సాక్షి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 24: పంక్తి 24:
=== అభివృద్ధి ===
=== అభివృద్ధి ===
ముళ్ళపూడి వెంకటరమణ ఆంగ్ల చలనచిత్రం ''high noon'' అనుసరించి సాక్షి అనే కథను రాశారు.<ref name="సారంగలో బాపు హీరోయిన్లపై వ్యాసం">{{cite web|last1=|first1=ల.లి.త|title=బొమ్మలోంచి సినిమాలోకి నడిచొచ్చిన ‘బాపూ తనపు’ హీరోయిన్!|url=http://magazine.saarangabooks.com/2014/09/03/%E0%B0%AC%E0%B1%8A%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8B%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B0%BF-%E0%B0%A8/|website=సారంగ|accessdate=18 April 2015}}</ref> సాక్షి చిత్రకథను చాలావరకూ ఆ సాక్షి కథనే ఆధారంగా చేసుకుని తయారుచేసుకున్నారు. కనుక ఈ సినిమా మూలకథాంశంపై హై నూన్ ప్రభావం ఉందని చెప్పవచ్చు. కథలో చివరకు కథానాయకుడి పాత్ర కూడా మంచి పాత్ర కాదన్న విషయం తెలుస్తుంది. ఐతే సినిమాకు అనుగునంగా ఆ విషయాన్ని తీసివేసి సినిమా కథానాయకుడిని అమాయకుడిగా నిలిపారు.<ref name="ఎమ్వీయల్ కథారమణీయం పీఠిక">{{cite book|last1=ఎమ్.వి.ఎల్.|first1=ప్రసాద్|title=కథారమణీయం-2|publisher=విశాలాంధ్ర పబ్లికేషన్స్|location=హైదరాబాద్|edition=1|chapter=ముందుమాట}}</ref><br />
ముళ్ళపూడి వెంకటరమణ ఆంగ్ల చలనచిత్రం ''high noon'' అనుసరించి సాక్షి అనే కథను రాశారు.<ref name="సారంగలో బాపు హీరోయిన్లపై వ్యాసం">{{cite web|last1=|first1=ల.లి.త|title=బొమ్మలోంచి సినిమాలోకి నడిచొచ్చిన ‘బాపూ తనపు’ హీరోయిన్!|url=http://magazine.saarangabooks.com/2014/09/03/%E0%B0%AC%E0%B1%8A%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8B%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B0%BF-%E0%B0%A8/|website=సారంగ|accessdate=18 April 2015}}</ref> సాక్షి చిత్రకథను చాలావరకూ ఆ సాక్షి కథనే ఆధారంగా చేసుకుని తయారుచేసుకున్నారు. కనుక ఈ సినిమా మూలకథాంశంపై హై నూన్ ప్రభావం ఉందని చెప్పవచ్చు. కథలో చివరకు కథానాయకుడి పాత్ర కూడా మంచి పాత్ర కాదన్న విషయం తెలుస్తుంది. ఐతే సినిమాకు అనుగునంగా ఆ విషయాన్ని తీసివేసి సినిమా కథానాయకుడిని అమాయకుడిగా నిలిపారు.<ref name="ఎమ్వీయల్ కథారమణీయం పీఠిక">{{cite book|last1=ఎమ్.వి.ఎల్.|first1=ప్రసాద్|title=కథారమణీయం-2|publisher=విశాలాంధ్ర పబ్లికేషన్స్|location=హైదరాబాద్|edition=1|chapter=ముందుమాట}}</ref><br />
అప్పటికి పెద్ద హీరోలతో తీస్తున్న భారీ బడ్జెట్ సినిమాలు పరాజయం పాలవుతూండడంతో నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ వారు చిన్న బడ్జెట్లో తీసే సినిమాలకు ఫైనాన్స్ చేద్దామన్న పాలసీకి వచ్చారు. దాంతో బాపురమణలు వారిని ఈ సినిమా కథతో సంప్రదించారు. ఆ మీటింగ్ లో భాగంగా నవయుగ ప్రతినిధులు "మీకు [[అక్కినేని నాగేశ్వరరావు]], [[దుక్కిపాటి మదుసూదనరావు]] తెలుసు కదా, పైగా అక్కినేని జీవితచరిత్ర కూడా రాసినట్టున్నారు, మరి వారికి ఈ ప్రయత్నాలు తెలుసా?" అని అడిగారు. దానికి రమణ-తెలియదని, చెప్పలేదని, లక్షలతో వ్యాపారమైన సినిమారంగంలో ఇలాంటి సిఫార్సులు నాకిష్టంలేదని, నచ్చితే అవకాశమివ్వమని సమాధానం చెప్పారు. అంతటి