ఎ. ఆర్. రెహమాన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 53: పంక్తి 53:
* [[జెంటిల్ మాన్]]
* [[జెంటిల్ మాన్]]
* [[జీన్స్]]
* [[జీన్స్]]
*[[సఖి]]
* [[నీ మనసు నాకు తెలుసు]]
* [[నీ మనసు నాకు తెలుసు]]
* [[నానీ]]
* [[నానీ]]
పంక్తి 59: పంక్తి 60:
* [[నువ్వు నేను ప్రేమ]]
* [[నువ్వు నేను ప్రేమ]]
{{refend}}
{{refend}}
=== రెహ్మాన్ సంగీతం అందించిన చిత్రాలు ===sakhi


== 1992 లో ==
== 1992 లో ==

05:31, 14 జూలై 2015 నాటి కూర్పు

ఏ.ఆర్. రెహమాన్
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంఏ.ఎస్. దిలీప్ కుమార్
ఇతర పేర్లుఎ.ఆర్. రెహ్మాన్
సంగీత శైలిFilm score, Theatre, World Music
వృత్తిComposer, record producer, music director, singer, instrumentalist, arranger, programmer
వాయిద్యాలుకీబోర్డు
క్రియాశీల కాలం1992 – present
లేబుళ్ళుK.M. Music
వెబ్‌సైటుఎ.ఆర్.రహ్మాన్.కామ్

అల్లా రఖా రెహమాన్ అన్న పూర్తిపేరున్న ఎ.ఆర్.రహ్మాన్ (audio speaker iconpronunciation , పుట్టుకతో ఎ. ఎస్. దిలీప్ కుమార్, జ.6 జనవరి 1967) భారతీయ సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు-గీత రచయిత, నిర్మాత(సంగీతం), సంగీతకారుడు, దాత.[1] రహమాన్ గీతాలు తూర్పుదేశాలకు చెందిన శాస్త్రీయ సంగీతాన్ని(ముఖ్యంగా భారతీయ శాస్త్రీయ సంగీతం) ప్రపంచ సంగీతం, ఎలక్ట్రానిక్ సంగీతం, సంప్రదాయ ఆర్కెస్ట్రా అరేంజ్మెంట్లనూ మేళవించే శైలికి పేరొందాయి. ఆయన పొందిన పురస్కారాల్లో రెండు ఆస్కార్ అవార్డులు, రెండు గ్రామీ పురస్కారాలు, ఒక బిఎఎఫ్‌టిఎ పురస్కారం, ఒక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు, నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, పదమూడు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు ఉన్నాయి. సినిమాలు, వేదికల్లో రహమాన్ సంగీత కృషి

జీవితం

రెహ్మాన్‌ అసలు పేరు ఎ. ఎస్‌. దిలీప్‌ కుమార్‌. తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే తండ్రి మరణించాడు. తల్లి, ముగ్గురు అక్కచెల్లెళ్ళు- పేదరికం. శేఖర్‌ సంగీత వాయిద్యాలను అద్దెకిచ్చి వచ్చిన ఆ డబ్బుతో జీవితం సాగించడం మొదలు పెట్టాడు. 11 సంవత్సరాల ప్రాయంలో కుటుంబ బాధ్యతలు నెత్తిపై వేసుకొని తల్లికి చేదోడుగా ఉంటూ గిటార్‌, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా ఇళయరాజా ట్రూప్‌లో జీవితం ప్రారంభించాడు. 1989వ సంవత్సరంలో కుటుంబమంతా హిందూ మతం నుంచి ఇస్లామ్‌లోకి మారిపోయింది. ఈయన కడప లోని పెద్ద దర్గా, కసుమూరు దర్గా, నెల్లూరు జిల్లాలోని వేనాడు దర్గాలను తరచూ సందర్శిస్తారు.

