షోలో డాన్స్ చేయడానికి హీరో సునీల్‌శెట్టి ఆమెను ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు నిర్మించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి కథానాయికగా పరిచయమయింది. ఈ చిత్రంలో కథానాయకుడు వెంకటేష్. ఆ సినిమా ఘన విజయం సాధించి ఆమెకి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది. తెలుగు సినీరంగంలో 2000 దశకంలో అగ్ర కథానాయకులుగా భావించబడిన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ మరియు నాగార్జున ల సరసన నటిండమ కాక యువతరం కథానాయకులైన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీయార్, ప్రభాస్, రవితేజ,ఉదయ్ కిరణ్, తరుణ్ లతో నటించిన ఘనత ఆర్తీకి దక్కింది. బి.గోపాల్ దర్శకత్వంలో వరుసగా నాలుగు సినిమాలలో నటించింది (చివరిది అతిధి పాత్ర). వెంకటేష్ సరసన నటించిన మూడు చిత్రాలు నువ్వు నాకు నచ్చావ్, వసంతం, సంక్రాంతి ఘనవిజయం సాధించాయి.

చిరంజీవి తో ఆమె నటించిన ఇంద్ర చిత్రం ఆర్తిని అగ్రతారగా నిలబెట్టింది. ప్రిన్స్ మహేష్‌తో బాబీ.. బాలయ్యతో పల్నాటి బ్రహ్మ నాయుడు.. విక్టరీ వెంకటేష్‌తో వసంతం.. రవితేజతో వీడే.. నాగార్జునతో నేనున్నాను.. ప్రభాస్‌తో అడవిరాముడు.. జూనియర్ ఎన్టీఆర్‌తో నరసింహుడు.. సునీల్‌తో అందాలరాముడు తదితర చిత్రాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి.

వ్యక్తిగత జీవితము

ఆర్తీ అగర్వాల్ అనుమానాస్పద పరిస్థితుల్లో మెట్లపై నుండి జారిపడి ఆర్తి ఆసుపత్రి పాలైంది. 2005లో క్లీనింగ్ కెమికల్ త్రాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో యువహీరో తరుణ్‌ తో సంబంధం ఉన్నట్టుగా వస్తున్న వదంతులతో విసిగి ఆ పని చేసినట్టు ఆర్తీ చెప్పింది.[3] 2007 నవంబర్ 22 న ఆర్తీ రాణీగంజ్‌లోని ఆర్యసమాజంలో న్యూజెర్సీకి చెందిన గుజరాతీ ప్రవాసభారతీయుడు ఉజ్జ్వల్ కుమార్ ను వివాహమాడింది. వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. వివాహం తర్వాత అమెరికాలో కొంతకాలం ఉండి తిరిగి తెలుగు సినిమా రంగంలో రెండవ అంకాన్ని ప్రారంభించడానికి వచ్చింది. ఆర్తీ చెల్లెలు అదితి కూడా తెలుగు సినిమాలలో నటిగా అల్లు అర్జున్ చిత్రం గంగోత్రి తో పరిచయమైంది.

మరణం

గత కొంతకాలంగా స్థూలకాయం, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న ఆర్తీ చికిత్సకోసం అమెరికా వెళ్లి అక్కడే చికిత్స తీసుకున్నది. జూన్ 4, 2015న అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో లైపోసక్షన్ సర్జరీ చేయించుకుంది. చికిత్స వికటించడంతో గుండెపోటు వచ్చి ఇన్ ఫెక్షన్ తలెత్తడంతో అనూహ్యంగా జూన్ 6, 2015 న కన్ను మూసింది.

కారణం హీరోయిన్ ఓరియెంటెడ్ "జంక్షన్‌లో జయమాలిని" చిత్రం కోసం బరువు తగ్గడానికి ఆర్తి చేసిన ప్రయత్నమే ఆమె ప్రాణాలమీదకు తెచ్చింది. ఈ సినిమాలో డ్యూయెల్ రోల్‌ ఉండగా, ఒక పాత్రలో మాస్ ఇమేజ్ కోసం ఆర్తి వెయిట్ తగ్గాల్సివచ్చింది. అప్పటికి 89 కేజీల బరువున్న ఆర్తి 63 కేజీలకు తగ్గింది. మరో మూడు కేజీల బరువు తగ్గడం కోసం లైపో సెక్షన్ చేయించుకోవడానికి ఆమె తన జన్మస్థలమైన అమెరికాలోని న్యూజెర్సీ నగరానికి వెళ్లింది. [4]

నటించిన చలన చిత్రాలు

తెలుగు

హింది

మూలాలు

బయటి లింకులు