సినీతారలు తెలిసినా, నిజాయితీగా అవకాశం అడగడం నచ్చి వారు ఫైనాన్స్ చేయడానికి ముందుకువచ్చారు. సినిమా పూర్తిగా అవుట్-డోర్ లో షూటింగ్ చేసి, కొత్తవారిని హీరోహీరోయిన్లుగా పెట్టుకుని, పాటలు లేకుండా తీస్తామన్నారు. కథ విన్నాకా, వారు అవుట్-డోర్ షూటింగ్, కొత్తవారు వరకూ సరే కానీ పాటలు లేకపోవడం తెలుగువారు అంగీకరించలేరని చెప్పడంతో, ట్రీట్ మెంట్లో మార్పులు చేసుకుని పాటలు కూడా చేర్చారు. అలాగే బాపు అంతకుముందు ఎక్కడా పనిచేయకపోవడంతో, రమణనే దర్శకత్వం వహించి బాపును సహాయకునిగా తీసుకోమనీ అడిగారు. బాపుకు దర్శకత్వం మీదున్న పట్టు తనకు లేదని, తాను రచయితనేనని చెప్పి ఒప్పించారు. అయితే ఇందరు కొత్త టెక్నీషియన్లతో పనిచేయడంలో కనీసం కెమేరామాన్ అయినా సీనియర్ని తీసుకోవాలని, అన్నపూర్ణ చిత్రాలకు ఛాయాగ్రాహకులైన సెల్వరాజ్ పేరు సూచించారు.<ref name="ఇంకోతి కొమ్మచ్చి">{{cite book|last1=ముళ్ళపూడి|first1=వెంకటరమణ|title=(ఇం)కోతి కొమ్మచ్చి|date=జూలై 2013|publisher=వరప్రసాద్ రెడ్డి|location=హైదరాబాద్|edition=6}}</ref>
అప్పటికి పెద్ద హీరోలతో తీస్తున్న భారీ బడ్జెట్ సినిమాలు పరాజయం పాలవుతూండడంతో నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ వారు చిన్న బడ్జెట్లో తీసే సినిమాలకు ఫైనాన్స్ చేద్దామన్న పాలసీకి వచ్చారు. దాంతో బాపురమణలు వారిని ఈ సినిమా కథతో సంప్రదించారు. ఆ మీటింగ్ లో భాగంగా నవయుగ ప్రతినిధులు "మీకు [[అక్కినేని నాగేశ్వరరావు]], [[దుక్కిపాటి మదుసూదనరావు]] తెలుసు కదా, పైగా అక్కినేని జీవితచరిత్ర కూడా రాసినట్టున్నారు, మరి వారికి ఈ ప్రయత్నాలు తెలుసా?" అని అడిగారు. దానికి రమణ-తెలియదని, చెప్పలేదని, లక్షలతో వ్యాపారమైన సినిమారంగంలో ఇలాంటి సిఫార్సులు నాకిష్టంలేదని, నచ్చితే అవకాశమివ్వమని సమాధానం చెప్పారు. అంతటి సినీతారలు తెలిసినా, నిజాయితీగా అవకాశం అడగడం నచ్చి వారు ఫైనాన్స్ చేయడానికి ముందుకువచ్చారు. సినిమా పూర్తిగా అవుట్-డోర్ లో షూటింగ్ చేసి, కొత్తవారిని హీరోహీరోయిన్లుగా పెట్టుకుని, పాటలు లేకుండా తీస్తామన్నారు. కథ విన్నాకా, వారు అవుట్-డోర్ షూటింగ్, కొత్తవారు వరకూ సరే కానీ పాటలు లేకపోవడం తెలుగువారు అంగీకరించలేరని చెప్పడంతో, ట్రీట్ మెంట్లో మార్పులు చేసుకుని పాటలు కూడా చేర్చారు. అలాగే బాపు అంతకుముందు ఎక్కడా పనిచేయకపోవడంతో, రమణనే దర్శకత్వం వహించి బాపును సహాయకునిగా తీసుకోమనీ అడిగారు. బాపుకు దర్శకత్వం మీదున్న పట్టు తనకు లేదని, తాను రచయితనేనని చెప్పి ఒప్పించారు. అయితే ఇందరు కొత్త టెక్నీషియన్లతో పనిచేయడంలో కనీసం కెమేరామాన్ అయినా సీనియర్ని తీసుకోవాలని, అన్నపూర్ణ చిత్రాలకు ఛాయాగ్రాహకులైన సెల్వరాజ్ పేరు సూచించారు. అలాగే తీసుకున్నారు. బాపురమణలు ఇతర సన్నిహితులు కలిపి పాతికవేల రూపాయలు ఆంధ్రాబ్యాంకు ఖాతాలో జమచేసి ఆ రసీదు పంపగా నవయుగ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రూ.50వేలు ఫైనాన్స్ చేసింది. దాంతో సినిమా ప్రారంభమైంది.<ref name="ఇంకోతి కొమ్మచ్చి">{{cite book|last1=ముళ్ళపూడి|first1=వెంకటరమణ|title=(ఇం)కోతి కొమ్మచ్చి|date=జూలై 2013|publisher=వరప్రసాద్ రెడ్డి|location=హైదరాబాద్|edition=6}}</ref>


