ప్రభాస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి ఉచిత దస్త్రం
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox person
{{Infobox person
| name = ఉప్పలపాటి ప్రభాస్ రాజు
| name = ఉప్పలపాటి ప్రభాస్ రాజు
| image = Prabhas.jpg
| image = Prabhas promoting Baahubali in June 2015 (cropped).jpg
| caption = బాహుబలి సినిమా ప్రచారానికై పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న ప్రభాస్
| caption =
| birth_date = {{Birth date and age|df=yes|1979|10|23|df=yes}}/ [[1979]] , [[అక్టోబరు 23]]
| birth_date = {{Birth date and age|df=yes|1979|10|23|df=yes}}/ [[1979]] , [[అక్టోబరు 23]]
| birth_place = [[మద్రాసు]], [[తమిళనాడు]], [[భారతదేశం]]
| birth_place = [[మద్రాసు]], [[తమిళనాడు]], [[భారతదేశం]]

02:02, 25 జూన్ 2015 నాటి కూర్పు

ఉప్పలపాటి ప్రభాస్ రాజు
బాహుబలి సినిమా ప్రచారానికై పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న ప్రభాస్
జననం
ఉప్పలపాటి ప్రభాస్ రాజు

(1979-10-23) 1979 అక్టోబరు 23 (వయసు 44)/ 1979 , అక్టోబరు 23
ఇతర పేర్లుడార్లింగ్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2002–ఇప్పటివరకు
ఎత్తు6'2
తల్లిదండ్రులుసూర్యనారాయణా రాజు
శివ కుమారి
వెబ్‌సైటుhttp://www.darlingprabhas.com

ఉప్పలపాటి ప్రభాస్ రాజు ఒక తెలుగు నటుడు. ఇతడు "ప్రభాస్" గా సుపరిచితుడు. ఇతను ప్రముఖ నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ఇతను తెలుగు సినీ నటులలో ఒకడైన పొడుగువానిగా మరియు అందగాడు చెప్పుకోవచ్చు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి వంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు.[1]

వ్యక్తిగత జీవితం

ప్రభాస్ ఉప్పలపాటి సూర్యనారాయణరాజు మరియు శివ కుమారి దంపతులకు అక్టోబర్ 23, 1979 తేదీన జన్మించాడు. పశ్చిమ గోదావరి జిల్లా లోని మొగల్తూరు తన కుటుంబ స్వగ్రామం. తన తల్లితండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు. అక్టోబర్ 23, 1979 న జన్మించారు. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, మరియు ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. ఇతను ప్రముఖ నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ప్రముఖ నటులు గొపిచంద్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్ కుమార్ ప్రభాస్ కు మంచి స్నేహితులు.

సినీ జీవితం

2001లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేసాడు. ఈ సినిమా ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవికి కూడా తెలుగులో ఇది తొలి సినిమా. ఈ సినిమా విజయం సాధించినా ఆ తర్వాత 2003లో విడుదలైన రాఘవేంద్ర సినిమా పరాజయం పాలైంది. 2004లో త్రిష సరసన నటించిన వర్షం సినిమా ప్రభాస్ కు మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించింది. ఆ తర్వాత ప్రభాస్ అడవి రాముడు, చక్రం సినిమాల్లో నటించాడు. ఈ సినిమాల ద్వారా ప్రభాస్ కు నటుడిగా మంచి గుర్తింపు లభించినా పరాజయం పాలయ్యాయి. 2005లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ శ్రియా సరసన ఛత్రపతి సినిమాలో నటించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి ప్రభాస్ ను తెలుగులో ఒక ప్రముఖ నటుడిగా నిలబట్టింది. కానీ ఆ తర్వాత విడుదలైన పౌర్ణమి, యోగి సినిమాలు పరాజయం చెందాయి. ఆ తర్వాత ప్రభాస్ ఇలియానా సరసన పైడిపల్లి వంశీ దర్శకత్వంలో మున్నా సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. 2008లో పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో త్రిష సరసన తన కెరియర్ లో రెండో సారి బుజ్జిగాడు సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా విజయం సాధించింది.

