ముఖలింగం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 61: పంక్తి 61:
| footnotes =
| footnotes =
}}
}}
'''శ్రీ ముఖలింగం''' లేదా '''ముఖలింగం''' ([[ఆంగ్లం]]: '''Mukhalingam''') [[శ్రీకాకుళం]] జిల్లా, [[జలుమూరు]] మండలానికి చెందిన గ్రామము. శ్రీ ముఖలింగేశ్వరస్వామి దేవాలయము గల ఈ ఊరు '[[పంచపీఠ]]' స్థలముగా ప్రసిద్ధం. దీనినే ముఖలింగక్షేత్రమని కూడా పిలుస్తారు.
'''శ్రీ ముఖలింగం''' లేదా '''ముఖలింగం''' ([[ఆంగ్లం]]: '''Mukhalingam''') [[శ్రీకాకుళం]] జిల్లా, [[జలుమూరు]] మండలానికి చెందిన గ్రామము. <ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>శ్రీ ముఖలింగేశ్వరస్వామి దేవాలయము గల ఈ ఊరు '[[పంచపీఠ]]' స్థలముగా ప్రసిద్ధం. దీనినే ముఖలింగక్షేత్రమని కూడా పిలుస్తారు.
==గ్రామ చరిత్ర ==
==గ్రామ చరిత్ర ==
ఇక్కడ లభించిన అధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాలలో ఇక్కడ [[బౌద్ధ]], [[జైన]], [[హిందూ]] మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ పూరిపేరు శ్రీ ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం, కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనగరం మొదలైన పేర్లతో వుంది.ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన [[సరస్వతి]] విగ్రహం, జైనమత ప్రవక్త [[మహావీరుడు|మహావీరుని]] విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు.
ఇక్కడ లభించిన అధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాలలో ఇక్కడ [[బౌద్ధ]], [[జైన]], [[హిందూ]] మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ పూరిపేరు శ్రీ ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం, కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనగరం మొదలైన పేర్లతో వుంది.ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన [[సరస్వతి]] విగ్రహం, జైనమత ప్రవక్త [[మహావీరుడు|మహావీరుని]] విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు.

06:25, 1 ఆగస్టు 2015 నాటి కూర్పు

శ్రీముఖలింగం లో ప్రసిద్ధ దేవాలయం గూర్చి శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం ( మధుకేశ్వరాలయం) చూడండి.


Mukhalingam
ముఖలింగం
Srimukhalingam
Village of historical importance
Srimukhalingam temple
Srimukhalingam temple
Country India
StateAndhra Pradesh
DistrictSrikakulam
TalukasJalumuru
Population
 • Total3,022
Languages
 • OfficialTelugu
Time zoneUTC+5:30 (IST)
PIN
532 428

శ్రీ ముఖలింగం లేదా ముఖలింగం (ఆంగ్లం: Mukhalingam) శ్రీకాకుళం జిల్లా, జలుమూరు మండలానికి చెందిన గ్రామము. [1]శ్రీ ముఖలింగేశ్వరస్వామి దేవాలయము గల ఈ ఊరు 'పంచపీఠ' స్థలముగా ప్రసిద్ధం. దీనినే ముఖలింగక్షేత్రమని కూడా పిలుస్తారు.

గ్రామ చరిత్ర

ఇక్కడ లభించిన అధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ పూరిపేరు శ్రీ ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం, కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనగరం మొదలైన పేర్లతో వుంది.ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహం, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు. ఇక్కడ అనేక శాసనాలు కూడ దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని క్రీ.శ. 10వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది. వీరిద్దరూ కళింగరాజులు. కామార్ణవుడు తన రాజధానిని దంతనగరం నుండి యిక్కడకు మార్చినట్లు కూడ తెలుస్తోంది.

గ్రామ జనాభా

2001 జనాభా లెక్కల ప్రకారం వివరాలు [2]

  • మొత్తం జనాభా: 3,204 in 767 Households
  • పురుషులు: 1,625 మరియు స్త్రీలు: 1,579
  • 6 సం. లోపు పిల్లలు: 387 (బాలురు- 180 మరియు బాలికలు - 207)
  • అక్షరాస్యులు: 1,579

గ్రామంలో విద్యా సౌకర్యాలు

ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నాయి. ఇంటర్మీడియట్ విద్య కొరకు విద్యార్థులు జలుమూరు వెళుతుంటారు.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

ఈ గ్రామానికి వెళ్ళుటకు శ్రీకాకుళం ఆర్.టి.సి కాంప్లెక్స్ నుండి ప్రతి గంటకు ఒక బస్సు ఉంటుంది. ప్రయాణ కాలం సుమారు 2 గంటలు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

ఇది శ్రీకాకుళం నుండి 46 కి.మీ దూరంలో వుంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధినందిన ముఖలింగేశ్వరాస్వామి, భీమేశ్వరాస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి.

క్షేత్ర పురాణము

ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు. ఇప్పచెట్టు మొదలను నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలుపై " ముఖం " కనిపిస్తుంది అని చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెబుతారు. ఇప్పచెట్టును సంస్కృతంలో 'మధుకం' అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వరస్వామి ఆలయం గా పేరొచ్చిందని అంటారు. ఈ ఆలయంలో గర్బాలయంకాక ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలున్నాయి. ఇక్కడి అమ్మవారు వరాహిదేవి, సప్త మాతృకలలో ఆమె వొకరు . మిగిలివారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడి శిల్పాలలో వరాహావతారం, వామనావతారం, సూర్య విగ్రహం వుండటం విశేషం.

భీమేశ్వరాలయం శిధిలావస్థలో వుంది. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలున్నాయి.

సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖమండపం లేదు. ఎత్తయిన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇది ఒకేరాయి. ఒకసారి పిడుగుపడి, ఆరాయి పగిలి అందులో ఒక ముక్క క్రింది పడింది. ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారంటే , మొత్తం రాయి ఎంత బరువో వూహించుకోవచ్చు. అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో, ఎలా అమర్చారో తలచుకుంటే ఆనాటి విశ్వబ్రాహ్మణ శిల్పుల గొప్పతనం, ప్రజ్ఞ అర్థం అవుతాయి. ఇక్కడ ఏడు నాలికల అగ్ని విగ్రహం, వినాయకుడు, కాశీ అన్నపూర్ణ, నటరాజు, కొమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు ఎంత్తో అందంగా వున్నాయి. కొన్ని శృంగార శిల్పాల్ని కూడా ఇక్కడ చెక్కారు . ఈ ఆలయం శిధిలావస్థలో వుంది.

మహా శివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది.

ఇవి కూడా చూడండి

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=ముఖలింగం&oldid=1572981" నుండి వెలికితీశారు