సంగీత ప్రస్థానం

తన సంగీత జీవితాన్ని రాజ్ - కోటి లాంటి కొందరి వద్ద అసిస్టెంటుగా ప్రారంభించి, కొన్ని ప్రకటనలకు జింగిల్స్ సమకూర్చి, తదనంతరం మలయాళ దర్శకద్వయం సంతోష్-శివన్ ల దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకునిగా నటించిన యోధ సినిమాతో పరిచయం అయ్యాడు. అయితే ప్రఖ్యాత తమిళ దర్శకుడు మణిరత్నం ] సినిమా రోజా ద్వార మొత్తం భారతదేశమంతటా పేరు పొందాడు. "స్లమ్‌డాగ్ మిలియనీర్" అనే చిత్రంలో 'జై హో' అనే పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్టాత్మకమైన "గోల్డెన్ గ్లోబ్ అవార్డు"ను కైవసం చేసుకున్న రెహ్మాన్ ఈ గౌరవం తనకు మాత్రమే దక్కలేదని, వంద కోట్ల భారతీయులందరికీ లభించిన అరుదైన గౌరవం అన్నారు. ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు రెహ్మాన్. రెహ్మాన్ ప్రభావానికి తనుకూడా లోనుకాక తప్పలేదని తనకు రెహ్మాన్ అంటే భయమనీ, జలసీ అని ప్రఖ్యాత స్వరకర్త ఎస్ ఎల్ వైద్యనాథన్ అన్నాడు. రెహ్మాన్‌లా తను కూడా వేర్వేరు ప్లేన్స్‌లో, లేయర్స్‌లో, సకాలంలో వచ్చేకౌంటర్స్‌తో బాణీలు కట్టాలని ప్రయత్నించి చాలా సార్లు విఫలమైనానని ఒప్పుకున్నాడు. కర్నాటక సంగీతాన్ని, ఖవ్వాలీ సంప్రద్రాయాన్ని, రెగే, హిప్-హాప్, ర్యాప్, రాక్, పాప్, జాజ్, ఒపెరా, సూఫీ ఆఫ్రికన్, అరేబియన్, పాశ్చాత్య సంగీతాన్ని శ్రావ్యంగా మిళితం చేయగలిగాడు రెహ్మాన్. అలా చేస్తూ కూడా పూర్తి స్థాయి ఒరిజినల్ బాణీలను తయారుచేశాడు.

గౌరవాలు బిరుదులు

టైమ్ మ్యాగజైన్ రెహ్మాన్‌ కు "మొజార్త్ ఆఫ్ మద్రాస్" బిరుదు ఇచ్చింది. ఆయన పాటలు ఆస్కార్ కు నామినేట్ అయ్యాయి. "స్లమ్‌డాగ్ మిలియనీర్" అనే చిత్రంలో 'జై హో' అనే పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్టాత్మకమైన "గోల్డెన్ గ్లోబ్ అవార్డు", రెండు ఆస్కార్ అవార్డులను అందుకొన్న తొలి భారతీయుడు. రెండు ఆస్కార్‌ అవార్డులను గెలుచుకొని భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లిన ఘనత రెహ్మాన్‌కే దక్కుతుంది. జాతీయ స్థాయి లో నాలుగుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడుగా హిందీ, తమిళ చిత్రాలకు 19 సార్లు ఫిలిమ్‌ఫేర్‌ అవార్డులను, తమిళ ప్రభుత్వ అవార్డులను అందుకున్నాడు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును స్వీకరించాడు. భార్య సైరా బాను, ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీమ్‌, అమన్‌ .

== సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు == kishore

కొన్ని పాటలు

  • నీ నమాజులో ఓనమాలు నేర్చా
  • అది అరబిక్ కడలి అందం
  • అచ్చొచ్చేటి వెన్నెలలు
  • కాకి ఎంగిలిలా ఓ పండే తిందామా
  • కలమేలుకున్నది ఇలనేలుతున్నది
  • నిద్దురలోన చెమటలు పడితే నక్షత్రాలతో తుడిచేస్తా
  • నీ అడుగల చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే
  • కన్నులతో చూసేది గురువా కనులకు సొంతమవునా
  • అతిశయమే అచ్చెరువొందే
  • ఉట్టిమీది కూడు ఉప్పు చేపతోడు

తెలుగు చిత్రాలు

1992 లో

  • రోజా (తమిళం)

బిరుదులు

ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ పురస్కారం, తమిళనాడు ప్రభుత్వ పురస్కారం, ఫిల్మ్ ఫేర్ అవార్డు, 2005 లో మొదటి 10 సినిమాలలో ఎప్పటికి ఉత్తమ చిత్రంగా శబ్ధ విభాగానికిగాను టైమ్స్ పత్రికచే గుర్తింపు.

