అబుల్ హసన్ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:హైదరాబాదు జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1: పంక్తి 1:
[[File:Portrait of Abu'l Hasan,.jpg|thumb|అబుల్ హసన్ కుతుబ్ షా,]]
[[File:Portrait of Abu'l Hasan,.jpg|thumb|అబుల్ హసన్ కుతుబ్ షా,]]


'''తానీషా''' (దయామయ పాలకుడు)గా ప్రసిద్ధి చెందిన '''అబుల్ హసన్ కుతుబ్ షా''' [[దక్షిణ భారతదేశము]]లో [[గోల్కొండ]]ను పాలించిన [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్‌షాహీ వంశాని]]కి చెందిన ఏడవ మరియు చివరి చక్రవర్తి. ఇతడు [[అబ్దుల్లా కుతుబ్ షా]] మూడవ అల్లుడు. ఈయన [[1672]] నుండి [[1687]] వరకు పాలించాడు.
'''తానాషా''' (దయామయ పాలకుడు)గా ప్రసిద్ధి చెందిన '''అబుల్ హసన్ కుతుబ్ షా''' [[దక్షిణ భారతదేశము]]లో [[గోల్కొండ]]ను పాలించిన [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్‌షాహీ వంశాని]]కి చెందిన ఏడవ మరియు చివరి చక్రవర్తి. ఇతడు [[అబ్దుల్లా కుతుబ్ షా]] మూడవ అల్లుడు. ఈయన [[1672]] నుండి [[1687]] వరకు పాలించాడు.
== బాల్యం ==
అబుల్ హసన్ చిన్నతనంలో అబ్దుల్లా మహారాజు భవంతిలో ఉండేవాడు. అతను ఎవరి కుమారుడో తెలియకున్నా, అతనికీ రాజవంశానికి ఏదో సంబంధం ఉందని భావిస్తూ అందరూ కొద్దిపాటి గౌరవాన్ని ఇచ్చేవారు.


==పరమత సహనం==
==పరమత సహనం==

03:30, 6 జూలై 2015 నాటి కూర్పు

అబుల్ హసన్ కుతుబ్ షా,

తానాషా (దయామయ పాలకుడు)గా ప్రసిద్ధి చెందిన అబుల్ హసన్ కుతుబ్ షా దక్షిణ భారతదేశములో గోల్కొండను పాలించిన కుతుబ్‌షాహీ వంశానికి చెందిన ఏడవ మరియు చివరి చక్రవర్తి. ఇతడు అబ్దుల్లా కుతుబ్ షా మూడవ అల్లుడు. ఈయన 1672 నుండి 1687 వరకు పాలించాడు.

బాల్యం

అబుల్ హసన్ చిన్నతనంలో అబ్దుల్లా మహారాజు భవంతిలో ఉండేవాడు. అతను ఎవరి కుమారుడో తెలియకున్నా, అతనికీ రాజవంశానికి ఏదో సంబంధం ఉందని భావిస్తూ అందరూ కొద్దిపాటి గౌరవాన్ని ఇచ్చేవారు.

పరమత సహనం

ఇతర మతాలకు చెందిన ప్రజలను కూడా తారతమ్యాలు లేకుండా పరిపాలించిన ప్రభువుగా తానీషా చిరస్మరణీయుడు. ఈయన తన ఆస్థానములో మంత్రులు మరియు సేనానులుగా అనేకమంది బ్రాహ్మణులను నియమించుకున్నాడు. ఉదాహరణకు తానీషా హనుమకొండకు చెందిన మాదన్న అనే తెలుగు బ్రాహ్మణున్ని ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు. తెలుగు సాహిత్యములో తానీషా, మాదన్న మేనల్లుడు రామదాసు (కంచర్ల గోపన్న)ను కారాగారములో బంధించిన చక్రవర్తిగా ప్రసిద్ధి పొందాడు. పాల్వంచ తాలూకా నేలకొండపల్లి గ్రామ వాస్తవ్యుడైన కంచర్ల గోపన్నను తానీషా మాదన్న సిఫారుసుపై పాల్వంచ తాలూకాకు తాసీల్దారుగా నియమిస్తాడు. గోపన్న ప్రజాధనాన్ని ప్రభువుకు ముట్టజెప్పకుండా భద్రాచలములో రామాలయము నిర్మించడానికి, సీతారామలక్ష్మణులకు నగలు చేయించడానికి వినియోగిస్తాడు. ప్రజాధనాన్ని సొంతపనులకు ఉపయోగించుకున్నాడన్న అభియోగముపై గోపన్నను తానీషా గోల్కొండలోని కారాగారములో బంధిస్తాడు. కథనం ప్రకారం ఆ తరువాత రామలక్షణులు తానీషాకు కనిపించి స్వయంగా డబ్బుతిరిగి ఇవ్వగా గోపన్నను విడుదల చేస్తాడు. రామదాసుకు తానీషా చూపిన సహృదయతకు గాను తెలుగు ప్రజలు తానీషాను నేటికీ కొనయాడుతారు.