=== చిత్రీకరణ ===
=== చిత్రీకరణ ===

19:19, 6 ఆగస్టు 2015 నాటి కూర్పు

సాక్షి
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
నిర్మాణం శేషగిరిరావు
కథ ముళ్ళపూడి వెంకటరమణ
తారాగణం కృష్ణ,
విజయనిర్మల,
రాజబాబు,
విన్నకోట రామన్న పంతులు,
సాక్షి రంగారావు,
జగ్గారావు (మస్తాన్),
విజయలలిత,
శివరామకృష్ణయ్య,
చలపతిరావు
సంగీతం కె.వి.మహదేవన్,
సహాయకుడు పుహళేంది
నేపథ్య గానం చిత్తరంజన్,
పి.బి. శ్రీనివాస్,
ఘంటసాల,
పి. సుశీల
నృత్యాలు పసుమర్తి కృష్ణమూర్తి
సంభాషణలు ముళ్ళపూడి వెంకటరమణ
ఛాయాగ్రహణం పి.ఎన్. సెల్వరాజ్
నిర్మాణ సంస్థ నందనా ఫిలిమ్స్
(శ్రీరమణ చిత్ర?)
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
దస్త్రం:SAAKSHI cinima b&w.jpg
సాక్షి సినిమాలో టైటిల్ పడినప్పడి దృశ్యం

బాపు దర్శకత్వంలో కృష్ణ, విజయనిర్మల ప్రధానపాత్రలుగా 1967లో విడుదలైన సినిమా సాక్షి. సాక్షి బాపు దర్శకుడిగా తీసిన మొట్టమొదటి చిత్రం. ఈ చిత్రం తీసే సమయానికి కృష్ణగాని, విజయనిర్మల గాని ప్రేక్షకులకి అంతగా తెలియదు. ఈ సినిమాలో వీరిద్దరూ ఏవిధమైన మేకప్ లేకుండా నటించారు. రంగారావు అనే నటుడు ఈ చిత్రంలో కరణం పాత్రను పోషించి,ఈ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకుని సాక్షి రంగారావు గా ప్రసిద్ధికెక్కాడు.

నిర్మాణం

అభివృద్ధి

ముళ్ళపూడి వెంకటరమణ ఆంగ్ల చలనచిత్రం high noon అనుసరించి సాక్షి అనే కథను రాశారు.[1] సాక్షి చిత్రకథను చాలావరకూ ఆ సాక్షి కథనే ఆధారంగా చేసుకుని తయారుచేసుకున్నారు. కనుక ఈ సినిమా మూలకథాంశంపై హై నూన్ ప్రభావం ఉందని చెప్పవచ్చు. కథలో చివరకు కథానాయకుడి పాత్ర కూడా మంచి పాత్ర కాదన్న విషయం తెలుస్తుంది. ఐతే సినిమాకు అనుగునంగా ఆ విషయాన్ని తీసివేసి సినిమా కథానాయకుడిని అమాయకుడిగా నిలిపారు.[2]
అప్పటికి పెద్ద హీరోలతో తీస్తున్న భారీ బడ్జెట్ సినిమాలు పరాజయం పాలవుతూండడంతో నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ వారు చిన్న బడ్జెట్లో తీసే సినిమాలకు ఫైనాన్స్ చేద్దామన్న పాలసీకి వచ్చారు. దాంతో బాపురమణలు వారిని ఈ సినిమా కథతో సంప్రదించారు. ఆ మీటింగ్ లో భాగంగా నవయుగ ప్రతినిధులు "మీకు అక్కినేని నాగేశ్వరరావు, దుక్కిపాటి మదుసూదనరావు తెలుసు కదా, పైగా అక్కినేని జీవితచరిత్ర కూడా రాసినట్టున్నారు, మరి వారికి ఈ ప్రయత్నాలు తెలుసా?" అని అడిగారు. దానికి రమణ-తెలియదని, చెప్పలేదని, లక్షలతో వ్యాపారమైన సినిమారంగంలో ఇలాంటి సిఫార్సులు నాకిష్టంలేదని, నచ్చితే అవకాశమివ్వమని సమాధానం చెప్పారు. అంతటి సినీతారలు తెలిసినా, నిజాయితీగా అవకాశం అడగడం నచ్చి వారు ఫైనాన్స్ చేయడానికి ముందుకువచ్చారు. సినిమా పూర్తిగా అవుట్-డోర్ లో షూటింగ్ చేసి, కొత్తవారిని హీరోహీరోయిన్లుగా పెట్టుకుని, పాటలు లేకుండా తీస్తామన్నారు. కథ విన్నాకా, వారు అవుట్-డోర్ షూటింగ్, కొత్తవారు వరకూ సరే కానీ పాటలు లేకపోవడం తెలుగువారు అంగీకరించలేరని చెప్పడంతో, ట్రీట్ మెంట్లో మార్పులు చేసుకుని పాటలు కూడా చేర్చారు. అలాగే బాపు అంతకుముందు ఎక్కడా పనిచేయకపోవడంతో, రమణనే దర్శకత్వం వహించి బాపును సహాయకునిగా తీసుకోమనీ అడిగారు. బాపుకు దర్శకత్వం మీదున్న పట్టు తనకు లేదని, తాను రచయితనేనని చెప్పి ఒప్పించారు. అయితే ఇందరు కొత్త టెక్నీషియన్లతో పనిచేయడంలో కనీసం కెమేరామాన్ అయినా సీనియర్ని తీసుకోవాలని, అన్నపూర్ణ చిత్రాలకు ఛాయాగ్రాహకులైన సెల్వరాజ్ పేరు సూచించారు. అలాగే తీసుకున్నారు. బాపురమణలు ఇతర సన్నిహితులు కలిపి పాతికవేల రూపాయలు ఆంధ్రాబ్యాంకు ఖాతాలో జమచేసి ఆ రసీదు పంపగా నవయుగ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రూ.50వేలు ఫైనాన్స్ చేసింది. దాంతో సినిమా ప్రారంభమైంది.[3]