2009లో మెహెర్ రమేష్ దర్శకత్వంలో అనుష్క, నమితల సరసన బిల్లా సినిమాలో నటించాడు. ఒక క్రూరమైనా డాన్ మరియూ అతనిలగే ఉండే ఒక చిల్లరదొంగ పాత్రల్లో ప్రభాస్ నటించాడు. ఈ సినిమా తనకు గుర్తింపునిచ్చినా యవరెగజ్ గా నిలిచింది . ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విడుదలైన ఏక్ నిరంజన్ కూడా పరాజయం పాలైంది. 2010లో ఏ. కరుణాకరణ్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ సరసన డార్లింగ్ సినిమాలో నటించాడు. తొలిసారిగా ఒక క్లాస్ రోల్లో నటించిన ప్రభాస్ ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. 2011లో మళ్ళీ కాజల్ అగర్వాల్ తో కలిసి దశరధ్ దర్శకత్వంలో మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాలో నటించాడు ప్రభాస్. కుటుంబ విలువల నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ మరో కథానాయిక. ఈ సినిమా డార్లింగ్ కంటే పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.

2012లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తమన్నా, దీక్షా సేథ్ దర్శకత్వంలో రెబెల్ సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది. 2013లో ప్రముఖ రచయిత కొరటాల శివ దర్శకత్వంలో మిర్చి సినిమాలో నటించాడు. ఈ సినిమాలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ కథానాయికలు. ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రస్తుతం ప్రభాస్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో అనుష్క, రానా దగ్గుబాటి లతొ కలసి బాహుబలి సినిమాలో నటిస్తున్నాడు.

నటించిన చిత్రాలు

సంవత్సరం చిత్రం పాత్ర(లు) భాష ఇతర విశేషాలు
2002 ఈశ్వర్ ఈశ్వర్ తెలుగు
2003 రాఘవేంద్ర రాఘవేంద్ర తెలుగు
2004 వర్షం వెంకట్ తెలుగు
2004 అడవి రాముడు రాము తెలుగు
2005 చక్రం చక్రం తెలుగు
2005 ఛత్రపతి శివాజి

ఛత్రపతి

తెలుగు
2006 పౌర్ణమి శివకేశవ తెలుగు
2007 యోగి ఈశ్వర్ ప్రసాద్

యోగి

తెలుగు
2007 మున్నా మున్నా తెలుగు
2008 బుజ్జిగాడు బుజ్జి

లింగరాజు

తెలుగు
2009 బిల్లా బిల్లా,
రంగా
తెలుగు
2009 ఏక్ నిరంజన్ నిరంజన్

ఛొటు

తెలుగు
2010 డార్లింగ్ ప్రభాస్ తెలుగు
2011 మిస్టర్ పర్‌ఫెక్ట్ విక్కీ తెలుగు
2012 రెబెల్ రిషి తెలుగు
2013 మిర్చి జై తెలుగు
2014 బాహుబలి తెలుగు,
తమిళ్,
హిందీ
చిత్రీకరణ జరుగుతున్నది

అవార్డులు మరియూ పురస్కారాలు

సంవత్సరం అవార్డ్ క్యాటెగరీ చిత్రం ఫలితం
2004 సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ యువ నటుడు వర్షం విజేత
2004 దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్స్ ఉత్తమ నటుడు వర్షం పేర్కొనబడ్డాడు
2005 దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్స్ ఉత్తమ నటుడు ఛత్రపతి పేర్కొనబడ్డాడు
2009 దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్స్ ఉత్తమ నటుడు ఏక్ నిరంజన్ పేర్కొనబడ్డాడు
2010 సినీ"మా" అవార్డ్స్ ఉత్తమ నటుడు - జ్యూరీ డార్లింగ్ విజేత
2011 దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్స్ ఉత్తమ నటుడు మిస్టర్ పర్‌ఫెక్ట్ పేర్కొనబడ్డాడు
2012 దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా అవార్డ్స్ ఉత్తమ నటుడు మిస్టర్ పర్‌ఫెక్ట్' పేర్కొనబడ్డాడు

మూలాలు

  1. "ప్రభాస్ రాజు ఉప్పలపాటి". Short Bio. Retrieved 2013-10-11.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రభాస్&oldid=1542651" నుండి వెలికితీశారు