దశ రూపకాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:తెలుగు నాటకరంగం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 31: పంక్తి 31:
[[వర్గం:సంఖ్యానుగుణ వ్యాసములు]]
[[వర్గం:సంఖ్యానుగుణ వ్యాసములు]]
[[వర్గం:నాటక భేదములు]]
[[వర్గం:నాటక భేదములు]]
[[వర్గం:తెలుగు నాటకరంగం]]

13:40, 7 ఆగస్టు 2015 నాటి కూర్పు

వ్యుత్పత్తి: దశ అంటే పది సంఖ్య. రూపకము అంటే నాటకము. సంస్కృతంలో ఈ రూపకాలను పది రకాలుగా చెప్పారు. అవే దశరూపకములు.

నాటక భేదములు[1]

వివరణ

  1. నాటకము: ఇందులో ఇతివృత్తం ప్రఖ్యాతమయినది(పురాణేతిహాసాల నుండి గ్రహించిన వస్తువు). నాయకుడు ధీరోదాత్తుడు. వీరము కానీ, శృంగారము కానీ ప్రధాన (అంగిరసము) రసముగా ఉంటుంది.ఇతర రసములు అంగములుగా ఉండవచ్చు.వీటిలో 5 నుంచి 10 వరకు అంకములు ఉండవచ్చు. పూర్వకావ్యాలలో నాటకములు అనే ప్రక్రియలో రచించబడినవి - కాళిదాసు రచించిన శాకుంతలం,మాళవికాగ్నిమిత్రము మొదలైనవి.
  2. ప్రకరణము: ఇందులో ఇతివృత్తం కల్పితమై ఉంటుంది. నాయకుడు ధీరశాంతుడు. శృంగారము ప్రధాిన రసంగా ఉంటుంది. నాయకుడు, మంత్రి కానీ, వణిజుడు కానీ, బ్రాహ్మణుడు కానీ అయి ఉండాలి. ఇందులో కుల స్త్రీ గానీ, వేశ్యగానీ లేదా ఇద్దరూ కానీ కావ్య నాయికలై ఉండవచ్చు. ఉదాహరణలు - మాలతీ మాధవం, తరంగవృత్తం అనే నాటకాలు, శూద్రకుడు రచించిన మృచ్ఛకటిక నాటకం.
  3. భాణము : ఇందులో ఇతివృత్తం కల్పితము. నాయకుడు ధూర్తుడయిన విటుడు. శృంగార, వీర రసములతో ఉంటుంది.ఇందులో ఒకటే అంకం ఉంటుంది.
  4. ప్రహసనము: ఇందులో కథ కల్పితం. నాయకులు పాషండులు అంటే వేదబాహ్యులు.హాస్యరసమే ఇందులో ప్రధానం.
  5. డిమము : ఇందులో ఇతివృత్తం ప్రసిద్ధం. రౌద్ర రసము ఇందులో ప్రధానరసము. వీర,శృంగార రసములు అంగ రసములుగా ఉండవచ్చు. నాయకుడు ధీరోదత్తులైన దేవ, గంధర్వ, పిశాచ జాతులకు చెందినవారు. నాలుగు అంకములుంటాయి.మాయలు, ఇంద్రజాలం, యుద్ధం, గ్రహణములు ఇందులో వర్ణించబడతాయి.
  6. వ్యాయోగము: ఇందులో ఇతివృత్తం ప్రసిద్ధం. నాయకుడు ధీరోదాత్తుడు. వీరరసము ప్రధానమైన రసం.ఒకనాటి మహా యుద్ధం కథని ప్రయోగించాలి.
  7. సమవాకారము  : ఇందులో కథ కల్పితం కానీ, ప్రసిద్ధం కానీ అయి ఉండవచ్చు. దేవతలు, రాక్షసులు మొదలైన 12 మంది నాయకులు ఉంటారు. వీరరసము ప్రధానమైన రసము. 3 అంకములుంటాయి ఈ నాటకంలో. ఉదాహరణకి సముద్ర మధనము.
  8. వీధి : ఇందులో ఇతివృత్తం ప్రసిద్ధం. నాయకుడు ధీరోదాత్తుడు. శృంగార రసము సూచనగా ఉంటుంది. ఒకటే అంకము ఉంటుంది.
  9. అంకము : ఇందులో కథ ప్రసిద్ధం. నాయకుడు ప్రాకృత జనుడు(నాగరికత తెలియనివాడు). కరుణరసము ప్రధానమైన రసం. వాగ్యుద్ధం, స్త్రీవిచారం ముఖ్యంగా వర్ణించబడతాయి.
  10. ఈహా మృగము : ఇందులో కథ కొంత కల్పితము, కొంత ప్రసిద్ధము గా ఉంటుంది. నాయకుడు ధీరోద్ధతుడు. శృంగారరసము సూచనగా ఉంటుంది. 4 అంకములు ఉంటాయి. మర్త్యుడు (మానవుడు) నాయకుడుగా ఉంటాడు.దివ్యుడు ప్రతినాయకుడుగా ఉంటాడు. వీరిరువురు స్త్రీ కోసం కలహించుకుంటారు.

మూలాలు