గోల్కొండ పతనం

కర్ణాటకమును అక్రమించి గోల్కోండను విస్తరించినవాడు అదే విధంగా ఔరంగజేబు పంచనచేరి గోల్కోండ పతనానికి కారకుడు నమ్మకద్రోహి అయిన మీర్ జుమ్లా

తానీషా కంటే ముందు చక్రవర్తిగా ఉన్న తానీషా మామ, అబ్దుల్లా కుతుబ్ షాను దక్కన్లో మొఘల్ సేనానిగా ఉన్న ఔరంగజేబు ఓడించి మొఘల్ చక్రవర్తి షాజహాను యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించి కప్పం కట్టే విధంగా ఒప్పందం కుదిర్చాడు. మొగలుల దండయాత్రల నుండి గోల్కొండను రక్షించడానికి మహారాష్ట్ర నాయకుడైన శివాజీతో అబుల్ హసన్ సంధి కుదుర్చుకున్నాడు. 1680లో శివాజీ మరణం తరువాత 1685లో ఔరంగజేబు తన కుమారుడైన షా ఆలం నాయకత్వంలో గోల్కొండ పైకి దండయాత్ర చేశాడు. మొదట గోల్కొండకే విజయం లభించినా, చివరకు కొందరు సేనానుల నమ్మకద్రోహం వలన గోల్కొండ సైన్యాలు ఓడిపోయాయి. పర్యవసానంగా అబుల్ హసన్ మొగలులతో సంధి చేసుకున్నాడు. సంధి షరతుల ప్రకారం అబుల్ హసన్ బకాయిల క్రింద కోటి హొన్నులు చెల్లించాలి. సంవత్సరానికి రెండు లక్షల హొన్నులు కప్పం చెల్లించాలి. మల్ఖేడు ప్రాంతాన్ని మొగలాయిలకు అప్పగించాలి. అక్కన్న, మాదన్నలను ఉద్యోగాల నుండి తొలగించాలి.

మొగలు సైన్యం నిష్క్రమించిన తరువాత అక్కన్న, మాదన్నలను తొలగించడానికి అబుల్ హసన్ జాప్యం చేశాడు. ఔరంగజేబు కోపానికి కారణం వీరేనని భావించిన కొందరు ముస్లిం సర్దా`రులు, అంతఃపుర స్త్రీల ప్రోత్సాహంతో షేక్ మిన్హాజ్ నాయకత్వంలో అక్కన్న మాదన్నల హత్యకు కుట్ర పన్నారు. 1686 మార్చి 24వ తేదీ రాత్రి సుల్తానుతో సంప్రదించి ఇంటికి వెళుతున్న వారిని గోల్కొండ నడివీధిలో హత్య చేశారు.

1683 ప్రాంతంలో అబుల్ హసన్ మొఘల్ చక్రవర్తులకు కట్టవలసిన పన్నులను సకాలములో చెల్లించలేదు. దీని పర్యవసానంగా గోల్కొండపై మొఘలుల ఆధిపత్యాన్ని పటిష్టపరచేందుకు బీజాపూర్ ఆక్రమణ పూర్తయిన తరువాత ఔరంగజేబు స్వయంగా గోల్కొండపై 1687 ఫిబ్రవరి 7న దండయాత్ర చేశాడు. తానీషా గోల్కొండ కోటపై ఔరంగజేబు దాడిని ఎనిమిది నెలలపాటు నిలువరించాడు. కానీ 1687 అక్టోబర్ 3వ తేదీన ఔరంగజేబు లంచం ఇచ్చి కోటలు తలుపులు తెరిపించి, గోల్కొండ కోటను వశపరచుకున్నాడు. తానీషాను బందీగా తీసుకొని వెళ్ళి దౌలతాబాదు కోటలో 13 సంవత్సరాలు (అనగా క్రీ.శ. 1700) మరణించేవరకు బంధించి ఉంచారు.

తానీషా ఓటమితో గోల్కొండ కుతుబ్ షాహీ వంశము అంతమొంది దక్కన్లో మొఘలుల ఆధ్వర్యములో నిజాం పాలన క్రీ.శ. 1701 నుండి ప్రారంభమయ్యింది.