చిత్రీకరణ

పులిదిండి గ్రామంలో సాక్షి చిత్రీకరణ సాగింది. ఈ సినిమా స్క్రిప్ట్ పని పూర్తిచేసి, ఫైనాన్సు చేసేందుకు నవయుగ వారిని ఒప్పించగానే బాపురమణలు ఓ మ్యాప్ గీసుకున్నారు. సినిమాలో అనుకున్న గ్రామం ఎలావుంటుంది అన్న మ్యాప్ అది. అందులో బల్లకట్టు ఉన్న ఓ కాలవ, కాలవ దగ్గర రేవులో ఓ పెద్ద మర్రిచెట్టు, రేవు నుంచి ఊరికి చిన్న బాట, ఊళ్ళో ఓ చిన్న గుడి, గుడికో మండపం.. ఇలా తమ సినిమా కథకు అవసరమైన పల్లెటూరిని మ్యాప్ గా గీశారు. గోదావరి పరిసరాల్లో ప్రభుత్వ ఇరిగేషన్ డిపార్ట్ మెంటులో పనిచేసి అప్పటికి సీలేరు ప్రాజెక్టు ఇంజనీరుగా పనిచేస్తున్న బాపు రమణల బాల్యమిత్రుడు, రచయిత బి.వి.ఎస్.రామారావును ఆ మ్యాప్ ని పోలిన ఊరు వెతకాల్సిందిగా కోరారు. రామారావు ఉద్యోగానికి సెలవుపెట్టి అలాంటి ఊరి కోసం రాజమండ్రి వచ్చేసి ఇరిగేషన్ కాంట్రాక్టర్ గా పరిచయస్తులైన కలిదిండి రామచంద్రరాజుకు అలాంటి ఊరిని వెతుకుదాం సాయపడమని అడిగారు. ఆ మ్యాప్ చూసినాకా మ్యాపును పోలినట్టుగా తమ ఊరు పులిదిండే ఉందని సూచించారు.[4]
అయితే బాపురమణలు వచ్చి సినిమా చిత్రీకరించాల్సిన గ్రామం ఎంచుకోవాల్సివుంటుంది కనుక అందుకోసం వెతికేందుకు ఆయన గ్రామంలో స్వంత ఇంట్లోనే వారికి బస ఏర్పాటుచేశారు. కాలవరేవుల్లో బొబ్బర్లంక, పిచికలలంక, ఆత్రేయపురం, ఆలమూరు, పులిదిండి, కట్టుంగ వంటి గ్రామాలను చూశారు. చివరకి పులిదిండి గ్రామాన్నే ఎంచుకున్నారు.[3]
సినిమాకు అవసరమైన కొన్ని సెట్లు బి.వి.ఎస్.రామారావు వేశారు. ఈ సెట్ ఎంత సహజంగా కుదిరేలా ప్రయత్నించారంటే సినిమాలో కథానాయకుడి గుడిసె సెట్ వేసినప్పుడు, దాన్ని పాతబడిన ఇల్లుగా చూపేందుకు గ్రామంలోని పాతబడిపోయిన పాడైన గుమ్మం ఆ ఇంటివారిని అడిగి తీసుకుని వినియోగించారు. అలానే ఆ గుమ్మాన్నిచ్చిన వారికి కొత్త గుమ్మాన్ని ఏర్పాటుచేశారు. ఈ సినిమా చిత్రీకరించేందుకు ముందు బాపుకు సినిమా దర్శకత్వ విభాగంలో పనిచేసిన అనుభవమేదీ లేదు. కేవలం సినిమా విద్యార్థిగా, ఔత్సాహికునిగా ప్రారంభమై ఎవరి వద్దా అసిస్టెంటుగా పనిచేయకుండానే సినిమాల్లో అడుగుపెట్టారు. ఆయనకు షాట్ తీసే విధానాల గురించి కొంత మౌలికమైన విషయాలను ఆదుర్తి సుబ్బారావు అసిస్టెంటుగా పనిచేసిన కబీర్ దాస్ నేర్పారు. సినిమాలో మొదట అమ్మకడుపు చల్లగా అత్తకడుపు చల్లగా పాట చిత్రీకరణతో ప్రారంభించి దాదాపు 19రోజుల్లోనే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలైంది.[5]