  • యోధ (మళయాళం)

1993 లో

  • పుదియ ముగం (తమిళం)
  • జెంటిల్మేన్ (తమిళం)

బిరుదులు

తమిళనాడు ప్రభుత్వ పురస్కారం, ఫిల్మ్ ఫేర్ అవార్డు

  • కిళక్కు సీమయిలే (తమిళం)
  • ఉళవన్ (తమిళం)
  • తిరుడా తిరుడా ( తమిళం తెలుగులో దొంగా దొంగా)

1994 లో

  • వండిచోళై చిన్నరాసు (తమిళం)
  • సూపర్ పోలీస్ (తెలుగు)
  • డ్యూయెట్ ( తమిళం)
  • మే మాధం(తమిళం)
  • కాదలన్ ( తమిళం తెలుగులో ప్రేమికుడు)

బిరుదులు

తమిళనాడు ప్రభుత్వ పురస్కారం, ఫిల్మ్ ఫేర్ అవార్డు

  • పవిత్ర (తమిళం)
  • కరుత్తమ్మ(తమిళం)
  • పుదియ మన్నర్గళ్( తమిళం)
  • మనిదా మనిదా (తమిళం)
  • గ్యాంగ్ మాస్టర్ (తెలుగు)

1995లో

  • బొంబాయి (తమిళం మూల భాష)

బిరుదులు

తమిళనాడు ప్రభుత్వ పురస్కారం, ఫిల్మ్ ఫేర్ అవార్డు

  • ఇందిరా (తమిళం)
  • రంగీలా (హిందీ)

బిరుదులు

ఫిల్మ్ ఫేర్ అవార్డు , ఫిల్మ్ ఫేర్ ఆర్.డి. బర్మన్ అవార్డు యువ సంగీత దర్శకుడిగా

  • ముత్తు (తమిళం) :ఎంతో విజయవంతమైన చిత్రంగా శబ్ద విభాగంలో జపాన్ దేశంచే గుర్తించబడెను.

హిందీ చిత్రాలు

అదా రొబొ,నాయక్,బొస్స్

సంగీత పాఠశాల

తన స్వంత సంగీత పాఠశాల ‘‘కెఎమ్ మ్యూజిక్ కాలేజ్ అండ్ టెక్నాలజీ’’ ని రంజాన్ పర్వదినం నాడు 9 ఆగస్టు, 2013న ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చేత లాంఛనంగా ప్రారంభింపజేశాడు. ఈ సంగీత కళాశాల ప్రారంభోత్సవానికి అంబానీతోపాటు ఆయన సతీమణి నీతూ అంబానీ కూడా పాల్గొన్నారు. రెహామాన్ స్థాపించిన ఈ మ్యూజిక్ కాలేజ్ క్యాంపస్ వైశాల్యం దాదాపు 27వేల సెక్టార్లు ఉంటుంది. ఈ క్యాంపస్‌లో వాద్యబృంద సంగీత కళాశాలను పేదపిల్లల కోసం సంగీతంలో శిక్షణ ఇస్తూ వారిందరికీ వసతి కల్పించేందుకు వీలుగా ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా రెహ్మాన్ మాట్లాడుతూ సంగీత కళాశాలలో శిక్షణ పొందేందుకు వీలుగా రికార్డింగ్ స్టూడియోలను విడివిడిగా నిర్మించి వాటిలో మ్యూజిక్ డ్రమ్స్, పియానో, తీగ వాయిద్యాలు వంటి పరికరాలను ఏర్పాటుచేసినట్టు తెలిపాడు.

ఈ సంస్థ ఏర్పాటు చేసి సంగీత ప్రియులకు అందుబాటులో ఉంచాలన్నదే తమ లక్ష్యమని రెహ్మాన్ చెప్పాడు. కేవలం తాము స్థాపించిన ఈ సంగీత కళాశాలను సినిమా వినోదం కోసం కాదని సంగీతం పట్ల అభిరుచిని పెంచుకునేందుకు వీలుగా ఎంతోగానూ తోడ్పతుందని రెహ్మాన్ చెప్పాడు. కెఎమ్ మ్యూజిక్ కాలేజ్ ప్రారంభోత్సవానికి ముఖేష్, నీతూ అంబానీదంపతులు విచ్చేసిన సందర్భంగా అక్కడి విద్యార్ధులు ప్రత్యేక మ్యూజిక్ ప్రదర్శనతో అంబానీ దంపతులకూ ఘన స్వాగతం పలికారు. సంగీత శిక్షణలో ఫూల్‌టైమ్, ఫార్ట్‌టైమ్ కోర్సులు చేయాలనుకునేవారికి లండన్‌లో స్థాపించిన అనుబంధ సంస్థ మిడెల్‌సెక్స్ యూనివర్సిటీలో సంగీత శిక్షణను అందిస్తున్నారు.

  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ARR bio అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు