శేషాద్రి రమణ కవులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:1890 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 19: పంక్తి 19:


==మూలాలు==
==మూలాలు==
{{వికీసోర్స్|శేషాద్రి రమణ కవులు}}
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}



08:20, 9 జూలై 2015 నాటి కూర్పు

శేషాద్రి రమణ కవులు తెలుగు సాహిత్యాన్ని సంపన్నం చేసిన సోదరులైన జంట కవులు మరియు చరిత్ర పరిశోధకులు.

వీరు గుంటూరు జిల్లా వాడరేవులో వెంకట రంగాచార్యులు మరియు లక్ష్మమ్మ దంపతులకు కలిగిన ఏడుగురు సంతానంలో మూడవ వారుగా జన్మించిన దూపాటి శేషాచార్యులు (1890-1940) మరియు నాలుగవ వారైన దూపాటి వెంకట రమణాచార్యులు (1893-1963) కలిపి శేషాద్రి రమణ కవులుగా ప్రసిద్ధిచెందారు.[1]

జంటకవులు

వీరు జయంతి రామయ్య పంతులు గార్ని ఉద్యోగం కోసం ఆశ్రయించగా వారు ఆంధ్ర సాహిత్య పరిషత్తు తరపున శేషాచార్యులను గుంటురు జిల్లాలోను, రమణాచార్యులను నిజాం సర్కారులలోను పర్యటించి శాసనాది చారిత్రక సామగ్రిని, తాళపత్ర గ్రంథాలను సేకరించడానికి నియమించారు. వీరిద్దరు కొంతకాలం తెలుగు చరిత్ర, సాహిత్యానికి తోడ్పడే సామగ్రిని సేకరించి పరిషత్తు భండాగారం నింపారు.

దూపాటి శేషాచార్యులు

శాసన పరిష్కార బాధ్యతలను నిర్వహించిన అనంతరం వీరు బయ్యన్నగూడెం, తిప్పనపల్లె, తుళ్లూరు, వడ్డెపల్లి, ఆంధ్ర గ్రంథాలయ ముద్రణాలయం, పునాదిపాడు చివరకు బందరు హిందూ కళాశాలలోను ఉద్యోగం చేశారు.

దూపాటి వేంకట రమణాచార్యులు

వీరు గంపలగూడెం ఆస్థాన పండితులుగాను, బెజవాడ ఆంధ్ర గ్రంథాలయ ముద్రణాలయంలోను, నందిగామ బోర్డు హైస్కూలులోను పనిచేశారు.

రచనలు

  • ఆంధ్రవీరులు (రెండు భాగాలు - 1929, 1931)
  • పాపారాయ నిర్యాణము అను బొబ్బిలి సంగ్రామము (1927).[2]
  • చంద్రహాస చరిత్ర (1928)[3]

మూలాలు

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  1. శేషాద్రి రమణ కవులు, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీలు: 837-9.
  2. ఆర్కీవు.ఆర్గ్ లో పూర్తి పుస్తకం.
  3. చంద్రహాస చరిత్ర పుస్తకం ఆర్కీవు.ఆర్గ్ లో.