నిర్మాణానంతర కార్యక్రమాలు

కథ

గ్రామంలో పడవ నడిపేవాడు కృష్ణ. అతన్ని ప్రేమించే అమ్మాయి విజయ నిర్మల. ఊరి రౌడీ, లారీ డ్రైవరు జగ్గారావు. విజయ నిర్మల ఇతని చెల్లెలు. రౌడీ చేసిన హత్య చేస్తుండగా చూసిన కథానాయకుడు, న్యాయస్థానానికి వెళ్ళి సాక్ష్యం చెప్తాడు. రౌడీకి జైలు శిక్ష పడుతుంది. కాని, రౌడీ జైలు నుంచి తప్పించుకుని వస్తున్నాడని తెలిసిన జనం, అప్పటిదాకా మెచ్చుకున్నవారే, ప్రాణ భయంతొ ఉన్న పడవాడికి ఆశ్రయం ఇవ్వటానికి నిరాకరిస్తారు. ఇక రౌడీ చేతులో ఎట్టాగో చావు తప్పదని నిబ్బరం గా ఉన్న పడవ వాడు, రౌడీ వచ్చి తన్నటం మొదలు పెట్టేసరికి, భయంలోంచి వచ్చిన తప్పనిసరి ధైర్యంతో తాగి ఉన్న రౌడీని తనకున్న శక్తి యావత్తూ వినియోగించి దెబ్బలు వేస్తాడు. ఆ రౌడీ చచ్చిపోతాడు.

పాటలు

గీతరచన

సాక్షి సినిమా కోసం ఆరుద్ర 4 పాటలు రచించారు.[6]

స్వరకల్పన

  • అటు వెన్నెల ఇటు వెన్నెల ఎటు చూస్తే అటు వెన్నెల - రచన: ఆరుద్ర; గానం: పి.సుశీల
  • అమ్మకడుపు చల్లగా అత్తకడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా - రచన: ఆరుద్ర; గానం: పి.సుశీల
  • దయలేదా నీకు దయలేదా ప్రాణసఖునిపై దయలేదా - రచన: ఆరుద్ర: గానం: పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ బృందం
  • పదిమంది కోసం నిలబడ్డ నీకు ఫలితం ఏమిటి ? - రచన: ఆరుద్ర; గానం: మోహన్ రాజు

మూలాలు

  1. "బొమ్మలోంచి సినిమాలోకి నడిచొచ్చిన 'బాపూ తనపు' హీరోయిన్!". సారంగ. Retrieved 18 April 2015. {{cite web}}: |first1= missing |last1= (help)
  2. ఎమ్.వి.ఎల్., ప్రసాద్. "ముందుమాట". కథారమణీయం-2 (1 ed.). హైదరాబాద్: విశాలాంధ్ర పబ్లికేషన్స్.
  3. 3.0 3.1 ముళ్ళపూడి, వెంకటరమణ (జూలై 2013). (ఇం)కోతి కొమ్మచ్చి (6 ed.). హైదరాబాద్: వరప్రసాద్ రెడ్డి.
  4. బి.వి.ఎస్.రామారావు (అక్టోబర్ 2014). కొసరుకొమ్మచ్చి (3 ed.). హైదరాబాద్: వరప్రసాద్ రెడ్డి. {{cite book}}: Check date values in: |date= (help)
  5. "మా సినిమాలు". నవతరంగం. Retrieved 18 April 2015. {{cite web}}: |first1= missing |last1= (help)
  6. సాక్షి, ఆరుద్ర సినీ గీతాలు (1965-1970), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2002, పేజీలు: 60-63.